మెయన్ ఫీచర్

ఈ బంధం బలపడుతుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏపిలో రెండు కీలక ఎన్నికల ఫలితాలు కొత్త పరిణామాలకు దారులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకూ పైకి కలసి ఉన్నట్లున్నా, అంతర్గతంగా అం త సఖ్యతగా లేని తెదేపా-్భజపా సంబంధాలు నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త మలుపు తిరిగే అవకాశాల్ని కొట్టివేయలేం. గోద్రా ఘటనలో అప్పటి గుజరాత్ సిఎంగా ఉంటున్న తన రాజీనామాకు పట్టుబట్టి, ఢిల్లీలో చంద్రబాబు తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా అవమానించిన పరాభవాన్ని మోదీ ఇంకా మర్చిపోనందుకే- ఈ ఇద్దరి మధ్య సంబంధాలు బలహీనంగా ఉన్నాయన్నది ఇప్పటివరకూ రెండు పార్టీ నేతల వద్ద వినిపించే మాట! ఆ పరాభవం మోదీని ఇంకా వెంటాడుతూనే ఉంది. చంద్రబాబు దానిపై ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా, తన సహజ శైలికి భిన్నంగా వినమ్రత ప్రకటించినా మోదీ కరుణించడం లేదు. మోదీ జాతీయ రాజకీయ యవనికపై రాకముందు వరకూ బాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడంతోపాటు, వాజపేయికి తన మాటే వేదవాక్కుగా మార్చుకున్నారు. కానీ, మోదీ వచ్చాక సీను రివర్సయింది. అంతకుముందు తరచూ దిల్లీ వెళ్లే బాబు.. మోదీ మనస్తత్వం తెలిశాక దేశ రాజధాని ఛాయలవైపు వెళ్లకుండా, తన రాష్ట్ర వ్యవహారాలకే పరిమితమయ్యారు.
ఇటీవల రాష్టప్రతి ప్రమాణ స్వీకారం సందర్భంగా, తనతో పాత మిత్రులైన వామపక్ష నేతలు వచ్చినప్పటికీ, వారితో చంద్రబాబు అంటీముట్టనట్లు వ్యవహరించారే తప్ప, మునుపటిలా విడిగా భేటీలు వేయలేదు. హుద్ హుద్ తుపాన్ తర్వాత విశాఖ వచ్చిన మోదీకి బాబు అభివందనం చేసిన తీరు, ఢిల్లీలో ఆయనతో భేటీ అయిన సందర్భంగా కూర్చునే శైలి పరిశీలిస్తే మోదీకి ఆయనకు ఎంతో విధేయత ప్రదర్శిస్తున్నారని అర్థమవుతోంది. దీనికి కారణాలు సుస్పష్టం. కాంగ్రెస్ శిధిలావస్థకు చేరింది. మోదీకి సమానంగా అంతో ఇంతో ఇమేజ్ ఉన్న నితీష్‌కుమార్ కూడా ఎన్డీఏ గూటిలోనే సర్దుకుపోతున్నారు. తమిళనాట అన్నాడిఎంకె వర్గాలను ఆడించే రిమోట్ కూడా బిజెపి చేతికే చిక్కింది. తెలంగాణలో పార్టీ వ్యవహారాలు పక్కనపెడితే కేసీఆర్‌పై మోదీకి వ్యక్తిగత అభిమానం ఉంది. ఆయన అపాయింట్‌మెంట్ అడిగినదే తడవుగా ఇచ్చేస్తున్నారు. వారి భేటీ కూడా ఎక్కువసేపే కొనసాగుతోంది. అమిత్‌షాపై బహిరంగంగా విరుచుకుపడిన తొలి సీఎంగా చరిత్ర సృష్టించినప్పటికీ కేసీఆర్ మోదీతో మాత్రం సత్సంబంధాలు నెరపడం విశేషమే. బిజెపిని నియంత్రించే ‘సంఘ్ పరివార్’ను కూడా మోదీ శాసించే స్థాయికి ఎదిగిన తర్వాత, మోదీ-అమిత్ ద్వయానికి సొంత పార్టీలో ఎదురులేకుండా పోయింది. మరో ఐదేళ్ల వరకూ మోదీ తప్ప, జాతీయ రా జకీయాల్లో ఎవరి బొమ్మ ఆడే అవకాశం లేదు. నవ్యాంధ్ర అభివృద్ధి కావాలంటే మోదీ సహకారం తప్పనిసరి. పోలవరం వంటి ప్రాజెక్టులు పూర్తి కావాలి. రేపటి ఎన్నికల్లో బాబు ప్రచారంలో అదే ప్రధాన అస్త్రం. అందుకే స్థితప్రజ్ఞత-ప్రాప్తకాలజ్ఞత కలగలసి ఉన్న బాబు ఎప్పటికప్పుడు విధేయత ప్రదర్శించుకోవలసి వ స్తోంది.
