మెయిన్ ఫీచర్

ఇప్పుడిదే ట్రెండ్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీజనొచ్చేసింది!
ఇప్పుడు రావడమేంటి? ఆల్రెడీ ఆషాఢం సీజనైపోయింది. బిగ్‌బాస్ సీజన్ సగం దాటేసింది.
అదికాదెహె.. స్టార్లంతా స్మాల్ స్క్రీన్ ప్లాన్ చేస్తున్నారు. ఒకప్పుడు ఈ ట్రెండ్ నడిచింది. మళ్లీ ఇప్పుడు....!
****
ఇండస్ట్రీలో -రైటర్లో, టెక్నీషియన్లో, అసిస్టెంట్ డైరెక్టర్లో సరదాగా కలిసినపుడు సాగుతోన్న చర్చ ఇదీ. నిజమే మరి -ఒకపక్క పెద్ద సినిమాలు చేస్తున్న స్టార్ హీరోలు చిన్న స్క్రీన్‌మీద ‘షో’ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే -సినిమా ఆడియన్స్ కంటే టీవీ ఆడియనే్స ఇప్పుడు ఎక్కువ కనుక. స్క్రీన్‌మీద ఎంత ఎక్కువమందికి కనిపిస్తే -కెరీర్‌కు అంత ప్లస్సే అవుతుంది. మరోకోణంలో చూస్తే -ఒకింత ఆటవిడుపు చిన్ని తెర. పైగా, హిట్టయితే పది సినిమాలకు వచ్చే ఇమేజ్ ఒక్క షోతో వర్కవుటవుతుంది. అలాగని తెరమరుగైన వాళ్లు -తెరమీదకొస్తానంటే చానెల్స్ ఒప్పుకోవు. స్టార్ ఇమేజ్‌తో చిన్ని తెరకు వస్తే -వాళ్లకు టీఆర్పీ రేటింగ్. వీళ్లకు -్ఫ్యన్స్ ఫాలోయింగ్. అందుకే -టీవీ చానెల్స్ అన్నీ స్టార్ హీరోలతోనో, ఇమేజ్‌వున్న ఆర్టిస్టులతోనో కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. వైవిధ్యమైన కానె్సప్ట్‌లతో ‘షో’ చూపిస్తూ రేటింగ్‌ల కోసం ఎగబడుతున్నాయి. అంటే -బుల్లితెర, పెద్ద తెర మధ్య అనుసంధానమన్న మాట. ఎంటర్‌టైన్‌మెంట్ చానెల్స్‌లో పెద్ద స్టార్లకు వాటాలు ఉండటం, లేదూ ఆయా చానెల్స్ యాజమాన్యాలతో కొనసాగే వ్యాపార లావాదేవీలు, అదీకాదంటే -స్నేహ సంబంధాలు వెరసి ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ తరహా స్ట్రాటజీ నడుస్తోంది.
