మెయన్ ఫీచర్

దేశ ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిశోధనాత్మక పాత్రికేయంలో ప్రమాణాలు పాటిస్తూ, నిరవధికంగా పోరాడుతున్న జర్నలిస్టులకు ప్రణామాలు. ప్రభుత్వాలు చేయలేని పనిని జర్మన్ పత్రికలు చేయడం ప్రపంచంలో ఎనిమిదవ వింత. పనామ అనే దేశం ఉత్తర దక్షిణ అమెరికాలకు మధ్యలో ఉం ది. ఇక్కడ ఎందరో ప్రముఖులు తమ బ్యాంకు ఖాతాలను తెరిచారు. అలాంటి వారిలో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా ఛైర్మన్ జింగ్‌పింగ్, ఐస్‌లాండ్ ప్రధాని డేవిడ్, బ్రిటన్ ప్రధాని కామెరూన్, బాలీవుడ్ చలనచిత్ర నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కోడలు ఐశ్వర్యా రాయ్, ఇలాగే వేలాది మంది ఉన్నారు. ఎవరు ఎప్పుడైనా బ్యాంకు అకౌంట్లు తెరుచుకోవచ్చు. మరి ఇక్క డి విశేషం ఏమిటి? అంటే హవాలా మార్గంలో రకరకాల బినామీ పేర్లతో ఇందులో ఖాతాలుంటాయి. అంటే అక్రమాస్తులు పన్ను ఎగవేత కోసం ఇక్కడ దాచుకుంటూ ఉంటారు. అంటే స్విస్ బ్యాంక్ అకౌంట్ల వంటివే పనామా బ్యాం కు అకౌంట్లు. 2016 మార్చిలో పనామా బ్యాం కుల్లోని లక్షలాది బ్యాంకు అకౌంట్లను ఒక సంస్థ బయటపెట్టింది. ఇటీవలి కాలంలోని ఇనె్వస్టిగేటివ్ జర్నలిజంలో ఇదే అతిపెద్ద ప్రయోగం. ఇంతకు ముందు జూలియస్ అసాంజే తన వీకీలీక్స్ ప్రయోగం చేసినప్పుడు కూడా చాలా సం చలనాలు సంభవించాయి. ఐతే వాటిని అభూతకల్పనలు అంటూ ఆయా ఖాతాదారులు కొట్టిపారేశారు.
మన్మోహన్ సింగ్ 2006లో సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టారు. తత్ఫలితంగా రూ. 25,000 మొత్తం విదేశాల్లో దాచుకోవచ్చునని అంగీకరించారు. తర్వాత ఈ మొత్తాన్ని రెండున్నర లక్షలకు పెంచారు. ఈ సదుపాయాన్ని చా లామంది ఉపయోగించుకున్నారు. ఐతే మోసక్ ఫోన్సికా అనే ఒక న్యాయ వ్యవహారాల సంస్థ పనామా రహస్య ఖాతాలపై అపూర్వ పరిశోధన చేసి అందరి ఖాతాలు వెలికి తీసింది. ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన ఇనె్వస్టిగేటివ్ జర్నలిజంలో ఇదే అతిపెద్దది. మొత్తం 29 మంది ప్రముఖులకు 6500 కోట్లు ఉన్నాయి. వీరంతా సినీనటులు, కమ్యూనిస్టు, పెట్టుబడిదారీ ప్రజాస్వామ్య దేశాల అధినేతలు. పనామా బినామీ ధనం మన వార్షిక బడ్జెట్‌కు 78 రెట్లు ఉన్నది. అంటే 1550 లక్షల కోట్ల ధనం అక్కడ మూలుగుతున్నది. ‘సూడ్డెట్‌స్చె జూయ్‌టంగ్’ అనే జర్మనీ పత్రికకు ఈ రహస్య పత్రాలు ముందుగా అందాయి. ఈ పత్రాల సంఖ్య పదిమిలియన్లు. ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇనె్వస్టిగేటివ్ జర్నలిస్టు సంస్థ ఈ మహాకార్యాన్ని నిర్వహించింది.