ఏపిలో జరిగిన రెండు ఎన్నికల ఫలితాల విషయానికొస్తే.. ఈ ఎన్నికలు బాబుపై బిజెపి ‘గత వైఖరి’ కొద్దిగా సడలేందుకు బాటలు వేసింది. నం ద్యాల ఉపఎన్నికను దేశమంతా ఆసక్తిగా చూసింది. బిజెపి సహకారం, పవన్ కల్యాణ్ చే యూత లేకుండానే నివ్వెరపో యే మెజారిటీని నంద్యాలలో టిడిపి సొంతం చేసుకుంది. కాకినాడ ఎన్నికల్లో బిజెపితో కలసి బ్రహ్మాండమైన మెజారిటీ సాధించి, తన ఆధిపత్యాన్ని టిడిపి నిరూపించుకుంది. కాకినాడలో బిజెపికి ఇచ్చిన సీట్లలో టిడిపి రెబల్స్‌ను నిలబెట్టినా, చివరి సమయంలో బిజెపి గుర్రాలను కూడా గెలిపించే బాధ్యత చంద్రబాబే తీసుకున్నారు.
పోలింగ్ రోజున బిజెపి నేత సోము వీర్రాజు రంగంలోకి దిగి, వైసీపీ దాడులను ఎదిరించిన వైనం అందరినీ ఆకట్టుకుంది. నిజానికి వీర్రాజు ఫక్తు పార్టీవాది. టిడిపి సర్కారు విధానాలకు ఆక్షేపణ తెలిపే నేతల్లో ఆయన ముందు వరసలో ఉన్నప్పటికీ, ‘మిత్రధర్మా’న్ని పాటిస్తుంటారు. కొందరు ‘జాతి’ ప్రముఖుల్లా కాకుండా, పార్టీ కోసమే పనిచేస్తున్నందుకే ఆయన ప్రభ వెలగలేకపోయింది. ‘కమలం’ కళ్లు తెరచినప్పటినుంచీ గజ్జె కట్టినప్పటికీ, చాలామంది ప్రముఖుల మాదిరిగా ఆయన ‘తూర్పు’దాటి రాలేకపోయారు. కొందరికి ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’- కర్ణుడి కవచ కుండలాల మాదిరిగా పుట్టుకతోనే ఉంటుంది. అది అబ్బినవారే రా ణిస్తుంటారు. ఒక్క వీర్రాజే కాదు, రాష్టమ్రంతా అలాంటి బోలెడుమంది వీర్రాజులకు ఇం కా అలాంటి ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ విద్య అబ్బలేదు. వెంకయ్య నాయుడితోపాటు రా జకీయాల్లోకి వచ్చిన వారు, ఆయనకంటే సీనియర్లు ఉన్నప్పటికీ దిల్లీ ‘వెలుగు’ అందరిపైనా ప్రసరించలేదు. టిడిపికి దూరమై, వైసీపీకి దగ్గర కావాలని ‘కొంతమంది’ బిజెపి నాయకులు కోరుకుంటున్నార న్న ప్రచారం తీవ్రంగా ఉంది. కానీ, కాకినాడ ప్రచారం తీరు చూస్తే వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. అందుకేనేమో ప్రధా ని మోదీ కూడా తమ విలువైన ఎన్డీఏ మిత్రుడు సాధించిన విజయానికి అభినందనలు తెలిపితే, అమిత్ భయ్యా కూడా రాష్ట్రంలో ‘కొత్త మిత్రుల’ అవసరం లేదని చెప్పినట్లున్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అసలు బలమేమిటన్నది ‘గుజరాత్ బ్రదర్స్’ గుర్తించినట్లున్నారు. అంతంతమాత్రంగా ఉన్న రెండు పార్టీల సంబంధాల నేపథ్యంలో ‘కమలం కవలలు’ చేసిన ప్రకటనలు బాబుకు వ్యక్తిగతంగా పెద్ద ఊరటే!
