మెయిన్ ఫీచర్

కతలు కథలుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెగ్యులర్‌గా వచ్చే ఫిక్షన్.. ఫాంటసీ కథల కంటె కూడా ‘బయోపిక్’లో జవసత్వాలు మరింత ఎక్కువగా ఉంటాయన్న థియరీ ఇండస్ట్రీలో మొదట్నుంచీ ఉంది. ఇప్పుడు ఇన్ని కథల గురించి మాట్లాడుకొంటున్నాం గానీ.. దీనికి ఏనాడో బీజం పడింది. సత్యహరిశ్చంద్ర కథ అందరికీ తెలిసిందే. అదీ ఒక విధంగా ఆత్మకథనే. హరిశ్చంద్ర కథవల్ల తెలుసుకోవాల్సిన నీతి ఎంతో ఉంది కాబట్టి.. అది కథగా ‘తెర’కెక్కింది ‘వెండితెర’ కనిపెట్టిన మొదటిలోనే. ఇక - రామాయణ మహాభారత భాగవతాలన్నీ ‘బయోపిక్’ల కోవలోకి ఎందుకు చేర్చకూడదు? భాగవతాన్ని రచించిన పోతనామాత్యుడు.. రామాయణ గాథను కావ్యంగా మలచిన ‘మొల్ల’ జీవితం బయోపిక్ ఎందుకు కాకూడదు? ఇలా ప్రస్తావిస్తూ పోతే.. ‘్ఫక్షన్’ ఫాంటసీ కాని ప్రతిదీ ఆత్మకథనే.

ఇది ‘ఆత్మకథ’ల కాలం. ‘బయో’ రోజులు. బయోగ్రాఫికల్ ఫిల్మ్ మాటకి ‘బయోపిక్’ అని షార్ట్ ఫార్మ్‌లో అనేసుకొందాం. నిజానికిది కొత్త ట్రెండ్ ఏం కాదు. కానీ- ఇటీవలి కాలంలో మరింత ఊపందుకుంది. కోట్ల కొలదీ రాబడీ ఉంది. తాజా లెక్కల ప్రకారం -వచ్చే రెండేళ్ల కాలంలో దాదాపు
28 ఆత్మకథలు సెల్యులాయిడ్‌ని అలరించనున్నాయి.

ఇక్కడొక సింపుల్ లాజిక్ మాట్లాడుకొని
-కథలోకి వెళ్దాం.
జనానికి సుపరిచితమైన స్వాతంత్య్ర
సమరయోధుడో.. రాజకీయ నాయకుడో..
రౌడీ షీటరో.. క్రీడాకారుడో.. సంచలనం
సృష్టించిన మల్లయోధుడో.. పరుగుల వీరుడో.. ఎవరైతేనేం? వీళ్లందరినీ ‘తెర’పై చూట్టానికీ.. ఆయా సన్నివేశాల్తో ‘కనెక్ట్’ కావటానికీ
ఇష్టపడటం అన్న మనస్తత్వాన్ని మననం చేసుకొందాం. బ్రిటీష్ దాస్య శృంఖలాల నుంచీ దేశ విముక్తికై పోరాడిన స్వాతంత్య్ర
సమరయోధుడైతే -చరిత్ర పాఠ్యాంశాల్లో
చదివిన జ్ఞాపకాల్ని నెమరువేసుకొంటాం. ఆయా సంఘటనల్ని బేరీజు వేసుకొంటాం. తెలీని అంశాలెన్నింటినో తెలుసుకొనే ప్రయత్నం చేస్తాం. నిజానిజాల్ని
స్పష్టాతిస్పష్టంగా కళ్లకి కట్టేస్తాం. లేదా ఏ పుస్తకాల్లోనో -ఎవరో చెప్పగా విన్న పుటల్ని పోల్చి చూస్తాం. ఏది ఏమైతేనేం? ఆ స్వాతంత్య్ర వీరుడి గాథని ‘తెర’పై చూసేసి.. పులకించి పోతాం.

