ఉత్తరాయణం

‘చేయి’ అడ్డంపెట్టి నిజం దాచలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత పదిరోజులుగా కాంగ్రెస్ దాని తోకపార్టీలైన జెడి(యు), సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, వామపక్షాలు ఒక ప్రశ్నను చిలకపలుకుల్లా వల్లిస్తూ వస్తున్నాయి. అగస్టా వెస్ట్‌లాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందానికి సంబంధించి ముడుపులు అందుకున్న వారిని బయటకు లాగడంలో ఎన్‌డిఎ ప్రభుత్వం చేస్తున్నదేమిటంటూ అవి ప్రశ్నను సంధిస్తున్నాయి. యుపిఎ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కుంభకోణంపై నిజాయతీగా విచారణ జరపాలన్న ఉద్దేశం ఎన్‌డిఎ ప్రభుత్వానికి ఉంటే ఉండవచ్చు. అయితే ఇటలీ హైకోర్టులో దీనికి సంబంధించిన క్రిమినల్ విచారణ ఇంకా పెండింగ్‌లో ఉండటం వల్ల, అదేదో తేలేవరకు వేచిచూడాలన్నది ప్రభుత్వ ఉద్దేశమన్న వాదన ఒకటి వినిపిస్తోంది. కాని ఈ వాదన నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఇటలీ కోర్టు 225 పేజీల తీర్పు ఇచ్చిన తర్వాతనే మన ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేలుకొంది. అందువల్ల ఈ కేసు విచారణలో ఇప్పటివరకు నిర్లక్ష్య వైఖరి ఎందుకు అవలంబించాల్సి వచ్చిందో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుత ప్రభుత్వం సరైన చర్య తీసుకోనంతమాత్రాన, ఈ ఒప్పందంలో అసలు అవినీతే చోటుచేసుకోలేదని, కాంగ్రెస్‌వారికి అసలు ఇందులో ప్రమేయమే లేదని భావించడానికి ఎంతమాత్రం వీల్లేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రతినిధులు బోఫోర్స్ లేదా జైన్ హవాలా స్కాంలను ఉదహరిస్తూ, ఈ కేసుల్లో ఎవరినీ దోషులుగా గుర్తించలేకపోయారంటూ గుర్తు చేస్తున్నారు. కానీ కేవలం బోఫోర్స్ కారణంగానే 1989 ఎన్నికల్లో రాజీవ్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలయిందన్న సత్యాన్ని వారు మరచిపోతున్నారు. బోఫోర్స్ ఒప్పందంలో కీలకపాత్ర వహించిన క్వాట్రోచీ లండన్ బ్యాంకునుంచి ఈ అవినీతి సొమ్మును డ్రా చేయగలిగాడంటే, మన సిబిఐ వారు చూసీ చూడనట్టు వ్యవహరించడం వల్ల మాత్రమేనన్నది వాస్తవమని తేలినా, ఈ కేసుకు ముగింపు పలకడానికి నాటి వాజ్‌పేయి ప్రభుత్వం కాంగ్రెస్‌కు సహాయం చేసిందనేది వాస్తవం. బోఫోర్స్ కుంభకోణంపై అప్పట్లో దేశవ్యాప్తంగా గగ్గోలు పుట్టడమే కాకుండా, ఈ కుంభకోణానికి బాధ్యుడు రాజీవ్ గాంధీ మాత్రమేనని గట్టిగా విశ్వసించిన ప్రజలు అప్పట్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. ఇక జైన్ హవాలా కేసులో ‘ఎల్‌కెఎ’ వంటి పొడి అక్షరాలను కోర్టు సాక్ష్యాలుగా పరిగణించలేదు. అదేవిధంగా హెలికాప్టర్ల కేసు విషయంలో కూడా కోడ్‌లకు కోర్టు విలువ ఇవ్వకపోవచ్చు, ఇవన్నీ కాంగ్రెస్ చేస్తున్న పనికిమాలిన వాదనలు. పార్టీ ఆత్మరక్షణ ఎంత బలహీనంగా ఉన్నదో ఈ వాదనలే చెబుతున్నాయి.
