మెయిన్ ఫీచర్

దివ్య దీపావళి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపాన్ని ఆరాధించే సంస్కృతి మనది. జ్ఞానవెలుగుతో, సత్యానే్వషణతో జీవితాన్ని ఛరితార్థం చేసుకోవటం భారతీయులు అనుసరించే మార్గం. కనుకనే మన దేశంలో దీపారాధనను ప్రతి ఇంట్లోనూ చేస్తాం. అంతేకాదు, ఏ కార్యక్రమాన్నైనా దీపారాధనతో ప్రారంభిస్తాం. దీపారాధన ఒక యజ్ఞం- జీవిత యజ్ఞం. యజ్ఞానికి సూక్ష్మరూపం దీపారాధన, ‘ఆవళి’2 అంటే పంక్తి లేక వరుస అని అర్థం. కనుక దీప పంక్తి, దీపాల వరుసయే దీపావళి. ప్రబోధమనే ప్రమిదలో వైరాగ్యమనే తైలాన్ని పోసి అందులో భక్తి అనే వత్తిని వెలిగించి జ్వలింపచేస్తే అది విశ్వప్రేమను ప్రేరేపించి విశ్వకల్యాణానికి దోహదం చేస్తుంది. ‘‘నేను అస్తమించిన తరువాత నా పని నిర్వర్తించేది ఎవరు?2అని ప్రశ్నించాడు సాయంకాల సూర్యుడు.’’ ‘‘నేనా పని చేస్తాను’’2 అని బదులిచ్చింది చిన్న సంధ్యాదీపం, అని అన్నాడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. ఇవన్నీ దీపావళికి దీప్తినిస్తాయి. ఈ దివ్య దీపావళి మన అందరి జీవితాల్లో సరికొత్త ఉత్తేజానికి ఊపిరిగా నిలుస్తూ.. నవ శకానికి నాంది కావాలని ఆశిద్దాం.

అశ్వని నుంచి రేవతి వరకు ఇరువది ఏడు నక్షత్రాలు. రవ్వాది నవగ్రహములు వాటికి అధిపతులు. అందులో కృత్తిక, ఉత్తర ఉత్తరాషాఢ నత్రములకు అధిపతి రవి. కృత్తికా నక్షత్రంలో వచ్చిన పౌర్ణమిగల మాసం- కార్తీకమాసం. కృత్తిక అగ్ని సంబంధమైన నక్షత్రం. అగ్నిర్నః సాతు కృత్తికాః2. కనుక కార్తీక మాసమంతా అగ్ని ఆరాధనకు శ్రేష్ఠమైనది. అగ్ని ఆరాధన అంటే దీపారాధన.
‘‘ఉత్తిష్ఠత మాస్వప్త అగ్ని మిచ్ఛ్ధ్వం భారతాః’’2
భారతీయులారా లేవండి, సావధానంగా ఉండండి, ఉత్తేజంగా ఉండండి. నిద్రమత్తును వీడండి, అగ్నిని ఆరాధించండి అన్నది వేదం. అగ్ని ఆరాధనకు ప్రతీకయే దీపారాధన. అంతేకాదు ‘్భ’2 అంటే కాంతి, వెలుగు, దీప్తి. అగ్ని, దీపము అనే అర్థాలున్నాయి. అగ్నిని అనగా దీపాన్ని ఆరాధించేవారు భారతీయులు. జ్ఞానవెలుగును అనగా సత్యానే్వషణతో జీవితాన్ని చరితార్థత నొందించుకునేవారు- భారతీయులు. కనుకనే మన దేశంలో దీపారాధనను ప్రతి ఇంట్లోనూ చేస్తాం. అంతేకాదు, ఏ కార్యక్రమాన్నైనా దీపారాధనతో ప్రారంభిస్తాం. దీపారాధన ఒక యజ్ఞం- జీవిత యజ్ఞం. యజ్ఞానికి సూక్ష్మరూపం దీపారాధన, ‘ఆవళి’2 అంటే పంక్తి లేక వరుస అని అర్థం. కనుక దీప పంక్తి, దీపముల వరుసయే - దీపావళి.
వేద శబ్దావళియే..
