మెయన్ ఫీచర్

బురద అంటిన ‘పద్మం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రథమ భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కళా సాంస్కృతిక రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచినవారిని సత్కరించే నిమిత్తం సంగీత, సాహిత్య, నాటక అకాడమీలను కేంద్రంలో నెలకొల్పారు. ఇవి కాక పద్మ పురస్కారాలు, దాదా సాహబ్ ఫాల్కే సత్కారాలు, ఉత్తమ చలనచిత్రాలకు ఇచ్చే స్వర్ణ రజత కమలాలు కూడా వున్నాయి. వీటికి న్యాయమూర్తుల కమిటీ వుంటుంది. జ్యూరీ తీర్పు శిరోధార్యం. ఐతే జ్యూరీని నిర్ణయించే అధికారం మంత్రుల మీదే వుంటుంది. అంతేకాదు అకాడమీ అధ్యక్షులను నియమించే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి వుంటుంది.
నెహ్రూని ఫాబియన్ సోషలిస్టు అంటారు. అంటే ఆయన భారతదేశంలో రష్యా తరహా సమాజం రావాలని ఆశించాడు. దానికి ఆయన సోషలిస్టు పాటరన్ ఆఫ్ సొసైటీ అని పేరు పెట్టాడు. అందువల్ల కళా సాంస్కృతిక రంగాల్లో ఎక్కువగా గుడిసెలు-గోచీలు చూపే చిత్రాలకు, రచనలకు పురస్కారాలు వస్తూ వుండేవి. ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. నెహ్రూ తరువాత ఇందిరాగాంధీ కూడా ఇదే ధోరణిని కొనసాగించారు. 1964లో ‘శహర్ ఔర్ సప్నా’ అని ఒక హిందీ సినిమా వచ్చింది. అందులో బొంబాయిలో సిమెంటు పైపుల్లో నివసించే వారి జీవితం చిత్రీకరించబడింది. దీనికి స్వర్ణ కమలం లభించింది. ఇదే ధోరణి భారతరత్న వంటి అత్యుత్తమ పురస్కారాల విషయంలో కూడా జరిగింది. దాదాసాహెబ్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటివారి పేర్లను పక్కనపెట్టి నెహ్రూ ఇందిరాగాంధీలు తమకు తామే సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టు బిరుదులు పొందారు. 2014లో మొదటిసారి భారతీయ జనతాపార్టీ నేతృత్వంలో పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు కళా, సాంస్కృతిక రంగాల్లో వౌలిక పరిణామాలు వస్తాయని అంతా ఆశించారు. కానీ అలా జరగలేదు. కనీసం విద్యావ్యవస్థలో వెనుకటి ఎర్ర కళ్లద్దాల పాఠ్యాంశాలు తొలగించలేదు. ఎకాడమీలను ప్రక్షాళన చేయలేదు.
ఈ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వచ్చిందంటే గతవారం మహారాష్టల్రోని ధానే నగరంలో ఒక ఉగ్రవాదిని పోలీసులు పట్టుకున్నారు. అతని పేరు ఇక్బాల్ కస్కర్. ఇతడు స్వయంగా దావుద్ ఇబ్రహీం కస్కర్ సోదరుడు. 1993లో బొంబాయిలోని బాంబు పేలుళ్ల కేసులో ఇబ్రహీం కస్కర్ ప్రధాన సూత్రధారి. యాకుబ్ మెమెన్ పాత్రధారి. దాదాపు 257 మంది అమాయకులు అప్పుడు ప్రాణాలు కోల్పోయారు.
