మెయన్ ఫీచర్

వౌనసాక్షి మహా శత్రువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు సర్వోచ్ఛమైనది లోక్‌సభ- దానిపై పాక్ ఉగ్రవాదుల దాడికి వెనుక అఫ్జల్‌గురు ఉన్నాడు. అతగాడిపై సుదీర్ఘకాలంపాటు విచారణ జరిగింది. చివరికి నేరస్థుడని రుజువైన తర్వాత ఉరితీశారు. మరి ఇలాంటి సుదీర్ఘ ప్రకియ చైనా, రష్యా వంటి కమ్యూనిస్టు దేశాల్లో కాని అరేబియా, పాకిస్తాన్ వంటి మతరాజ్య దేశాల్లో కాని జరగదు. అఫ్జల్ గురును ఉరితీయకూడదంటూ సిపిఎం నేత సీతారాం ఏచూరి రక్తాక్షరాలతో రాష్టప్రతికి వినతిపత్రం సమర్పించాడు. ఎందుకు?
‘‘్భరత దేశాన్ని ముక్కలు చేయండి’’ అటూ 2016, ఫిబ్రవరి 9న న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చైనా, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఊరేగింపు జరిపితే ‘‘వీరికి వాక్‌స్వాతంత్య్రం ఉంది-ఆ మాత్రం దానికి అరెస్టు చేయా లా? నినాదాలిస్తే దేశద్రోహం అవుతుందా? పైగా రాజద్రోహం అనేది బ్రిటీషు వారు రూపొందించినది. దాన్ని ఇవ్వాళ ప్రజాస్వామ్యంలో ఎలా వర్తింపజేస్తారు?’’ అని సుప్రీంకోర్టు న్యాయవాదులే ప్రశ్నించారు. రాజ్యాంగంలోని 124వ అధికరణ ఉన్నదని తాత్కాలికంగా మరచిపోయినట్టు వారు నటించారు. ఇలాంటి సంఘటనలు ప్రపంచంలో మరే ఇతర దేశాల్లోనైనా జరుగుతాయా?
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అబేద్కర్ స్టడీ సెంటర్ ఉంది. అంబేద్కర్‌పై గౌరవంతో అక్కడి అధ్యయనాన్ని అంతా ప్రోత్సహిస్తారు. దీన్ని ఆసరా చేసుకొని చైనా ప్రేరేపిత ఉగ్రవాదులు ఇక్కడ తమ కార్యకలాపాలు మొదలుపెట్టారు. విజయ్‌మాల్యా అనే కింగ్‌ఫిషర్ విమానాల కంపెనీ యజమాని వెయ్యికోట్ల రూపాయల ఋణం బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాడు. ఖత్రోచీ అనే మరొక ఆయుధాల వ్యాపారిని అర్జున్ సింగ్ అనే కాంగ్రెస్ మంత్రి లోగడ సురక్షితంగా రాత్రికి రాత్రే ఇండియానుంచి తప్పించాడు. కారణం అతడు సోనియాగాంధీకి సన్నిహితుడు కావడమే. ఇలాంటి సంఘటనలు ఎలా జరిగాయి? రావెల కిశోర్‌బాబు తనయుడు సుశీల్ ఒక ముస్లిం యువతి లైంగిక వేధిపుల కేసులో పట్టుబడితే ఈ పిల్లవాడు అట్టడుగు వర్గాలకు చెందిన వాడు కాబట్టే కేసులను బనాయిస్తున్నారు అన్నారు. కాపులకు రిజర్వేషన్లు కావాలి అంటూ ముద్రగడ పద్మనాభం, ఈ ఏడాది జనవరిలో నిరాహార దీక్షకు కూర్చుంటే ఆయనకు మద్దతుగా కొందరు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగులబెట్టారు. పైగా ఈ పని చేసింది తాము కాదని, ‘ఎవరో అసాంఘికశక్తులు మాలో దూరాయ’ని అన్నారు.
