మెయిన్ ఫీచర్

నమ్మకాలే నడిపిస్తాయి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సృష్టిలో ప్రతి వ్యక్తికి ఓ నమ్మకం ఉంటుంది. అది వ్యక్తం చేసే తీరులోనే వైవిధ్యం కనిపిస్తుంది. సామాజికంగా శాస్తస్రాంకేతిక రంగాల్లో కొత్తపుంతలు తొక్కినా.. కొన్ని నమ్మకాలు మనమీద ఇంకా బలంగానే పనిచేస్తున్నాయి. కొన్ని హేతుబద్ధంగా అనిపించవచ్చు. కొన్ని మూర్ఖత్వంగా అనిపించవచ్చు. ఏదిఏమైనా ఈ నమ్మకం, విశ్వాసంతోనే చాలామంది భవిష్యత్తు బంగారు బాటలో నడిచేలా ఆచరిస్తుంటారు. బాలీవుడ్‌లో ప్రముఖ సెలబ్రిటీలకు ఉన్న నమ్మకాలు వారిని ఏవిధంగా నడిపిస్తున్నాయో ప్రముఖ జ్యోతిష్క్యులు, సంఖ్యాశాస్త్ర నిపుణులు కావ్యా ల్ సేదని, మహేంద్ర హథి ఇలా వివరిస్తున్నారు. పుక్కిట పురాణాలు అని కొట్టిపారేయకుండా జ్యోతిష్క్యులు చెప్పిన సలహాలనే నమ్మకాలుగా చేసుకుని ముందుకు సాగుతున్నారు.
తైమూర్‌కు ట్రాన్స్‌జెండర్స్ దీవెనలు
తైమూర్ జన్మించిన తరువాత సుప్రసిద్ధ బాలీవుడ్ నటి కరీనాకపూర్ ఈ మధ్యకాలంలో వార్తల్లోకి ఎక్కుతుంది. ఆమె తన కుమారుడు తైమూర్‌ని దీవించటానికి తీసుకువచ్చిన ట్రాన్స్‌జెండర్స్‌కు అధిక మొత్తంలో నగదు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ట్రాన్స్‌జెండర్స్ దీవెనలు తైమూరుకు అవసరమని చెప్పటంతో కరీనా డబ్బుకు సైతం వెనుకాడకుండా వారిని ఇంటికి పిలుపించుకుని మరీ వారి దీవెనలు తీసుకున్నదట!. తన బిడ్డ తైమూర్‌కు దుష్టశక్తుల నుంచి ఎలాంటి ఆపద లేకుండా చేసుకునేందుకు ఇలా చేసింది. ట్రాన్స్‌జండర్ల దీవెనలు మంచిదని పురాణాలు సైతం నొక్కివక్కాణిస్తున్నాయి. వారి ఆశీస్సులే అదృష్టాన్ని కలుగజేస్తాయట. వారి దీవెనలు తీసుకున్నపుడు తప్పనిసరిగా వారికి ఎంతోకొంత డబ్బు ఇవ్వాలి. అలా చేయకపోతే ఆ దీవెనులు వృథా అవుతాయని కూడా నమ్ముతారు. దీంతో కరీనాకపూర్ కూడా ట్రాన్స్‌జెండర్ల దీవెనలు వృథాపోకుండా చేసుకునేందుకు ఇలా అధికమొత్తంలో డబ్బు అందజేసింది. కత్రినాకైఫ్ తన సినిమా విడుదలకు ముందు తప్పనిసరిగా అజ్మీర్ షరీఫ్‌ను సందర్శిస్తుంది. రణబీర్ అదృష్ట సంఖ్య ఎనిమిది. విద్యాబాలన్ ఎరుపు రంగు అదృష్టాన్నిస్తుందని నమ్ముతున్నట్లు కావ్యల్ సేదని, మహేంద్ర హథి చెబుతున్నారు.

