మెయిన్ ఫీచర్

లెక్క తప్పుతోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమాకు వాచిపోతుంది.
వాపును బలుపుగా చూపించుకునే తాపత్రయంలో సినిమా నమ్మకాన్ని కోల్పోతుంది. -గ్రాస్, షేర్, కలెక్షన్.. ఏదైతేనేం -హద్దుదాటి చెబుతోన్న ముద్దంకెలన్నీ అభిమానుల ముద్దుకోసం తప్ప ఇంకెందుకూ కాదు. కానీ -ఈ విషయాన్ని దాచిపెట్టడంతో సినిమా అసలు లక్ష్యం పక్కకుపోతోంది. వంద పెట్టి టికెట్ కొన్న ప్రేక్షకుడిని అలరించాలన్న ఆలోచనను గాలికొదిలేసి, తొలిరోజు కలెక్షన్లు ఎంత గొప్పగా ప్రచారం చేసుకోవాలన్న అంశంపైనే దృష్టి పెడుతోంది. ఆ అంకెలన్నీ వాపేనని ప్రచారం చేస్తున్న వాళ్లకూ తెలిసినా -బలుపేనంటూ ఇస్తోన్న బిల్డప్‌ను చూసి ఇండస్ట్రీ ముసిముసిగా నవ్వుకుంటోంది.

మా హీరో -తొలిరోజు కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టాడంటాడు ఒకడు. ఊహించని వసూళ్లతో రికార్డు క్రియేట్ చేసిందని మరోకడు అంటాడు. విడుదలకు ముందే 80 కోట్ల బిజినెస్ చేసి సెనే్సషన్‌కు నేరేషన్ చెప్పిందని ఇంకొకడంటాడు. ఈ లెక్కలు ఆలిండియా రికార్డులు తిరగరాసే వరకూ పోతున్నాయి. ఓవర్‌సీస్ బాక్సాఫీస్‌ను దునే్నసేది ఒకరైతే, దాన్ని దాటేందుకు ప్రయత్నించేది ఒకరు. ఈమధ్య మరీ ఎక్కువైపోయిన పైత్యపు లెక్కలివి.
తొలిరోజు వసూళ్లపై -వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో మోతమోగుతోన్న లెక్కలివి. దాదాపు పెద్ద సినిమాలన్నింటికీ ఫస్ట్‌డే హడావుడి ఇదే. ఇదీ తొలిరోజు బలుపు. చివరాఖరకు అధిక భాగం సినిమాలు డిజాస్టర్లుగా మిగుతున్నాయి. అప్పుడు తెలుస్తుంది -అది బలుపుకాదు, వాపని. అయినా మరో పెద్ద సినిమాకు మళ్లీ అదే హడావుడి. నిక్కచ్చిగా తొలిరోజు థియేటర్ల నుంచి కట్ అయిన టికెట్ల ద్వారా వచ్చిన వసూళ్లింత? అని ఎవరినైనా చెప్పమనండి. ఒక్కరు చెప్పరు. ఎన్ని థియేటర్లలో విడుదలైంది? ఎంతమేర టికెట్ల ద్వారా వసూలైంది? ఫస్ట్‌డే కలెక్షన్ల పేరిట ప్రకటించుకున్న మొత్తానికీ, టికెట్లు తెగిన మొత్తానికి వ్యత్యాసమెంత? అని అడిగితే -వౌనం తప్ప మాట వినిపించదు. మరి ఈ కలెక్షన్ల కాకమ్మ కథలు ఎవరి కోసం చెబుతున్నట్టు. ఎందుకోసం వినిపిస్తున్నట్టు. ఈ లెక్కలతో బాగుపడేదెవరు? బుక్కైపోతున్నదెవరు? వీటికీ సమాధానాలు ఎవ్వరూ చెప్పరు. ఇక్కడే తెలుగు సినీ పరిశ్రమ లెక్క తప్పుతోంది. వాస్తవాన్ని వదిలేసి -కొందరు స్వార్థంతో విసురుతోన్న ఉచ్చులో చిక్కుకుంటోంది. ఈ ఫస్ట్‌డే కలెక్షన్ల కోణంలో చూస్తే -తెలుగు సినిమాను బాహుబలికి ముందు, తరువాత అని పోల్చాలి. బాహుబలి సినిమాకంటే ముందు తెలుగు సినిమాకు అటు ఓవర్‌సీస్‌లోకానీ, ఇటు ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లోకానీ ఇప్పుడున్నంత మార్కెట లేదు. బాహుబలి నుంచే కొత్త ట్రెండ్ మరీ ఎక్కువైంది.
