మెయన్ ఫీచర్

‘డ్రాగన్’కు గుణపాఠం చెప్పే తరుణమిదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బారాహోతీ’.. ఉత్తరఖండ్‌లోని ఛమోలీ జిల్లాలో టిబెట్ సరిహద్దు వద్ద ఓ గ్రామం. సహజంగా పర్వత ప్రాంతం కావడంతో ఇక్కడ జనాభా తక్కువ. ఒకప్పుడు ఉత్తరఖండ్ ఉత్తరప్రదేశ్‌లోని భాగమే. ఉత్తరఖండ్ ఆవిర్భావానికి ముందు కూడా బారాహోతీలో 1959వ సంవత్సరంలో చైనా సైనికులు చొరబాటుకు తెగబడ్డారు. ఈ గ్రామం వద్ద చైనా సైనికులు సంచరించడాన్ని గుర్తించిన స్థానికులు ఆ ప్రాంతంలో పనిచేస్తున్న ఆరెస్సెస్ శాఖలోని స్వయం సేవకులు, సంఘ్ అధికారుల ద్వారా అప్పటి సర్ సంఘ్‌చాలక్ అయిన గురూజీ మాధవ సదాశివ గోల్వల్కర్‌కి విషయాన్ని నివేదించారు. అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకి గోల్వల్కర్ ఈ సమాచారాన్ని తెలిపి, చైనా సైనికుల చొరబాటు విషయమై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెహ్రూ మాత్రం తనకు అలవాటయిన ధోరణిలోనే ‘‘నిఆ జఒ చ్ఘిశఆ్ఘఒఆజష శ్యశఒళశఒళ. చైనా మన దేశంపై దండయాత్ర చేస్తుందన్నది కల్ల’’ అన్నారు.
ఎక్కువ సమయాన్ని లండన్‌లో గడిపే అప్పటి భారత రక్షణశాఖ మంత్రి కృష్ణమీనన్‌కి చైనా చొరబాటు గురించి సమాచారం అందిస్తే- ‘అలా ఎప్పటికీ జరగనే జరగదు.. చైనా మన మిత్రదేశం’ అన్నారు. సరిగ్గా మూడేళ్ళు గడవక ముందే చైనా సైనికులు మన దేశం మీద దండయాత్ర జరిపి మన భూభాగాల్ని ఆక్రమించుకుంటూంటే, మన నాయకులకు మత్తు వదలి వాస్తవాలను గమనించసాగారు. చేతిలో సరియైన ఆయుధాలు లేకున్నా శత్రువులతో పోరాడి మన సైనికులు చాలామంది వీరమరణం పొందారు. అయితే- మన సైనికాధికారులు చేసేదిలేక వెనక్కి వచ్చేస్తూ పథకం ప్రకారం సరిహద్దుల నుండి సేనలను వెనక్కి నడిపిస్తున్నారని రేడియో, వార్తా పత్రికల ద్వారా ప్రకటనలిచ్చేవారు. ఇది 1959 నుండి ఉత్తర సరిహద్దులో జరుగుతున్న వ్యవహారం.
చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో సుమారు 34,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని మనం కోల్పోయాం. ఇప్పటికి అర్ధ శతాబ్దం గడిచింది. తప్పుడు సిద్ధాంతాలతో ప్రజలను జోకొట్టి విదేశాలకి మన భూభాగాన్ని అప్పగించారు మన నేతలు. లద్దాక్‌లో అక్మాయిచిన్ ప్రాంతాన్ని యుద్ధంలోనే మనం కోల్పోయాం. టిబెట్ మన ఉత్తర సరిహద్దునగల ప్రాంతం. ఆపైన ఉత్తరాన చైనా ఉంది. 1950 ప్రాంతంలోనే టిబెట్‌ను చైనా కబళించినప్పుడే భారత్ చైనాను ఎదిరించవలసింది, హెచ్చరించవలసింది. అప్పట్లో వౌనం వహించడం దౌత్యరీత్యా మన నాయకులు చేసిన తప్పిదమే. బఫర్ స్టేట్‌గా ఉన్న టిబెట్ కబళింపబడినప్పుడు మాట్లాడక- శత్రుదేశాన్ని మిత్రదేశంగా పొగుడుతూ మన పొరుగున తీవ్ర ముప్పును తెచ్చిపెట్టుకోవడం అన్ని అనర్థాలకు మూలం. లేకుంటే మనకి చైనాతో కాశ్మీర్ ఉత్తర భాగంలో కొంతమేర తప్ప ఎలాంటి సరిహద్దు లేదు. ఐక్యరాజ్య సమితిలోని భద్రతామండలిలో భారత్‌కు సభ్యత్వం ఇస్తామని ఆహ్వానం వస్తే మన ‘శాంతికాముక నేతలు’ ముందుగా చైనాకి ఆ సభ్యత్వం ఇవ్వాలంటూ వెనక్కి తగ్గారు. మన నేతలు ఎంత వెర్రివారు? ‘వీటో’ అధికారం సహా చైనాకి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వాన్ని కట్టబెట్టిన ఉదారత వల్ల ఎందుకూ పనికిరాని ఖ్యాతి మాత్రం మన నేతలకి దక్కింది. నేడు చైనా మన సరిహద్దు ప్రాంతంలో ఏకు మేకై కూర్చుంది. స్వామి వివేకానంద ఒక శతాబ్దానికి ముందే- ‘చైనా ఒక నిద్రిస్తున్న సింహం. దాని కదలికల్ని గమనిస్తూ మనం జాగ్రత్తగా ఉండాల’ని ఇచ్చిన హెచ్చరికను మన నాయకులు ఏ మాత్రం ఖాతరు చేయలేదు.
