మెయిన్ ఫీచర్

కమర్షియల్ టచ్‌తో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామ్ సర్కారు కాలంలోని భాగమతి గురించి తెలియని వారుండరు. నిజామ్ ఆమెను మహారాణిగా గౌరవించారు. ఆమె ప్రేమను పొందడానికి అహర్నిశలు ఎదురు చూశాడు. ఆ కథనాన్ని తీసుకుని ఇప్పుడు చారిత్రాత్మక సినిమాల కథానాయికగా స్థిరపడిన జేజమ్మ అనుష్కతో చిత్రాన్ని రూపొందించనున్నారు. ఔను, అనుష్క భాగమతిగా నటించనుంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ను విన్న జేజమ్మ తప్పక చిత్రంలో చేస్తానని దర్శకుడికి ప్రామిస్ చేసినట్టు టాలీవుడ్ కథనం. హైలెట్ ఏంటంటే -బాహుబలి ప్రభాస్ కూడా ఈ చిత్రంలో పాలుపంచుకోనున్నాడట. ఇక అక్కినేని నాగార్జున నమో వెంకటేశాయకు సిద్ధపడుతున్నాడు. తండ్రి ఏఎన్నాఆర్ భక్త తుకారాం పాత్రను చేస్తే.. నాగ్ తాజా చిత్రంలో భక్త హాథీరామ్ బాబాజీ పాత్రను పోషించనున్నట్టు తెలుస్తోంది. అన్నమయ్య, శ్రీరామదాసులాంటి భక్తిరస చిత్రాలతో ఆకట్టుకున్న నాగ్ -హాథీరామ్ పాత్రకు ప్రిపేర్ అవుతున్నట్టు వినికిడి.

హాలీవుడ్‌లలో పీరియాడికల్ మూవీస్ కనీసం ఏడాదిలో రెండైనా దర్శనమిస్తాయి. గత సంవత్సరం బాలీవుడ్‌లో ‘బాజీరావుమస్తానీ’ మంచి విజయాన్ని సాధించగా వచ్చే ఆగస్టులో ‘మెహంజదారో’ చిత్రం ప్రేక్షకులను రంజింపజేయడానికి రెడీగా వుంది. త్వరలో ‘ఝాన్సీలక్ష్మీభాయ్’గా కంగనారనౌత్ నటించనుండడం చూస్తేనే పిరియాడికల్ స్టోరీస్ బాలీవుడ్‌లో ప్రేక్షకులను అలరిస్తాయో అర్థవౌతుంది.