ఇటాలియన్ కోర్టు తన తీర్పులో ఏ రాజకీయ వేత్తను నేరస్థుడిగా పేర్కొనలేదని కూడా కాంగ్రెస్ వాదిస్తోంది. ఇదెంత హాస్యాస్పదం..! ఇటలీ కోర్టు ముందు విచారణ అంశం ఒక్కటే. హెలికాప్టర్ కంపెనీ ముడుపులు ఇచ్చిందా? లేదా? అన్నది మాత్రమే. అందువల్ల అది కేవలం కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లను, ఇతర సంబంధిత అంశాలపై విచారణ జరిపి తుది నిర్ణయానికి రాగలుగుతుంది. భారతీయ రాజకీయవేత్తలకు లంచాలిచ్చినందుకు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లపై విచారణ జరిపి, శిక్షించి కోర్టు తన విధిని తాను నిర్వర్తించింది. అందువల్ల కాంగ్రెస్ ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేయజాలదు. అయితే ఒప్పందం కుదుర్చుకోవడానికి, పాలక ప్రభుత్వంలో ఎవరిని ప్రభావితం చేయవచ్చుననేదానిపై కోర్టు తగినన్ని సూచనలివ్వడానికి యత్నించింది. అసలు ఈ ఒప్పందం వెనుక చోదకశక్తి ఎవరనేది, లక్ష్యంగా పెట్టుకోవలసిన వ్యక్తులెవరనేది కూడా కోర్టు పేర్కొంది. అయితే సోనియాగాంధీ పేరును పేర్కొనడం కోర్టుకు ఎట్టిపరిస్థితుల్లో సాధ్యం కాదు. ఎందుకంటే ఆమెకు వ్యతిరేకంగా కోర్టు వద్ద ఏవిధమైన సాక్ష్యాధారాలు లేవు. మరి ఈ పని చేయవలసింది భారత ప్రభుత్వమని అది భావించడం సహజం. ఇక కోర్టు తీర్పులో పార్టీ అధ్యక్షురాలి ప్రస్తావన లేదంటూ చేస్తున్న కాంగ్రెస్ వారి వాదనకంటే హాస్యాస్పదమైనది మరోటుండబోదు.
సమాధానం చెప్పాల్సిన ప్రశ్న మరోటుంది. అసలు కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టిందెవరు? కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టే ప్రక్రియను తానే ప్రారంభించానని మాజీ రక్షణ శాఖ మంత్రి ఎ.కె. ఆంటోని చెబుతున్నారు. సాంకేతికంగా ఆయనది కరక్టే. కానీ ఆయన ఎప్పుడీ పని చేశారు? కేవలం మరో రెండు రోజుల్లో మోదీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుందనగా! ఆయన దాచిపెట్టినదానికంటే ఇది ఎక్కువే వెల్లడిస్తోంది. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? కేవలం భయంతోనే! రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతినిధిని భాజపా నిలువరిస్తూ, 3మీరు చెప్పేదంతా అబద్ధాల పుట్ట2 అంటూ దుయ్యబట్టారు. అయితే ఆ సంస్థను ఎకె ఆంటోనీ మాత్రమే బ్లాక్ లిస్టులో పెట్టారని ఆ ప్రతినిధి స్పష్టంగా చెప్పలేకపోయారు.
అసలు ప్రధాన అంశమైన అవినీతిని పక్కనబెట్టి కాంగ్రెస్, ఒప్పందానికి ఎంతమాత్రం సంబంధం లేని అంశాలను లేవనెత్తడం, సమస్యను పక్కదోవ పట్టించడమే. బెంగళూరులో నిర్వహించిన ఏరోషోలో పాల్గొనడానికి ఈ కంపెనీకి ఎందుకు అనుమతిచ్చారు? ఎఫ్‌ఐబిబి కంపెనీని ఉమ్మడి వెంచెర్ కింద ఎందుకు అంగీకరించింది? ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే కంపెనీ నుంచి హెలికాప్టర్లను ఎందుకు కొనుగోలు చేస్తున్నాయి? ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వీటిల్లో కొన్ని సముచితంగా ఉండవచ్చు. కానీ అగస్టా వెస్ట్‌లాండ్ కేసులో ఎవరు ముడుపులు తీసుకున్నారు?2అన్న ప్రధాన సమస్యను పక్కనపెట్టలేవు. మరి ఈ ప్రశ్నపై దేశానికి సంతృప్తికరమైన సమాధానం లభించాలంటే, ఇతర అంశాలను కూడా ఇందులో చేర్చాల్సి ఉంటుంది.
ఇక ముఖ్యమైన విషయమేమంటే ‘ఎపి’అనే కోడ్‌ను డీకోడ్ చేయాల్సి ఉంది. అదృష్టవశాత్తు ‘ఎపి’ అంటే తానేనని అహమ్మద్ పటేల్ స్వయంగా అంగీకరించారు. ఇక కాంగ్రెస్ కుహనా మేధావులు ‘ఎపి’2అంటే గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్2 అని వివరిస్తూ ఆమెను ఈ రొంపిలోకి లాగాలని యత్నిస్తున్నారు. తమను తాము రక్షించుకోవడానికి కోడ్‌లను డీకోడ్ చేయడంలో ఇంతటి స్థాయికి దిగజారాలా? అగస్టాకు అనుకూలంగా లేనివారికి ముడుపులు అప్పగించేంతంటి మూర్ఖులేమీ కాదు ఇటాలియన్లు! కేవలం అహమ్మద్ పటేల్‌కు మాత్రమే అంతటి అవకాశముంది. ఎందుకంటే సింహాసనం వెనుక అసలు అధికారాన్ని వెలగబెట్టే వారికి అత్యంత సన్నిహితుడాయన!
