మెయిన్ ఫీచర్

బాక్సాఫీస్‌ను భయపెడుతున్నాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌తోపాటు సౌత్ ఇండియన్ స్క్రీన్‌పై ప్రస్తుతం దెయ్యాల ట్రెండ్ బాగా నడుస్తోంది. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ తరహా సినిమాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు దర్శక, నిర్నాతలు. దెయ్యాల సినిమాలకు ప్రత్యేక ప్రేక్షకులతో పాటు, సహజంగా అన్ని వర్గాల్లోని వారు ఆసక్తి కనబరుస్తుంటారు. అందులో యూత్‌లో ఎక్కువ క్రేజ్, పైగా దెయ్యాల సినిమాలకు పెద్దగా బడ్జెట్ సమస్య కూడా ఉండదు. ఎంతైనా కామెడీ పిండుకోవచ్చు. ఇక అటు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకోవడం మనం చూస్తున్నదే. ఇక అసలు కథలోకి వెళదాం.. నిజంగా దెయ్యాలంటే ప్రతి ఒక్కరికీ భయమే.. అయితే కొందరు భయం లేనట్టు నటిస్తే.. మరికొందరికి నిజంగానే భయం కలగవచ్చు. అది వేరే విషయం. నిజంగా దెయ్యాలు ఉంటాయా? లేవా? అన్న విషయం పక్కన పెడితే, ఈ భయాన్ని బాక్సాఫీస్ వద్ద క్యాష్ చేసుకోవడానికి దర్శక, నిర్మాతలతో పాటు స్టార్ హీరోయిన్స్ ఆసక్తి చూపిస్తుండటం విశేషం. ఇక దెయ్యం సినిమాల్లో ఆడవాళ్లదే మొదటి స్థానం. ఎందుకంటే మగ దెయ్యాల కంటే ఆడ దెయ్యాలే ఎక్కువగా భయపెడతాయి.. దానికి కొన్ని కచ్చితమైన రీజన్స్ కూడా ఉంటాయి.

హారర్ సినిమా జోనర్‌కి కొన్ని పరిధులుంటాయి.. హారర్ కామెడీకి కథ, స్క్రీన్‌ప్లేలో తేడా ఉండొచ్చు. కానీ ఈ జోనర్‌లో తీసే అన్ని సినిమాల్లోనూ కొన్ని ఎలిమెంట్స్ కామన్‌గా కనిపిస్తాయి. ఆ ఎలిమెంట్స్ అన్ని సరిగా కుదిరాయా.. కచ్చితంగా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టొచ్చు. ఏమాత్రం తేడా కొట్టిందా.. అంతే సంగతులు. అలా ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా హారర్ కామెడీ సినిమాలు తేడా కొట్టడానికి రీజన్.. మిక్సింగ్ పక్కాగా లేకపోవడమే. తాజాగా వచ్చిన ‘రాజుగారి గది-2’ విషయంలోనూ కామెడీ ఏ మాత్రం పండలేదన్న విమర్శలు వచ్చాయి. హారర్ కామెడీలో కామెడీ సరిగా కుదరడం చాలా కీలకమైన విషయం. ఈ సినిమాలో ముగ్గురు కమెడియన్లు ఉన్నా సరిగా నవ్వించలేకపోయారని టాక్ వినిపించింది. దానికి కారణం సన్నివేశాల్లో ఫన్ లేకపోవడమే. ‘ప్రేమకథాచిత్రం’ నుంచి ఈ జోనర్‌లో వచ్చిన సినిమాలన్నింటిలో అన్ని కోణాల్లో చాలావరకు కామెడీని పిండేశారు. అందుకే ఇప్పుడు పిండుకునేందుకు జ్యూస్ ఎక్కడుంది.. అంతా పిప్పే తప్ప! అదే అసలు సమస్యగా మారింది. కొత్తగా ఆలోచిస్తే తప్ప ఈ జోనర్‌లో సరైన కామెడీతో జనాలను ఆకట్టుకోలేకపోతున్నారు.
ఒకప్పుడు దెయ్యాలు ఊరిబయట, స్మశానం దగ్గర లేదా పాడుబడిన ఇళ్ళలోనే.. లేదంటే మర్రిచెట్టు తొర్రలు.. అడవుల్లో ఉండేవని విన్నాం.. 90వ దశకంలో కూడా హర్రర్ సినిమాలు వచ్చాయి. ఎందుకంటే హర్రర్ సినిమాలకు సీజన్ అంటూ ఏమీ లేదు. ఈ సినిమాలు ఎప్పుడొచ్చినా చూసేందుకు జనాలు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.

