మెయిన్ ఫీచర్

రఘుపతి వెంకయ్య నాయుడు’పై వివక్ష ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రోజున మన తెలుగునాట సినిమా అనే మూడక్షరాల కల్పవృక్షాన్ని, కామధేనువును వ్యాపారంగా మార్చుకొని కోట్లకు కోట్లు సంపాదించుకున్న వాళ్లు ఎందరో వున్నారు. పెద్ద హీరోలుగా, నిర్మాతలుగా, దర్శకులుగా, ఎగ్జిబ్యూటర్లుగా, డిస్టిబ్యూటర్లుగా, ఇతర విభాగాల సాంకేతిక నిపుణులుగా ఎదిగిన వాళ్లున్నారు. వాళ్లంతా అంత గొప్పగా కీర్తి ప్రతిష్టలతో పాటు ఆస్తిపాస్తులు, అంతస్తులు సంపాదించుకోవడానికి కారణం సినిమా. ఎక్కడో విదేశాలలో పురుడు పోసుకున్న ఆ సినిమా ధేనువును మన గడ్డపైకి తీసుకు రావడానికి తన జీవితానే్న అంకితం చేసి, చివరికి దరిద్ర దేవత కబంధ హస్తాలలో నలిగిపోయి దిక్కులేని మరణానికి గురైపోయిన ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ గారి త్యాగం లేకపోతే మనకు ఆ సినిమా లేదు. సినిమాపై ఆధారపడి జీవిస్తున్న వారెవరైనా సరే.. వారు తింటున్న అన్నం మెతుకులపై ఆ మహనీయుడి పేరు వుందనే వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. అలా గుర్తుంచుకొని వుంటే ‘రఘుపతి వెంకయ్య నాయుడు’పై తీసిన సినిమా ఇలా మూలనపడి వుండేది కాదు.

భారతదేశ సినీ యవనికపై బయోపిక్‌లు విరివిగా పురుడు పోసుకుంటున్న కాలనేపథ్యం ఇది..
బాలీవుడ్ తెర బయోపిక్ చిత్రాలతో కొంగ్రొత్త చరిత్రను సృష్టిస్తున్న దృశ్యమానం ఇది...
కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ వారి వారి రాష్ట్రాలకు, భాషలకు, ప్రాంతాలకు సంబంధించిన చరిత్రకారుల చరిత్రలను వెండితెరపైన ఆవిష్కరించే పనిలో ఆయా రాష్ట్రాల సినీ రూపకర్తలు తలమునకలై వున్నారు.
స్వాతంత్య్ర సమరయోధులు, క్రీడాకారులు, సాంఘీక సేవామూర్తులు, విప్లవోద్యమ ధీరుల జీవితగాథలను సినిమాలుగా తీస్తున్నారు.
ఐతే... అసలు ఈ సినిమా అనే మూడక్షరాల అద్భుతాన్ని ఆవిష్కరించడానికి తమ జీవితాలనే అంకితం చేసుకున్న, బలిదానం చేసుకున్న మహనీయుల చరిత్రలను సినిమాలుగా తీయడంలో మాత్రం కొంచెం వెనకడుగుల్లోనే వున్నారు.
భారతీయ సినీ పితామహుడు ‘దాదా సాహెబ్ ఫాల్కే’ జీవిత గాథను ‘హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ’ పేరిట ఓ సినిమా తీసేసి, ఆ విధంగా తమ రుణం తీర్చుకున్నారు ఉత్తర భారత సినిమా రూపకర్తలు. అలాగే మలయాళ చిత్రా పితామహుడైన ‘జె.సి డేనియల్’ జీవితగాథను సెల్యూలాయిడ్ పేరిట సినిమాగా తీసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు మలయాళీలు.
అదే బాటలో తెలుగు సినిమా పితామహుడు ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ జీవితాన్ని ఎన్నో కష్టాలకోర్చి తెరకెక్కించాడు దర్శకుడు బాబ్జీ.