కాంగ్రెస్ నేతల నుంచి వెలువడుతున్న కొన్ని ఆణిముత్యాల్లాంటి పదాలను కొన్నింటిని పరిశీలించండి. 3‘‘ఇదంతా భాజపా పన్నుతున్న కుయుక్తి తప్ప మరోటి కాదు.’’2 ‘‘ఇటలీ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మాత్రమే భాజపా నిద్రమత్తునుండి బయటపడింది.’’ ‘‘అజిత్ దోవల్‌కు, ఎస్‌పి త్యాగితో ఉన్న సంబంధాలపై విచారణ జరపండి’’, ‘‘కొనుగోలు విధానం ప్రారంభమైందిఎన్‌డిఎ-1 హయాంలోనే.’’2‘‘్భజ పా అధ్యక్షుడు అమిత్ షా వంచనమారి, అబద్ధాల రాజకీయాలు నడపడంలో సిద్ధహస్తుడు,’’2సోనియాగాంధీని ప్రశ్నించడానికి అమిత్ షా ఎవరు?22వగైరాలు.. ఇవన్నీ కూడా ముడుపులు తీసుకున్న వ్యక్తి ని ఎదోవిధంగా ప్రముఖ స్థానంలో లేకుండా చేయడానికి చేసే ఎత్తుగడలు మా త్రమే.
మరి ఈ ముడుపుల వ్యహారంలో వస్తున్న తీవ్రస్థాయి ఆరోపణలకు సోనియా సమాధానమేంటి? మొత్తం మీద ఈ ఒప్పందం కుదరడం వెనుక ప్రధాన చోదక శక్తి ఆమె మాత్రమే! మీడియా వ్యక్తులు ఆ మెను ప్రశ్నించినప్పుడు, 3నే నెవరికి భయపడను22 అని సమాధానమిచ్చింది. ఈ ఒ ప్పందంలోని సంక్లిష్టత నేపథ్యంలో అన్ని వేళ్లూ తననే చూపుతున్నప్పుడు ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా ఇవ్వవలసిన సమాధానమేనా ఇది?
ఇక్కడ ఒక సాధారణ తర్కం ఒకటి ఉంది. హెలికాప్టర్ కంపెనీ భారతీయ రాజకీయ నాయకులకు, అధికార్లకు లంచాలు చెల్లించిందనేది సుస్పష్టమైంది. మరి ఈ ముడుపులు ఎవరికి ఇచ్చి ఉంటారు? ఆనందీబెన్ పటేల్‌కీ కాదు,అమిత్ షాకు కాదు. ఈ లంచాలు కేవలం నిర్ణయాధికారం కలిగిన వారికి మాత్రమే ముట్టి ఉంటాయి. ముఖ్యంగా రాజకీయంగా, రక్షణ వ్యవస్థలోని అత్యున్నత స్థాయిలోని వారికి మాత్రమే ఈ లంచాలు అంది ఉంటాయి. రూ.3600 కోట్ల ఒప్పందం విషయంలో కేవలం ఎయిర్ చీఫ్ మార్షల్ మాత్రమే నిర్ణయం తీసుకుంటారని భావించలేం. కచ్చితంగా ఇది రాజకీయ స్థాయిలోనే జరుగుతుంది. మరి ఆ రాజకీయవేత్తలు ఎవరై ఉంటారు? ఇప్పటి వరకు మనకు ఆవిషయం తెలియదు. అయితే ప్రశ్న ఏం టంటే, ఈ మురికి ఒప్పందంలో4చోదక శక్తిని తెరవెనుకే ఉంచవచ్చునా?22
ఇక చివరిగా మీడియా పాత్రను పరిశీలిద్దాం. ఇది కంపెనీకి 3గూఢచారిగా,3ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరించింది. టెలివిజన్ ఛానళ్లలో జరిగిన చర్చలను పరిశీలించిన వారికి నైతిక విలువలకు తిలోదకాలిచ్చిన జర్నరిస్టు ఎవరో మనకు ఇట్టే తెలిసిపోతుంది. మరి ప్రెస్ కౌన్సిల్ ఏం చేస్తున్నది? బ్రాడ్‌కాస్టింగ్ ఎడిటర్ల బాడీ ఎక్కడుంది? రాడియా టేపుల వ్యవహారం తర్వాత మీడియా వెలుగు మసకబారింది.