ఎడిట్ పేజీ

కస్తూరి రంగన్ కమిటీ ఏ విద్యా విధానాన్ని రూపొందిస్తుంది..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సమాజానికి సేవ చేయాలంటే, మంచి రాజకీయ నాయకుడు కండి! లేదా ఉపాధ్యాయుడు కండి! సివిల్ సర్వెంటుగా ఎంపికై సమాజ సేవ చేస్తాననుకోవడం భ్రమ..!’ అంటూ గత వారం గుంటూరులో ఓ ఐఎఎస్ కోచింగ్ అకాడమీ ప్రారంభోత్సవంలో సిబిఐలో జెడి లక్ష్మీనారాయణగా పేరొంది, ప్రస్తుత మహారాష్ట్ర పోలీసు శాఖలో ఎడిషనల్ డిజిపిగా సేవలందిస్తున్న అధికారి వి.వి.లక్ష్మీనారాయణ అన్నమాటలివి. ఇందులో రెండర్ధాలున్నాయి. నిజంగా సమాజానికి సేవ చేయాలనుకుంటే, ఏ వృత్తిలో లేని స్వేచ్ఛ ఈ వృత్తిలో ఉందనేది ఒకటైతే, ఈ రెండు రంగాలు భ్రష్టు పట్టాయి కాబట్టి, ఇవి బాగుపడాలంటే, నిజాయితీగల వ్యక్తులు కావాలనేది మరొకటి!
నిజానికి దేశంలో వ్యవసాయం, విద్యారంగాలు సంక్షోభంలో ఉంటే రాజకీయ రంగం నైతికంగా పూర్తిగా దిగజారింది. పోతే, మొదటి రెండు రంగాల్లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంటే, రాజకీయ రంగంలో ధనరాసులు పోగుపడుతున్నాయి. వ్యవసాయ రంగంపై జరుగుతున్న చర్చగాని, సానుభూతిగాని విద్యారంగంపై లేకపోవడం గమనార్హం! రైతులు చనిపోతుంటే వ్యక్తవౌతున్న బాధ, చదువుల ఒత్తిడిలో పిల్లలు పిట్టల్లా రాలుతుంటే, కనీసం కన్నీటిబొట్లు కూడా రాలడంలేదు. కారణం విద్యారంగాన్ని చూడాల్సిన దృక్కోణంలో చూడకపోవడమే! విద్యారంగ విధానాలు గురించి సమాజానికి, తల్లిదండ్రులకి తెలియకపోవచ్చు! రాజకీయ నాయకులకు పట్టింపు లేకపోవచ్చు! కానీ ఆలోచనాపరులకు, విద్యాపరమైన మేధావులకు, విద్యారంగంలోనే పని చేస్తున్న ఉపాధ్యాయులైన తల్లిదండ్రులకే లేకపోవడం శోచనీయం! అయితే విద్యారంగంపై చర్చలు జరగడంలేదా, లోపాలు ఎత్తి చూపడంలేదా అంటే ఏ రంగంపైన లేనంత చర్చ, తప్పుడు విధానాల్ని ఎత్తి చూపడం జరుగుతుంది కూడా విద్యారంగంలోనే! అయితే ఇవన్నీ వ్యక్తుల స్థాయిలో, కొద్దిమేరకు సంస్థల స్థాయిలో జరిగినా, ఓ సమగ్రతను, ఓ శాస్ర్తియ విధానాన్ని సంతరించుకోవడంలేదు.
విద్యారంగం గూర్చి, కొన్ని ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, విద్యా విషయక సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలుగా చెప్పుకునేవారు స్పందిస్తున్నట్టు కనపడుతుంది. ఉపాధ్యాయ సంఘాలు, అధిక శాతం ఉపాధ్యాయ సంక్షేమం కోసం మాట్లాడితే, విద్యార్థి సంఘాలు వారి హక్కులకై కలబడడానికై పరిమితమయ్యారు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు మాత్రం విధాన పత్రాలను రూపొందించుకుని, అటకెక్కించాయి. వాటిని విప్పి చదివే ఓపిక ప్రస్తుత నాయకత్వాలకు లేదు. ఇక తల్లిదండ్రులది, ఫ్రైవేటు పాఠశాలల్లోనే తమ పిల్లలు చదవాలని, అందులో ఫీజులు నామమాత్రంగా వసూలు చేయాలనే ఆలోచనే! ఏనాడు వీరు ఫ్రభుత్వరంగ విద్య గూర్చి, మెరుగు పర్చాల్సిన ఆవశ్యకత గూర్చి, రాజ్యాంగబద్ధంగా విద్యనందించాల్సిన ప్రభుత్వ బాధ్యత గూర్చి మాట్లాడరు. కారణం, ఈ తల్లిదండ్రుల సంఘాల్లో ఉన్న కొందరి పెద్దలకు స్వయంగా విద్యాలయాలుండడమే! విద్యా రంగ నేపథ్యంతో పనిచేస్తున్న సంఘాలకు వౌళికమైన అంశాల పట్టింపు లేకపోగా విద్యారంగాన్ని అంటే ఏ విద్యారంగంనో స్పష్టం చేయకుండా పరిరక్షించాలంటాయి. ఇక బాలల హక్కుల సంఘాలకు బడి బయట పిల్లల బాధలు తప్ప, బడిలోని పిల్లల వెతలు పట్టవు.