**
కొద్దికాలం క్రితం వరకూ -బిగ్ స్క్రీన్ మీద ఫేడవుట్ అయిపోయిన హీరోయిన్లు చానెల్స్ ముఖం చూడ్డం మొదలెట్టారు. సీరియల్స్‌లోనో, అప్పుడప్పుడే మొదలైన రియాలిటీ షోస్‌లోనూ కనిపిస్తూ -సెకెండ్ ఇన్నింగ్స్‌ను స్మాల్‌స్క్రీన్ నుంచి మొదలెట్టారు. క్రమంగా వాళ్లకంటూ ఓ ట్రాక్ రావడంతో -మళ్లీ బిగ్‌స్క్రీన్ మీదా అడపాదడపా అవకాశాలు రావడం కనిపించేది. ఇలా చాలాకాలమే సాగింది. తరువాత ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ అంటూ కంచుకంఠంతో ‘షో’ చూపించిన అమితాబ్ -తెలుగులో కొత్త ఆలోచనకు నాంది పలికాడు. అప్పటికి చానెల్స్‌లో ఎన్నో తరహా క్విజ్ షోలు నడిచినా ‘..కరోడ్‌పతి’ ఊపుతో తెలుగులోనూ ఓ ప్రోగ్రాంను డిజైన్ చేశాడు. అలా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అంటూ తన స్టయిల్‌లో ప్రశ్నిస్తూ వచ్చిన నాగార్జున -షోకి కొత్త ఊపుతెచ్చాడు. నాగ్ స్టయిల్, సమయస్ఫూర్తి, మన్మధుడిగా యువతలో అతనికున్న క్రేజ్ అన్నీ ప్రోగ్రాంకి కలిసొచ్చాయి. కట్‌చేస్తే -ఆ షోతో నాగ్ కెరీర్‌కు పెద్ద ఊపు వచ్చేసింది. ‘...కోటీశ్వరుడు’ షోతో బాగా అలవాటుపడిపోయిన నాగ్, తరువాత బిగ్ స్క్రీన్‌మీదా హిట్లు కొడుతూ బిజీ అయిపోయాడు.
పొలిటికల్ బిజీ తరువాత -కెరీర్ సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టేందుకు సిద్ధమవుతున్న చిరంజీవిని సీన్‌లోకి దించి స్క్రీన్‌మీదకు తీసుకొచ్చారు. బిగ్ స్క్రీన్‌కు వచ్చిన గ్యాప్ తరువాత స్మాల్‌స్క్రీన్‌మీద కనిపించిన చిరంజీవి -ఆ షోని పెద్దగా రక్తికట్టించలేకపోయాడు. పైగా -షోలో పార్టిసిపేట్ చేయాలన్న ఆసక్తి అప్పటికి జనంలోనూ తగ్గడంతో చానెల్‌కు వర్కవుట్ కాలేదు. దీంతో మమ అనిపించక తప్పలేదు. బిగినింగ్ అలా ఇచ్చినా -సెకెండ్ ఇన్నింగ్స్‌తో చిరంజీవి బిజీ అయిపోవడంతో ‘... కోటీశ్వరుడు’ మళ్లీ వస్తాడా? అన్నది సందేహాస్పదమైంది. తాజాగా వెటరన్ హీరో వెంకటేష్ సైతం స్మాల్ స్క్రీన్‌వైపు చూస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. వెంకటేష్‌ను హోస్ట్‌గా దింపేందుకు కొన్ని చానెల్స్ యాజమాన్యాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. వెంకీ సైతం ఈ విషయంలో ఒకింత ఆసక్తి చూపుతున్నట్టు కనిపిస్తున్నాడు. దృశ్యం, గురులాంటి చిత్రాలు తెచ్చిన సూపర్ ఇమేజ్‌తో కెరీర్ కొనసాగిస్తున్నాడు వెంకీ. సో.. తన స్టేటస్‌కు తగినట్టుండే భారీ కానె్సప్ట్‌ను ఇంట్రెస్టింగ్‌గా డిజైన్ చేస్తే -అప్పుడు చూద్దాంలే అన్న మాట కూడా ఇచ్చేశాడని తెలుస్తోంది. వెంకీకి తగినట్టుండే కానె్సప్ట్‌ను డిజైన్ చేసే పనిలో నిమగ్నమయ్యారు కొందరు. కానె్సప్ట్‌కి కనుక వెంకీ కనెక్టయితే -బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు త్వరలోనే వస్తాడన్న మాట. పైగా, వెంకీకి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ బలంగానే ఉంటుంది కనుక -ఆ విషయన్ని దృష్టిలో పెట్టుకునే మోడ్రన్ కానె్సప్ట్‌ని డిజైన్ చేసే పనిలో పడ్డారని వినికిడి. ఇక వెంకీ అన్న కొడుకు, బాహుబలితో సూపర్ ఇమేజ్ తెచ్చుకున్న రాణా ఇప్పటికే ‘నెం.1 యారీ’తో చెలరేగిపోతున్నాడు. కానె్సప్ట్‌లో కొత్తదనం లేకున్నా, నిర్వహించే తీరుతో రానా సక్సెస్ అయ్యాడు. సినిమా సంగతులు ఆడియన్స్‌కి ఎప్పుడూ ఆసక్తే. స్క్రీన్‌మీద వెలిగిన వాళ్ల లైఫ్ ముచ్చట్లు మరింత కిక్కునిస్తాయి. ఇప్పుడు రానా ఇదే ప్రయోగించాడు. ప్రోగ్రాం సక్సెస్‌నివ్వడంతో -యారీతో రానా కొంతకాలం మురిపించడం ఖాయం.
