మెయిన్ ఫీచర్

మహిషగుణ నాశిని మహిషాసురమర్దని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగజ్జనని, పరమేశురాణికి ‘దుర్గ’ అనే నామం ఉంది. ప్రాచీన కాలంలో ‘దుర్గముడ’నే రక్కసుండేవాడు. ఇతని తండ్రి పేరు ‘రురువు’. హిరణ్యాక్షుడనే దైత్య వంశంలో జనించాడు. దేవతల బలాన్ని, వేదాలను నశింపజేయాలనే తలంపు కల్గినాడు. శీతశైలంపై విధాత బ్రహ్మ గురించి ఘోర తపమాచరించాడు. ఈ రక్కసుని తపో తేజః ప్రభావానికి లోకాలు సంతాపం చెందాయి. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకో అన్నాడు.
ఆనందంతో ఆ దుర్గముడు ముల్లోకాల్లోగల వేదాలన్నీ తనకిమ్మన్నాడు. దేవతలనోడించే బలమిమ్మన్నాడు. బ్రహ్మసరేనని వరమిచ్చి అంతర్థానమైనాడు. వరప్రభావంతో వేదాలన్నీ అతణ్ణి చేరాయి. లోకాలు వేదాలను మరచిపోయాయి. వేదోక్త కర్మకాండ అంతరించింది!
యజ్ఞాలు లేవు. దేవతలకు హవిస్సులు లేవు. బలహీనపడిన దేవతలు కొండల్లో, గుట్టల్లో తలదాచుకున్నారు. ఆదిపరాశక్తిని ధ్యానిస్తూ కాలం గడుపుతున్నారు. వర్షాలు లేక, పంటలు లేక శతవత్సరాలు అనావృష్టితో తల్లడిల్లారు. మనుజులు, పశువులు, జీవజాలం మరణించడం మొదలైంది.
ఈ సమయంలో వేదవిదులు హిమాలయాలకు వెళ్లి పరాశక్తిని ధ్యానం - పూజల చేస్తూ నిరాహరులుగా జీవిస్తున్నారు. వీరి దయనీయ పరిస్థితిని గాంచిన దేవి నీలవర్ణంతో పలు నేత్రాలతో దర్శనమిచ్చింది. దయగల తల్లి నేత్రాలు కన్నీటిని వర్షించాయి. 9 రోజుల వర్షంతో లోకాలకు నీటి ఎద్దడి తగ్గింది. నదులు నిండాయి. ఆనందపడిన దేవతలు, వేదవేత్తలు దేవిని స్తోత్రంచేశారు. వారి ఆకలిదీర్చడానికి శాకాలు - ఫలాలు - కందమూలాలు- పలు రకాల ఆహారం వారికి అమ్మ అందించింది. శాకములు పట్టుకొని దర్శనమిచ్చింది. నాటి నుండి దుర్గమ్మ శాకంబరిగా నేత్రోత్సవం చేసింది. పలు నేత్రాలతో కన్నీటిని వర్షించినదిగాన ‘శతాక్షి’గా పేరు వచ్చింది. ‘సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే’- ఆ దేవికి దుర్గముని దురాగతాలను విన్నవించారు. ఈ విషయాలను విన్న దుర్గముడు సైన్యంతో దేవతలపైకి యుద్ధానికి సిద్ధమైనాడు. బలహీనులైన దేవతల కొరకు దేవి తేజస్సు కల్గిన చక్రాన్ని నిర్మించింది. అమ్మవారికీ, రాక్షసునికీ భయంకరమైన యుద్ధం జరిగింది.
ఆమెలోనుండి కాళిక- తారిణి- బాలా-త్రిపురా మున్నగు 32మంది శక్తిదేవతలు జనించారు. చతుష్షష్టి దేవతలు ఆవిర్భవించారు. దేవి పరివారం రక్కసుల సైన్యాన్ని నాశనం చేసింది. యుద్ధం పది రోజులపాటు సాగింది. 11వ రోజన ఆదిపరాశక్తియై ఆ జనని యుద్ధంలో దుర్గమాసురుని వధించినది. నాటినుండి ఆ దేవిని ‘దుర్గ’ అనే నామంతో దేవతలు ఆరాధించి, పూజించారు. ఆ దేవి అనుగ్రహం వారికి లభించి శుభాలు కలిగాయి.