ఆగస్టు 1947లో దేశ విభజన ఫలితంగా భారత్ నుండి విడిపోయి పాకిస్తాన్ ఏర్పడింది. హిందూ సమాజాన్ని నీరసపరిచేలా ముస్లిం లీగ్ చేస్తున్న దౌర్జన్యాలను ఎదిరించ లేక ‘అన్నదమ్ముల్లా విడిపోదాం’ అని భారత విభజనకి ఒప్పుకున్న మన నేతలే ఇందుకు కారణం. నేడు పాకిస్తాన్ మనకి పక్కలో బల్లెమై, తూర్పు పడమరలలో ఇరువైపులా శత్రువై కూర్చుంది. పిఓకె (పాక్ ఆక్రమిత కాశ్మీర్) మనదే. పాకిస్తాన్ 1947 సెప్టెంబర్-అక్టోబర్‌లలో ఆ ప్రాంతాన్ని ఆక్రమించింది. పాకిస్తాన్ సైన్యాన్ని ఎదిరించి, ఆ ప్రాంతాన్ని రక్షించుకోలేక - ఆ వ్యవహారాన్ని ఒక జటిల సమస్య చేసి మన నాయకులు ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసి చేతులు దులిపేసుకున్నారు. ఇది సిగ్గుమాలిన పని. ఈ లోగా పాకిస్తాన్ పిఓకెలోని గిల్గిత్, బాల్టిస్తాన్‌లను చైనాకి అప్పగించింది. చైనా దీనిని ఒక సైనిక స్థావరంగా చేసుకుంది.
ఇప్పటికే చైనా హిమాలయాల సరిహద్దుల వెంబడి 1, బాల్టిస్థాన్‌లో 2, లద్దాక్‌లోని అక్సాయిచిన్‌లో 3, బారాహోతిలో నాలుగు, సిక్కిం-్భటాన్‌ల మధ్య డోక్లామ్ ప్రాంతంలో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. అరుణాచల్‌ప్రదేశ్ తమదేనంటూ మెక్‌మహన్ రేఖను గుర్తించనంటూ, మన భూభాగాన్ని ఆక్రమించే దుర్బుద్ధితో చైనా తన సైన్యాన్ని తెచ్చిపెట్టింది. నేపాల్‌లో చొరబడిన చైనా అక్కడ కమ్యూనిజాన్ని వ్యాప్తి చేస్తోంది. ప్రపంచంలో ఏకైక హిందూ దేశంగా పిలువబడుతున్న నేపాల్‌ను ‘నేపాల్ రిపబ్లిక్’గా ప్రకటించి, రాజ్యాంగాన్ని సైతం తన గుప్పిట్లో పెట్టుకుంది. ఇలా ఉత్తరాన సరిహద్దు పొడవునా దురాక్రమణకు చైనా సిద్ధమవుతూ ఉండగా, ఇదివరకే మనం యుద్ధంలో వెనుకంజ వేశాం. ఇప్పుడు ఆ ప్రసక్తే లేదని ధైర్యంతో నిలిచి ఉన్నాం. ఇది గర్వకారణమే కానీ, ఏ ఉపద్రవం వచ్చినా ఎదుర్కొనడానికి మనం సిద్ధమయ్యామన్నది ఎంతవరకూ వాస్తవం! స్వాతంత్య్రం సముపార్జించాక కూడా జాతిని నిర్వీర్యం చేసే సిద్ధాంతాలు, పథకాలతో ఏడు దశాబ్దాల కాలం వృథా చేసిన కాంగ్రెస్ నాయకత్వం వెనక్కి తగ్గి, శక్తియుతం వైభవోపేతమయిన జాతి నిర్మాణానికి కృషిచేసే నాయకత్వం ఆవిర్భవించడం వలన వచ్చిన మార్పును గమనించి మనం గర్వపడాలి. ఇటీవలి కాలంలో బారాహోతీ వద్ద చైనా సైన్యం రెండు సార్లు మోహరించిందన్న వార్త విన్నాం. ఒకటవది- జూలై 15వ తేదీన అయితే, రెండవది- అదే నెల 25వ తేదీన జరిగింది. చైనాలో ‘బ్రిక్స్’ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాల సమాఖ్య) సమావేశం జూలై 26న జరిగే సందర్భంగా మన ప్రభుత్వ రక్షణ సలహాదారు అజిత్ దోవల్ చైనా చేరుకోవడానికి ముందు జూలై 25న బారాహోతీ వద్ద చైనా సైన్యం మోహరింపుమరొక కవ్వింపు చర్యయే.