తెలుగు పరిశ్రమకు పీరియాడికల్ స్టోరీలు కొత్తేమీ కాదు. టెక్నాలజీ అంతగాలేని రోజుల్లోనే కళాదర్శకులు, కెమెరామెన్‌లు, దర్శకుల ప్రతిభతో ఎన్నో పీరియాడికల్ సినిమాలు అద్భుతాలు సృష్టించాయి. ఔరా! అనిపించేలా ఎన్నో ప్రయోగాలు చేసి ప్రేక్షకులను మైమరిపించినా -తెలుగు సినిమా మాత్రం రాష్ట్ర అవార్డుల సరిహద్దు దాటిపోలేకపోయింది. ఏడు పదుల టాలీవుడ్ చరిత్రలో ఈనాడు బాహుబలి రూపంలో కొత్త రికార్డులు నమోదయ్యాయి. ఇందులో వాడిన టెక్నాలజీ హాలీవుడ్‌కి కొత్తేమీ కాదుకాబట్టి -ఆస్కార్ రేసులో బాహుబలి ఏ విభాగంలోనూ నిలువలేకపోయాడు. భళీ! అనిపించుకోలేకపోయాడు. అయితే -జాతీయస్థాయిలో మాత్రం తెలుగు చలనచిత్ర
పరిశ్రమ కలను నెరవేర్చగలిగాడు బాహుబలి.
ఇప్పుడు అగ్ర హీరోలే కాదు.. అగ్ర దర్శకులూ పీరియాడికల్ చిత్రాలపై ఆసక్తి చూపడం విశేషం! దాంతో బాలకృష్ణ ఏకంగా ప్రతిష్ఠాత్మక వందో చిత్రాన్ని పీరియాడికల్ స్టోరీతో పట్టా లెక్కిస్తున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సినిమా విషయంలో ముందు ఎన్నో ఊహాగానాలు చెలరేగినా.. చివరికి గౌతమీపుత్ర శాతకర్ణి కథనే భుజానికెత్తుకోవడానికి నిర్ణయించుకోవడం గమనార్హం. బాలకృష్ణకు జానపద, పౌరాణిక, భక్తిరస, చారిత్రాత్మక చిత్రాల్లో నటించి మెప్పించడం కొత్తేమీ కాదు. అలాంటి పాత్రలతో రిస్కులో పడిన సందర్భాలూ లేవు. ఆ ధైర్యంతోనే క్రిష్ దర్శకత్వంలో శాతకర్ణి కథను తెలుగువాళ్లకు చూపించేందుకు సిద్ధమయ్యాడు. నిజానికి -హండ్రెడ్ మైల్‌స్టోన్‌ను ఏ నటుడైనా మాస్ ఎలిమెంట్‌తో దాటాలని భావిస్తాడు. కానీ బాలకృష్ణ మాత్రం హిస్టారికల్ మూవీతో హిస్టరీ క్రియేట్ చేయాలని అనుకోవడం సాహసంగానే పరిగణించాలి.
***
ఒకప్పుడు కృష్ణంరాజు హీరోగా తాండ్ర పాపారాయుడిని తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించినా, అనుకున్న విజయం సాధించలేదు. తర్వాత టాలీవుడ్‌లో దాదాపు 30ఏళ్లపాటు పీరియాడికల్ స్టోరీలతో చెప్పుకోతగ్గ కథలేమీ స్క్రీన్‌కు ఎక్కలేదు. ఇటీవలి పరిస్థితిని గమనిస్తే -రుద్రమదేవి సినిమాతో గుణశేఖర్ హిస్టారికల్ స్టోరీని లేడీ ఓరియెంటెడ్‌గా స్టార్ట్‌చేసి అష్టకష్టాలు చవిచూశాడు. ఈలోపు వరస సక్సెస్‌లతో కెరీర్ గ్రాఫ్‌ని టాప్‌కు తీసుకెళ్లిన రాజవౌళి -బాహుబలిని స్టార్ట్ చేయడం సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది. ఈ సినిమా మూడేళ్ల గ్యాప్‌తో వివిధ భాషల్లో సమాంతరంగా విడుదలై హిస్టారికల్ స్టోరీలకు కమర్షియల్ టచ్ రుచి చూపించింది. తరువాత విడుదలైన రుద్రమదేవి కూడా బిజినెస్‌కి నోచుకుంది. అనుకున్న ఫలితం రాకపోయినా గుణశేఖర్‌లో కసిని పెంచింది. దాంతో మళ్ళీ కాకతీయ వంశాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రతాపరుద్రుడు సినిమా కోసం స్టోరీ బోర్డు వేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోగా చేయడానికి పలువురు యువ హీరోలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. రాఘవేంద్రరావు సైతం నాగార్జునతో మైథలాజికల్ మూవీకి ప్లాన్ చేయడం మరో విశేషం!
నమో వేంకటేశాయ టైటిల్‌తో చిత్రం చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రతి నటుడి జీవితంలో జానపదం, మైథలాజికల్, హిస్టారికల్, ఫిక్షన్ వంటి సినిమాలు చేయాలని ఉండటం సహజం. దీనికోసం కొంత రెమ్యూనరేషన్ సడలింపులూ ఇస్తారు. అయినా ఇలాంటి సినిమాలు భారీ వ్యయంతో కూడుకున్నవి. పైగా బిజినెస్ పరిస్థితులు ఎలా వుంటాయో కూడా ఖచ్చితంగా అంచనా వేయలేరు. అందుకే ఇలాంటివి సొంత ప్రొడక్షన్‌లోనే రూపుదిద్దుకుంటుంటాయి. రుద్రమదేవి, బాహుబలి ఆ విధంగానే తయారయ్యాయి. ఇప్పుడు బాహుబలి-2, గౌతమీపుత్ర శాతకర్ణి సైతం డైరెక్టర్స్ వెల్‌విషర్స్ ప్రొడక్షన్స్‌గా చెప్పొచ్చు.
మెగాస్టార్ సైతం 150వ మైలురాయి కోసం ఎన్నో కథల్ని చూసాడు. అందులో భాగంగానే ఒకదశలో -ఉధ్యమకారుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి హిస్టారికల్ స్టోరీకి ఓటేసినా, చివరకు కత్తిలాంటి రీమేక్ మాస్ మసాలాతోనే రానున్నాడు. గోన గన్నారెడ్డితో అల్లు అర్జున్, మగధీరతో రామ్‌చరణ్, యమదొంగతో జూ.ఎన్టీఆర్, కంచెతో వరుణ్‌తేజ్.. వంటి జూనియర్ హీరోలు శెభాష్ అనిపించుకోగా -మైథలాజికల్, ఫిక్షన్, హిస్టారికల్, జానపద చిత్రాలతో మెగాస్టార్ చిరు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్లు ఎప్పుడో పాసయ్యారు.
బాహుబలి విజయం మళ్ళీ జూనియర్లు, సీనియర్లలో పీరియాడికల్ మూవీస్ పట్ల ఆసక్తిని రేపుతుంది. హీరోలు ఎంత ‘సై’ అన్నా దమ్మున్న ప్రొడ్యూసర్లు.. విజువల్ ఫీస్ట్‌గా తెరకెక్కించే దర్శకులు ఎక్కడ ఉన్నారన్నదే ప్రశ్న. బాలీవుడ్.. హాలీవుడ్‌లలో పీరియాడికల్ మూవీస్ కనీసం ఏడాధిలో రెండైనా దర్శనమిస్తాయి. గత సంవత్సరం బాలీవుడ్‌లో ‘బాజీరావుమస్తానీ’ మంచి విజయాన్ని సాధించగా వచ్చే ఆగస్టులో ‘మెహంజదారో’ చిత్రం ప్రేక్షకులను రంజింపజేయడానికి రెడీగా వుంది. త్వరలో ‘ఝాన్సీలక్ష్మీభాయ్’గా కంగనారనౌత్ నటించనుండడం చూస్తేనే పిరియాడికల్ స్టోరీస్ బాలీవుడ్‌లో ప్రేక్షకులను అలరిస్తాయో అర్థవౌతుంది. తెలుగులో చాలా అరుదుకావడంతో ప్రేక్షకులు సైతం పెద్దగా కనెక్ట్ కారు. బాహుబలి అంత హంగామా చేసినా రుద్రమదేవిపై ఆ ప్రభావం కనిపించలేదనే చెప్పాలి. ఆఖరికి తెలంగాణ ప్రభుత్వం సైతం టాక్స్‌ని రద్దుచేసి మరీ ప్రోత్సహించినా లాభంలేకపోయింది. టాలీవుడ్‌లో బాహుబలి-2 రిలీజ్ అయ్యేంతవరకు ఈ పిరియాడికల్ మూవీస్ ఫీవర్ ఇలాగే వుంటుందనడంలో సందేహమే లేదు.

-బాసు