మెయిన్ ఫీచర్

దైవత్వమే మానవరూపం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లల ప్రవర్తన పెద్దలను బట్టి ఉంటుంది. మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్నట్టు మంచి బుద్ధులన్నీ చిన్నపుడే నేర్పించాలి అంటారు. ఇది అన్నివేళలో నిజమే అయనా అన్ని వేళలా నిజం కాకపోవచ్చు.ప్రహ్లాదుడు తన తల్లి కడుపులో ఉన్నపుడే నారదాశ్రమంలో నారాయణ మంత్రం నేర్చుకున్నాడు. తల్లి కడుపులోనుంచే విష్ణుకథలను విన్నాడు. వాటిపైన మక్కువ ఏర్పరుచుకున్నాడు.
తీరా పుట్టినతర్వాత మహావిష్ణువుకు వైరి అయన హిరణ్యకశపునికి దగ్గరికి వచ్చాడు. హిరణ్యకశపుడు ముల్లోకాలకు తానే రాజు నని శ్రీహరి అంటే తనకు భయపడేవాడని తనకు బ్రహ్మనుంచి ఎన్నో వరాలు పొందినవాడినని తనను ఎదరిం చలేని మహావిష్ణువు తనకు భయపడి ఎక్కడో దాక్కున్నాడని అనే వాడు. తన్ను తప్పమరెవరినీ పూజించ కూడదని కూడా శాసనం చేశాడు. రాక్షసులకు ప్రభువైన హిరణ్యకశపుడిని కేవలం రాక్షసులే కాదు మానవులు, దేవతలుకూడా పూజించాలన్న నియమం పెట్టాడు. ఎక్కడ హరి భజన జరుగుతుంటుందో, ఎక్కడ పరమేశ్వరా రాధన జరుగుతుంటుందో అక్కడికి వెళ్లి నానాభీబత్సం చేసి వారిని నానా తిప్పలు పెట్టి వచ్చేవాడు. బ్రాహ్మణులను, సజ్జనులు నానాహింస పెట్టేవాడు. అటువంటి వాడైన హిరణ్యకశపునికి ముద్దుల తనయుడు ప్రహ్లాదుడు.
ప్రహ్లాదుడు నారదుని ద్వారా విన్న శ్రీహరిమీద అపారమైన ప్రేమను పెంచుకున్నాడు. అన్నింటి కారణుడైన శ్రీహరి మీద ఏర్పడిన ప్రేమనే భక్తిగా మార్చుకున్నాడు. అచలంచలమైన భక్తితో శ్రీహరిని అహర్నిశమూ స్మరణచేసేవాడు. తాను ఒక్కడే స్మరణ చేసేవాడు కాదు తనతోడి బాలురచేత చేయంచేవాడు. మానవత్వంతో మెలగడమే దైవత్వం అని చెప్పేవాడు. సర్వాంతర్యామి అయన భగవంతుడు ప్రతివారిలోను చైతన్య రూపమై విలసిల్లుతున్నాడని అనేవాడు. ఈ శరీరం నశ్వరమైనది. దేహమనే ఉపాధి ఉన్నంతవరకు మంచి పనులు చేసి స్థిరమైన బుద్ధితో శ్రీహరిని ధ్యానిస్తే మరలా ఈ జనన మరణ చక్రంనుంచి తప్పించుకోవచ్చు అని చెప్పేవాడు. అనశ్వరమైన శ్రీహరి సాయుజ్యాన్ని కోరుకోవాలి కాని క్షణభంగురమైన ఈ లౌకికసుఖాలను కోరుకోకూడదని తన మిత్రులకు చెప్పేవాడు. మనకు ఇచ్చిన ఈ అవయవాలు, కర్మేంద్రియజ్ఞానేంద్రియాల వల్ల సత్యము, శాశ్వతమూ అయన భగవంతుని గూర్చి తెలుసుకోవాలని చెప్పేవాడు. దీన్ని చూచి హిరణ్యకశపుడు కోపం తెచ్చుకున్నాడు. నాకు శత్రువైన శ్రీహరిగూర్చి