మెయిన్ ఫీచర్

కుంగ్ ఫూ నన్‌లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* యుద్ధ విద్యలో శిక్షణ * మాటలతో పనిలేదని చేతల్లోనే సత్తా * ‘హిమాలయ హీరోలు’గా అభివర్ణన

సువిశాలమైన హిమాలయాల పర్వత శ్రేణుల్లో నెలకొన్న అత్యంత సుందర ప్రాంతం లడక్! ఉషస్సులో సూర్యోద కాంతులు
ఈ ప్రాంతమీద పరుచుకునే సమయంలో కాలం ఒక్క క్షణం స్తంభించినట్టుగా అనిపిస్తుంది. అప్పటినుంచి చెవులకు సోకుతాయి బౌద్ధ సన్యాసుల మంత్రోచ్ఛాటనలు! ఆ శబ్దానికి నిద్రమత్తు వదిలించుకున్న లడఖ్ వాసులు ధవళకాంతులీనే తమ రాతి గృహాల నుంచి బయటకు వచ్చి గోధుమ, బార్లీ పంటల పనులకు కానీ, గొర్రెలను మేపేందుకు తీసుకువెళ్ళడానికి కానీ సన్నద్ధలవుతుంటారు. శిలాసదృశ్యమైన పర్వతసానువులపై నెలకొన్న ఆలయాలు, కళాకృతులతో నిండిన వాటి ఆవరణలు, మంత్ర ప్రవచనాలు చెక్కిన వాటి గోడలతో ఆధునికతను ఏ మాత్రం దరిచేరనివ్వకుండా, శతాబ్దాల టిబెట్ బౌద్ధమత జీవనశైలిని కళ్ళకు కడుతుంది లడక్!

