మెయన్ ఫీచర్

భావ స్వాతంత్య్రానికి విచిత్ర భాష్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైశ్యులను నిందిస్తూ కంచ ఐలయ్య అనే విద్వేషకారుడు వ్రాసిన పుస్తకాన్ని నిషేధించడానికి సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించకపోవడం విస్మయకర విపరిణామం! ఆ పుస్తకాన్ని నిషేధించడంవల్ల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం వాటిల్లగలదన్నది సర్వోన్నత న్యాయ నిర్థారణ! సర్వోన్నత న్యాయస్థానం తీర్పు దేశ ప్రజలకు శిరోధార్యం. అందువల్ల ‘సామాజిక స్మగ్లర్లు కోమట్లు’ అన్న ఐలయ్య పుస్తకం చెలామణిలో ఉంటుంది. కాని భావోద్వేగాలకు గురికావడం అనుభూతులకు లోనుకావడం మానవ సహజ లక్షణం. అందువల్ల ఈ సహజ ప్రతిస్పందనకు జనం గురికాకుండా ఎవ్వరూ నిరోధించలేరు. సహజ ప్రతిస్పందన ఆవిష్కృతం కావడంవల్ల ఆవిష్కరించినవారు న్యాయ ధిక్కారానికి పాల్పడినట్టు కాదు.. సర్వోన్నత న్యాయ నిర్ణయాలు జనాన్ని వ్యతిరేక అనుభూతులకు గురి చేసినపుడు, ఇలా గురయిన వారు న్యాయాన్ని ధిక్కరించినట్టు కాజాలదు! ఐలయ్య, ఐలయ్య వంటివారు ఇలాంటి చెడు వ్రాతలను వ్రాయడం ఆశ్చర్యం కాదు. వారు వివిధ వృత్తులవారిని, సామాజిక జన సముదాయాలను నీచంగా నిందించడం ఏళ్ల తరబడి కొనసాగుతున్న ప్రహసనం! ‘‘పటం ఛింద్యాత్, ఘటం భింద్యాత్, కుర్యాత్ వా గార్ద్భస్వరం, యేనకేనపి ఉపాయేన ప్రసిద్ధః పురుషోభవేత్..’’- పటాన్ని లేదా వస్త్రాన్ని చింపవచ్చు, కుండను పగుల కొట్టవచ్చు, గాడిదవలె ఓండ్ర పెట్టవచ్చు, ఏదో ఒక ఉపాయం చేత మానవుడు ప్రసిద్ధిని పొందాలి- అన్నది తరతరాల అవకాశవాదం. వెలుగు అనాదిగా ఉంది, చీకటి కూడా సమాంతరంగా కొనసాగుతోంది. వెలుగు సహజం, చీకటి అపవాదం. వైవిధ్యాల మధ్య సమన్వయం సహజం, వైవిధ్యాల మధ్య వైరుధ్యాన్ని కల్పించడం అపవాదం. ఈ ‘అపవాద’ కూటమికి చెందిన అవకాశవాదులు వైరుధ్య విషాన్ని వెళ్లగక్కడం ఆశ్చర్యం కాదు. కాని ఇలా ఒక ప్రధాన వృత్తిని నిర్వహిస్తున్న సామాజిక జన సముదాయంపై విద్వేషాన్ని వెళ్లగక్కడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగమని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పడమే విచిత్రం. అంటే ఇతరులను ఎవరినైనా నీచంగా నిందిస్తూ ఎవ్వరైనా పుస్తకాలు వ్రాయవచ్చునన్నమాట!
