మెయిన్ ఫీచర్

స్వరధాత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచానికి ఆమె కర్నాటక సంగీత స్వరరాణి, ఓ స్వర్ణపుట. భారతీయ సంప్రదాయ సంగీతానికి గమకం, గమనం, గమ్యం. సంగీతంతో వసుధైక కుటుంబాన్ని ఏర్పాటుచేసి అందరి హృదయాల్లో దైవత్వాన్నినింపిన శాంతమూర్తి ఎంఎస్ సుబ్బులక్ష్మి. దాదాపు ఏడు దశాబ్దాల పాటు తన గానామృతంతో యావత్ ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసిన ఈ సంగీత శిఖామణి భౌతికంగా మనమధ్య లేకపోయినా.. వేకువ జామున శ్రీవారి సుప్రభాతంతో ప్రపంచాన్ని మేలుకొలుపుతోంది. భగవంతుడు సైతం కోయిలను మరిపించే ఆ కంఠస్వరానికి తన్మయుడవ్వాల్సిందే.
ఆమె జీవితంలోని కొన్ని ముఖ్య విశేషాలు
భగవంతుని కీర్తన ఆలపిస్తుంటే అచంచల భక్తితో కళ్లు మూసుకుని ఆలపించే ఆమె అతి చిన్న వయసులోనే తల్లే తొలి గురువుగా సంగీత సాధన చేశారు.
పదవ ఏటనే గ్రామ ఫోన్ రికార్డింగ్ కోసం గానం చేశారు. 1927లో 11వ ఏట మొదటి కచ్చేరీ నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు.
పదికి పైగా భాషల్లో వేలాది కృతులు, కీర్తనలు, శాస్ర్తియ లలిత గీతాలను, జానపద గేయాలు, భజన్స్, మరాఠీలో అభ్యాంగ్స్, దేశభక్తి గేయాలు పాడారు.
సంగీతానికే శిరోభూషణమై వెలిగినా కించిత్తు కూడా గర్వపడేవారు కాదు. ఉదయం పూట సాధన చేయనిదే కచ్చేరీ వేదికపై ఆమె అడుగుపెట్టేవారు కాదు. ఆఖరి కచ్చేరీ వరకూ ఆమె ఇదే పద్ధతిని కొనసాగించారు.
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం, అన్నమాచార్య కీర్తనల ఆలాపనతో ఆమె తెలుగునాట అడుగుపెట్టారు. అన్నమాచార్య పదాల్ని భావగర్భితంగా ఆలపించేందుకు ఆమె ప్రత్యేకంగా తెలుగు నేర్చుకున్నారు.
సంగీతానికి సామాజిక బాధ్యత ఉందని ఆచరణలో నిరూపించిన ఎమ్మెస్ జీవితాంతం ఆమె తన ఆదాయంలో అధికభాగాన్ని సమాజహితానికే వెచ్చించారు. స్వాతంత్రోద్యమ కాలంలో కచ్చేరీల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆమె కస్తూరీబా ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చారు. అనాధశరణాలయాలు, ఆసుపత్రులు, విద్యాలయాల కోసం ఉచితంగా కచ్చేరీలు చేశారు. ఆమె సేవానిరతికి దక్కిందే ‘రామన్ మెగసెసే’ అవార్డు.
1960 దశకంలో ప్రధాని హోదాలో లాల్ బహుదూర్ శాస్ర్తీ తిరుమల క్షేత్రానికి వచ్చారు. అపుడు ఎంఎస్ సుబ్బులక్ష్మి ఆయన కోసం తిరుమల క్షేత్రంలో తొలిసారి కచ్చేరీ చేశారు. ఆనాటి నుంచి కూడా ఆమె ఏటా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సంగీత కచ్చేరీ నిర్వహించేవారు.
1966 నుంచి టీటీడీ ఆస్థాన విద్వాంసురాలిగా విశేష సేవలందించారు. ఎమ్మేస్ సేవలకుగానూ 2006లో తిరుపతిలో ఆమె కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.
సుబ్బులక్ష్మి సిగలో ఒదిగిన అవార్డులు
ఈ కళామతల్లి సిగలో అనేక అవార్డులు ఒదిగాయి. సంగీత కళానిధి అవార్డును పొందిన తొలి మహిళ. భారతరత్న అవార్డు పొందిన తొలి కర్నాటక గాయకురాలు. 1956లో రాష్టప్రతి అవార్డు, 1968లో మద్రాసు మ్యూజిక్ అకాడమీ అవార్డు, 1975లో పద్మభూషణ్, 1966లో సప్తగిరి సంగీత విద్వన్మణి అవార్డు, 1988లో కాళిదాస్ నమ్మాన్, 1990లో ఇందిరాగాంధీ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు, ఆసియా నోబెల్ బహుమతి పొందారు. అంతేకాదు 2005లో ఆమె పేరున పోస్టల్ స్టాంప్‌లు సైతం విడుదల చేశారు.
పారితోషికాలన్నీ భగవంతునికే..
ఎమ్మెస్ సుబ్బులక్ష్మి తన సంగీత కచ్చేరీల ద్వారా సంపాదించిన కోట్లాది రూపాయలను భగవంతుని సేవలకే సమర్పించిన వితరణశీలి. బాలాజీ పంచరత్నాలు పేరుతో శ్రీవారికి సుప్రభాతంతో పాటు సంకీర్తనలు, శ్లోకాలు ఆలపించి రికార్డు చేసిన ఐదు సీడీలు విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును శ్రీవారి సేవలకు అందజేసిన త్యాగశీలి. రామకృష్ణ మిషన్‌లాంటి సేవా సంస్థలకు కోట్లాది రూపాయలను రాయల్టీల రూపంలో అందజేశారు.