ఇక ఆ సమయంలో వచ్చిన సినిమాలు ఎక్కువగా ఇదే నేపథ్యం ఎన్నుకునేవి. ఊరిబయట, స్మశానాలు, మర్రిచెట్టు తొర్రల్లోనే కథలు నడిచేవి.. కానీ ఈమధ్య దెయ్యాలు ఏకంగా ఇంట్లోకే వచ్చేశాయి. పాడుబడ్డ ఇల్లు వాటికి కూడా నచ్చడంలేదో ఏమో.. ఇల్లు ఎంత హైటెక్‌గా ఉంటే అంత ఇష్టమనుకుంటా- ఎలాంటి ఇల్లయినా సరే అందులో దెయ్యాలు ఏకం గా కాపురం పెట్టేస్తున్నాయి. ఇళ్లలో అవి దర్జాగా తిరుగుతూ వచ్చినవాళ్ళను భయపెడుతూ నానా హంగామా చేస్తున్నాయి. తెలుగులో ఆమధ్య వచ్చిన ‘ప్రేమకథాచిత్రం’తో ఈ ట్రెండ్ ఎక్కువైంది.
అంతకుముందు అడపాదడపా సినిమాలు వచ్చేవి. కానీ ‘ప్రేమకథా చిత్రం’ తరువాత వరుసగా సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాల్లో నటించేందుకు స్టార్ హీరోయిన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఆమధ్య ‘మంత్ర’ సినిమాతో ఛార్మి
మంచి కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత వచ్చిన ‘మంత్ర-2’ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక నయనతార కూడా ‘డోరా’, ‘మయూరి’ లాంటి హర్రర్ సినిమాలలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక మిల్కీ భామ తమన్నా కూడా నేనేం తక్కువ కాదంటూ ‘అభినేత్రి’ సినిమాతో ఏకంగా మూడు భాషల్లో ప్రయత్నించింది. కానీ అది పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇక దశాబ్దంపాటు గ్లామర్ హీరోయిన్‌గా దక్షిణాదిలో క్రేజ్ తెచ్చుకున్న త్రిష కూడా ‘నాయకి’ పేరుతో ఓ హర్రర్ సినిమా చేసింది. తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే ఈసారి మరింత పక్కా ప్లాన్‌తో ఖచ్చితంగా భయపెట్టాలని మోహినిగా వస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తికావచ్చిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలై సంచలనం రేపింది. ఇక తెలుగు పాప అంజలి కూడా హర్రర్ సినిమాలో నటించి మెప్పించింది. ‘గీతాంజలి’ పేరుతో రాజ్‌కిరణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత భారీ బడ్జెట్‌తో చేసిన ‘చిత్రాంగద’ అంతగా ఆకట్టుకోలేదు. ఇక స్వాతి ‘త్రిపుర’, హన్సిక ‘చంద్రకళ’ అంటూ పలువురు హీరోయిన్స్ హర్రర్ సినిమాలు చేశారు. ఇది జరిగిపోయిన కథ.. అయితే వచ్చేకాలం అంతా హర్రర్ సినిమాలదే.. ఎందుకంటారా.. ప్రస్తుతం పలు హర్రర్ సినిమాలు రెడీ అవుతున్నాయి, ప్రేక్షకులను భయపెట్టేందుకు. మరి ఎవరు ఎలా భయపెట్టేందుకు సిద్ధం అవుతున్నారో తెలుసుకుందాం.
తాజాగా హర్రర్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపించాడు కింగ్ నాగార్జున. తాజాగా ఆయన నటించిన ‘రాజుగారి గది-2’ మంచి క్రేజ్ తెచ్చుకుంది. నాగార్జున తన కెరీర్‌లో చేసిన మొదటి హార్రర్ సినిమా ఇదే. అదే కోవలో లవర్‌బాయ్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న సిద్ధార్థ్‌కు ఈమధ్య కెరీర్ సాఫీగా సాగడం లేదు. ‘బొమ్మరిల్లు’లాంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న సిద్ధార్థ్ తెలుగులో ఓ దశలో స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ తరువాత కొన్ని వరుస సినిమాల పరాజయాలను అందుకున్న సిద్ధార్థ్ కాస్త గ్యాప్ తీసుకుని ఓ హర్రర్ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. గృహం పేరుతో తెరకెక్కిన ఈ సినిమా తమిళ హిందీలో విడుదల కానుంది. ఆండ్రియా హీరోయిన్‌గా నటిస్తోంది. హర్రర్‌తోపాటు రొమాన్స్.. లవ్ లాంటి అంశాలతో రూపొందిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
ఇక హీరోయిన్‌గా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన అందాల భామ త్రిష కూడా మరోసారి హర్రర్ సినిమాతో క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నాల్లో వుంది. ఇప్పటికే ఆమె నటించిన నాయకిగా పెద్దగా భయపెట్టలేకపోయింది. కానీ ఈసారి రెట్టించిన ఉత్సాహంతో రెడీ అవుతోంది త్రిష. ‘మోహిని’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ హర్రర్ సినిమాలకు భిన్నంగా వుంటుందట. ఈ మధ్యే ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఆ లుక్ అందరిలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తోంది. మొత్తానికి మోహినిగా త్రిష భయపెట్టేందుకు బాగానే రెడీ అవుతోంది. ఆమెలాగే మరో హీరోయిన్ అంజలి కూడా బెలూన్‌తో భయపెట్టేందుకు రెడీ అవుతోంది. హీరో జైతో కలిసి అంజలి నటిస్తున్న ‘బెలూన్’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు కూడా భారీగా పెరిగాయి. ఈ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న హర్రర్ సినిమా ‘చిత్రాంగద’ ఫ్లాప్ అవ్వడంతో పాపం అంజలికి అవకాశాలు తగ్గాయి. దాంతో మళ్లీ క్రేజ్ తెచ్చుకునేందుకు గట్టిగానే ప్రయత్నం చేస్తుంది అంజలి. ఇక మరో హీరో శ్రీకాంత్ కూడా హర్రర్ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రస్తుతం సోలో హీరోగా శ్రీకాంత్ క్రేజ్ తగ్గడంతో ఈమధ్యే ‘యుద్ధం శరణం’ సినిమాతో విలన్‌గా మారిన శ్రీకాంత్ తాజాగా ‘రారా’ పేరుతో ఓ హర్రర్ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