భారతదేశంలో ఇలాంటి సంఘటనలు వేల సంఖ్యలో జరుగుతున్నాయి. వీటికి పోలీసులు కొన్ని సందర్భాల్లో స్పందిస్తారు. మరికొన్ని సందర్భాల్లో ఉన్నత రాజకీయ నాయకుల ప్రమేయం కారణంగా పట్టించుకోరు. చంద్రబాబు నాయుడు మీద పదేళ్ల క్రితం బాంబు దాడి చేసిన దామోదర్ అనే వ్యక్తిని సాక్ష్యాలు లేవని 2016లో విడుదల చేశారు. సల్మాన్ ఖాన్ ముంబయిలో 2004లో తాగి కారు డ్రైవ్ చేస్తే ఒకడు మరణించాడు. ఇందుకు తగిన సాక్ష్యాధారాలు లేవంటూ బోంబే హైకోర్టు కేసును కొట్టివేసింది. అంటే సాక్ష్యాధారాలు నీరుగార్చబడ్డాయని అర్థం. ఇదెలా జరిగింది?
విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే దారిలో నిడుమోలుకు సమీపంలో ఎలకుర్రు అనే కుగ్రామం ఉంది. అక్కడ కాశీనాథుని నాగేశ్వరరావుగారు ఉండేవారు. ఈ గ్రామానికి చెందిన ఆలయ ధర్మకర్తతో మాట్లాడుతున్నప్పుడు, సమీపంలోనే గుడారాలు వేసి సుభజనలు చేస్తుండటం గమనించాను. వీరిలో అట్టడుగు వర్గాలవారే కాకుండా, కాపులు, రెడ్లు,కమ్మలు కూడా ఉన్నారు. చాపకింద నీళ్లలా ఇక్కడ మతమార్పిడులు జరుగుతున్నాయి. దీనిపై ఆయన వ్యాఖ్యానిస్తూ, ‘హిందూ మతం తనని తాను రక్షించుకొంటుంది ఆన్నారు’. ఏదైనా ధర్మానికి గ్లాని కలిగినప్పుడు భగవానుడు తానే దిగివస్తానని హామీ ఇచ్చాడు కదా? ఇంక మనం చేవలసింది ఏముంది? అనేది ఇటువంటి వారి అభిప్రాయం కావచ్చు. ఇదే విశ్వాసం క్రైస్తవంలో కూడా ఉంది. దానినే మరనాథ అంటారు. అంటే క్రీస్తు మళ్లీ భూలోకమునకు వచ్చును అని అర్థం.
ఒక సిద్ధాంతం, తాత్వికత ఏదైనా సరే వ్యక్తిలోని కర్తృత్వ శక్తిని ప్రేరేపించేదిగా ఉండాలి. అంతేకాని నిద్రాణ స్థితిలోకి పం పేదిగా ఉండకూడదు. పరలోక వాంఛతో ఇహలోక సమస్యను నిర్లక్ష్యం చేయడం తత్వం అనిపించుకోదు. మనకు ప్రధానంగా తీవ్రవాదులు, విదేశీ దురాక్రమణ దారులు శత్రువులుగా కనిపిస్తున్నారు. కానీ వౌన సాక్షుల మాటేంటి? వీరంతా నిశ్శబ్ద శత్రువులు. వీరి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వీరిని ఎవరూ శత్రువులుగా పరిగణలోకి తీసుకోవడం లేదు. కారణం వీరు కనబడని శత్రువులు. చక్కగా గుడికి వెళ్లి పూజలు, దానాలు చేస్తారు. చీమకు బెల్లం, పాముకు పాలు పోస్తారు. వీరిలో కొందరి ఉనికి పక్కింటి వారికి కూడా తెలియదు. వీరినుండి ఎట్టి క్లిష్ట సమయంలోనూ, మనకెందుకులే అనే సమాధానం వస్తుంది.