దుర్గ అంటే దుర్గతి నాశని. దుర్గతులను నశింపజేసి సద్గతులను ప్రసాదించే దేవి. శరత్కాలంలో శరదృతువు ప్రారంభంనుండి మొదటి 9 రోజులు శరన్నవరాత్రులంటారు. శరత్కాలంలో ఆరాధింపబడే తల్లి గనుక ‘శరదారాధ్య’గా ఖ్యాతి చెందినది.
సర్వశక్తుల మూలం మనో, బుద్ధి ఇంద్రియములు. ఈ చైతన్యమే పరాశక్తి- ఆది పరాశక్తి అభిసంభావించారు. ఆశ్వయుజ మాసంలో శుక్ల పాడ్యమి నుండి నవమి వరకుగల 9 రాత్రులలలో అమ్మవారి ఆరాధన ప్రపంచమంతా జరుపుకుంటుంది. ఈ తొమ్మిది రోజులూ పూజించే దుర్గాదేవి రూపాలను ‘నవదుర్గలు’ అంటారు.
నవదుర్గా వివరణ
1.ఈ దేవి ప్రథమ రూపం శైలపుత్రి. ఈమెయే పరమేశ్వరుని పెండ్లియాడిన పర్వతరాజ పుత్రి పార్వతి. వృషభవాహిని. కుడిచేతిలో త్రిశూలం. ఎడమ చేతిలో కమలం ఉంటాయి.
2.రెండవ రూపం బ్రహ్మచారిణి. ఈమె కూడా శైలపుత్రి పార్వతియే. శివుని భర్తగా పొందుటకై బ్రహ్మచర్య దీక్షతో కథన తపమాచరించినందున బ్రహ్మచారిణి అయింది. చేతులలో జపమాల- కమండలం ఉంటాయి.
3.ఈ దేవి మూడవ రూపం చంద్రఘంట. ఈమె శిరస్సుపై అర్థచంద్రుడు ఘంటాకృతిలో నుండుట వలన ఈమె చంద్రఘంట అయినది. ఈమెకు పది చేతులు. వాటిలో ఖడ్గం- త్రిశూలం- గద - ధనుస్సు- బాణం- కమలం- కమలండలం ఉంటాయి. ఈమె వాహనం సింహం.
4.అమ్మవారి నాలుగవ రూపం కూష్మాండ. చిరునవ్వుతో బ్రహ్మాండమును సృష్టించుటవలన ఈమెకు కూష్మాండ అనే పేరు వచ్చింది. కూష్మాండం అనగా గుమ్మడికాయ. ఈ దేవికి కూష్మాండ బలి యిష్టం. ఈమె అష్ట్భుజి. వాటిలో కమండలం- ధనుస్సు- బాణం- కమలం- అమృతకలశం- చక్రం- గద - జపమాల ఉంటాయి. సింహవాహిని.
5.దేవి ఐదవ రూపం స్కందమాత. స్కందుడంటే శివపుత్రుడు కుమారస్వామి. తల్లి అయిన పార్వతీదేవి రూపమే. స్కందమాత రూపం. ఈమె ఒడిలో స్కందుడుంటాడు. ఈమె చతుర్భుజి. ఒక చేతితో స్కందుని పట్టుకొని ఉంటే ఆమె మిగిలిన రెండు చేతుల్లో పద్మం- కమలం ఉంటాయి. ఒక చేతిలో అభయముద్ర ఉంటుంది. ఈమె సింహవాహిని.
6.ఆరవ రూపం కాత్యాయిని. శ్రీకృష్ణుని పతిగా పొందాలని గోకులంలో గోపికలంతా యమునా నది తీరంలో ఈ దేవిని పూజించారు. నాలుగు భుజాలతో విలసిల్లే తల్లి. అభయముద్ర- వరముద్రలు కలిగి ఖడ్గము- పద్మం ధరించి ఉంటుంది.
7.కాళరాత్రి ఈ దేవికి ఏడవ రూపం. దేవి శరీరం చీకటి వలె నల్లగా ఉంటుంది. కావుననే కాళరాత్రి అను పేరు వచ్చింది. భయంకర రూపిణి. అయినా శుభములనిచ్చే శుభంకరిగా ఖ్యాతి పొందినది. నాలుగు భుజాలు కల్గినది. రెండు చేతులలో వర- అభయ ముద్రలు- మిగిలిన రెండు చేతులలో ఒక దానిలో ఇనుప ముళ్ళు కలిగిన ఆయుధం. ఖడ్గం ధరించి వుంటుంది. ఈమె వాహనం గాడిద.