ఈ పరిశోధన ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఐస్‌లాండ్ అధ్యక్షుడు రాజీనామా చేశాడు. కామెరూన్‌పై ఒత్తిడి పెరుగుతున్నది. అమితాబ్ బచ్చన్ తన ఇంటర్ నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ పదవిని వదులుకోవలసి వచ్చింది. పాకిస్తాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ కుడితిలో పడ్డ ఎలుకలా లండన్ చుట్టూ తిరుగుతున్నాడు. సిగ్మండ్ డేవిడ్ గన్నార్‌సన్, అశ్వినీకుమార్ మెహ్రా, గౌతమ్ కరణ్ తాపసి, అనురాగ్ కేజ్రీవాలా (లోక్‌సత్తా పార్టీ-న్యూఢిల్లీ), వినోద్ రామచంద్ర యాదవ్ (పూనా), వికాస్ జాకీచాన్ (హాలీవుడ్ నటుడు), శుక్లా (మధ్యప్రదేశ్) ఇంకా చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కుమారుడు ఇలా ఎనె్నన్నో పేర్లు వెలికి వచ్చాయి. మన దేశానికి చెందినంతవరకు 500 వరకు ఉన్నారు. మరి ఈ డబ్బు వెనక్కి వస్తుందా? అంటే సందేహమే. స్విస్ బ్యాంకు డబ్బు వచ్చిందా? సుబ్రహ్మణ్యస్వామి తన పరిశోధనలో సోనియాగాంధీకి సంబంధించిన రహస్యఖాతాలు ఏయే బ్యాంకుల్లో ఉన్నాయో సుప్రీంకోర్టుకు నివేదించారు. మరి ఆ మొత్తాలన్నీ ఏమయినాయి? నిజానికి ‘రా’, ‘సిట్’, సిబిఐ వంటి ప్రభుత్వ అపరాధ పరిశోధక సంస్థలు చేయవలసిన పనికన్నా పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా చాలా పెద్ద పెద్ద పనులు చేస్తున్నాయి. పనామా పేపర్లు వెలికి తీసుకు రావడానికి వారికి దశాబ్దకాలం పట్టింది. ఐతే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇందంతా ‘‘చెత్త’’ అంటూ కొట్టిపారేశారు.
పనామా పత్రాల పరిశోధన వంటిదే 2016, ఏప్రిల్ మొదటి వారంలో ఇండియాలో ఒకటి జరిగింది. దీన్ని ఎలక్ట్రానిక్ మీడియా నిర్వహించింది. ఇది మాయమైన హోంశాఖ దస్త్రాలకు సంబంధించిన వ్యవహారం. ఈ ఫైళ్లకు సంబంధించిన సమాచారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తొయ్యబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించారు. వారికి ఉత్తర ప్రదేశ్‌కు చెందిన స్థానిక ఉగ్రవాది తోడయ్యాడు. వీరివెంట ఒక ఆత్మాహుతి దళానికి చెందిన అమ్మాయి ఉంది. ఈ అమ్మాయిపేరు ఇష్రాత్ జహాను. ఈమె స్వస్థలం బిహారు. ఈ నలుగురూ కలిసి ముందు లక్నోకు చేరి అక్కడ మారుపేర్లతో ఒక హోటల్‌లో బస చేశారు. అక్కడినుండి, 2004, ఏప్రిల్‌లో ఉత్తర ప్రదేశ్‌లోని ఇబ్రహీంపూర్ చేరారు. అక్కడ వీరు నరేంద్ర మోదీని హత్య చేయడానికి పథకం రూపొందించారు. ఆ తర్వాత వీరు అహమ్మదాబాద్ చేరారు. ఐతే వీరి కదలికలను గుజరాత్ పోలీసులు కనిపెట్టి అధికారులకు సమాచారం అందించారు. అప్పుడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఈ ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి బ్రహ్మాస్తమ్రైంది. దీనిపై కోర్టు విచారణలు జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి. ఇంకా కొన్ని దశాబ్దాల పాటు జరుగుతాయి!
లోక్‌నాథ్ బెహరా అనే ఉన్నతోద్యోగి 190 పుటల ఒక రహస్య ఫైలును వెంట తీసుకొని అమెరికా వెళ్లాడు. ఆయన వెళ్లింది డేవిడ్ కోల్మన్ హెడ్లీ అనే వ్యక్తిని కలిసి ముంబయి పేలుళ్లకు సంబంధించిన సమాచారం సేకరించడానికి. విచిత్రమేమంటే ఈ పరిశోధనలో హెడ్లీనుండి మరికొన్ని నూతనాంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఇష్రాత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసు తీగెలాగితే మొత్తం డొంక కదిలింది. ఇష్రాత్ జహాన్ సూసైడ్ బాంబర్ అని హెడ్లీ తేల్చాడు. ఈ విషయాన్ని పాకిస్తానీ పత్రిక కూడా ధ్రువీకరించింది. మోదీ ప్రభుత్వం గుజరాత్ కోర్టుకు ఈ అంశాలు సమర్పించింది. అయితే అసలు కీలకఘట్టం ఇక్కడ మొదలైంది.