సీనియర్‌నటుడు నరేష్ ‘రఘుపతి వెంకయ్య నాయుడు’గా, వాహిని రఘుపతి వెంకయ్య భార్య నాంచారమ్మగా, తనికెళ్ల భరణి - సత్యప్రియలు తల్లిదండ్రులుగా, మహర్షి - చాణక్య సహచరులుగా, అనేకమార్లు జాతీయ అవార్డులు అందుకున్న కిషన్‌సాగర్ డి.ఓ.పిగా, రాజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరిస్ట్‌గా పనిచేసిన ఈ సినిమాను సతీష్‌బాబు అనే కొత్త నిర్మాత నిర్మించడం చెప్పుకోతగ్గ విషయం.. విశేషం! ఎందుకంటే ఇటువంటి సినిమాలను పరిశ్రమలో వున్న అగ్ర నిర్మాతలో, అగ్ర నిర్మాణ సంస్థలో నిర్మించాలి. అది వారి బాధ్యత కూడా. కానీ ఆ బాధ్యత నిర్వహించడం లేదు. అందుకేనేమో పెద్ద నిర్మాతలెవరూ చేయని పనిని కొత్త నిర్మాత చేశాడు. పెద్ద దర్శకులు ఎవరూ చేయని పనిని దర్శకుడు బాబ్జీ చేసి, తీసి చూపించాడు.
2012లో షూటింగ్ ప్రారంభించుకొని 2013లో విడుదలకు సిద్ధమై ఆడియో ఫంక్షన్ ఘనంగా జరుపుకుంది. ఆ సందర్భంలో ఈ చిత్రాన్ని చూసిన దివంగత దాసరి నారాయణరావు ఎంతగానో మెచ్చుకొని, మరెంతగానో ఇష్టపడి ఈ చిత్రానికి ఫ్యాన్సీ రేటిచ్చి ప్రపంచ వ్యాపిత విడుదల హక్కులు కొన్నా రు. 2013 చివరిలో ఇది జరిగింది. కానీ ఎందువల్లనో ఆయన ఈ సినిమాను విడుదల చేయలేదు. నాలుగేళ్లు దాటిపోయింది. భౌతికంగా దాసరి ప్రస్తుతం మన మధ్యన లేరు. ఈ పరిస్థితిలో ఈ సినిమా విడుదల ఎలా..? ఎప్పుడు...?
ఒక సినిమా బిజినెస్ కాకపోతే విడుదల కాదు. కానీ మంచి బిజినెస్ అయికూడా ఈ చిత్రం విడుదల కాకపోవడమే ఒక విచిత్రం..! ఈ చిత్రాన్ని కొన్నది కూడా ఏ చిన్నా, చితక డిస్ట్రిబ్యూటరో కా దు. తెలుగు సినీ పరిశ్రమకే పెద్ద దిక్కయిన దాసరి. అంత గొప్పవ్యక్తి ఈ సినిమాను ఎంతో ఇష్టపడి కొని, నాలుగేళ్లకు పైగా విడుదల చేయకుండా ఎందుకు ఆపారు? ఇదో స్ట్రాటజీనా..లేక పరిశ్రమ సహకరించకపోవడమా..? ఇవన్నీ యక్ష ప్రశ్నలు కాదు.. ధర్మ సందేహాలు!
సమాధానం ఏదైనా కానీ, ఈ సినిమాకు మాత్రం అన్యాయం జరిగింది.. జరుగుతూనేవుంది. దర్శక నిర్మాతలకు, నటీనట సాంకేతిక నిపుణులకు అన్యా యం జరిగింది. కారణం ఏదైనా.. ఒక సినిమా ఆగిపోతే దాని ప్రభావం అందరికంటే ఎక్కువగా ఆ చిత్ర దర్శకుడిపై పడుతుంది. ఆ సినిమా విడుదలయ్యే వరకూ ఆ దర్శకుడికి మరో సినిమా రాదు. అదో శాపం! ప్రస్తుతం ఆ చిత్ర దర్శకుడు బాబ్జీ ఆ బాధను, ఆ వేదనను వౌనంగా భరిస్తున్నాడు పాపం!