చెప్పటమేమిటి? థీనికి కారణం చదువు లేకపోవడమని చండామార్కులను పిలిచి తన కొడుకుకు హితం చెప్పి మంచి బుద్ధి ఏర్పడేట్టుగా చదువు చెప్పమని పురమాయంచాడు. గురుకులానికి వెళ్లిన ప్రహ్లాదుడు అక్కడ సహధ్యాయులందరినీ శ్రీహరివైపుకు మళ్లించాడు. కేవలం లౌకిక సుఖాలను చెప్పే ఈ చదువు చదువుకాదు. శాశ్వతమైన భగవంతుని గూర్చి నేను చెబుతాను అంటూ శ్రీహరి కథలను కడురమ్యంగా చెప్పి వారినందరినీ తనకు అనుకూలంగా చేసుకొన్నాడు. వారందరూ కూడా శ్రీహరి భజన చేయడానికి పూనుకోవడం చూచి గురువులు భయపడి ఈ విషయాన్ని హిరణ్య కశపునకు చేరవేశారు. గురువుల దగ్గరనుంచి ప్రహ్లాదుడిని తీసుకొని వచ్చి ఇంతకాలం ఏమి చదువుకున్నావు అని హిరణ్యకశపుడు అడిగితే చదువుల్లోని మర్మాన్నంతా తెలుసుకొన్నాను. జగత్తు అంతా ఆవరించి ఉన్న జగన్నాథుని స్వస్వ రూపాన్ని గురించి తెలుసుకొన్నాను అని చెప్పాడు. ఎన్నో విధాలుగా నయాన భయాన హిరణ్యకశపుడు తన కొడుకుకు శ్రీహరి తనకు శత్రువని అసలు దానవుల కంతా శత్రువని చెప్పాడు. అతడినుంచి మనలను మనం రక్షించు కోవాలి. మనలను నాశనం చేసేవాడు కేవలం ఆ శ్రీహరి మాత్రమే అని చెప్పాడు. కాని తన మాట ఏవిధంగా వినని కొడుకు మతం మార్చలేక శ్రీహరి మెప్పు భరించలేక హిరణ్యకశ్యపుడు ఆ సర్వవ్యాపి అన్న ఆ శ్రీహరిని స్తంభంలో చూపించమని అడిగాడు. ఇందుగలడు అందులేడని సందేహమెందుకు తండ్రీ నీకు ఇపుడే ఆ శ్రీహరి కనిపిస్తాడు అని శ్రీహరి ప్రహ్లాదుడు ప్రార్థించాడు. వెనువెంటనే స్తంభం నుంచి నరమృగ రూపంలో రూపంలేని భగవం తుడు వ్యక్తమయ్యాడు. హిరణ్యకశపుని కోరిక మేరకే ఆయన వరాలు నిజం అయ్యేవిధంగానే దానవాంతకుడైన శ్రీహరి హిరణ్యకశపుణ్ణి సంహరించాడు. లోకాలన్నీ రాక్షసపీడ వదిలిందని సంతోషించాయ. ప్రహ్లాదుడిని అక్కున చేర్చుకున్నాడు. దానవలోకానికి రాజు ను చేసి ధర్మాచరణతో రాజ్యాన్ని ఏలమని శ్రీహరి చెప్పాడు. ప్రహ్లాదుడు శ్రీహరికి నమస్కరించి ధర్మమే భగవంతుని స్వరూపంగా ఎంచి రాక్షసలోకాన్ని ధర్మయుతంగా ఎన్నో వేల యేండ్లు పరిపాలించాడు. చరిత్రలో అజరామరంగా నిలిచిపోయాడు. కనుక చదువు సంస్కారం మనష్యుల్లోని సత్వగుణాన్ని ప్రేరేపిస్తా య. తల్లితండ్రులు సజ్జనులై, ధర్మాచరణ చేస్తూ ఉండి వారు తమ పిల్లలకు సత్వ గుణాన్ని ప్రోదిచేసేట్టు పెంచితే తప్పక పిల్లలందరూ ధర్మాచరణులు అవుతారు. సర్వవ్యాపి అయన భగవంతునికి మారు రూపులుగా ఎదుగుతారు.

- డా॥ ఎ. రాజమల్లమ్మ