దావూద్ ఇబ్రహీం కస్కర్ పాకిస్తాన్‌లోని కరాచీలో దాక్కున్నాడు. ‘అతడు మావద్ద లేడు’ అని పాకిస్తాన్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది. ఐతే ఈ దినపత్రికలో ఇబ్రహీం కరాచీలో దాక్కున్న ఇంటినెంబరు ఫోన్ల నెంబరు కూడా లోగడ ఒక వ్యాసంలో సాక్ష్యాధారాలతో పేర్కొన్నాము. 2004లో రాజీవ్ శుక్లా పాకిస్తాన్ వెళ్లి దావూద్ ఇబ్రహీంతో మంతనాలు జరిపాడు. దావూద్ ఇబ్రహీం కరాచీ తరువాత ఒక హిల్ రిసార్టుకు తన బసను మార్చాడు. ఆయన భార్యతో కొందరు నేరుగా గుజరాత్‌నుండి ఫోనులో మాట్లాడారు. ప్రస్తుతం ఇబ్రహీం తీవ్రమైన జబ్బులతో హాస్పిటల్స్‌లో వున్నట్టు వార్త.
దావుద్ ఇబ్రహీంతో ఎవరెవరికి సంబంధాలున్నాయో విచారణ జరిగింది. అతడు షార్జా-దుబాయి వంటి చోట్ల జరిగిన క్రికెట్ మ్యాచ్‌లకు ప్రధాన ప్రేక్షకునిగా హాజరైనాడు. ఎన్నో మెమోరియల్ లెక్చర్స్ సెమినార్లకు వచ్చాడు. అతనితో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలున్న రాజకీయ నాయకులు, బాలీవుడ్ తారల పేర్లు, పారిశ్రామిక వేత్తల పేర్లు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి శరద్ పవార్ పేరు ఇంకా నలుగురు మంత్రుల పేర్లు, కొందరు ప్రముఖులైన బాలీవుడ్ నటుల పేర్లు, జర్నలిస్టుల పేర్లు వున్నాయి. దాదాపు 70 కోట్ల రూపాయలు దావూద్ ఇబ్రహీంనుండి వీరు ముడుపులు తీసుకున్నట్టు వెల్లడవుతున్నది. దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్ ఈ విషయాన్ని నిర్ధారించాడుకూడా.
1993లో జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి వొహరా కమిటీని విచారణకు నియమించారు. కమిటీ తన నివేదికను సమర్పించింది. దానిని గౌ.ఎం.వెంకయ్యనాయుడు 2015లో రాజ్యసభకు సమర్పించారు. ఐతే నివేదికలోని పేర్లు ఇప్పటివరకు బయటకు రాలేదు. అందుకు చాలా రాజకీయ కారణాలుండవచ్చు. మహారాష్టల్రో దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో ఏర్పడిన బిజెపి ప్రభుత్వాన్ని అనేక విధాలుగా శివసేన ఇరుకున పెడుతున్నది. ఈ ఇబ్బందులను అధిగమించే నిమిత్తం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎన్‌సిపి మద్దతును బిజెపి తీసుకోవాల్సిన అవసరం వుంది. అందుకు నాందీ ప్రస్తావనగా శరద్ పవార్‌కు పద్మవిభూషణ పురస్కారాన్ని ప్రకటించారు.
నిన్న నారాయణ రాణే అనే కాంగ్రెస్ పార్టీ నాయకుడ్ని బయటకు తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ ఇంకా బలహీనపరిచారు. ఇప్పుడు మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే పద్మ పురస్కారం ప్రకటించడానికి ముందు పోలీసు ఎంక్వయిరీ జరుగుతుంది. ‘ఇతడు సచ్చీలుడు-ఎట్టి కేసుల లేవు‘ అని రహస్య నిఘా విభాగంవారు నివేదిక ఇవ్వాలి. అలాంటివి ఏవీ లేకుండా శరద్‌పవార్‌కు పురస్కారం ఎలా ప్రకటించారు?