ఫలితాల తర్వాత బిజెపి ధోరణి మారింది సరే.. కానీ బాబు వైఖరిలోని అనుమానాస్పద తీరు, నిజాయితీ సహిత ప్రదర్శన ఇంకా బిజెపిలో చర్చనీయాంశంగానే కొనసాగుతోంది. ‘‘జన్మభూమి కమిటీల్లో ఇప్పటిదాకా బిజెపికి చోటు లేదు. రాష్ట్రంలో బిజెపిని ఎదగకుండా బాబు తన సామాజికవర్గానికి చెందిన వారితో పైనుంచి నరుక్కువస్తున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరని నియమించాలో కూడా ఆయనే నిర్దేశిస్తున్నారు. జిల్లాల్లో బిజెపి నేతలు చెప్పిన పనులేమీ చేయవద్దని అధికారులకు హుకుం జారీ చేశారు. సీనియర్లకు గన్‌మెన్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. పార్టీ నేతల వ్యాపారాలు నిలిపివేస్తున్నారు. గత అసెంబ్లీ, ఇటీవలి కాకినాడ ఎన్నికల్లో మిత్రపక్షానికి కొన్ని సీట్లు ఇచ్చినట్లే ఇచ్చి రెబల్స్‌ను నిలబెడుతున్నారు. వీటి ఆధారంగా రాష్ట్రంలో పార్టీకి బలం లేదని చెప్పి, వచ్చే ఎన్నికల్లో తక్కువ సీట్లు ఇచ్చి చేతులు దులిపేసుకోవడమే ఆయన వ్యూహం. బిజెపికి చెందిన కామినేని శ్రీనివాస్‌ను ‘టిడిపి మంత్రి’ని చేసుకున్నారు. ‘కమలదళాని’కి చెందిన మరో మంత్రి మాణిక్యరావునూ అనుకూలంగా మార్చుకున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా మళ్లీ హరిబాబునే కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారు’’.. ఇదీ మెజారిటీ బిజెపి శ్రేణుల్లో బాబుపై ఉన్న నిశ్చితాభిప్రాయం!
‘చంద్రబాబు బిజెపితో బాగున్నట్లు కనిపించడం కాదు. దానిని ఆచరణలో చూపిస్తేనే నమ్మకం ఉంటుంది. మాతో బాగుంటూనే మా పార్టీని ఎదగకుండా చూస్తున్నారన్న సమాచారం దిల్లీ నేతల దాకా వెళ్లింది. మాకు 40 అసెంబ్లీ సీట్లు ఇచ్చి, మునుపటి మాదిరిగా రెబల్స్‌ను దింపకుండా గెలిపిస్తే అప్పుడు ఆయనను పార్టీ నమ్ముతుంది. అంతేగానీ మోదీ ఒక్కరికే విధేయత ప్రదర్శిస్తే లాభం ఉండదు. తనపై ఉన్న అపనమ్మకాన్ని బాబు తొలగించుకుంటే ఆయనకే మంచిది. అప్పుడు మా వాళ్లూ మనస్ఫూర్తిగా కలసి పనిచేస్తారు. ఏదేమైనా బిజెపికి తాను నిజమైన, నమ్మకమైన, అనుమానించాల్సిన అవసరం లేని మిత్రుడినని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనదే’ అని బిజెపి నాయకుడొకరు అసలు విషయం వెల్లడించారు. ఈ అనుమానాలను తొలగించకుండా, పైస్థాయిలో మోదీకి విధేయత ప్రకటించడం వల్ల పెద్దగా ఫలితం ఉండదు. ఎందుకంటే మోదీ ఆవలించకుండానే పేగులు లెక్కపెట్టే రకం కాబట్టి! గతంలో బాబు వామపక్షాలతో చెలిమి చేసినప్పుడు కూడా రాష్ట్ర నేతలైన రాఘవులు, నారాయణను పట్టించుకోకుండా బర్దన్, కారత్-సీతారాం ఏచూరితో నేరుగా రాజకీయాలు నెరిపేవారు. సీపీఎంకు ఎక్కువ సీట్లు వచ్చినప్పుడు సీపీఐని పట్టించుకునేవారు కాదు. సీపీఐకి ఎక్కవ సీట్లు వచ్చినప్పుడు నారాయణ ఇదే విషయాన్ని కొందరితో ప్రస్తావించారు కూడా. కానీ మోదీ ఆ తరహా రాజకీయాలకు లొంగడని గుర్తించకపోతే కష్టమే. కింది స్థాయిలో బిజెపికి తాను గౌరవం ఇస్తున్నానన్న సంకేతాలు దిల్లీకి పంపించడమే ప్రస్తుతం బాబు అంతర్గతంగా, మానసికంగా, రాజకీయంగా ఎదుర్కొంటున్న సమస్యలకు ఏకైక పరిష్కారం.
బిజెపి టిడిపికి పుస్తెకట్టిన పార్టీ ఏమీ కాదు. ఏ రాష్ట్రంలో ఎవరి బలం ఎక్కువ ఉంటుందో ఆ పార్టీతోనే చెలిమి చేసి, జాతీయ స్థాయిలో బలం పెంచుకోవడమే దాని ఏకైక లక్ష్యం. నిజానికి జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలపై ప్రేమ ఉండదు. ఆ ప్రకారంగా బిజెపికి టిడిపి అయినా, వైసీపీ అయినా ఒకటే. ఈ సూక్ష్మం తెలిసి నడుచుకున్న వారే తెలివైనవాళ్లు!

*

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144