ఈ సినిమా తీసింది ఎవరో నిర్మాత కావొచ్చు. కానీ సినిమా విడుదలయ్యేంత వరకే అది ఆ నిర్మాత సినిమా. విడుదలైన తర్వాత అది తెలుగు సినీ పరిశ్రమ ఆస్తి! అది పరిశ్రమ సినిమా. తెలుగు సినిమా పితామహుడికి కృతజ్ఞత తెలుపుకోవడానికి తీసిన సినిమా. ఇదో గొప్ప బయోపిక్..! ఈ సినిమా విడుదల కాకపోవడం అనేది ఒక రకంగా చెప్పాలంటే సదరు దర్శక నిర్మాతలకే కాదు.. స్వయంగా ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ జీవిత చరిత్రకే జరిగిన అవమానం.. అపచారం.. అన్యాయం! ఇదిగో..మా చరిత్ర అని చెప్పుకోవడానికి సాక్ష్యంగా ఉపయోగపడే సినిమా! ఇండస్ట్రీ సినిమా..!
ఇలాంటి సినిమాల విడుదల ఆగిపోయినప్పుడు ఫిలిం ఛాంబర్‌లు కానీ, ఫిలిం ఫెడరేషన్ గానీ, సినిమా పెద్దలు కానీ రంగంలోకి దిగి ఆ సినిమాను విడుదల చేయడానికి గట్టిగా కృషి చేయాల్సిన అవసరం వుంది. మన పొరుగు రాష్ట్రాలలో కానీ, పొరుగు దేశాలలో కానీ ఇలాంటి సందర్భాలలో అలాగే చేశారు.. చేస్తున్నారు కూడా. కానీ మన తెలుగు రాష్ట్రాలలో అలా జరగదు.. ఎందుకో!?
ఆ సినిమా విడుదల కాకపోవడం ఆ చిత్ర దర్శకుడో, నిర్మాతో తమ బాధను వ్యక్త పరుస్తూ ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలలో పోస్టింగ్‌లు పెడితే ‘మీ సినిమా బాధ మీరే పడండి.. మీ చావు మీరే చావండి.. మీ సినిమా విడుదల కాకపోతే దాని గురించి ఫిలిం ఛాంబరో, నిర్మాతల మండలో ఎందుకు పట్టించుకోవాలి? మీరు ఆ సినిమా తీసేటప్పుడు వాళ్లకు చెప్పి ఏమైనా తీశారా?’- అంటూ కొందరు కామెంట్స్ పెడుతుండడం ఫేస్‌బుక్‌లో కనిపిస్తుంది. అలాంటివి చూసినప్పుడు ఎంతో బాధగా అనిపిస్తుంటుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయితే వాళ్లన్నట్లు ఓకే అనుకోవచ్చు. కానీ.. ఇది ఒక మంచి ఆలోచనతో చేసిన సినిమా. ఓ చారిత్రక అవసరం కూడా! తీసినది ఎవరైనా కానీవండి. అది మంచి ప్రయత్నం అయినప్పుడు, చరిత్రకు అవసరం అయినది అయినప్పుడు ఆ ఒంటరి చేతులకు అందరి చేతులు అండగా నిలవాల్సిన అవసరం వుంది. అది మన బాధ్యత. అటువంటి సినిమాల విషయంలో చేతనైతే ఏదైనా సహాయం చేయాలి. లేకపోతే నోరుమూసుకొని కూర్చోవాలి. సినిమాలను ప్రేమించే హృదయం చెబుతున్న మాట ఇది.
ఈ రోజున మన తెలుగునాట సినిమా అనే మూడక్షరాల కల్పవృక్షాన్ని, కామధేనువును వ్యాపారంగా మార్చుకొని కోట్లకు కోట్లు సంపాదించుకున్న వాళ్లు ఎందరో వున్నారు. పెద్ద హీరోలుగా, నిర్మాతలుగా, దర్శకులుగా, ఎగ్జిబ్యూటర్లుగా, డిస్టిబ్యూటర్లుగా, ఇతర విభాగాల సాంకేతిక నిపుణులుగా ఎదిగిన వాళ్లున్నారు. వాళ్లంతా అంత గొప్పగా కీర్తి ప్రతిష్టలతో పాటు ఆస్తిపాస్తులు, అంతస్తులు సంపాదించుకోవడానికి కారణం సినిమా. ఎక్కడో విదేశాలలో పురుడు పోసుకున్న ఆ సినిమా ధేనువును మన గడ్డపైకి తీసుకు రావడానికి తన జీవితానే్న అంకితం చేసి, చివరికి దరిద్ర దేవత కబంధ హస్తాలలో నలిగిపోయి దిక్కులేని మరణానికి గురైపోయిన ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ గారి త్యాగం లేకపోతే మనకు ఆ సినిమా లేదు. సినిమాపై ఆధారపడి జీవిస్తున్న వారెవరైనా సరే.. వారు తింటున్న అన్నం మెతుకులపై ఆ మహనీయుడి పేరు వుందనే వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. అలా గుర్తుంచుకొని వుంటే ‘రఘుపతి వెంకయ్య నాయుడు’పై తీసిన సినిమా ఇలా మూలనపడి వుండేది కాదు.