ఇక ఇంటా బయట పెద్ద చర్చకు తెరలేపిన స్టార్ హీరో -జూ.ఎన్టీఆర్. ‘బిగ్ బాస్’ తెలుగు షోకి ఎన్టీఆర్‌ను ఒప్పించడమే పెద్ద స్ట్రాటజీ. టాప్ స్టార్ ఇమేజ్‌తో కెరీర్ కొనసాగిస్తున్న ఎన్టీఆర్‌ని -షోకి ఒప్పించడంతోనే ‘బిగ్ బాస్’కు కొత్త ఇమేజ్ వచ్చేసింది. కాకపోతే, ఎన్టీఆర్ హైట్స్‌కి తగిన సినీతారలు షోలో లేకపోవడం ఒకింత మైనస్. లేదంటే -హీరో ఇమేజ్‌తో తెలుగు బిగ్ బాస్ మరో రేంజ్‌లో ఉండి ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినా, టీఆర్పీ రేటింగ్ బాగానే వస్తుండటంతో స్ట్రాటజీ వర్కవుటైనట్టే అంటున్నారు.
ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే -రేణుదేశాయ్ స్మాల్ స్క్రీన్‌కు వస్తుందన్న కథనం. హీరో పవన్‌తో ఉన్నపుడు అతని సినిమాలకి సంబంధించిన వ్యవహారాలను రేణుదేశాయ్ చూసుకునేది. ఇద్దరూ వేరుపడినా -ఇండస్ట్రీలో రేణుకు అదే ఇమేజ్ కొనసాగుతోంది. కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయాలన్న ఆలోచనతోవున్న రేణు -పరిశ్రమకు దూరంకాకుండా ఏదోక యాక్టివిటీతో బిజీగానే ఉంటోంది. అందులో భాగంగానే కొద్దికాలం క్రితం ఒక సినిమాకు దర్శకత్వమూ వహించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రేణుకి అభిమానులకేం కొదువలేదు. ఈ కోణంలోనే తెలుగు బుల్లితెరపై హోస్ట్‌గా కనిపించనుందని అంటున్నారు. స్టార్ మా -ఓ బిగ్ రియాలిటీ డాన్స్ షోను డిజైన్ చేస్తోంది. త్వరలోనే షోకి సంబంధించి షూటింగ్ సైతం మొదలవుతోందట. దీనికి రేణు వ్యాఖ్యాతగా రాబోతోంది.
సౌందర్యలహరితో దర్శకుడు రాఘవేంద్రరావు, అలీ టాకీస్‌తో కమెడియన్ అలీ, సీనియర్ హీరోయన్ రోజా నుంచి ఇమేజ్ తగ్గిన సదా వరకూ.. లక్ష్మి మంచు, అవసరాల శ్రీనివాస్.. ఇలా అంతా స్మాల్ స్క్రీన్ మీద వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తావనకు రాని నటులు, నటీమణులు ఇంకెంతమందో ఉన్నారు. బిగ్ స్క్రీన్ నుంచి స్మాల్ స్క్రీన్‌కు రావడం ఇప్పుడొక ట్రెండ్.

-ప్రవవి