కొన్ని శతాబ్దాల క్రితమో.. దశాబ్దాల క్రితమో -సమకాలీన సమాజంలో నడుస్తున్న వ్యక్తుల జీవితం కావొచ్చు. ఇలాంటి కథల నెన్నింటినో బాలీవుడ్
ఏనాడో తలకెత్తుకుంది.
ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోన్న బాలీవుడ్ ‘బయోపిక్’ల గురించి చర్చించుకొనే ముందు.. టాలీవుడ్‌లో బహుశా మొట్టమొదటిగా చిత్రీకరించబడిన ‘బయోపిక్’ ‘అల్లూరి సీతారామరాజు’ కథకి వద్దాం. ఆత్మకథల్లో మెలోడ్రామా ఉండదు. కామెడీ డ్రాక్ ఉండదు.
సెంటిమెంట్ సీన్లు ఉండవు. ఫైట్స్, రొమాన్స్ ఉండదు. కేవలం స్ఫూర్తి లేదా ఉత్కంఠత మాత్రమే ఉంటుంది.
రాజకీయ నాయకుడైతే - అతడి సామాన్య జీవితం గురించీ.. గల్లీ రాజకీయాల నుంచీ దేశ రాజకీయాలకు ఎదిగిన అతడి పట్టుదలనీ.. కృషినీ చూచాయగా వినటమో.. చూట్టంతో తటస్థిస్తే.. అతడి రియల్ లైఫ్‌ని అనే్వషించి చూపిన విధానాన్ని మెచ్చుకొంటాం. ఇలా జరిగి ఉంటుందా? ఉండొచ్చు. ఉండకపోవచ్చు అన్న మీమాంసలను పక్కనపెట్టి - స్ఫూర్తిని పొందే ప్రయత్నం చేస్తాం.
* * *
‘సచిన్’ - క్రికెట్ అభిమానులకు అతడొక ఆరాధ్య దైవం. మైదానంలో అతడుంటే కావల్సినంత భరోసా. పరుగుకే పరుగు నేర్పిన క్రికెట్ వీరుడు. ఇతగాడి ‘లైఫ్’ గురించీ.. అతడి మాటల్లోనే వినటానికి ఇష్టపడతాం. అతడి ఆత్మకథలో ఇంత ఆవేదన.. సంతోషం దాగి ఉన్నాయా? అని ఆశ్చర్యపోతాం. రన్నింగ్ రేస్ కావొచ్చు. క్రికెట్ కావొచ్చు. బాక్సింగ్ కావొచ్చు - ఇలా ఏదైనా సరే. ఆ ఆట వెనుక.. ఆటగాడి వెనుక ఉన్న జీవితాన్ని తరచి చూసేందుకు ఇష్టపడతాం.
* * *
నటి జీవితం ‘తెర’పై కనిపించేది మాత్రం తెలిసిన అందరికీ.. తెర వెనుక -్ఫ్లష్‌బ్యాక్‌లో ఆ నటి తాలూకు విషాద ఛాయలను తరచి చూసేందుకు.. మరింత లోతుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తాం. ఈ ‘ఆత్మకథ’ల ఉద్దేశం ఒక్కటే. ఉత్కంఠత -ఉత్సుకత -స్ఫూర్తి. తెలిసీ తెలియని నిజ సంఘటనల పట్ల ఆసక్తి.