భారతదేశంలో నాడు, నేడు ఎందరో మేధావులు సాధు పురుషులూ ఉన్నారు. ఐనా దేశం ఎందుకు పరాధీనమైంది? దాదాపు ఏడువందల సంవత్సరాలు విదేశీయుల చేత ఎలా పాలింపబడింది? అప్పుడు కవులు, కళాకారులు, పీఠాధిపతులు ఏం చేస్తున్నారు? అయితే దీనికి సమాధానం ఒక్కటే. సాత్వికులు ప్రశాంత జీవనాన్ని వాంఛిస్తారు. దేశంలో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే మనకెందుకులే! అని ఊరుకోవడమో, దేవుడే దిగివస్తాడులే అని సర్దుబాటు పడటమో జరుగుతున్నది. కాని రాజసిక తామసిక శక్తులు ఊరుకోవు. వారు నిరంతరం సక్రియాత్మకంగా ఉండటం మనం అనుభవంలో చూస్తున్నాము.
షీల్దా రషీద్ షోలా శ్రీనగర్‌కు చెందిన 27 సంవత్సరాల అమ్మాయి. ఈమె శ్రీనగర్, బెంగళూరు వంటి చోట్ల విద్యాభ్యాసం చేసింది. సాఫ్ట్‌వేర్ విద్య ముగించుకొని ఢిల్లీ జెఎన్‌యులో ఎంఫిల్ ‘లా’ పట్టంకోసం పరిశోధన మొదలుపెట్టింది. ఈ దశలోనే ఆమె విచ్ఛిన్నకర శక్తుల చేతిలో కీలుబొమ్మగా మారింది. ఏఐఎస్‌ఎఫ్ అనే కమ్యూనిస్టు పార్టీ అనుబంధ విద్యార్థి సంఘంలో సభ్యత్వం తీసుకుంది. అఫ్జల్ గురు, యాకుబ్ మెమెన్‌లను ఉరితీయడం తప్పని వాదించింది. ఈమె భారతదేశంలోని విశ్వవిద్యాలయాల్లో పర్యటిస్తోంది. అక్కడ చైనా అనుకూల వర్గాలను కూడగట్టి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తున్నదని అర్థం. జెఎన్‌యులో తనలాంటి వారు వందల సంఖ్యలో ఉన్నారని, ఏదో కారణం చూపి ఈ విశ్వవిద్యాలయాన్ని మూసివేయాలని ప్రభుత్వం చూస్తున్నదని గత మార్చి 13న ఆమె వివరించింది. ఇలాంటి వారు సక్రియాత్మకంగా దేశం మొత్తం ఎందుకోసం పర్యటించారు? కాశ్మీరును భారత్ నుంచి విడగొట్టడం కోసం! మరి మనదేశంలో సత్పురుషులు ఏం చేస్తున్నట్టు? షీలా రషీద్ చైతన్యాన్ని చూసి జాతీయవాదులు పాఠాలు, గుణపాఠాలు నేర్చుకోవాలి. అదే రోజున విప్లవకవి వరవరరావు, హైదాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ, నాగపూర్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ షోమాసేన్ పాల్గొన్నారు. వారి ప్రసంగ పాఠాలిలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం దేశంలో హిందూ భావజాలాన్ని ప్రవేశపెడున్నది. దీన్ని అంబేద్కర్, వామపక్ష భావజాలం వారు వ్యతిరేకించాలి. కెసిఆర్‌ది రాచరికపు పాలన. బూటకపుఎన్‌కౌంటర్లతో మావోయిస్టులను చంపుతున్నారు. స్ర్తిలకు దేశంలో సమానహక్కు లేదు. లౌకికవాదం పాటించడం లేదు. భూమికోసం పోరాడుతున్న ఆదివాసులను తీవ్రవాదులని చెప్పి చంపుతున్నారు. ఇలా సాగాయి ప్రసంగాలు. మరి పఠాన్‌కోటలో భారతీయ సైనికులను వీరు పొట్టన పెట్టుకుంటే ఇది తప్పు అని షీలా రషీద్, షోమాసేన్, కె. లక్ష్మీ నారాయణలు ఎందుకు అనలేదు?
ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన వారిలో సైనికులు మాత్రమే కాదు, వందలాది మంది ఆదివాసీలు కూడా ఉన్నారు. వీరిని పోలీసుల బంట్లు అని చెప్పి కాల్చి చంపారు. రాజ్యాంగం నుంచి ‘సెడిషన్’ (రాజద్రోహం) చట్టాన్ని ఎత్తివేయాలని షీలా రషీద్ ఉద్యమిస్తున్నది. కేరళలోని కన్నూరులో చంద్రశేఖరన్ అనే స్కూల్ టీచర్‌ను దేశభక్తుడు కాబట్టి క్లాసు రూమ్ నుంచి బయటకు లాక్కొచ్చి 50 సార్లు కత్తితో పొడిచి హత్య చేశారు. కన్నయ్యకుమార్‌ను, భట్టాచార్యను విడుదల చేయాలని ఆందోళన చేస్తున్నారు. మరి అదే సిపిఎం కార్యకర్తల చేతిలో దేశభక్తులు హతమైనప్పుడు ‘అయ్యోపాపం’ అనే సానుభూతిని కూడా ఎందుకు చూపడం లేదు?
మన పూర్వీకులు సూత్ర యజ్ఞాన్ని బ్రహ్మ యజ్ఞంగా భావించారు. ఖద్దరు ధరించడాన్ని అత్యంత పవిత్రమైనదని అనుకున్నారు. కాంగ్రెస్ సభ్యత్వం ఇంద్ర పదవికన్నా ఘనమైనదనుకున్నారు. అలాం టి పార్టీకి నేడు ఎంతటి దుర్గతి పట్టిందో చూశారుగా! ఇక కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ గత మార్చి 27న మాట్లాడుతూ, జెఎన్‌యులోని వామపక్ష విద్యార్థి నాయకుడిని భగత్‌సింగ్ వంటివాడు అన్నాడు. అంతేకాదు ‘‘కేరళ ముస్లింలీగ్ మంచి సామాజిక సంస్థ’’ అని కూడా కితాబిచ్చాడు.
అసదుద్దీన్ భారత్ మాతాకీ జై అనను అన్న తర్వాత దేశవ్యాప్తంగా చర్చ ఈ అంశంమీదకే మరలింది. దేశభక్తి, జాతీయవాదంపై భాజపా, విహెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్, మోదీ ప్రభుత్వాలకు గుత్త అధికారం లేదు. తామూ దేశభక్తులమే అంటున్నారు.
‘1945లో రష్యా మీదికి జర్మనీ, జపాన్ సైన్యాలు దండయాత్ర చేసినప్పుడు రష్యా సైనికులను సోషలిస్టు నినాదాలు ఉత్తేజ పరచలేదు. అందుకని రష్యన్ ప్రభుత్వం, తమ ప్రాచీన పుణ్యపురుషుల పేర్లు స్మరించి సైన్యంలో ఉత్తేజం నింపింది. అలాగే స్టాలిన్ తన దేశంలోని భిన్న రాష్ట్రాలు విడిపోకుండా, రష్యన్ జాతీయవాదాన్ని ప్రబోధించడం నిజం కాదా? 1962లో చైనా ఇండియా మీదకు దండయాత్ర జరిపినప్పుడు, మాకినేని బసవపున్నయ్య, ‘ఇండియాయే చైనాపై దండయాత్ర చేసింది’ అనడం నిజం కాదా? కామ్రెడ్ అత్యుతమీనన్, భారతసైనికులకు రక్తదానం చేయకండి అనడం, అందుకు ఆయనను పోలిట్ బ్యూరో నుంచి తప్పించడం నిజమా? కాదా?
ఒకటి మాత్రం నిజం. భాజపా తెలివిగా ప్రమాదాన్ని ప్రమోదంగా మలచుకుంది. అపాయాన్ని ఉపాయంగా సద్వినియోగం చేసుకున్నది. ఇందుకు 125 కోట్ల మంది నేషనలిజం అంటే ఏమిటి? కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఆర్‌జెడి వంటి పార్టీలు ఎంతవరకు జాతీయ వాదులు? అని అంతా లోతుగా చర్చిస్తున్నారు. ఇదే భాజపాకు కావలసింది!

- ముదిగొండ శివప్రసాద్