ఇలా విద్యాపర బాధ్యతారాహిత్య సమాజంలో ప్రభుత్వాలు తమకు తోచిన విధంగా విద్యారంగాన్ని రూపొందించుకుంటాయి. రాజ్యాంగ స్పూర్తి లేకుండా ఫెడరల్ విధానానికి తావివ్వకుండా, ఓ వర్గ ప్రయోజనాలే జాతీయ ప్రయోజనాలంటూ విద్యావిధానానికి తమ తమ రాజకీయ రంగుల్ని పులమాలని చూస్తున్నాయి. ప్రభుత్వాలే ఏర్పరిచిన కమిటీల రిపోర్టుల్ని పట్టించుకుపోగా, బుట్టదాఖలు చేయడం జరుగుతున్నది. 1964-66 నాటి విద్యా కమిటీ రిపోర్టును నీరుగార్చి, 1968లో ఓ విధానాన్ని రూపొందించినా, అది ఆచరించని వైనం. తిరిగి 1986లో మరో నూతన విద్యావిధానానికి రూపకల్పన జరిగినా, దీనికి 1992లో మరికొంత రంగు పులిమి దీన్ని అటకెక్కించారు. చివరికి విద్యారంగంలో సంబంధంలేని అసలు దేశంలోనే నివసించని శ్యాం పిట్రోడా లాంటి వారితో 2003లో జ్ఞాన సముపార్జన కమిటీని ఏర్పాటుచేసి, విద్య అంటే, కేవలం జ్ఞానాన్ని పోగు చేసుకోవడమే, పోటీపడడమే అనే తప్పుడు నినాదాన్ని ముందుకు తెచ్చింది. తర్వాత అంబానీలతో, బిర్లాలతో కూడా విద్యారంగ వీక్షణం చేయించడం ఈ దేశ పాలకుల పెట్టుబడి మనస్తత్వానికి అద్దం పడుతుంది. ఈ విధంగా కమిటీలపై కమిటీలు ఏర్పాటు కావడం, ఏ కమిటీ రిపోర్టు సమగ్రతను సంతరించుకోకపోవడం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే రెండోసారి అధికారం చేపట్టిన ఎన్‌డిఏ ప్రభుత్వం జనవరి 26, 2015 సంవత్సరం విద్యారంగ సమూల మార్పులపై ఓ కమిటీని వేయాలనే నిర్ణయాన్ని తీసుకుంది. తదనుగుణంగా అక్టోబర్ 31, 2015న మాజీ కేంద్ర కేబినెట్ కార్యదర్శి అనుభవ శాలిగా గుర్తించబడిన టి.ఎస్.సుబ్రహ్మణ్యం నేతృత్వంలో మానవవనరుల మంత్రిత్వ శాఖ ఓ కమిటీని ఏఱ్పాటు చేసింది.ఈ కమిటీలో కేంద్రస్థాయిలో వివిధ హోదాల్లో పనిచేసిన మాజీ అధకారులైన శైలజ చంద్ర, సేవారాం శర్మ, సుధీర్ మన్కర్, జె.పి.రాజ్‌పుట్‌లను సభ్యులుగా ఎంపిక చేసారు. ఇందులో రాజ్‌పుత్‌గారు గత వాజ్‌పాయి హయాంలో ఎన్‌సిఆర్‌టి (్ళఉ్గ) డైరక్టరుగా పనిచేశారు.
