మెయిన్ ఫీచర్

జంక్‌ఫుడ్ కీడు ఎంతెంతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియకు పిజ్జా అంటే ప్రాణం. ప్రేమికి ఫ్రెంచ్ ఫ్రైస్ పేరు వింటేనే ఆనందం, భాస్కర్‌కు బర్గర్ ఉంటే మరేమీ అవసరం లేదు. నల్లికి నూడిల్స్ ఉంటే హాయి. బుజ్జికి బజ్జీలంటే మహాప్రీతి. ఈ స్నాక్స్ అన్నీ కుర్రకారుకే కాక అందరికీ మహా ఇష్టమైనవి. పద్మిని, అమ్మ ఇచ్చిన లంచ్ బాక్స్‌లోని పెరుగన్నం బస్‌స్టాప్ వద్ద డస్ట్‌బిన్‌లో వేసి కాలేజీకెళుతుంది. ఆ పెరుగన్నం చూస్తే అందరూ వెక్కిరిస్తారని ఆమె భయం.
ఏది ఏమైనా నేడు అందరూ అనేక కారణాలవల్ల ఈ జంక్ ఫుడ్స్‌వైపు ఆకర్షితులవుతున్నారు. స్నాక్స్ అంటే చిప్స్, కాండీ, తీపి ఉండలు, పంచదార పెట్టిన సీరల్స్, ఫ్రైడ్ ఫాస్ట్ఫుడ్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, రెడీమేడ్ కూల్ డ్రింక్స్, మసాలా చాట్, పకోడీలు, బజ్జీలు, మిర్చి బజ్జీలు (ఇంట్లో చేసినవి కాదండోయ్), ఫాస్ట్ ఫుడ్ టమోటా కెచప్, వెన్నతో కూడిన కేకులు, చాక్లెట్ డింగ్ డాంగ్స్, బేకన్, సాసేజ్ మున్నగునవి. బర్గర్, పిజ్జా, ఫ్రెంచి ఫ్రైస్, కేక్స్, నూడిల్స్ వంటివి సులువుగా అన్నిచోట్లా దొరకడంవల్ల కంటికి కనిపించే తిండి తినేసి ఆకలి తీర్చుకుంటున్నారు. వాటి మంచి చెడులను, అవి చేసే మేలు కీడులను గురించి ఆలోచించను సమయమే ఉండటంలేదు.
నేటి అత్యాధునిక కాలంలో వంటిల్లు వాడకుండా ఏదో ఒకటి తినేయటం జరుగుతున్నది. కారణాలు అనేకం, ఫలితం మాత్రం ఒక్కటే. విరామమెరుగని కార్పొరేట్ పనివల్ల తిండి తినే సమయం ఉండటంలేదు. పిల్లలు, పెద్దలు, అన్ని వయసులవారూ ఈ జంక్ ఫుడ్స్ ప్రియులే! వాటి రూప లావణ్యలూ ఆకర్షణ అలా ఉంటాయి. దీనే్న ‘సంతపకోడి’ అంటారు. వాసన, రుచి మాత్రం అమోఘం. అనారోగ్యం కూడా అదే స్థాయిలో వుంటుంది. పైగా ఏ చానల్ తెరిచినా ఏమున్నది చూసేందుకు యాడ్స్ తప్ప. వాటిల్లో మనస్సును దోచే జంక్ ఫుడ్ యాడ్సే. ముఖ్యంగా పిల్లలు వాటిపట్ల ఆకర్షితులై వాటికోసం ఎంతో గొడవ చేస్తారు. కొనక తప్పదు. ఆపైన వచ్చే కష్టాలూ అనుభవించక తప్పదు. ఆకుకూర పప్పుకన్నా పిజ్జా ఆకర్షిస్తుంది. క్యారెట్ కూరకన్నా టమోటో కెచప్ నోరూరిస్తుంది.
అవసరమైన పోషక విలువలు, శరీర పోషణకు సరిపోయేంతమేరకు కేలరీలు అందించని అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను జంక్ ఫుడ్స్ అంటాం. జంక్ ఫుడ్ తినడం మన అనారోగ్యానికి మనమే దారి వేసుకున్నట్లుగా భావించక తప్పదు. ఈ జంక్ ఫుడ్ అనే మాట మొట్టమొదట 1972లో మిచెల్ జకొబ్‌సన్- డైరెక్టర్ ఆఫ్ ది సెంటర్ ఫర్ సైన్స్ ఇన్ ది పబ్లిక్ ఇంటరెస్ట్ ఉటంకించారు. జంక్‌ఫుడ్‌లో అధికంగా సాచ్యురేటెడ్ కొవ్వులు, సాల్ట్, షుగర్ ఉంటాయి. వీకెండ్స్ అంటే వారాంతపు సెలవుల్లో కుటుంబం మొత్తం వెళ్లి హోటలు తిండి తినడం అలవాటుగా మారిపోయింది. అక్కడ వాడే నూనెలు ఎన్నోమార్లు వేడిచేసినవి, వాటినే మళ్లీ మళ్లీ వేడిచేసి ఆ పదార్థాలు తయారుచేస్తారు. ఏం చేద్దామండీ! మన గతి ఇలా అయిపోయింది.
ఆరోగ్యకరమైన పండ్లు, కాయగూరలు, ఫైబర్ ఉన్న పదార్థములు లభించవు. నేటి పిల్లలకు నచ్చే జంక్‌ఫుడ్స్ బర్గర్, పిజ్జా, ఫ్రెంచి ఫ్రైస్, కేక్స్, నూడిల్స్- ఇంకా మరికొన్ని. జంక్‌ఫుడ్ తినడమంటే స్థూలకాయాన్ని తెచ్చుకోడమే! ఈ ఊబకాయంవలన చిన్న వయసులోనే బిపి, షుగర్ ఇంకా అనేక సమస్యలు వచ్చి తీరతాయంటారు వైద్యులు, శాస్తవ్రేత్తలు. ధూమపానం, మత్తుమందుల మాదిరిగానే జంక్ ఫుడ్ తినడం కూడా వ్యసనమైందని కూడా అంటున్నారు. ఆకర్షణీయంగా కనిపించే ఈ జంక్‌ఫుడ్‌లో ఎటువంటి న్యూట్రిషియన్స్ ఉండవని, ఇవి రసాయనాలతో తయారుచేయబడినవని తినేముందు ఒక్కమారు ఆలోచిస్తే ఇవి తినడం తగ్గించవచ్చు.
మన ఐసియంఆర్ వైద్య నిపుణులు జంక్‌ఫుడ్స్ అసలు ఆరోగ్యానికి మంచిది కాదనీ, బరువు పెంచి ఊబకాయానికి రూటు వేస్తుందంటున్నారు. ఈ ఫాస్ట్ఫుడ్‌వల్ల నాలుకమీద రుచి మొగ్గలు తృప్తిపడతాయట. అంటే ఆ రుచికి మన నాలుక ఇష్టపడుతుంది. మనస్సు కావాలంటుంది, ఆకలి చచ్చిపోతుంది కానీ ఆరోగ్యం హరిస్తుంది.

-ఆదూరి హైమావతి