ఇప్పుడు తెలుగులో ఏ హీరో ఏ సినిమా చేస్తున్నాడు? ఏ హీరో ఎంత మార్కెట్ చేస్తాడన్న ఆలోచనలు రాజవౌళి బాహుబలి తరువాతి నుంచే మొదలయ్యాయి. ప్రస్తుతం తెలుగు సినిమాలు ఒక్క తెలుగులోనే కాకుండా అటు తమిళ మార్కెట్, ఇటు హిందీ మార్కెట్‌లోకి విడుదల అవుతున్నాయి. అసలు సమస్య వచ్చింది ఇక్కడే.
అభిమానులు -మా హీరో సినిమా భారీగా విడుదలై మొదటిరోజు రికార్డుస్థాయిలో వసూళ్లు రాబట్టిందని ఇష్టమొచ్చిన నెంబర్లను ప్రచారం చేస్తున్నారు. దాంతో సినిమాపై జనాల్లో క్రేజ్ పెంచేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. కానీ పరిస్థితి మరోలా ఉంటుంది. థియేటర్‌కి వెళ్తే సగం హాలు ఖాళీగా ఉండటం, కనీసం వాళ్లు ప్రకటించిన దాంట్లో సగమైనా వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపించవు. అయితే ఎందుకు ఈ అంకెల గారడీ. మొన్నామధ్య బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ ఓ సినిమా చేశాడు. విడుదలకు ముందు నానా హంగామా చేశారు. పైగా సల్మాన్ సెంటిమెంట్‌గా రంజాన్‌కు విడుదల చేసిన సినిమాలో విషయం లేకపోవడంతో బయ్యర్లు భారీగా లాసయ్యారు. కానీ అంతకుముందు ఆ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే సినిమా అని, రికార్డులు బద్దలుకొడుతుందని ఊదరగొట్టి పబ్లిసిటీతో నానా హంగమా చేశారు? తరువాత సల్మాన్ నష్టపోయిన నిర్మాతలను ఆదుకోవడం కొసమెరుపు? ఇది కేవలం సల్మాన్ నటించిన సినిమా విషయం గురించే కాదు, చాలామంది అంకెల గారడీతో తమ సినిమాల క్రేజ్‌ని పెంచేందుకు ఇలా ఇష్టమొచ్చిన కలెక్షన్లు ప్రచారం చేయడం. దానికితోడు సోషల్ మీడియా పుణ్యమా అని కొన్ని గంటల్లోనే స్ప్రెడ్ అవ్వడంతో, సినిమాపై భారీ ఎఫెక్ట్ పడుతుంది.
ఇక టాలీవుడ్‌లో ఈ అంకెల గారడీ మామూలుగా లేదు. స్టార్ హీరోల సినిమాలకు మరీ ఎక్కువవుతోంది. ఈమధ్యే విడుదలైన ఓ స్టార్ హీరో సినిమా తొలిరోజు కలెక్షన్లు 20 కోట్లు అన్నారు. రెండోరోజు 28 కోట్లు కలెక్ట్ చేసి, బాక్సాఫీస్‌ను షేక్ చేసిందన్నారు. బాహుబలి తరువాత రికార్డులను కొల్లగొట్టిందని ఊదరగొట్టారు. కానీ సినిమా విడుదలైన రెండోవారమే థియేటర్స్ నుంచి తీసేశారు. సినిమాను తీసుకున్న బయ్యర్లు బోరుమన్నారు. నిజానికి రెండు రోజుల్లో 28 కోట్లు వసూలు చేస్తే, సినిమాకు పెట్టిన డబ్బులో సగానికిపైగా వచ్చేసినట్టే. ఇక మరోవారంలో అటు నిర్మాత, ఇటు బయ్యర్లు అందరూ హ్యాపీగా ఉండాలి. కానీ అలా జరగ లేదు. నిజానికి ఈ అంకెల గారడీ ఎవరికి లాభం అన్నదే పెద్ద ప్రశ్న.