అప్పటి భారత హోంమంత్రి పళనియప్పన్ చిదంబరం ఇష్రాత్ జహాన్ (14వ పేరా) ఆత్మాహుతి దళానికి చెందిన ఉగ్రవాది అని ఒక అఫిడవిట్‌లో నిరూపించారు. ఈ అఫిడవిట్ 10 జనపథ్‌కు చేరింది. వీరు దీన్ని చూసి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌ను ఉపయోగించుకొని దేశవ్యాప్తంగా ముస్లిం ఓట్లను కొల్లగొట్టాలంటే కొత్త అఫిడవిట్ తయారు చేయాల్సిందేనన్నారు. సోనియా, అహ్మద్ పటేల్ మాటలు విన్న చిదంబరంకు ముచ్చెమటలు పట్టాయి. మొతటి అఫిడవిట్ తయారైంది. దానిపై స్వయంగా తాను సంతకం కూడా చేశాడు. అందులో ఇష్రాత్ జహాన్ ఉగ్రవాది అని నిరూపించారు. తర్వాత ‘ఇష్రాత్ జహాన్, నరేంద్ర మోదీ ప్రభుత్వం చేత హత్యకు గురైంది’ అని కొత్త అఫిడవిట్ తయారు చేశారు. ఈ అపిడవిట్‌ను అంగీకరించని అప్పటి హోంశాఖ కార్యదర్శి పిళ్లైచేత బలవంతంగా వీటిపై సంతకాలు పెట్టించారు. ఈ పని చేసింది ‘సిట్’ సంస్థ. చేయించింది సోనియా గాంధీ. ఈ మొత్తం ఇతివృత్తానికి సూత్రధారి చిదంబరం! 2014 సాధారణ ఎన్నికలకు ముందు న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయం నుంచి చాలా రహస్య పత్రాలు మాయమైనాయి. అందులో ఈ రెండు అఫిడవిట్లకు మధ్య లింక్ ఫైలు మిస్సయింది. అనూహ్యంగా 2014లో కాంగ్రెస్ ఓటమిపాలై, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇష్రాత్ జహాన్ కేసు మళ్లీ మొదటికి వచ్చింది. ఈ లోగా ఎలక్ట్రానిక్ మీడియాలో కొన్ని రహస్య పత్రాలు ప్రజలకు ఇనె్వస్టిగేటింగ్ జర్నలిజం ద్వారా అందించారు.
ఇప్పటికే 2-జి వాయుతరంగాల కేసులో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన చిదంబరం మెడకు ఇష్రాత్ జహాన్ కేసు చుట్టుకుంది. ఈలోగా మనీష్ తివారీ, అభిషేక్ సింఘ్వీ, దిగ్విజయ్ సింగ్‌లు రంగంలోకి దిగి, ‘అసలు సమస్య చిదంబరం ఫైలుపై సంతకం పెట్టడం కాదు, ఎట్టి విచారణ జరపకుండా కాల్చి చంపడమే కేసులో ప్రధానాంశం’ అంటూ సరికొత్త తర్కం ముందుకు తెచ్చారు. లోక్‌నాథ్ బెహరా శ్రమించి సేకరించిన సమాచారాన్ని సోనియాగాంధీ ఎందుకు బుట్టదాఖలు చేసింది? జి.కె. పిళ్లై వంటి మచ్చలేని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని ఎందుకు వాతలు పెట్టి హింసించారు? దీనికి సోనియా, రాహుల్ గాంధీలు సమాధానం చెప్పాల్సి ఉంది. ఇప్పుడు నరేంద్రమోదీ ఏం చేస్తారు? పళనియప్పన్ చిదంబరం, సోనియాగాంధీలపై కేసులు పెడతారా? నాల్గవ అఫిడవిట్ తయారవుతుందా? పనామా బ్యాంక్, స్విస్ బ్యాంకు, కరీబియన్ ఐలాండ్స్, వర్జిన్ ఐలాండ్స్, స్విట్జర్లాండ్, మారిషస్, జర్మనీ బ్యాం కులలోని రహస్య ఖాతాలు మొత్తం ఇండియాకు చేరతాయా? రాజేంద్రకుమార్ సింగ్‌ను విచారిస్తారా? నరేంద్ర మోదీ కఠిన చర్యలు మొదలుపెడితే ‘‘నాకేమీ తెలియదు, నేను నిర్దోషిని’ అని అమితాబ్ బచ్చన్ బుకాయించలేడు. ‘‘మొదటి అఫిడవిట్ గురించి నాకేమీ తెలియదు’’ అని పళనియప్పన్ దబాయించలేడు. ఎందుకంటే ‘ఇష్రాత్ జహాన్ ఉగ్రవాద ఆత్మాహుతి బాంబర్ ’ ఇట్లు, పి. చిదంబరం అంటూ సంతకం చేసిన ఫైలు ఒరిజినల్ కాపీని ఒక ఇంగ్లీషు ఛానల్‌లో చూపారు. ‘‘సుబ్రహ్మణ్యస్వామిని అడ్డం పెట్టుకొని నేషనల్ హేరాల్డ్ కేసు నడుపుతున్నారు. నన్ను అరెస్ట్ చేయండి. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి’ అని రాహుల్ గాంధీ బెదిరించడం కూడ టీవీల్లో ప్రసారమైంది. ఐదేళ్ల పదవీ కాలంలో అప్పుడే రెండేళ్లు హారతి కర్పూరంలా హరించుకొని పోయాయి. అందువల్ల మోదీ ఏమైనా చేయదలచుకుంటే వెంటనే చేయవలసిన సమయమిది.