ఒక సామాజిక జన సముదాయాన్ని కాని, వృత్తివారిని కాని, మత వర్గాన్ని కాని, భాషా సమూహాన్ని కాని, ప్రాంతీయ ప్రాదేశిక విభాగంవారిని కాని నిందించడం, రెచ్చగొట్టడం రాజ్యాంగ విరుద్ధం. ఈ సంగతిని సర్వోన్నత న్యాయస్థానం గతంలో అనేకసార్లు సృష్టించేసి ఉంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇలా రెచ్చగొట్టే వ్యతిరేక ప్రసంగాలు చేసిన అభ్యర్థుల ఎన్నిక రద్దవుతుందని కూడా చట్టం నిర్దేశిస్తోంది. ఎన్నికలు సమాజ జీవన ప్రస్థానంలో తాత్కాలిక ఘట్టాలు. నిత్య జీవన వ్యవహారం నిరంతరం ఉంటోంది. అందువల్ల ఎన్నికలలో ఒక జన సముదాయాన్ని నిందించడంకంటే రెచ్చగొట్టడం కంటే నిత్య జీవన వ్యవహారంలో ‘ఇలా’ చేయడం మరింత విస్తృతమైన ప్రమాదం! కంచ ఐలయ్య తన ‘తిట్ల’ ద్వారా ఈ విస్తృత ప్రమాదాన్ని కల్పించడానికి యత్నిస్తున్నాడు! ఈ పుస్తక రచన ద్వారా ఐలయ్య ఒక సామాజిక జన సముదాయానికి వ్యతిరేకంగా ఇతర జన సముదాయాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం లేదా?? ఇలా యత్నించడం ‘స్వేచ్ఛ’ ఎలా అవుతుంది! ‘‘మనోవాక్కాయ కర్మల చేత తనకు నచ్చిన విధంగాను, ఇతరులకు భంగం కలుగని రీతిలోను వ్యవహరించడం స్వేచ్ఛ..’’ అన్నది అంతర్జాతీయంగా సామాజిక, రాజనీతి శాస్తవ్రేత్తలు ప్రచారం చేస్తున్న సూత్రం. అందువల్ల తనకు నచ్చిన విధంగా వ్యవహరించడం, మాట్లాడడం, వ్రాయడం, తినడం, తిరగడం ‘స్వేచ్ఛ’లో సగం మాత్రమే.. మిగిలిన సగం ‘‘ఇతరులకు భంగం కలిగించకపోవడం’’! కంచ ఐలయ్య పుస్తకం ద్వారా వైశ్యుల మనోభావాలకు, వాస్తవాలకు తీవ్రమైన విఘాతం కలిగింది! ఇలా కలిగించడం స్వేచ్ఛ ఎలా అవుతుంది? అందువల్ల సర్వోన్నత న్యాయస్థానం గతంలో చేసిన నిర్థారణలకు ప్రస్తుత నిర్ణయం విరుద్ధంగా ఉందన్నది సహజంగా జన మానస సీమలో ప్రస్ఫుటిస్తున్న భావం! ‘్భవ వ్యక్తీకరణ’ అని అంటే విచ్చలవిడిగా ఇతరులను తిట్టడం కాదన్నది రాజ్యాంగపు పంతొమ్మిదవ అధికరణం స్ఫూర్తి.. భావ వ్యక్తీకరణకు హేతుబద్ధమైన పరిమితులు- రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయని ఈ అధికరణంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ పరిమితులను ఐలయ్య ఉల్లంఘించాడన్నది అతగాడు తన పుస్తకానికి పెట్టిన పేరు వల్లనే స్పష్టమైంది.
కింది స్థాయి న్యాయస్థానాలు తీర్పులివ్వడంలో పొరపాట్లు చేసినపుడు వాటిని సర్వోన్నత న్యాయస్థానం సరిచేయగలదు. కానీ సర్వోన్నత న్యాయస్థానం తీర్పులివ్వడంలో చేసిన పొరపాట్లను దిద్దేందుకు వీలులేదు. ఆ తీర్పును పాటించక తప్పదు. తమ పొరపాట్లను సర్వోన్నత న్యాయస్థానం వారు మళ్లీ దిద్దుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి! అందువల్ల ‘కంచ’వారి పుస్తకం గురించి ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టు సమీక్షించుకుంటే అది సమాజంలో సమన్వయాన్ని పెంపొందించగలదు. సర్వోన్నత న్యాయ నిర్ణయాలను పార్లమెంటులో చట్టాలను చేయడం ద్వారా, రాజ్యాంగానికి సవరణలు చేయడం ద్వారా ప్రభుత్వాలు అనేక సందర్భాలలో వమ్ము చేయగలిగాయి. జాతీయ మహాపథాలకు ఇరువైపులా ఉన్న మద్యం దుకాణాలను మూసివేయాలన్న సర్వోన్నత న్యాయ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ‘‘విజయవంతంగా వమ్ముచేయగలగడం’’ ప్రస్తుతం కొనసాగుతున్న ప్రహసనం! కానీ కంచ ఐలయ్య పుస్తకం విషయం ప్రభుత్వాలకు ఇలాంటి శ్రద్ధ ఉండదు.. గత ఏడాది జనవరి 27వ తేదీన అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్‌కు సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన ‘ఆదేశం’ రాజ్యాంగ విరుద్ధమన్న వాస్తవాన్ని ఐదు రోజుల తరువాత సర్వోన్నత న్యాయస్థానమే అంగీకరించడం ‘‘ప్రమాదో ధీమతాం అపి..’’ ధీమంతులు సైతం పొరపాట్లు చేయవచ్చు. అన్న వాస్తవానికి ఒక ఉదాహరణ మాత్రమే! ఉదాహరణలు ఇంకా ఉన్నాయి. కానీ ‘అరుణాచల్’ గవర్నర్ విషయంలో సర్వోన్నత న్యాయస్థానంవారు తమ తీర్పును సమీక్షించారు కాబట్టి సరిపోయింది. సమీక్ష జరగకపోయి ఉంటే ‘తప్పు’ ‘ఒప్పు’గా వ్యవస్థీకృతమైపోయేది! ఇలా సమీక్ష జరుగవలసిన సర్వోన్నత న్యాయ నిర్ణయాలు ఇంకా ఉన్నాయి.. అది విషయాంతరం!
