మెయిన్ ఫీచర్

భరోసాను బహుమతిగా ఇద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి బాలలు రేపటి పౌరులు. నేటి విద్యార్థులు రేపటి దేశ ప్రగతికి మూలస్తంభాలు. పునాది గట్టిగా ఉంటేనే భవనం పటిష్టంగా ఉండి పది కాలాలపాటు నాలుగైదు తరాలకు నీడను, నివాసాన్ని ఇవ్వగలుగుతుంది. అలాగే నేటి బాలలు ఆరోగ్యంగా పుష్టిగా ఉండి బలంగా పెరిగితేనే ఈ దేశ బరువు బాధ్యతలను రేపు వాళ్ళు భుజస్కంధాలమీద మోయగలుగుతారు. ఈ విషయాన్ని గుర్తించకుండా చాలామంది తల్లిదండ్రులు, పెద్దలు, ఉపాధ్యాయులు పిల్లలపట్ల చాలా నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు.
ఈ మిడిమేలపు మోడ్రన్ యుగంలో విపరీత ధోరణులు మనుషుల మెదళ్ళలో ఎప్పుడైతే చోటు చేసుకున్నాయో.. ఎప్పుడైతే స్ర్తి, పురుషుల మధ్య విభేదాలు, ఎక్కువ తక్కువల పోటీలు తలెత్తాయో అప్పుడే ఈ సమాజంలో పిల్లలకు కష్టాలు మొదలయ్యాయి. ‘అమ్మగా, నాన్నగా ఎవరి బాధ్యతల పంపకం వారిది. ఇందులో ఎక్కువ తక్కువల ప్రసక్తే లేదు’ అని సమన్వయంతో ఆలోచించకుండా ‘పిల్లల్ని మేమే ఎందుకు కనాలి.. మేమే ఎందుకు పెంచాలి?’ అని అమ్మలైన కొందరు ఆడవాళ్ళు ప్రకృతి విరుద్ధపు పెడవాదన చేయడంతో అమ్మ ఉండీ లేని అనాథల్లా అయింది పిల్లల పరిస్థితి. పిల్లకు తల్లి పాలు తాగించకపోవడం, ఆయాలకు.. క్రష్‌లకు అప్పగించడం, మూడేళ్ళయినా రాని పసి పిల్లలను ప్లేస్కూలు, ప్రీ స్కూలు అంటూ ఇంటికి, బాల్యానికి దూరం చేయడం ఈ రోజుల్లో ప్రతి ఇంటా కనిపిస్తున్న పిల్లలపట్ల తల్లిదండ్రుల ప్రవర్తనా తీరు.
పిల్లలు.. పాపం అనె్నం పునె్నం తెలియని అమాయకులు. ఆటవస్తువుకు, నిప్పుకణికకు తేడా తెలియనివాళ్ళు.. వాళ్ళ ఎదురుగా పాకుతూ పాము కనిపించినా... పారాడుతూ వెళ్లి దాన్ని పట్టుకునేటంతటి అమాయకత్వం వాళ్ళది. తల్లో, తండ్రో ప్రతి క్షణం వాళ్ళని కనిపెట్టుకుని ఉండకపోతే.. ప్రమాదాలు ఎప్పుడూ వాళ్ళ చుట్టే పొంచి ఉంటాయి. పేపర్లో రోజూ ఎన్ని వార్తలు చదవటం లేదు. ‘సంపులో పడి చనిపోయిన బాలుడు..’, ‘మూడో అంతస్తు పెద్దవాళ్ళకు ఏదైనా అన్యాయం జరిగినపుడు పోలీస్ స్టేషన్‌కెళ్లి కంప్లయింట్ ఇస్తారు. ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటారు. కానీ పిల్లలు కనీసం తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేరు. చెపితే ఏమంటారో అన్న భయం కొంత.. అసలు వాళ్ళమీద ఏం జరుగుతోందో వాళ్ళకే తెలియని పసితనం కొంత.. వాళ్ళను బలిపశువులుగా మార్చేస్తున్నాయి.
అన్ని సామాజిక వర్గాలవారికి, అన్ని మతాలవారికీ అడక్కుండానే సంక్షేమ పథకాలు, రాయితీలు ఇచ్చే ప్రభుత్వాలకు సైతం పిల్లల విషయానికి వచ్చేసరికి చిన్నచూపే! ఎందుకంటే వాళ్ళకు ఓటులేదు కదా..! వాళ్లకు ఏ డిమాండ్లూ చేయటం రాదు.. ధర్నాలు, సమ్మెలు చెయ్యటం అసలు రాదు! అందుకే ప్రభుత్వాధినేతలు, అధికారులు బాలలకూ కొన్ని హక్కులుంటాయన్న విషయానే్న మర్చిపోతుంటారు. కంటితుడుపుగా పేదబాలల ప్రభుత్వ సంక్షేమ స్కూళ్ళు, హాస్టళ్ళు పెట్టినా.. అవి నరకానికి మారుపేర్లు అన్నట్టుగా ఉంటాయి. అక్కడి తిండి కుక్కలు కూడా తిననంత నాశిరకంగా ఉంటుంది! స్నానాల గదులు, మరుగుదొడ్లు అడుగుపెట్టగానే వాంతి వచ్చేటంత దుర్గంధభరితంగా, అపరిశుభ్రంగా ఉంటాయి. రేపటి పౌరులైన నేటి బాలలకు కాస్తంత బలవర్థకమైన పౌష్టికాహారాన్ని పిడికెడంత కూడా పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో మన ప్రభుత్వాలు ఉన్నాయి. చలికి కప్పుకోవటానికి ఓ దుప్పటి, ఉక్కపోత నుండి ఉపశమనానికి ఓ ఫ్యాను, వర్షానికి వళ్ళు తడవని ఓ గట్టి ఇంటి పైకప్పు.. ఇలా ఏవీ మన పిల్లలకు ప్రభుత్వం నుండి లభ్యం కావటంలేదు. ఈగలకు, దోమలకు ఎలకలకు, పందులకు తద్వారా విషజ్వరాలకు, అంటురోగాలకు వాళ్ళ బాల్యం బలైపోతున్నది. వాళ్ళ జీవితాలు రోగగ్రస్తం అవుతున్నాయి. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని పెచ్చులూడిన పాత బళ్ళలో.. పెంకులూడిన హాస్టళ్ళలో బతుకు వెళ్ళదీస్తున్నారు వాళ్ళు. మన ప్రభుత్వాలు మన దేశ పేద బాలలను సంరక్షిస్తున్న తీరు ఇది-
‘మెత్తటోళ్ళని చూస్తే మొత్తబుద్ధవుతుందని’ ఒక సామెత ఉంది. ఇక పిల్లలయితే నోట్లో వేలుబెట్టినా కొరకలేనంతటి అమాయకులు. దేవుడిలా చల్లని మనసున్న వాళ్ళు. నోరు విప్పి మాట్లాడలేరు కదా అని వాళ్ళని శారీరక, మానసిక హింసలకు గురిచేయడం.. హత్యలు చేయడం అన్నీ తెలిసిన పెద్దలకు న్యాయం కాదు. పిల్లల్ని కనగానే తల్లిదండ్రుల బాధ్యత అయిపోలేదు. వాళ్ళను సంరక్షించటం, చక్కగా పోషించి పెద్ద చేసి ఉత్తమ పౌరుడిగా ఈ సమాజానికి అందించటం కూడా వాళ్ళ బాధ్యతే! గురువు దైవంతో సమానం అంటారు.. అంతేకాదు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే గురువు తండ్రితో సమానం కూడా. విద్యార్థులను తన పిల్లలుగా భావించి వాళ్ళ మనసుల్లో జ్ఞానజ్యోతులు వెలిగించి వాళ్ళ జీవితాలను తీర్చిదిద్ది ప్రకాశవంతం చేయటం గురువుల బాధ్యత. ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలించాల్సిన ప్రభుత్వాలు రేపటి సమాజ సారథులైన పిల్లల ఆరోగ్యానికి, చదువుకు, స్వేచ్ఛకు ప్రాధాన్యతనిచ్చి వాళ్ళను కనుపాపల్లా సంరక్షించుకోవడం ప్రథమ కర్తవ్యంగా భావించాలి. అప్పుడే ఈ దేశంలో బాలలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది.