రెగ్యులర్‌గా వచ్చే ఫిక్షన్.. ఫాంటసీ కథల కంటె కూడా ‘బయోపిక్’లో జవసత్వాలు మరింత ఎక్కువగా ఉంటాయన్న థియరీ ఇండస్ట్రీలో మొదట్నుంచీ ఉంది. ఇప్పుడు ఇన్ని కథల గురించి మాట్లాడుకొంటున్నాం గానీ.. దీనికి ఏనాడో బీజం పడింది. సత్యహరిశ్చంద్ర కథ అందరికీ తెలిసిందే. అదీ ఒక విధంగా ఆత్మకథనే. హరిశ్చంద్ర కథవల్ల తెలుసుకోవాల్సిన నీతి ఎంతో ఉంది కాబట్టి.. అది కథగా ‘తెర’కెక్కింది ‘వెండితెర’ కనిపెట్టిన మొదటిలోనే. ఇక - రామాయణ మహాభారత భాగవతాలన్నీ ‘బయోపిక్’ల కోవలోకి ఎందుకు చేర్చకూడదు? భాగవతాన్ని రచించిన పోతనామాత్యుడు.. రామాయణ గాథను కావ్యంగా మలచిన ‘మొల్ల’ జీవితం బయోపిక్ ఎందుకు కాకూడదు? ఇలా ప్రస్తావిస్తూ పోతే.. ‘్ఫక్షన్’ ఫాంటసీ కాని ప్రతిదీ ఆత్మకథనే.
కొన్ని శతాబ్దాల క్రితమో.. దశాబ్దాల క్రితమో -సమకాలీన సమాజంలో నడుస్తున్న వ్యక్తుల జీవితం కావొచ్చు. ఇలాంటి కథల నెన్నింటినో బాలీవుడ్ ఏనాడో తలకెత్తుకుంది.
ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోన్న బాలీవుడ్ ‘బయోపిక్’ల గురించి చర్చించుకొనే ముందు.. టాలీవుడ్‌లో బహుశా మొట్టమొదటిగా చిత్రీకరించబడిన ‘బయోపిక్’ ‘అల్లూరి సీతారామరాజు’ కథకి వద్దాం. ఆత్మకథల్లో మెలోడ్రామా ఉండదు. కామెడీ డ్రాక్ ఉండదు. సెంటిమెంట్ సీన్లు ఉండవు. ఫైట్స్, రొమాన్స్ ఉండదు. కేవలం స్ఫూర్తి లేదా ఉత్కంఠత మాత్రమే ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా తీస్తే - అది డాక్యుమెంటరీగా మారే ప్రమాదమూ లేకపోలేదు. అలాని వాస్తవ కథకి ‘కాల్పనికత’ జోడిస్తే.. వివాదాలకు తెర తీసినట్టవుతుంది. వాస్తవికత తాలూకు ‘ఫ్లేవర్’ మిస్ అవుతుంది. ‘బయోపిక్’లతో వచ్చే తంటానే ఇది. సన్నటి తెర ఉంటుంది. దాన్ని గనుక బాలెన్స్ చేసుకోగలిగితే - అంతకి మించిన కథ మరొకటి ఉండదు. ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా ఇలాంటి ఎన్నో సందేహాలను మూటగట్టుకొంది. వాస్తవ సంఘటనలన్నింటినీ మార్చివేశారనీ.. రూథర్ ఫర్డ్‌ని హీరోని చేసేశారనీ - ఇలా ఎనె్నన్నో. కేరెక్టర్ డెప్త్ కోసం ‘ఊహ’ కొంత జోడించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ సినిమా తర్వాత అడపాదడపా కొన్ని ‘బయోపిక్’లో టాలీవుడ్‌లో వచ్చినప్పటికీ.. అవేవీ కమర్షియల్‌గా సక్సెస్‌ని సాధించకపోవటంతో.. వాటి జోలికి వెళ్లటానికీ, అంతటి సాహసం చేయటానికీ.. టాలీవుడ్ ఇష్టపడటం లేదు.
‘ఆంధ్రకేసరి’ ‘కొమరం భీమ్’ ‘అంబేద్కర్’ ‘సర్వాయి పాపన్న’ ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ -లాంటి చిత్రాలు ఆ కోవలో చేరాయి. తాజాగా- స్వాతంత్య్ర సమర సంగ్రామం నాటి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కథ తెర కెక్కుతోంది.