కంచ ఐలయ్య వ్రాసిన విషగ్రంథాన్ని చెలామణిలో ఉండడానికి వీలు కల్పించడం ద్వారా సర్వోన్నత న్యాయస్థానం వైశ్యులకు మేలే చేసిందన్నది న్యాయ ప్రక్రియలోని మరో అంశం. సర్వోన్నత న్యాయస్థానంవారు ఆ పుస్తకంలోని వివరాలు చట్టవ్యతిరేకమైనవా? కాదా? అన్న విషయమై చర్చించలేదు, వాటిపై తీర్పు చెప్పలేదు. పుస్తకాలను చెలామణి కాకుండా నిషేధించడం స్వేచ్ఛా సిద్ధాంతానికి భంగకరం మాత్రమేనని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఇపుడు కంచ ఐలయ్య పుస్తకంలోని విషయాలు వాస్తవాలకు విరుద్ధమని, తమ ప్రతిష్ఠకు భంగకరమని భావించేవారు ఆయనకు వ్యతిరేకంగా పరువు నష్టం ‘దావా’లు వేయడానికి వీలుంది, నేరాభియోగాలను దాఖలు చేయడానికి వీలుంది! పౌర వివాదం- సివిల్ సూట్- న్యాయస్థానంలో దాఖలు చేసి అతగాడినుండి నష్టపరిహారం కోరవచ్చు, అవమానపరచిన నేరానికి అభియోగం దాఖలు చేసి అతగాడిని శిక్షించాలని న్యాయస్థానాలను అభ్యర్థించవచ్చు! పుస్తకం నిషిద్ధమై ఉంటే ‘దావాల’నుంచి ‘అభియోగాల’నుంచి ఐలయ్య విముక్తమైపోయి ఉండేవాడు! ఐలయ్యకు వ్యతిరేకంగా బాధితులు పరువు నష్టం దావాలను వేయడానికి కాని, అభియోగాలను దాఖలు చేయడానికి కాని సర్వోన్నత న్యాయస్థానం ఆయన పుస్తకాన్ని నిషేధించకపోవడం అవరోధం కాదు.. న్యాయశాస్త్ర నిపుణులు చెపుతున్న మాట ఇది..
ఐలయ్య ఇలా వైశ్యులను మొత్తం సమష్టిగా కించపరచడం కేవలం ఒక సామాజిక జన సముదాయానికి సంబంధించిన వ్యవహారం కాదు, జాతీయ సమాజ నిహిత సమన్వయానికి సామరస్యానికి విఘాతమైన విద్వేష కలాపం ఇది. జాతీయ సమాజంలోని ఏ ‘జనసముదాయాన్ని’ ఎవ్వరు నిందించినప్పటికీ అది మొత్తం జాతిని నిందించినట్టు మాత్రమే అవుతోంది. ‘కన్ను’ను తిట్టినా, ‘కాలు’ను తిట్టినా ‘హస్తాన్ని’ దూషించినా, ‘పాదాన్ని’ దూషించినా మొత్తం శరీరాన్ని నిందించినట్టు- అనేది వైయక్తిక జీవన వాస్తవం! ఏ వృత్తివారిని దుయ్యబట్టినప్పటికీ మొత్తం జాతీయ సమాజాన్ని నిందించినట్టు అవుతోంది! హైందవ జాతీయ సమాజంలోని అనాది వృత్తులు జీవన వ్యవస్థలో భాగం! ‘వ్యవస్థ’లో ‘వివక్ష’ లేదు. వైవిధ్యాలమధ్య వైరుధ్యం లేదు. స్వరూప వైవిధ్యాలమధ్య స్వభావ ఏకత్వం నిహితమై ఉండడం సృష్టిగత వ్యవస్థ! సృష్టిగత వ్యవస్థను సమాజ స్థితంగా మలచుకున్న హైందవ జాతి వైవిధ్యాలకు ఆలవాలమైంది. వైవిధ్యాలను పరస్పర వైరుధ్యాలుగా చిత్రీకరించి భారత దేశాన్ని శాశ్వతంగా బలహీనపరచడానికి బ్రిటన్ సామ్రాజ్యవాదులు క్రీస్తుశకం 1947 వరకు కుట్రను కొనసాగించారు. కంచ ఐలయ్యలు ఈ కుట్రను కొనసాగిస్తున్న సామ్రాజ్యవాద భావదాస్యగ్రస్తులు, విద్వేష విధానానికి వారసులు...