‘‘అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ’’. అసత్యం నుండి సత్యం, చీకటినుండి వెలుగును, అజ్ఞానం నుండి జ్ఞానమును, మృత్యువునుండి అమృతత్త్వమును నాకు కలిగించమని ప్రార్థన. ఈ జ్ఞానదీపాన్ని, ఈ విశ్వానికి మొదట ఇచ్చింది వేద శబ్దములు. వేద శబ్దావళియే- దీపావళి.
జీవావళియే..
ఆధిభౌతికం, ఆధ్యాత్మిక, ఆధిదైవిక అర్థాల్ని పరిశీలిద్దాం. ఆధిభౌతికంగా గృహములలోని దీపం, ఆధ్యాత్మికంగా జీవ చైతన్య రూప దీపం. ఆధిదైవికంగా పరంజ్యోతి స్వరూపుడైన పరమేశ్వర రూప మహాగ్ని రూప మహాదీపం. ఆధ్యాత్మికంగా పరిశీలిస్తే లోకములోని జీవులందరూ దీపములే. కనుక జీవావళియే దీపావళి.
లలితా సహస్రనామంలో ..
స్ర్తిల పాతివ్రత్యాగ్నియే దీపం. స్ర్తిలు గృహమును, చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రకాశింపజేయు సామర్థ్యంగల దీపములే. పాతివ్రత్యము అగ్నివంటిది. మహాదీపమే. అందుకే ‘ఇంటికి దీపం ఇల్లాలే’2 అన్నారు. అటువంటి పతివ్రతా మహిళలే నిజమైన దీపాలు. ఆ దీపములే ఈ విశ్వాసానికి నిజమైన దీపాలు. ‘‘నిజ భర్తృ ముఖాంభోజ చింతనాయై నమో నమః’’2- సదా భర్త ముఖార వింద ధ్యానముచే తన పాతివ్రత్యముచే భర్తను స్వాధీనము గావించుకొని ‘‘శివా స్వాధీన వల్లభా2గా వెలుగొందుతోంది జగన్మాత’’ అని పేర్కొన్నది- లలితా సహస్రనామం. ఇది దీపావళికి స్ఫూర్తినిస్తుంది.
దీప పదానికి వ్యుత్పత్తి
దీపావళి గురించి వివిధ భావాల్ని చెప్పుకున్నాం. ఇప్పుడు దీప పదానికి వ్యుత్పత్యర్థం తెలిసికొందాం. ‘దీప్యతే అనేన2 అని వ్యుత్పత్తి.’’ దేని చేత సమస్తం ప్రకాశింపచేయబడునో దానికి దీపమని పేరు. పరమాత్మ లేకపోతే జగత్తు లేదు. కనుక పరమాత్మ ప్రధమ అనగా మొట్టమొదటి దీపం. ‘‘న తత్ర సూర్యోభాతి న చంద్ర తారకమ్ యస్య భాసా సర్వమిదం విభాతి’’2 ఆ పరమేశ్వర దీపంతోనే ఈ ప్రపంచము, సూర్య చంద్ర నక్షత్రాదులు ప్రకాశిస్తున్నాయి. కనుక సూర్య చంద్ర నక్షత్రాలు కూడా దీపాలే. దీనే్న శ్రుతి ‘‘వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమసః పరస్తోత్’’..2 చీకటిని పారద్రోలుతూ, మనకు వెలుగునిచ్చే ఆదిత్య స్వరూపుడు పరమాత్మ. ఆయనే మొదటి దీపం అని పేర్కొన్నది మంత్రపుష్పం. ఆ వెలుగే మన శరీరంలో అగ్నిజ్వాలగా అణువుకన్నా సూక్ష్మంగా ఉంటుందని చెప్పింది. లోవెలుగును బాహ్యంగా దర్శించటానికే దీపారాధన. దీపాలను వరుసగా పెట్టే రోజు ఆశ్వయుజ అమావాస్య సాయంత్రం, సంధ్యా సమయం- అదే దీపావళి. దీపం జ్యోతి పరబ్రహ్మదీపం సర్వత మోపహరం, దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుతే.
దీప్తినిచ్చేవి..
శ్రీరాఘవం దశరధాత్మజ మప్రమేయం, సీతాపతిం రఘులాన్వయ రత్నదీపం2 అని రఘు కులానికే దీపముగా శ్లాఘింపబడుతున్నాడు శ్రీరామచంద్రుడు. ‘‘దానే భూత సమస్త దేవ వనితాం లోకైక ‘దీపాం2కురాం’’2 అంటూ జగన్మాతను మొదటి దీపముగా పేర్కొన్నారు. ‘‘జయ జయ వైష్ణవి దుర్గే పార్వతి లోకైక ‘దీపే’’2 అని కీర్తించాడు, నారాయణతీర్థులు శ్రీకృష్ణలీలా తరంగిణిలో.