ఆంధ్రప్రదేశ్‌లో కూడా కోర్టుకేసులో వున్న వారిని పద్మాలు వరించాయి. అంటే కమలనాథుల కాలంలో కూడా పద్మాలకు బురద అంటిందని అర్థం. ఇందుకు కారణం ఏమిటి? ప్రతిభాపాటిల్ భారత రాష్టప్రతిగా వున్న కాలంలో పురస్కారాలు ప్రతిభకు కాక ‘ప్రతిభ’ గారి రాష్ట్రానికి వడ్డించుకున్నారని బహిరంగంగానే మీడియాలో ఆరోపణలు వచ్చాయి. లతామంగేష్కర్‌కు భారతరత్న వచ్చినపుడు ఆమెకు ఏమాత్రం తీసిపోని ఘంటసాల వేంకటేశ్వరరావు, జేసుదాసు, పి.సుశీల, మంగళంపల్లికి ఎందుకు రాలేదు? ఎస్.ఎం.కృష్ణ, బి.సరోజమ్మకు పద్మభూషణ్ ఇప్పించినపుడు అంజలి, సావిత్రి, జమున, ఎస్.వరలక్ష్మి, ఎస్.వి.రంగారావులకు కనీసం పద్మశ్రీ ఎందుకు రాలేదని ప్రేక్షకులు ప్రశ్నించడంలో న్యాయం వుంది.
‘బుల్లిరామయ్యనే కాదు పెద్దరామయ్య (ఎన్‌టిఆర్)ను కూడా ఓడిస్తాను’ అని ప్రగల్భాలు పలికినందుకు కేంద్రం కృష్ణకు పద్మ పురస్కారం ఇచ్చింది. ఢిల్లీలో కూర్చుని పైరవీలు చేసుకునే వారికే పురస్కారాలు ఇచ్చే దుష్ట సంప్రదాయానికి ముగింపు ఎప్పుడు?
ధోనీకి పద్మభూషణ్ పురస్కారం ఇవ్వాలని క్రికెట్ అసోసియేషన్ (2017) రికమెండేషన్ పంపింది. సచిన్ తెండూల్కర్‌కు భారతరత్న వచ్చినపుడు తక్కినవారికి పద్మశ్రీనైనా ఇవ్వకపోతే ఎలా మరి? రాజ్యసభ మెంబర్లుగా నామినేట్ చేయబడిన కళాకారులు, క్రీడాకారుల అటెండెన్స్ నిల్ అని ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది.
అవినీతి ఆరోపణలో బెంగళూరు జైలులో చిప్పకూడు తిన్న జయలలితకు భారతరత్న ఇవ్వాలని తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవం తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపింది. ఇప్పుడు మనం కేంద్రప్రభుత్వాన్ని అర్థించవలసింది ఒక్కటే! వొహరా కమిటీ నివేదికను పత్రికల ముందు విడుదల చేయండి. శరద్ పవార్‌కు ఇచ్చిన పద్మాన్ని వెనక్కు తీసుకోండి. మొన్న ఒక ఎన్‌సిపి నాయకుడు ఇలా అన్నాడు- ‘నిజమే మేము లోగడ దావూద్ నుండి డబ్బు తీసుకుని ఉండవచ్చు. ఐతే భారతదేశంలో స్మగ్లర్లనుండి ముడుపులు తీసుకోని ఒక పార్టీ పేరు చెప్పండి’ అని ఎదురు ప్రశ్న వేశాడు. ఐతే ఇది ముడుపుల ప్రశ్న కాదు. అలాంటి వారికి పద్మ పురస్కారాలు ఎలా ఇచ్చారనేదే ప్రశ్న. పోనీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం శరద్‌పవార్‌కు ఇచ్చిన పద్మ విభూషణ్ వెనక్కు తీసుకోగలదా?
పద్మ పురస్కారాలు, స్వర్ణ కమలాలు, సాహిత్య అకాడమీ అవార్డులలో కన్వీనర్లు చేస్తున్న అక్రమాల గురించి కేంధ్రం ఒక ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిర్ణయం దర్యాప్తు జరిపించగలదా? విద్యా, కళా, సాంస్కృతిక రంగాలను కమ్యూనిస్టుల కబంధ హస్తాలనుండి విముక్తం చేయడంలో ఈ మూడేళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అందుకే ఇటు పురస్కారాలు తీసుకోవడం అటు తిరస్కారాలు (ఎవార్డు వాపసీ) అనే నాటకం ఇటీవల నడిచింది.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్