* * *
బాలీవుడ్ ‘బయోపిక్’ ప్రస్థానానికి వస్తే.. 1935 - 1936 మధ్యకాలంలో ‘నందనార్’ ‘పట్టినాథర్’ సినిమాల్తో ఆత్మకథల ‘బాట’ మొదలైందనుకోవచ్చు. ఇతమిత్థంగా చెప్పలేం గానీ - మైలురాయి అక్కడే పడి ఉండొచ్చుననుకొందాం.
* * *
‘పాడ్‌మాన్’ - అరుణాచలం మురుగనాథం అనే ఓ సోషల్ ఎంట్రపెన్యూర్‌కి సంబంధించిన కథ. భారతదేశంలో అతి తక్కువ ధరకి శానిటరీ నేప్‌కిన్స్‌ని అందజేయ్యొచ్చునని కనిపెట్టిన వ్యక్తి. అరుణాచలం పాత్రని అక్షయ్ కుమార్ పోషిస్తున్నాడు.
‘పద్మావతి’ - చిత్తోర్ మహారాణి పద్మావతి కథ. చరిత్రలో అత్యంత సుందరీమణిగా పేరొందిన పద్మావతి పాత్రలో దీపికా పదుకొనె కనిపించనుంది. సంజయ్ లీలా బన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజా రతన్‌సింగ్ పాత్రలో షాహిద్ కపూర్, అల్లాఉద్దీన్ ఖిల్జీగా రణవీర్ సింగ్ నటిస్తున్నారు. ఈ కథలో బోలెడంత ఉద్విగ్నత ఉంది. సౌందర్య రాశి పద్మావతి కథలో ఎన్నో మలుపులున్నాయి.
‘డాడీ’ - అరుణ్ గాలీ గురించి తెలీని వారుండరు. గ్యాంగ్‌స్టర్‌గా అతడి జీవిత ప్రస్థానం.. రాజకీయ నాయకుడిగా ఎదిగిన తీరు వెనుక ఎనె్నన్ని మెట్లున్నాయో కొంతమందికి మాత్రమే తెలుసు. ఆయా సంఘటనల సమాహారమే ‘డాడీ’. అరుణ్ గాలీ పాత్రలో అర్జున్ రాంపాల్ జీవిస్తున్నాడన్న వార్త పతాక శీర్షిక అవుతోంది.
‘మొఘల్’ - సంగీత జగత్తులో ధృవతారగా వెలిగిన గుల్షన్ కుమార్ కథ ఇది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రధారి.
‘గోల్డ్’ - భారతదేశానికి మొట్టమొదటి గోల్డ్‌మెడల్ సాధించి తెచ్చిన హాకీ ప్రేయర్ బల్బీర్‌సింగ్ వ్యక్తిగత
జీవితాన్ని ప్రతిబింబించే కథ ఇది. ఇందులోనూ అక్షయ్‌కుమార్ కనిపించనున్నాడు.
‘హసీనా: ది క్వీన్ ఆఫ్ ముంబై’ - దావూద్ ఇబ్రహీం గురించి తెలిసిందే కొద్దిగా అనుకొంటే.. ఆతడి సహోదరి హసీనా పార్కర్ కథ ఎంత మందికి తెలిసే అవకాశం ఉంది. శ్రద్ధాకపూర్ లీడ్ రోల్ చేయనున్న ఈ సినిమాలో ‘హసీనా’కి సంబంధించి ఎనె్నన్నో అంశాలను ప్రస్తావించనున్నారు.
‘శశికళ’ - తాజాగా ఈమె ఒక సెనే్సషనల్ న్యూస్. తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర నిర్వహిస్తున్న ఈమె కథని దర్శకుడు రాంగోపాల్‌వర్మ తెర కెక్కించనున్నారు.
‘సైనా’ - షటిల్ క్రీడాకారిణి నైనా నెహ్వాల్ క్రీడా జీవితానికి సంబంధించిన కథ ఇది. శ్రద్ధాకపూర్ లీడ్ రోల్.
‘కల్పనా చావ్లా’ - ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లా కథ ఇది. ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ బాటలోనే ‘పి.వి.సింధు’ కథ కూడా.