అమీర్‌కు కలిసొచ్చిన డిసెంబర్
అమీర్‌ఖాన్‌కు డిసెంబర్ నెల కలిసొచ్చిందట. ఎందుకంటే తారే జమీన్ సినిమా వరకు అమీర్‌ఖాన్‌కు అవకాశాలు లేక తల్లడిల్లిపోయాడు. దీంతో ఆయన అప్పటి నుంచి తన సినిమాలను డిసెంబర్ నెలలో వచ్చే క్రిస్మస్ పండుగను విశ్వసిస్తూ.. ఆ నెలలో విడుదల చేసుకుంటాడు. అంతేకాదు అమీర్‌ఖాన్‌కు కుమారుడు పుట్టకముందు కూడా సంతానానికి సంబంధించిన సమస్యలు ఎన్నో తలెత్తాయి. అమీర్‌ఖాన్, ఆయన భార్య కిరణ్‌రావులకు కొడుకు అజాద్ డిసెంబర్‌లోనే జన్మించాడు. ఇది కూడా అమీర్‌ఖాన్ దంపతుల నమ్మకాన్ని మరింత బలపరిచింది. దీంతో ఈ నెల తమకెంతో మంచిదని అమీర్‌ఖాన్ దంపతులు విశ్వసిస్తున్నారు. మనసు ఎంతో శక్తివంతమైంది. డిసెంబర్ నెలలో విడుదలైన సినిమాలు బాగా చేస్తే బాగా ఆడుతాయనే బలమైన విశ్వాసం అమీర్ దంపతుల మనసు మీద పడింది. దీంతో డిసెంబర్ నెలలో విడుదలైన ధూమ్3 వంటి సినిమాలు ఆయనకు లాభాలు తెచ్చిపెట్టాయని కావ్యల్ అంటారు.

నీలం రంగు రాయితో అదృష్టం..
బిగ్‌బీ అమితాబచ్చన్ ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ సందర్భంలో ఆయన జ్యోతిష్క్యుల సూచనతో నీలం రంగు రాయితో చేసిన ఉంగరాన్ని ధరించారు. ఈ ఉంగరం పెట్టుకున్న తరువాతే ఆయనకు ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమం నిర్వహించే ఛాన్స్ వచ్చిందట. ప్రతి రాయికి దాని నాణ్యతతో పాటు కొంత అయస్కాంత శక్తివలే ఎంతోకొంత శక్తి ఉంటుందని మహేంద్ర హథి అంటారు. నీలం రంగు జ్ఞానం, ధర్మం వంటివాటికి ప్రతీకగా నిలుస్తుందని మహేంద్ర తెలియజేస్తున్నారు.

ఆ నెంబర్ ఉంటేనే డ్రైవ్..
షారూక్‌ఖాన్‌కు కూడా ఓ గుడ్డి నమ్మకం ఉంది. కారు నెంబర్ ప్లేట్ మీద ‘555’ అని ఉంటే చాలు ఇక ఆ కారు ఆయన డ్రైవ్ చేస్తా డు. ఆయన అదృష్ట నెంబర్ ఐదు. చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా సందర్భంలోనూ బైక్ నెంబర్ ప్లేటు మీద ఐదు స్టాంప్ చేశారు. ఐదు నెంబర్ బుధుడుకు సంబంధించినది. ప్రయాణాన్ని, కమ్యూనికేషన్‌ను సూచిస్తుంది. కాబట్టి ‘555’ సంఖ్య ఉంటే దాని అసాధారణంగా ఉంటుంది కాబట్టే షారుక్‌ఖాన్ నమ్ముతున్నారు.

విదేశాలకు ఎగిరిపోతాడు..
అక్షయ్‌కుమార్‌కు ఓ భయం ఉంది. తన సినిమా రిలీజ్‌కు ముందు ఆయన విదేశాలకు చెక్కేస్తాడు. ఎందుకంటే తాను స్వదేశంలో ఉంటే కలెక్షన్లు మీద ప్రభావం చూపుతుందనే భయంతో విదేశాలకు వెళ్లిపోతాడు. గతంలో సినిమాకు ముందు విదేశాలకు వెళ్లటం వల్ల ఆయన సినిమాలు కలెక్షన్ల వసూళ్లు బాగా జరిగాయి. ఈ నమ్మకంతో ఆయన ప్రతిసారి తన సినిమా రిలీజ్‌కు ముందు విదేశాలకు వెళ్లిపోతాడు. గత సినిమాల కలెక్షన్ల ప్రభావం అయన మీద అలా పనిచేయటం వల్ల అదే నమ్మకంతో అక్షయ్‌కుమార్ అలా చేస్తున్నారు.
చెట్టుతో పెళ్లి..
ఐశ్వర్యారాయ్ పెళ్లి విషయంలోనూ నమ్మకాలే పనిచేశాయి. అభిషేక్ బచ్చన్‌తో పెళ్లికి ముందు ఐశ్వర్యారాయ్‌కు ఓ చెట్టుతో పెళ్లి చేశారనే పుకారు వినవచ్చింది. పెళ్లిలో ఇద్దరి నక్షత్రాలు కలవకపోవటం, మంగళ్ ప్రభావం వల్ల ఇలా పెళ్లికి ముందు మరో వివాహం చేయటం సంప్రదాయమని కావ్యల్ అంటున్నారు.

- ఆశాలత