నేడు 1962లో వలే గాక భారత్ తన భూభాగాలను ధైర్యంతో నిలబడి రక్షించుకునే స్థితిలో ఉన్నది. అసలు భారత్‌కి ఏళ్ళతరబడి టిబెట్‌తోనే గాని చైనాతో సరిహద్దులేదన్న విషయం, టిబెట్‌ను 1950 ప్రాంతంలో చొరబాట్లకు చైనా యత్నించింది. అయితే భారత్ తన ప్రాంతాలను ఆక్రమిస్తోందని గడుసుగా వాదించడం చైనా దురాక్రమణ, దురాలోచనకు తిరుగులేని నిదర్శనం. ‘మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిన’ తీరులో వ్యవహరిస్తోంది చైనా.
దక్షిణాన మూడు సముద్రాలలోను చైనా -ళ్ఘూ డఆజశ ఢఆ్ఘఆళక తో తన స్థావరాలను ఏర్పాటు ఛేసుకుని, తీగతో కలిపే ముత్యాల హారము వలె తన స్థావరాలనేర్పరచి మన దేశాన్ని దిగ్బంధం చేసేందుకు యత్నిస్తున్నది. ఉత్తరాన హిమాలయ పర్వత శ్రేణులలో కనుమల వద్ద తన సైన్యాల్ని మోహరించి భారత్‌ను దిగ్బంధం చేద్దామనే ఉద్దేశంతో బారాహోతీ వంటి స్థలాల్ని వెతుక్కుంటోంది. టిబెట్‌లో నుండి అటువంటి స్థావరాలను చేరుకోవడానికే మనం ఎగుమతి చేసిన ఇనుప ఖనిజాన్ని చైనా వినియోగిస్తోంది. భారత్ పంపిన ఇనుమును వాడి ఎన్నో రైలు మార్గాలను చైనా వేసిందన్న విషయం గుర్తుంచుకోవాలి. మన సైనిక శక్తిని ఏదో ఎంచుకున్నామని సంతృప్తి చెందక, ఈ ఆయుధం ‘హిరణ్యాక్షుడి’ నడ్డివిరిచే శక్తిని ప్రపంచ దేశాల తోడ్పాటుతో సముపార్జించడం మన లక్ష్యం కావాలి. గత అర్ధశతాబ్దంలో టిబెట్‌ను ఆక్రమించాక ముందుకు చొచ్చుకు వస్తూ భారత్‌పై చైనా చేస్తున్న దురాక్రమణ ప్రయత్నాలను ఆపడం ఒక్కటే పరిష్కారమని ప్రపంచానికి గట్టిగా చెప్పాలి. టిబెట్టుకి స్వాతంత్య్రాన్ని సంపాదించిపెట్టగలిగితే ఆసియా దేశాలలో శాంతిని నెలకొల్పగలమని దౌత్యంతో ప్రపంచ నేతలకు తెలిసి, ఆ ప్రయత్నంలో అందరూ కలిసి వచ్చేట్లు మన నేతలు చొరవ చూపితే- అది అన్ని సమస్యలకు పరిష్కారమవుతుంది.

-దుగ్గిరాల విశే్వశ్వరం