ఇదంతా బాగానే ఉన్నా, కమిటీ ఏర్పాటైన తర్వాతనే స్మృతి ఇరానీ మంత్రిణిగా ఉన్న మానవ వనరుల శాఖకు, కమిటీకి సయోధ్య లేకుండా పోయింది. 15-20 రోజుల్లోనే నివేదిక అందించాలని కోరామని ఓసారి, మొత్తం విద్యారంగంపై సమగ్రమైన నివేదిక (జ్ఘూచిఆ) కోరితే, కేవలం సూచనలు మాత్రమే కమిటీ చేసిందని వ్యాఖ్యానించడం జరిగింది. ఇచ్చిన సమయం సరిపోదని, మరింత సమయం కోరామని, నివేదిక సమగ్రంగా వుందని, 95 సూచనల్ని కూడా చేసామని వాటిని విధానాలుగా మార్చి తిరస్కరించడం జరిగిందని సుబ్రహ్మణ్యం ఆవేదన పడడం ఈ సందర్భంగా గమనార్హం. నివేదిక సమర్పించే కాలాన్ని ఒకసారి జులై 31, 2016కి, తర్వాత సెప్టెంబర్ 15, 2016కు పొడిగించినా, మే 27 2016నే మంత్రిత్వ శాఖకు సమర్పించడం జరిగింది. ఇదే సమయంలో స్మృతి ఇరానీ స్థానంలో జవదేకర్ రావడం జరిగిపోయాయి. నిర్దేశిత 33 అంశాల్ని (ఆ్దళౄళఒ) దేశ వ్యాప్తంగా ఆరు జోనులలో వివిధ రంగాల వ్యక్తులతో, విద్యావేత్తలతో చర్చించి, 250 పేజీల నివేదికను తయారుచేయగా లక్షా పదివేల గ్రామాలనుంచి, 5 వేల బ్లాకుల నుంచి, 500 జిల్లాలనుంచి , యునెస్కో, యునిసెఫ్, యుజిసి, ఎఐసిటిఇ (న్ళిఉ), న్యూపా (శ్రీఉ-) నుంచి, ఎన్‌సిటిఇ (్ళఉ) నుంచి, ఎన్‌సిఇఆర్‌టి (్ళఉ్గ) నుంచి సూచనల్ని, సలహాల్ని తీసుకోవడం జరిగిందని సుబ్రహ్మణ్యం తెలుపుతూ నివేదికను బహిర్గతం చేయకుండా ప్రభుత్వం నిలుపుదల చేసిందని, నివేదికను బయటపెట్టకపోతే తానే జనాల్లోకి పోతానని ఆగస్డు 25, 2016న పత్రికా ముఖంగా హెచ్చరించడంతో ఎన్‌ఇపి (ఉ-) పేరున ప్రభుత్వం దాన్ని 43 పేజీలకు కుదించి గత సంవత్సరం ఆగస్టులో విడుదల చేసింది.
సమగ్ర నివేదికతోపాటు, దాని ఆచరణాత్మక విధానాన్ని కూడా సూచించాలని కోరితే, సూచనలు, సలహాలకే పరిమితంగా,పైగా గతంలోని విద్యా కమిటీ నివేదికల్ని కాపీకొట్టి రాయడం జరిగిందనే ఆరోపణను అనధికారికంగా కేంద్రం చేయడం ఈ సందర్భంగా గమనార్హం. డ్రాఫ్ట్ కమిటీ ఓ పరిణామ (ళ్ప్యఖఆజ్యశ) కమిటీగా పని చేసిందని కేంద్రమంటే, విద్యార్థి కేంద్రీకృతానికి భిన్నంగా, పాఠశాల కేంద్రీకృతంగా నివేదిక ఉందని అనధికారి మరి కొన్ని విమర్శలు రావడం తెలిసిందే!
లేదు, విద్యా ప్రమాణాలు పెరగడానికై తగు సూచనల్ని చేసామని, అందుకే, 6వ తరగతి నుంచి తిరిగి డిటెన్షన్ కోరామని, లింగ వివక్షతకు తావులేని విద్యావిధానాన్ని సూచించామని, కేంద్రస్థాయిలో ఎడ్యుకేషన్ సర్వీసెస్‌తోపాటు ఎడ్యుకేషన్ ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేయాలని, దేశవ్యాప్తంగా సైన్సుకు, గణితానికి, ఆంగ్లానికి ఒకేవిధమైన కరికులం వుండాలని, పదవ తరగతిలో రెండురకాల పరీక్షల విధానం ఉండాలని, గణితం, సైన్సులో ఉన్నత చదువులు చదివేవారికి-(ఎ)పరీక్ష విధానం (ఉన్నతస్థాయి), లేదనుకుంటే (బి)స్థాయి (సాధారణ) విధానం పాటించాలని సూచించడం జరిగిందని కమిటీ తెలుపుతూ, అమెరికా పిల్లలు అమెరికాను ప్రేమించినట్టుగా, భారతీయ పిల్లలు భారతదేశాన్ని ప్రేమించేలా ప్రణాళికాపరమైన మార్పుల్ని పొందుపరిచామని తెలిపారు. చాలా అంశాలు గత కమిటీ నివేదికల్లానే వున్నా, ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే బోధన చేయాలనే ఒత్తిడిని ఈ కమిటీ నొక్కి చెప్పడం ఓ ప్రత్యేకత. దీంతోపాటుగా విద్యారంగానికి చేస్తున్న ఖర్చు చాలా తక్కువగా ఉందని, దీన్ని పెంచాలని, ఫ్రైవేటు విద్యారంగాన్ని నియంత్రించాలని, వ్యవస్థీకృత మార్పులకన్నా, పాలనా సంబంధ మార్పుల్ని చేపట్టాలనే కొన్ని సూచనలు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించి ఉంటాయి. అందుకే, ప్రధానమైన కొన్ని విద్యారంగ సమస్యల్ని ఈ కమిటీ గుర్తించినా, వీటిని కేంద్ర ప్రభుత్వంచే గుర్తింపచేయడంలో కమిటీ వైఫల్యం చెందిందని కొందరి వాదన! ఈ నేపథ్యంలోనే సుబ్రహ్మణ్యం స్వయం మూడు పేజీల లేఖను స్మృతి ఇరానీకి రాయడం, ఆమె మారడం, తర్వాత సుబ్రహ్మణ్యం వౌనంగా ఉండిపోవడం, తిరిగి ఇస్రో మాజీ అధినేత కస్తూరి రంగన్ నేతృత్వంలో గత జూన్ 26న మరో 8 మంది సభ్యులతో కొత్త కమిటీని ఏర్పాటు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ కమిటీ ఎంత వేగంగా పనిచేసినా, నిర్దేశిత 6-7 నెలల్లో ఓ సమగ్ర నివేదిక ఇస్తుందా అనేది ఓ అనుమానం. అలా ఇచ్చిన, ఆ నివేదిక బహిర్గతమై విమర్శల్ని ఆహ్వానించి, కేంధ్ర కేబినెట్ ఆమోదం పొంది ఆచరణలోకి వచ్చేనాటికి 2019 ఎన్నికల సీజన్ మొదలవుతుంది. తిరిగి ఎన్‌డిఏ (బిజెపి) అధికారంలోకి వచ్చినా, ఈ నివేదిక ఆచరణలోకి వస్తుందనేది (అప్పుడు మానవ వనరుల మంత్రిగా జవదేకరో, మరొకరో తెలియదు కాబట్టి) కూడా ఊహించడం కష్టమే!
ప్రభుత్వాలు మారినప్పుడే కాకుండా, ఒకే ప్రభుత్వంలో ఓ కమిటీ ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేయడం ఇదే మొదటిసారి. సుబ్రహ్మణ్య కమిటీ నివేదికపై కారాలు, మిరియాలు నూరినవారికి, వ్యతిరేకించనవారికి కొత్త కమిటీ ఏర్పాటు ఆనందాన్ని కల్గించవచ్చు! కానీ కొత్త కమిటీ తిరిగి ఎలాంటి సూచనల్ని చేస్తుందనేది గుర్తిస్తే ఈ ఆనందం క్షణకాలం నిలవదు.సుబ్రహ్మణ్య కమిటీ సూచించిన మాతృ భాషలో విద్యను, ఆరు శాతం జిడిపి నిధుల్ని ఖర్చు చేయాలన్న సలహాను, ఉపాధ్యాయ విద్యను పటిష్టపరచాలన్న ప్రతిపాదనలకే ఇబ్బంది పడ్డ కేంద్రం, కస్తూరి రంగన్ ఎలాంటి సూచనల్ని ఇస్తే ఆహ్వానిస్తుందో తెలియదు. తెలిసిందల్లా, విద్యారంగాన్ని మొత్తంగా ఫ్రైవేటీకరించాలని, కాషారుూకరణ చేయాలని ఏకవాక్య తీర్మానంతో నివేదిక ఇస్తే బహఉశా ఆమోదం పొందవచ్చు. ఇది రోగి కోరిన మందులానే వుంటుంది తప్ప విద్యారంగ వౌలిక మార్పులకు దోహదపడదు. వీటికి ముందు దేశవ్యాపితంగా సివిల్ సొసైటీలు ఏర్పడి, విద్యారంగ తీరుతెన్నుల్ని, వౌలిక భావనల్ని, అంశాల్ని, విద్యార్థి, మానసిక శారీరక స్థాయిని, దేశీయ ప్రాంత విభిన్న వర్గాల సామాజిక, సాంస్కృతిక ఆర్థిక నేపథ్యాల్ని ఎత్తిపట్టేలా, దోహదపడేలా విద్యావిధానం రూపకల్పన జరిగేలా చూడాలి.ఇవి శాస్ర్తియంగా, లౌకికం, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేలా కేంద్ర కమిటీ మార్పులు, చేర్పులు చేసి, నివేదికను తిరిగి చర్చకుపెట్టి ఆచరణలోకి తీసుకురావాలి. రాజకీయాలకతీతంగా ప్రతి పది సంవత్సరాల కొకసారి అవసరమైన మార్పులతో విద్యారంగాన్ని నడిపితే, అనుకున్న గమ్యంవైపు పయనం సాగుతుంది. లేదంటే నేటి కుంటి నడకనే కొనసాగుతుంది.

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162