‘ఆనంద్ కుమార్’ - ఐఐటి-జెఇఇ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కిగాను వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్న గణితశాస్తవ్రేత్త ఆనంద్ కుమార్ జీవితంలోని వొడిదుడుకులనూ.. సాధించిన విజయాలనూ తెర కెక్కించనున్నారు. హృతిక్ రోషన్ ప్రధాన పాత్రధారి.
‘రాకేష్ శర్మ’ - భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ ‘ట్రావెల్’ గురించిన కథ. అమీర్‌ఖాన్, సిద్దార్థ రాయ్, రొనె్న స్క్రూవాలా నిర్మించనున్న ఈ చిత్రంలో ‘అమీర్’ లీడ్ రోల్ చేయనున్నారు. ‘సారె జహాఁ సే అచ్ఛా’ టైటిల్ ఖరారు కానుంది.
‘మణికర్ణిక’ - 1857 సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో ఝాన్సీరాణి లక్ష్మీబాయి పోషించిన కీలక పాత్రకి సంబంధించిన ‘మణికర్ణిక’లో కంగనా రనౌత్ నటించనుంది. కె.వి. విజయేంద్ర ప్రసాద్ రచన ఇది.
‘ఝల్కీ’ - 2014లో నోబెల్ శాంతి బహుమతి అందుకొన్న కైలాష్ సత్యార్థి కథలో బొమన్ ఇరానీ నటించనున్నారు. బ్రహ్మానంద్ ఎస్ సింగ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ఎంతోమందికి స్ఫూర్తిని అందించనుంది.
‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ - మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి చాలామందికి తెలియకపోవచ్చు. ఆర్థిక శాస్తవ్రేత్తగా కొద్ది మందికి తెలుసు. కానీ- ప్రధానమంత్రిగా, నోరు మెదపని వ్యక్తిగా.. ఎన్నో విమర్శలను మూటగట్టుకొన్న మన్మోహన్ కథ ఇది. సంజయ్ బారూ కథని సినిమాగా మలిచారు. జాతీయ అవార్డు గ్రహీత హన్సల్ మెహతా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించనున్నారు.
* * *
వీటిలో కొన్ని చిత్రీకరణ పూర్తి చేసుకొన్నవి.. మరికొన్ని చిత్రీకరణ జరుపుకొంటున్నవీ.. ఇంకా సెట్స్‌కి వెళ్లనివి కొన్ని. సుమారు 28 ‘బయోపిక్’లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇందులో ప్రస్తావించినవి కొన్నైతే.. ప్రస్తావించనివి చాలానే ఉన్నాయి. ‘బయోపిక్’లు కమర్షియల్‌గా ఎంతటి విజయాన్ని సాధించాయో లెక్కలు చూస్తే.. కళ్లు తిరగటం ఖాయం. ఆ కళ్లు తిరిగే ప్రక్రియలో భాగం - ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ.. 100 కోట్ల పైచిలుకు వసూళ్లని సాధించింది. దాన్ని మించి 109 కోట్లని వసూలు చేసింది ‘బాగ్ మిల్కా బాగ్’ సినిమా. 2013లో రిలీజైన ఈ సినిమా ఎంతోమందికి స్ఫూర్తిని అందించటమే కాకండా.. వసూళ్లలోనూ తనదే రికార్డు అని చాటుతూనే ఉంది. డర్టీ పిక్చర్ - 80 కోట్లు.. నీర్జా - 75 కోట్లు, మేరీ కోమ్ - 64 కోట్లు, పాన్ సింగ్ తోమర్ - 15 కోట్లు, బాండిట్ క్వీన్ 14 కోట్లు సాధించాయి. కనుకనే - టు స్వామి కార్యం -అటు స్వకార్యం రెండూ నెరవేరుతాయన్న సూత్రంతో.. కమర్షియల్‌ని సాధిస్తూ.. స్ఫూర్తిని అందించటానికి ఎన్నో ‘బయోపిక్’లు రెడీగా ఉన్నాయి.

-బిఎనే్క