ఏప్రిల్ 21న ఒక ఇంగ్లీషు ఛానల్‌లో ఒక వీడియోను ప్రసారం చేశారు. ఈ వీడియో ఇషత్ జహాన్ ఎన్‌కౌంటర్‌కు సంబంధించినది. అం దులో ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరుపుతున్న దృశ్యాలున్నాయి. ఈ వీడియోకు ఒక చరిత్ర ఉంది. అహమ్మదాబాద్ హైకోర్టు సిట్‌ను ఎన్‌కౌంటర్ ‘‘పునర్‌నిర్మాణం’’ (రికన్‌స్ట్రక్ట్) చేయవలసిందిగా ఆదేశించింది. ఈ 12 మంది సభ్యులు గల వీడియో నిర్మాణ బృందానికి సత్యపాల్ సింగ్ ఛైర్మన్. అతనికి ఒక కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసి బూటకపు ఎన్‌కౌంటర్ జరిగినట్టు-వీడియో రూపొందించండి అని కోరాడు. ఈ విషయం స్వయంగా సత్యపాల్ సింగ్ వెల్లడించాడు.
ఎం.కె. నారాయణన్ 10 జనపథ్‌కు చాలా సన్నిహితుడు. సోనియా దయవల్లనే ఈయనకు ఈ పరిశోధనారంగంలో ఉద్యోగం లభించింది-‘‘ఇది బూటకపు ఎన్‌కౌంటర్ కాదు’’ అని నారాయణన్ నిర్ధారించాడు. డోగ్రా నిజాయతీకి మారుపేరు. ఆయన కూడా ఇష్రాత్ ఆత్మాహుతి దళ సభ్యురాలు అని తేల్చాడు. సుధీర్ గుప్త, అహమ్మదాబాద్ ఎన్‌కౌంటర్ బూటకం కాదు అని నిర్ధారించాడు. ఇది కాంగ్రెస్‌కు నచ్చలేదు. ఫోరెన్సిక్‌పై వత్తిడి తెచ్చి వీడియో దృశ్యాలు మార్చాలని చూసిన యత్నాలు ఫలించలేదు. ఫలితంగా వీరి రిపోర్టు ‘‘అసమగ్రం-అసంబద్ధం’’ అని తేల్చారు. ఇదంతా మోదీ బూటకపు ఎన్‌కౌంటర్ జరిపించాడని చెప్పి ముస్లిం ఓట్లను పొందాలనే రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. దురదృష్టం ఏమంటే పాకిస్తాన్‌లోని గద్వా టైమ్స్ పత్రిక ‘చూశారా, ఇండియాలోని కాంగ్రెస్ వాళ్లే జహాన్ ఎన్‌కౌంటర్ బూటకం అంటున్నారు’ అని వ్యాఖ్యానించింది. అంటే పార్టీ ప్రయోజనాలకోసం దేశ ప్రయోజనాలను ఎలా బలిచేయబడ్డాయో ఈ మొత్తం ఉదంతం తెలియజేస్తోంది. ఇప్పుడు రికన్‌స్ట్రక్టడ్ వీడియో, చిదంబరం సంతకం చేసిన మొదటి అఫిడవిట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఎవరు దేశభక్తులు, ఎవరు దేశద్రోహులో ప్రజలే స్వయంగా నిర్ణయించుకోవచ్చు.

- ముదిగొండ శివప్రసాద్