మన శ్రవణేంద్రీయాలను తాకుతాయి వందలాది మంది యువతుల సన్నని అరుపులు, కేకలు! తీరాచూస్తే ట్రాక్‌షూట్లు ధరించిన అమ్మాయిలు, ట్రెయినర్లు ఆలయం వంటి తెల్లని ఠీవి గొల్పే ఓ కట్టడడం ముందు మనకు కనిపిస్తారు. బౌద్ధ సన్యాసినుల(నన్) సూచనల మేరకు ఒకరిమీదకు ఒకరు దూకడం, పంచ్‌లు విసురుకోవడం, పైకి కిందకి దూకడం చేస్తుంటారు ఆ అమ్మాయిలు. ఆ శిక్షకులే కుంగ్ ఫూ నన్‌లు. ఆడపిల్లలకు ఆత్మరక్షణ నైపుణ్యాన్ని నేర్పడం కోసం తరాల తరబడి ప్రత్యేకంగా ఏర్పడుతూ వస్తున్న బౌద్ధతెగకు చెందిన వారు ఈ నన్‌లు! బౌద్ధమత విద్యార్థులకు నిత్యం నిర్వహించే ధ్యాన తరగతుల మధ్య మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలను కూడా నేర్పంచడానికి ఈ నన్‌లు నియమితులయ్యారు. దేశంలో యువతులపై అత్యాచారాలు, మానభంగాలు రోజు రోజుకూ పెరిగిపోతున్న తరుణంలో ఇటువంటి శిక్షణ మహిళలకు తప్పనిసరైంది. దీంతోపాటు స్ర్తి, పురుష సమాన స్థాయిపై పాఠాలను కూడా వారికి బోధిస్తారు. ‘బౌద్ధ సన్యాసినులు కేవలం ఒక చోట కూర్చోని ధ్యానంలో గడుపుతుంటారని అందరూ అనుకుంటారు. కానీ, మేం అంతకంటే ఎక్కువే చేస్తున్నాం,’ అని చెప్పింది 19 ఏళ్ళ కుంగ్ ఫూ శిక్షకురాలు జిగ్మే వాంగ్‌చుక్ లామో! తమకు మాటలతో పనిలేదని చేతల్లోనే సత్తా చూపిస్తామని, అప్పుడే, సన్యాసిలే ఇటువంటి యుద్ధ విద్యలు ప్రదర్శిస్తుంటే మేమెందుకు నేర్చుకోకూడదని, అమ్మాయిలు ముందుకు వస్తారని ఆమె వివరించింది. బౌద్ధ సన్యాస విధానాల్లో సన్యాసినులు, సన్యాసులు సమాన హోదా, స్థాయి కలిగివుంటారు. యుద్ధ విద్యల్లో శిక్షణ ఇవ్వడానికి ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన దృక్పా తరం నన్‌లు సుమారు ఏడు వందల మందిలో ఒకరు వాంగ్‌చుక్! సంప్రదాయ సిద్ధంగా వంట చేయడం, పరిశుభ్రత పాటించడమే సన్యాసినుల డ్యూటీ! కానీ, సుమారు దశాబ్దం కిందటి నుంచి ఈ పద్ధతి పూర్తిగా మారిపోయింది. దృక్పా తరం వ్యవస్థాపకుడు ది గ్యాల్‌వాంగ్ దృక్పా. ఈయనే కుంగ్ ఫూ విద్య నేర్చుకోవాల్సిందిగా నన్‌లను దాదాపు వెయ్యి సంవత్సరాల కిందట ప్రోత్సహించాడు. కేవలం బౌద్ధమత బోధనలలో శిక్షణ పొందడంతోపాటు ఎలక్ట్రీషియన్లుగా, ప్లంబర్లుగా శిక్షణ పొందాలని కూడా ఆయన ప్రబోధించాడు. ఈ నన్‌లు తాము నివసించే ప్రాంతాల్లో ముఖ్యంగా ఇండియా, నేపాల్‌లలో దైనందిన కార్యకలాపాలతోపాటు జబ్బుపడిన జంతువులకు వైద్యం చేయడం, గ్రామస్తులకు నేత్ర వైద్యశిబిరాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నారు. హిమాలయ పర్వత కనుమల మీదుగా వేలాది కిలోమీటర్లు కాలినడకన, సైకిళ్ళపైన ప్రయాణిస్తూ వాతావరణ కాలుష్యం, వ్యభిచారం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా వారు ప్రచారం చేస్తున్నారు. నేపాల్‌లో 2015 ఏప్రిల్‌లో సంభవించిన భారీ భూకంపం తర్వాత కూడా వారు ఆ ప్రాంతాన్ని వదిలి రావడానికి ఇష్టపడడం లేదు. గ్రామాల్లో పర్యటిస్తూ భూకంపం మిగిల్చిన శిథిలాలను తొలగించడం, మార్గాలను సరిచేయడం, బాధితులకు ఆహార పదార్థాలను సరఫరా చేయడం లక్ష్యంగా పనిచేశారు. అందుకే కుంగ్ ఫూ నన్‌లను ‘హిమాలయ హీరోలు’గా అభివర్ణించింది లివ్ టు లవ్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు కేరీ లీ. హిమాలయాల్లో నివసించే వివిధ పేదవర్గాల ప్రజలను ఆదుకోవడానికి దృక్పానన్‌తో కలిసి ఈమె పనిచేస్తోంది. భూకంపాలు, హిమశిలాపతాలు, భారీ వర్షాలు, వరదలు వంటి ప్రకృతి బీభత్సాలు కుంగ్ ఫూ నన్‌ల కార్యక్రమాలను ఏ మాత్రం అడ్డుకోలేవని లీ చెప్పింది.
గత ఆగస్టులో నరో ఫొటాంగ్ వద్ద జరిగిన అయిదు రోజుల శిక్షణా శిబిరంలో 13-28 సంవత్సరాల మధ్య యువతులు సుమారు వంద మంది పాల్గొన్నారు. ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు వివిధ విద్యల్లో సుశిక్షితులయ్యారని జిగ్మే యేషి లామో అనే నన్ చెప్పింది. ఆకస్మాత్తుగా వెనుక నుంచి జరిగే దాడుల నుంచి తమను తాము రక్షించుకోవడం ఈ శిక్షణలో ఓ భాగం. దీంతోపాటు అత్యాచార సంఘటనలను ముందుగా ఊహించి, అందుకు తగిన విధంగా ప్రతిస్పందించడం వంటి వాటిని కూడా చర్చించారు. మార్కెట్లు తదితర రద్దీగా ఉండే ప్రదేశాల్లో అబ్బాయిల ఈలలు, పిల్లికూతలు ఎంతో ఇబ్బంది కలిగించే సమయంలో అమ్మాయిలు ఈమాత్రం జాగ్రత్తలు తీసుకోవడం అవసరమే కదా!

- జికె మూర్తి