పెద్ద సినిమా విడుదలైనపుడు -తొలిరోజు కలెక్షన్లు కోట్లలో ఉంటాయి. మలిరోజు ఫిగర్ మాత్రం సగం కూడా ఉండదు. ఎందుకు? ఎక్కడుంది కిటుకు? అన్న ప్రశ్నలు వేసుకుంటే అసలు విషయం అర్థమవుతుంది. మసిపూసి మారేడు చేస్తున్నారన్న విషయం బోధపడుతుంది. ఫస్ట్‌డే కలెక్షన్లను కోట్లు దాటించి హైప్ చూపించేందుకు ఫ్యాన్స్, ప్రమోటర్లు, చివరకు నిర్మాతలూ శక్తికిమించే కృషి చేస్తున్నారు. ఇక్కడే యుక్తి ప్రదర్శన దాగివుంది. ప్రతి పెద్ద సినిమా తొలిరోజు కలెక్షన్లు ఈమధ్య కనీసం 25 కోట్లు దాటేస్తోంది. అంటే -అదంతా టికెట్లు తెగ్గొట్టడం వల్ల వచ్చింది కాదు. అందులో జిల్లాలవారీ డిస్ట్రిబ్యూటర్లు, ధియేటర్ల వాళ్లదగ్గర నుంచి సంపాదించిన ఫిక్స్‌డ్ హైర్‌లు, అడ్వాన్స్‌లు, రిటర్న్ బుకింగ్ హైర్‌లు అన్నీ కలిసి ఉంటాయి. అంతేకాదు, లోకల్‌గా థియేటర్లవారీ, ఊళ్లవారీ జరిపిన అమ్మకాలు ఆ ఫిగర్‌లోనే మిళితమై ఉంటాయి. అంటే తొలిరోజు టికెట్లు తెగి వచ్చిన వసూలు పది రూపాయలుంటే, కలెక్షన్లుగా ప్రకటించిన ఫిగర్ వంద ఉండొచ్చు. పెద్ద అనబడే అన్ని సినిమాలకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. అందుకే తొలిరోజు పాతిక కోట్ల వసూలు చెప్పుకున్న సినిమాలన్నీ -మలిరోజు ఫిగర్‌ను మూడు కోట్లు దాటి చెప్పుకోవు, చెప్పుకోలేవు కూడా.
నిజానికి -్ఫక్స్‌డ్ హైర్‌లు, అడ్వాన్స్‌లు, లోకల్ సేల్స్ తప్పిస్తే మిగిలేదే ఫస్ట్‌డే కలెక్షన్. సినిమా నిజంగానే హిట్టయితే, ఈ లెక్కలేమీ బయటకు రావు. పొరబాటున సినిమా ఢమాల్ అంటే మాత్రం -తీసుకున్న అడ్వాన్స్‌లు బయ్యర్లు వెనక్కి ఇచ్చుకోవాలి. తీసుకున్న అడ్వాన్స్‌ల్ని తిరిగి చెల్లించాలి. అప్పుడు అసలు విషయం బయటపడుతుంది. ఫస్ట్‌డే కోట్లు కలెక్ట్ చేసిన సినిమా -వారం తిరిగే సరికల్లా డిజాస్టర్‌గా మారి కోట్ల నష్టాలు మిగులుస్తుంది. టికెట్‌ల సేల్ లెక్కలు చెప్పకుండా, గొప్ప కోసం పిచ్చి లెక్కల్ని చెలామణిలోకి తేవడం వల్ల వచ్చే దుస్థితి ఇది.
దీన్నిబట్టిచూస్తే -వెనక్కిచ్చే మొత్తాలను మొదటిరోజు సినిమా కలెక్షన్ల రికార్డుల్లో ఎలా చూపిస్తారు? అన్నది ప్రశ్న. నిజానికి డిసీఆర్‌లే నిజమైన కలెక్షన్. ఒక జిల్లాలోని అన్ని థియేటర్ల నుంచి బయ్యర్‌కు ఏ రోజుకు ఆరోజు వస్తాయి. వాటిని టోటల్ చేస్తే ఫస్ట్‌డే, సెకెండ్ డే లెక్కలు తెలుస్తాయి.