8.దేవి ఎనిమిదవ రూపం మహాగౌరి. తెల్లని మేనిఛాయ. తెల్లని వస్త్భ్రారణాలు ధరించిన పార్వతి రూపమే మహాగౌరి. నాలుగు చేతులు అభయ, వర ముద్రలు- ఢమరుకం- త్రిశూలం ఆయుధాలు. వాహనం వృషభం.
చివరిదైన తొమ్మివది సిద్ధి ధాత్రి రూపం. అన్ని రకాల సిద్ధులను ఇచ్చే దేవిగాన సిద్ధి ధాత్రి అయినది. నాలుగు భుజాలు, మూడు చేతుల్లో శంఖ చక్ర గదలు, ఒక చేతిలో కమలం ఉంటాయి. ఈమె వాహనం నెమలి. ఈ దేవి ధ్యానించే వారు కమలంలో ఉన్నట్లు ధ్యానిస్తారు. దివ్య నైవేద్యాలు అర్పిస్తారు.
ఋగ్వేదంలో ఉపనిషత్తులో ఇలా ఉంది.
‘యస్యాః పరతరం నాస్తి- సైషా దుర్గా ప్రకీర్తితా’
ఎవరిని మించి ఏది లేదో ఆ శక్తియే దుర్గ. ఆ తల్లి రక్షణ విధాన స్వరూపాలే నవదర్గానామాలు అని బ్రహ్మ కీర్తించాడు. నవరాత్రి సమయంలో దేవి ఎదురుగా ఉండి దుర్గాస్తోత్రం పఠించినచో సర్వవాంఛలూ ఫలిస్తాయి. వింధ్యాచలవాసిని దుర్గ. ఈ దేవి 108 రూపాలదేవి. స్కంద పురాణంలో సహ్యాద్రి ఖండంలో దుర్గాదేవి విజయగాధలున్నాయి. చిచ్ఛక్తిరూపమైన కుండలినీ శక్తియే మహాశక్తియైన శ్రీ కనకదుర్గాదేవి. నవరాత్రులలో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే కోరికలీడేరి జన్మలు ధన్యవౌతాయి. నవరాత్రులలో అష్టమి రోజును దుర్గాష్టమి అని పిలిచి ఆ రోజున దుర్గను ఆరాధిస్తారు.
వేదవ్యాస మహర్షి దుర్గాదేవి ప్రభావాన్ని బ్రహ్మవైవర్త పురాణంలో వర్ణించాడు. ‘అమ్మలగన్న యమ్మ దుర్గమ్మ, త్రిశూలధారిణి, వ్యాఘ్రవాహిని’. మహాదుర్గను దుర్గామాతయని స్మరిస్తే జీవుల భయం పోగొడుతుంది జగన్మాత దుర్గ. మహాభారతంలో పాండవులు అమ్మదయతో అజ్ఞాతవాసాన్ని పూర్తిచేశారు. దేశంలో పరోక్షంగా 50 దుర్గాక్షేత్రాలున్నాయి. ఇవి సతీదేవివల్ల ఏర్పడిన అష్టాదశ శక్తిపీఠాలు ప్రసిద్ధమైనవి. వేద మంత్రాలలో దుర్గాసూక్తం ఖ్యాతిగాంచినది. మన రాష్ట్రంలో విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన తల్లి. కృష్ణవేణీ నదీ తీరంలో కొండపై నిండుగా వెలసిన దుర్గ అజేయశక్తి. విశ్వజనని. ఈ దేవిని అంతర్ముఖంగా ఆరాధించి తరించాలి. దుర్గ సర్వ సమగ్ర నామం. అమ్మవారి పూజను కుంకుమతో శ్రీచక్రార్చన- లలితా సహస్రనామంతో విశేషంగా జరుపుతారు. ప్రాచీన గాధననుసరించి కనక వర్షం కురిపించినది గాన కనకదుర్గగా ఖ్యాతిగాంచి జగతిలో పూజలందుకుంటున్నది.

-పి.వి.సీతారామమూర్తి