బాలీవుడ్ హాట్ పాప సన్నీలియోన్ కూడా ఆమధ్య ‘రాగిణి ఎంఎంఎస్-2’లో హర్రర్ సినిమాతో భయపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు మరో సీక్వెల్ కూడా రూపొందించే సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ప్రముఖ నటుడు శరత్‌కుమార్ కూతురు వరలక్ష్మి మెయిన్ లీడ్‌లో తమిళ, తెలుగు భాషల్లో అమ్మాయి పేరుతో మరో హర్రర్ సినిమా తెరకెక్కుతోంది. దాంతోపాటు యువ హీరో భరత్ తమిళంలో ‘పొట్టు’ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. అది కూడా తెలుగులో విడుదల కానుంది. ఇక హర్రర్ సినిమాల దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న రాంగోపాల్‌వర్మ హీరో రాజశేఖర్‌తో తెరకెక్కించిన పట్టపగలు ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమా విడుదల గురించి ఎవరు పట్టించుకోవడంలేదన్నది తెలుస్తోంది. ఇక తెలుగులో చిన్నా చితకా సినిమాలతో కలిపి ఏకంగా డజనుకుపైగా సినిమాలు సిద్ధం అవుతున్నాయి. కొత్త నటీనటులతో ‘కారులో షికారుకెళితే’, ‘అడవిలో లాస్ట్ బస్’, ‘ఆట’, ‘ఆ ఇంట్లో ఏమైంది’, ‘చిత్రం కాదు నిజం’, ‘పనె్నండు 12’, కన్నడంలో ‘జిలేబి’, హిందీలో ‘్భమి’ లాంటి సినిమాలు సిద్ధం అవుతున్నాయి. మరికొన్ని సినిమాలు కూడా షూటింగ్ మొదలుపెట్టేశాయి. మొత్తానికి ఈ ఏడాదితోపాటు వచ్చే ఏడాది కూడా ఈ హర్రర్ సినిమాల హవా తగ్గేలా లేదు.

-శ్రీనివాస్ ఆర్.రావ్