మనిషిలోని ఈర్ష్య, అసూయ ద్వేషం, స్వార్థం, అధర్మం అవినీతి అనేవి- ‘చీకటి’. ప్రేమ, మంచితనం సప్రవర్తన ధర్మం అనేవి ‘వెలుగు’. చీకటిని తొలగించి జ్ఞాన వెలుగునిచ్చి జీవితానికి చైతన్యదీప్తినిచ్చే వెలుగుల పండుగ - దీపావళి.
ప్రబోధమనే ప్రమిదలో వైరాగ్యమనే తైలాన్ని పోసి అందులో భక్తి అనే వత్తిని వెలిగించి జ్వలింపచేస్తే అది విశ్వప్రేమను ప్రేరేపించి విశ్వకల్యాణానికి దోహదం చేస్తుంది. ఇదే దీపాల పండుగ దీపావళికి స్ఫూర్తిదీప్తి.
‘‘నేను అస్తమించిన తరువాత నా పని నిర్వర్తించేది ఎవరు? అని ప్రశ్నించాడు సాయంకాల సూర్యుడు.’’ ‘‘నేనా పని చేస్తాను’’2 అని బదులిచ్చింది చిన్న సంధ్యాదీపం, అని అన్నాడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. ఇవన్నీ దీపావళికి దీప్తినిస్తాయి.
పితృదేవతలకు తర్పణాలు
సూర్యుడు తులారాశిలో ఉండగా వచ్చే దీపావళి అమావాస్యనాడు పితృతర్పణాలు యిస్తే, వారికి ఉత్తమ లోకప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు పేర్కొన్నాయి. ఇది తల్లిదండ్రులు లేనివారికి మాత్రమే. వారు జీవించి ఉండగా చేయకూడదు.
దీపోత్సవం
దీపావళి అంటే దీపోత్సవమే. ఈ రోజు దీప లక్ష్మి చీకట్లను పారద్రోలి జగత్తును తేజోవంతం చేస్తుంది. త్రిమాతా స్వరూపిణి అయిన మహాలక్ష్మీ దేవికి సంధ్యా సమయంలో స్వాగతం చెప్పి సర్వదా తమ ఇళ్ళలో కొలువుతీరమని ముంగిళ్ళలో దీపాలు వరుసగా పెట్టి దివ్య తేజస్సును పొందే హిరణ్మయ (బంగారు) పండుగ దీపావళి.
ఆధ్యాత్మికతే అనుసరణీయం
జీవనం పావనం కావాలంటే, ధర్మబద్ధమైన మనుగడ కావాలి, మానవునికి. పరమాత్మ ఏకైక అఖండ ప్రకాశ స్వరూపుడన్నారు శ్రీ శంకర భగవత్పాదులు. ఆ వెలుగును దర్శించటానికి నిరంతర కృషి చేయాలని చెప్పేది- దీపావళి. ‘‘పెంజీకటి కవ్వల ఎవ్వండేకాకృతి వెలుంగు అతనినే సేవింతున్’’22 అన్న పోతనగారి భాగవతంలోని పద్యం దీపావళికి స్ఫూర్తి. సర్వమానవ సౌభ్రాతృతతో విశ్వ మానవ కల్యాణాన్ని వీక్షించే ‘వెలు గు’ను పొందాలని, మానవాళికి దివ్య సందేశాన్నిస్తోంది దీపావళి.