శ్రమజీవనం హైందవ జాతీయ వ్యవస్థలోని వృత్తుల స్వరూప సౌందర్యం! సమాజ సమష్టిహితం అన్ని వృత్తుల స్వభావ ఏకత్వం! చెప్పులు కుట్టే చర్మకారుడు నిరంతర ప్రగతి ప్రస్థానం సాగిస్తున్న సమాజ పాదాలకు ‘రక్షణ’ను సమకూర్చుతున్నాడు. నిర్నిద్రలోచనుడైన సైనికుడు దేశ సరిహద్దులను సంరక్షిస్తున్నాడు. జనం నిశ్చింతగా నిద్రపోవడానికి వీలు కల్పిస్తున్నాడు. భూమిని పండిస్తున్న కాపు అందరికీ అన్నాన్ని ప్రసాదించగలుగుతున్నాడు! ఆవులను పాడి పశువులను పోషిస్తున్న గోపాలుడు ‘అమృతం’తో సమాజాన్ని అభిషేకిస్తున్నాడు. తిండిని, మానవుని విలక్షణ జీవన యాత్రకు అవసరమైన సకల సామగ్రిని ఉత్పత్తి స్థానం నుండి వినియోగ గృహ ప్రాంగణాలకు చేరవేస్తున్న వాణిజ్యకారుడు ‘పంపిణీ’కి సజీవ స్వరూపం! ఇతర జంతువుల కంటె విలక్షణుడిగా మానవుడు రూపొందడానికి జీవించడానికి వీలైన ‘సంస్కారాల’ను ప్రచారం చేస్తున్న ప్రవర్థమానం చేస్తన్న పండితుడు అక్షయ భావాలకు అక్షరరూపం ఇస్తున్నాడు. ఇలా అన్ని వృత్తులవారు సమాజ సమష్టి హితం కోసం అనివార్యమైన ‘శ్రమ’ను విభజించుకొని నిరంతర శ్రమ జీవనులు కావడం భారత జాతీయ వ్యవస్థ.. వర్ణాల స్వరూపంలో వైవిధ్యం ఉన్నప్పటికీ అన్ని వర్ణాలు ఒకే సూర్య కిరణంలో నిహితం కావడం సృష్టి.. వృత్తుల స్వరూపంలో వైవిధ్యం ఉన్నప్పటికీ ఒకే ‘కర్మయోగం’లో వృత్తులన్నీ నిహితమై ఉండడం సమాజం! సృష్టిలోకాని సమాజంలో కాని వైవిధ్యాల మధ్య సమన్వయం సామరస్యం- సహజ లక్షణం, సంఘర్షణ-అపవాదం-ఎక్సెప్షన్! సూర్యుడు ప్రకాశించడం సహజం, గ్రహణం అపవాదం! నీతి, నిజాయితీ, సమష్టిహితం, సౌశీల్యం ప్రతి వృత్తిలోను సహజం కావడం సనాతన హైందవ జాతీయ తత్త్వం. అవినీతి అపవాదం! శ్యామల కోమల పరిమళ నందనవనం సహజం, చీడ పురుగుల అపవాదం! ఐలయ్య వంటివారు అపవాదాన్ని సహజ సూత్రంగా ప్రచారం చేస్తున్నారు.. విద్వేష వమనానికి ఇదీ కారణం!
ద్వాపర యుగంలో దేవకీ వసుదేవుల పుత్రుడైన యదుకుల కృష్ణుడు క్షత్రియుడు.. గాయం మానే్పవాడు క్షత్రియుడు! యశోదా నందుల ఇంట పెరిగిన అదే కృష్ణుడు వైశ్యుడు! ఆవులను రక్షించిన పాలించిన కృష్ణుడు గోపాలుడు, ‘యాదవుడు’! వేద రూపంలోని ఆవును పితికి సంస్కృతిని గీతామృతాన్ని అవనికి పంచిన అదే కృష్ణుడు పండితుడు, జగత్తునకు గురువు.. శ్రమ జీవన వృత్తుల సమన్వయ తత్త్వం ఇది! యదుకుల కుల కృష్ణుడు సనాతనుడు, శాశ్వతుడు. నరకుడు ‘అభినవ నరకులు’ అపవాదులు!

హెబ్బార్ నాగేశ్వరరావు