మరో మరిచిపోలేని ఘోరం ఏమిటంటే ఇటీవల ప్రకటించిన నంది అవార్డుల విషయంలో కూడా ఆ సినిమాకు అవమానం జరిగింది. ఏ సినిమాలకైతే అవార్డులిస్తున్నారో ఆ సినిమాలకు తెలుగునాట మూల విరాట్ అయిన మహనీయుడిపై తీసిన సినిమాకు కనీసం ప్రత్యేక జ్యూరీ అవార్డు కూడా ఇవ్వకపోవడం. జ్యూరీలో వున్న వ్యక్తులు సదరు సినిమాలో ముఖ్య పాత్రలలో నటించిన వ్యక్తులపైనా, దర్శక, నిర్మాతలపైనో గల వ్యక్తిగత కక్షలను మనసులో పెట్టుకొని ఈ సినిమాకు నంది అవార్డు రాకుండా అడ్డుకున్నారని, కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నాలు చేశారని తెలుస్తుంది.
గతంలో కూడా కొన్ని సినిమాల విషయంలో ఇలా జరిగినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రత్యేక కేటగిరి కింద సదరు చిత్రాలకు అవార్డులు ఇచ్చి గౌరవించడం జరిగింది. మరో విషయం ఏమిటంటే ప్రభుత్వం 1980 నుంచి సినిమాలకు నంది అవార్డులు ఇస్తున్నప్పుడు ‘రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు’ పేరిట సినీ ప్రముఖులకు గౌరవ పురస్కారాన్ని అందజేస్తుంది. కొన్నాళ్లు ఆ అవార్డును ఆ పేరుతో అలాగే ఇస్తూ ఆ తర్వాత ఎందుకోగానీ ఆ అవార్డులో ‘నాయుడు’ అనే పేరు తొలగించి ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ అనే పేరుతో ఇస్తున్నారు. ఒక సామాజిక వర్గం పేరు గుర్తొస్తుందని అలా ‘నాయుడు’ అనే పదాన్ని తొలగించినట్లు అభిజ్ఞాన వర్గాల ద్వారా తెలిసింది. ఇది మరీ విడ్డూరం.. అన్యాయం! సమాజం కోసం, దేశం కోసం పోరాటాలు చేసి, తమ జీవితాలను అంకితం చేసిన మహనీయుల విషయంలో ఇలాంటి సామాజిక కోణాలు పరిగణనలోకి తీసుకురావడం తప్పు! సామాజిక పరిగణలతో పేర్ల చివర్లను తీసేస్తే గుర్తుపట్టేదెలా? ఇదే కారణాలతో అల్లూరి సీతారామరాజు పేరులో నుంచి ‘రాజు’ను, భగత్‌సింగ్ పేరు లో నుంచి ‘సింగ్’ను తొలగించగలమా..? అంతెందుకు ఈ అవార్డుతో పాటు ఇచ్చే ‘నాగిరెడ్డి- చక్రపాణి’ అవార్డులో ‘రెడ్డి’ని, బి.ఎన్.రెడ్డి పేరులో నుంచి ‘రెడ్డి’ని తొలగించ గలమా..?
హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ పేరును ‘రఘుపతి వెంకయ్య నాయుడు ఫిల్మ్‌నగర్’గా మార్చాలనే ప్రతిపాదన కూడా చాలా కాలంగా పరిశీలనకు నోచుకోక బుట్టదాఖలై వున్నది. రఘుపతి వెంకయ్య నాయుడు పేరిట పోస్టల్ స్టాంపును విడుదల చేయాలనే ఆలోచనకు కూడా అదే స్థితి..! ఆ మహానుభావుడి విషయంలో ఎందుకో ఈ వివక్ష అర్థమే కాదు..!

-ఎం.డి అబ్దుల్