వెలుగు వేడుక అంతరార్థం

ప్రాగ్జోతిషపురాన్ని రాజధానిగా చేసికొని లోకకంటకుడైన నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజాపీడనంగా రాజ్యమేలుతున్నాడు. శ్రీమహావిష్ణువు వరాహావతారమెత్తినప్పుడు, ఆయనకు భూదేవికీ సాంగత్యమేర్పడుతుంది. ఆ సమాగమ ఫలితమే ఈ నరకాసురుడు. బ్రహ్మను గూర్చి కఠోర తపస్సు చేసి దారుణమైన వరాలు పొందాడు. వర గర్వంతో దేవతలను, మునులను, శిష్టుల్ని అందరినీ చిత్రహింసలు పెట్టాడు. ఒకనాడు వశిష్ఠ మహర్షి ప్రాగ్జోతిషపురంలోని కామాఖ్యదేవిని పూజించటానికి వెడుతుంటే, ఆలయ తలుపులు మూయించాడు, నరకుడు. దానికి కోపించిన వశిష్ఠుడు ‘‘నీ జన్మదాత చేతిలోనే మరణిస్తావు’’22 అని శపించాడు. కృష్ణావతారంలో, భూదేవి అంశ అయిన సత్యభామతో కూడి వచ్చి యుద్ధరంగంలో నరకుడిని సంహరించాడు. చీకటి తొలగిపోయింది. నరక చతుర్థశి మరునాడు వెలుగుల పండుగ దీపావళి. ‘‘గాన మూర్తే, శ్రీకృష్ణ వేణుగానలోల త్రిభువనపాల నరకాంతక అల ధ్యానత త్యాగరాజు’’2 అన్న సద్గురు త్యాగరాజస్వామి కీర్తన, నరకచతుర్దశి, దీపావళి పండుగకు స్ఫూర్తినిస్తుంది.
ఈ నేపథ్యానికి అంతరార్థమేమిటి? అజ్ఞానమనే అంధకారానికి సంకేతమే నరకుడు. ‘నరీయతే ఇతి నరః.’ ముక్తి లభించేవరకు వదలని తత్వం- జీవభావం. జీవుడు నరుడైతే, జీవుడికి ఉన్న అజ్ఞానం- నరకుడు, ఇదే అసుర. స్వరూపంతో రాజిల్లేది సుర, అంటే జ్ఞానం. అది లేకపోతే అసుర. అజ్ఞానమున్న నరుడు- అసురుడు. ప్రాగ్జోతిషమే నివాసస్థానం. ప్రాక్కంటే ఏమిటి? ప్రాచీనం ఏమిటి దీనర్థం? పురాతనం నుంచీ మనలో ఆత్మ చైతన్య జ్యోతి ఉంది. ఎప్పుడూ ఉంటుంది. దాన్ని గుర్తిస్తే మనలో అసుర భావనలు నశిస్తాయి. మానవతా విలువలు తెలుస్తాయి. దైవతత్త్వం అంకురిస్తుంది. ఆ వెలుగు జ్యోతకమవుతుంది. అది లేకపోతే అసురతత్త్వంతో నరకాసురులం. మాయను జయించి మనస్సును స్వాధీనంలో ఉంచుకొన్న యోగీశ్వరుడు, పూర్ణ పుణ్యావతారుడు- శ్రీకృష్ణుడు. అధర్మ సామ్రాజ్యాన్ని అణచివేసి, ధర్మానికి పట్టం కట్టడానికి అవతరించి, అర్జునుని నిమిత్తంగా చేసి గీతాసారాన్ని బోధించి జీవనగతిని నిర్దేశించి హంసల ఆధ్యాత్మిక చిరు శబ్దాలు అందెల రవళులు కాగా, విశ్వమోహన వేణుగానంతో జీవన గీతాన్ని సుమనోహరంగా గానం చేయించి జీవిత పరమార్థాన్ని బోధించిన ఆచార్యుడు శ్రీకృష్ణుడు.
సత్యభామంటే? సత్యమైన భా- సత్యభా. ‘్భ’2 అంటే వెలుగని చెప్పుకున్నాం. శాశ్వతమైన చైతన్యదీప్తి. అదే పరమాత్మకు నిత్యసిద్ధమైన సంపద. ఆ యోగమాయా ప్రభావంతో దండెత్తి వచ్చాడు శ్రీకృష్ణుడు. భూదేవి అంశయే సత్యభామ. ‘‘వీర శృంగార భయ రౌద్ర విస్మయములు కలిసి భామినియయ్యెనో యనగ’’ సత్యభామ రూపమున్నదని, ఏనాటికీ మరిచిపోలేని సత్య స్వరూపాన్ని మన కళ్ళముందుంచాడు సహజ కవి పోతన. నరకుని బాణాలు సత్యభామకు పుష్పమాలాంకారాలుగా మారాయని వర్ణించాడు- నాచన సోముడు. నరకునిలో పాతుకుపోయిన అసుర (రాక్షస) గుణాలను తుడిచివేశారు.

పసుమర్తి కామేశ్వర శర్మ 9440737464