నోరు వాయి లేని పిల్లలంటే అందరికీ అలుసే! పెద్దవాళ్ల తప్పులకు, కోపతాపాలకు, ఒత్తిళ్ళకు, కొట్లాటలకు, మానసిక రుగ్మతలకు ముందుగా బలయ్యేది వాళ్ళే పాపం..! మొగుడూ పెళ్ళాలు ఎందుకో పోట్లాడుకుని, కొట్టుకుని ఆ కోపంలో తండ్రో, తల్లో పిల్లల్ని గొంతు పిసికో, కత్తితో నరికో చంపేస్తారు. ఇంట్లో సంగతి ఇలా ఉంటే ఇక బయటి ప్రపంచంలోకి చదువుకో, పనికో వెళ్ళే పిల్లల విషాద కథలు అవి వేరు! యూనిఫాం వేసుకోలేదనో, హాజరు పలకలేదనో, ఇంగ్లీషులో మాట్లాడలేదనో, హాజరు పలకలేదనో, ఇంగ్లీషులో మాట్లాడలేదనో కారణంగా స్కూల్లో సార్లు పిల్లల్ని బెత్తంతో నెత్తురుకారేలా చచ్చేలా కొడుతున్నారు. అనె్నం పునె్నం తెలియని, ముక్కుపచ్చలారని చిన్నారులమీద ఆంబోతుల్లాంటి పంతుళ్ళు, వికృత లైంగిక చర్యలకు పాల్పడుతున్నారు. బాల కార్మికులుగా పనిలోకెళ్లిన పిల్లలతో గొడ్డు చాకిరీ చేయించుకోవడమే గాక పనిలో వంకలు బెట్టి చిత్రహింసలు పెడుతుంటారు యజమానులు. ముసలి వగ్గుల్లాంటి అరబ్ షేక్‌లు ధనమదంతో పాత బస్తీలోని ఆడపిల్లల్ని నిఖా చేసుకుని తీసుకెళ్లి కామవాంఛ తీరాక వదిలేస్తున్నారు. ఇలా ఒకటా రెండా పిల్లల కష్టాలు.. అదో బాలభారతం!

-కొఠారి వాణీచలపతిరావు