ఇన్ని లొసుగుల్ని బలుపుగా ఎందుక ప్రచారం చేస్తున్నారు. లాభం కోసం? ఎవరికి? హీరోకి, దర్శకుడికి. అప్పుడప్పుడూ నిర్మాతకి. షేర్ అనేది అన్ని సినిమాలకు, అన్నిచోట్లా ఒక్కలా ఉండదు. నిర్మాత -బయ్యర్ మధ్య అవగాహనలో ఒకలా ఉంటే, నిర్మాతే పంపిణీదారైతే మరోలా ఉంటుంది. నిర్మాత నేరుగా విడుదల చేస్తే ఇంకోలా ఉంటుంది. కమిషన్‌పై విడుదలైతే ఒకలా, అవుట్‌రేట్‌లో మరోలా ఉండొచ్చు. ఒక సినిమా తయారై థియేటర్‌కు రావడానికి మధ్యలో చాలా లెక్కలే ఉంటాయి. కానీ, ఫస్ట్‌డే ప్రకటించన కలెక్షన్ల ఫిగర్ చూసి -నిర్మాతకు కోట్లు కురిపించేసిన సినిమా అనుకునేవాళ్లు చాలామందే ఉంటారు. నిజానికి ఈ లెక్కలు -హీరోల రెమ్యునరేషన్ పెంచుకోడానికి, దర్శకుడు తన స్టామినా పెంచుకోడానికి మాత్రమే ఉపయోగపడతాయి. పాతిక కోట్లమేర స్టార్ హీరోలు, కనీసం 20 కోట్లమేర స్టార్ డైరెక్టర్లు తీసుకుంటున్నారంటే -ఇలాంటి లెక్కలు వినిపించి పెంచేసిన బాపతే.
నిజానికి ఈ సొమ్మంతా -లక్ష, రెండు లక్షల స్టాయినుంచి సేకరించిందే. సినిమా బజ్‌మై నమ్మకంతో లోకల్ బయ్యర్లు, రెండు లక్షల రేంజ్‌లో థియేటర్లు, ఊళ్లవారీ కొనుగోలు చేసినోళ్ల సొమ్మే. నిజానికి పెద్ద సినిమా ఢమాల్‌మంటే -రియల్‌గా నష్టపోయేది వాళ్లే. గత ఏడాదికాలంలో చాలా పెద్ద సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు ఢమాల్ మన్నపుడు బయ్యర్ల ముఖాల్లో బాధ కనిపించలేదు. లోకల్‌గా సినిమా కొన్నవాళ్ల కళ్లలో కన్నీళ్లు తిరిగాయి. ఎలాగంటే -సినిమా ఇన్‌సైడ్ టాక్‌ను ఎప్పటికప్పుడు బయ్యర్ తెలుసుకుంటుంటాడు. ఈ సినిమా అటూ ఇటూగా ఉంది అన్న సంకేతాలు అందితే, లోకల్‌గా అమ్మకానికి పెట్టేస్తాడు. ఆ సోమ్ముతో బయ్యర్ దాదాపు రికవరీ అయిపోతాడు. కానీ, కిందిస్థాయిలో కొన్నవాడు మాత్రం చేతి చమురు వదిలించుకుని లబోదిబోమంటాడు. అంట -కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమా పోతే, ఆ నష్టమంతా లక్షల్లోకి, వేలల్లోకి సప్లై చేసేస్తారన్న మాట.
కలెక్షన్లు భారీగా వచ్చాయి కనుక -హీరో తన స్టామినా మేరకు రెమ్యునరేషన్ పెంచుతాడు. దర్శకుడు తన స్టామినాను చూపించి -బడ్జెట్ పెంచుతాడు. వెరసి -నిర్మాత పెద్దమొత్తాన్ని సిద్ధం చేసుకుంటాడు. పెద్ద సినిమాలు విడుదలైనపుడు ఒక విషయం గమనించొచ్చు. కలెక్షన్లు బావుంటాయి. వసూళ్లు పెరుగుతాయి. కానీ, నిర్మాత కంట్లో ఆనందం ఉండదు. ఎందుకంటే -వందకోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తే, అది బాగా ఆడి 110 కోట్లు కలెక్ట్ చేసిందని అనుకుందాం. లెక్కల ప్రకారం పైన వచ్చిన పది కోట్లు నిర్మాతకు పూర్తిగా లాభం అనుకుందాం. కానీ హీరోకి పాతిక కోట్లు, దర్శకుడికి 20 కోట్లు మిగులుతాయి. అంటే -ఒక భారీ బడ్జెట్ చిత్రానికి 60 కోట్ల వరకూ రెమ్యునరేషన్లు చెల్లిస్తే, 40 కోట్లు నిర్మాణానికి వెచ్చిస్తే -నిర్మాతకు మిగిలేది పది కోట్లన్నమాట. సినిమా పోతే మాత్రం -నిర్మాత అడ్రస్ గల్లంతు. హిట్టయిన చాలా సినిమాల నిర్మాతలు -చివరిలో నష్టపోయారంటే నమ్ముతారా? కానీ -ఇది నిజం.

-త్రివేది