మెయిన్ ఫీచర్

పూల మొక్కల పొదరిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చినుకు పడితే చాలు నేలంతా పచ్చటి తివాచీ పరిచనట్లు పచ్చగా కనువిందు చేస్తోంది. ఎండిన పూలకుండీల్లో మళ్లీ కొత్త మొక్కలు నాటుకుని ఇల్లంతా పూలమొక్కల పొదరిల్లుగా మార్చేస్తుంటారు. చిరుగాలులకు మొక్కలు హోయలుపోతుంటే ఆ దృశ్యం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చటి ప్రకృతి పరిమళాలు వెదజల్లేలా ఇంటిని తీర్చుదిద్దుకునే సీజన్ ఇదే. ఈ కాలంలో పూచే పూలపై కురిసే చినుకులు వింతైన అందాన్ని కలిగిస్తాయి. అందుకే వర్షాకాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో పూల వసంతాన్ని కురిపించవచ్చు. మొక్కలు పెంచాలని ఎవరికీ మాత్రం ఆసక్తి ఉండదు. అపార్ట్‌మెంట్‌లలోగానీ, ఇంటి ముందు ఖాళీ స్థలంలో గానీ పూల మొక్కలు ఉంటే ఆ ఇంటికి కొత్త అందం వచ్చినట్లే. పొందికైన ఇంట్లోకి వచ్చే చిరు చలిగాలులకు గులాబీలు హొయలు పోతూ అమితంగా ఆకట్టుకుంటాయి. కొద్దిపాటి స్థలం ఉన్నా పూల మొక్కలు నాటుకుంటే చక్కటి సువాసనలు వెదజల్లుతూ స్వచ్ఛమైన గాలి వస్తోంది. సూర్యరశ్మి తక్కువగా వచ్చే ఇళ్లల్లో నూ పూల మొక్కలను పెంచుకోవచ్చు.
రకరకాల గులాబీ మొక్కల సీడ్స్ తక్కువ ధరకే వస్తున్నాయి. మంచివి, ఏపుగా.. అందంగా పెరిగే విత్తనాలు ఎంచుకోవటం మంచిది.
అపార్ట్‌మెంట్‌లలో పెంచుకోవటానికి అనువుగా రెయన్‌బో రోజ్, క్లయింబింగ్ రోజ్ రకాలు బాగుంటాయి. మూడు నెలల్లోనే పూస్తాయి. క్రీమ్, పసుపు, పింక్, ఆరంజ్ రంగుల్లో పూసే స్నాప్డ్రాగెన్ పూల మొక్కను పెంచటం ఎంతో తేలిక. బెడ్ రూమ్‌లలోనూ, ఇంటి ముంగిట పెంచితే కొత్త ఆకర్షణ తెచ్చిపెడుతోంది. 13 నుంచి 24 సెంటీగ్రేడ్ వేడి ఈ మొక్కకు అవసరం. విత్తనాలు లోతుగా నాటవద్దు. మట్టి ఎక్కువగా కప్పేయకుండా నాటుకుంటే చాలు. వీటిని పూల కుండీల్లో పెంచిన తరువాత బెడ్ పక్కన పెట్టుకుంటే సువాసనలు వెదజల్లుతుంటాయి. అలాగే పెటూనియా మొక్క కూడా సంవత్సరం మొత్తం పూలనిస్తునే ఉంటాయి. నాలుగు అంగళాల ఉండే ఈ పూలు వేలాడే కుండీల్లో పెంచుకుంటే బాగుంటాయి. ఇండోర్‌లో పెంచేటప్పుడు ఈ మొక్క తాజాగా ఉండాలంటే తగినంత సూర్యరశ్మి అవసరం. ఈ మొక్క పువ్వులు వైట్, రెడ్, బ్లూ, వయోలెట్, పింక్, ఎల్లో రంగుల్లో కనువిందు చేస్తాయి. సూర్యరశ్మి కూడా 16 నుంచి 24 సెంటీగ్రేడు ఉంటే చాలు. విత్తినాలను లోతుగా నాటకుండా ఉపరితలంలో నాటితే చాలు. అలాగే మట్టి తేమగా ఉండేటట్లు చూసుకోవాలి.
సాకులా బోన్సాయ్ ప్లాంట్ సర్వ సాధారణంగా పెంచుకోవచ్చు. అతి తక్కువ సూర్యరశ్మి ఉంటే చాలు. బోగన్‌విల్లియా బోన్సాయ్ ఔట్‌డోర్, ఇండోర్ ప్లాంట్స్‌గా పెంచుకోవచ్చు. పింక్ బిగోనియా అందమైన పూల నిస్తోంది. ఇండోర్‌లో పెంచేటపుడు ఈ మొక్కకు వేడి ఎక్కువగా తగలకుండా చూసుకోవాలి. సూర్యరశ్మి కూడా అవసరం కాబట్టి కిటికీకి చేరువలో పెట్టుకుంటే మంచిది. బాల్కనీ, లివింగ్ రూమ్, స్టడీ రూమ్‌లలో పెంచుకుంటే అందంగా ఉంటుంది. ఇంటికి కొత్త అందాన్నిచ్చే ఇలాంటి పూల మొక్కల పెంపకం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణం వెల్లివిరుస్తోంది.

చిత్రాలు.. కిటికీ పక్కన అమర్చిన పూల మొక్కలు వర్షాలకు కనువిందు చేస్తున్న దృశ్యం, పూల మొక్కలు