మెయన్ ఫీచర్

‘వారసుడి’ వాదనకు విలువెంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాలల్లో హిందువులు మైనారిటీలో వున్నారు. జమ్మూ కశ్మీర్‌లో ముస్లిములు మెజారిటీలో వున్నారు. అయినా రిజర్వేషన్ల చట్టం అక్కడ మైనారిటీ హిందువులకు వర్తించదు. నాగాలాండ్, అరుణాచలప్రదేశ్‌లల్లో క్రైస్తవులు మెజారిటీలో ఉన్నారు. ఐనా వారు రిజర్వేషన్ సౌకర్యాలు పొందుతున్నారు. పంజాబ్‌లో సిక్కులు ఆర్య సామాజికులు మెజారిటీలో ఉన్నారు. అక్కడ హిందువులు మైనారిటీలో ఉన్నారు. బింద్రన్‌వాలా వచ్చేవరకు అమృత్‌సర్ స్వర్ణదేవాలయంలో శివుడు, దుర్గ వంటి దేవీ దేవతల విగ్రహాలుండేవి. ఇప్పుడు అవి తీసివేశారు. మరి ఆర్య సామాజికుల మాట ఏమిటి? వారు వేదాన్ని మాత్రమే గౌరవిస్తారు. కాని పురాణాలు భగవద్గీత వంటివి గౌరవించము, మాకు తిరుపతి కాళహస్తి వంటి దేవాలయాలతో పనిలేదు అంటున్నారు. అంటే పంచగకారములను అంగీకరించేవారే సనాతనులు అని అర్థం. అవి గంగ, గాయత్రి, గోవు, గీత- గోపాలుడు. ఇటీవల కర్ణాటకలో లింగాయతులు తాము హిందువులు కాదు అంటున్నారు. తమది బసవన్న మతం అంటున్నారు. ఇక తమిళనాడులో తాము ద్రావిడులం- ఆర్యుల మతాలు మాకు అక్కరలేదు అని పోరాటాలు చేస్తున్నారు. కేరళలో హిందువులు, కమ్యూనిస్టులు, ముస్లిములు, క్రైస్తవులు అనే నాలుగు ప్రధాన వర్గాలున్నాయి. హిందువులు తప్ప తక్కిన మూడు వర్గాలు శబరిమల యాత్ర చేయరు. అనంత పద్మనాభ స్వామిని దేవునిగా గౌరవించరు. గురువాయూరు, శ్రీకృష్ణ మందిరానికి వెళ్లరు. ఈ విధంగా చూచినప్పుడు భారతదేశంలో హిందువులు క్రమక్రమంగా మైనారిటీలుగా మారిపోతున్నారని గణాంకాలు నిరూపిస్తున్నాయి. ఐనా మన పీఠాధిపతులు కన్ను తెరవలేదు. మన ప్రభుత్వాలు ముస్లిములకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటున్నాయి.
కొద్దిరోజుల క్రితం యూకుబ్ హబీబుద్దీన్ తుల్సీ అనే యువకుడు తాజమహల్- అయోధ్యలోని బాబరీ మసీదు తనకు చెందుతాయి అని ఒక వాదం లేవదీశాడు. ఇతడు హైదరాబాద్‌లోని కోఠిలో ఉంటాడు. తన పేరు ముందు హిజ్ హైనెస్ అని ఉంచుకున్నాడు. అంటే మహాఘనత వహించిన అని అర్థం. ఇతడు బహదూర్ షా వారసుడని చెప్పుకుంటున్నాడు. మొగలు చక్రవర్తులల్లో చివరివాడు బహదూర్‌షా. ఇతడు 1857 విప్లవం తరువాత భారతదేశాన్ని కొద్దికాలం పాలించాడు. అతనిని తరిమివేసి విక్టోరియా రాణి భారతదేశాన్ని స్వాధీనం చేసుకున్నది. బహదూర్‌షా విదేశాలకు పారిపోయి అక్కడే మరణించాడు. ఇప్పుడు యాకూబ్ హబూబుద్దీన్ తుల్సీ తాను బహదూర్‌షా వారసుడననే ధ్రువపత్రాలు చూపించాడు. వాటిపై హైదరాబాద్ కలెక్టరేటు అంగీకార ముద్రలు కూడా ఉన్నాయి. అంటే అయోధ్యలోని రామమందిర స్థలం ముస్లిం వక్ఫ్ బోర్డుకు కాని, హిందువులకుగాని నిర్మోహి అకాడాలకుగాని హిందువులకు ప్రతినిధిగా వున్న యోగి ఆదిత్యనాధ్‌కుగాని చెందదు. అది బహదూర్‌షాకు చెందుతుంది. ఆయన వారసునికి చెందుతుంది. లోగడ ఇతడు తాజమహల్ దగ్గరికి వెళ్లి వచ్చాడు.
తాజమహల్ షాజహాను పుట్టడానికి మూడు వందల సంవత్సరాలకు ముందే ఉన్నదని న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కార్బన్ సెర్చి టెస్ట్‌లో తేల్చాడు. అందువల్ల అక్కడ శివాలయం ఉండేదని సంగీత్ సోం అనే యు.పి నాయకుడు వాదిస్తుంటే తాజమహల్ తన ఆస్తి అని ఇపుడు యాకూబ్ తుల్సీ అంటున్నాడు. ఈ విధంగా చూస్తే ఎర్రకోట, ఫతేపూర్ సిక్రీ వంటి మొగల్ కట్టడాలన్నీ యాకూబ్‌కే చెందుతాయి. ఎందుకంటే అతడు బహదూర్‌షా వారసుడు కాబట్టి. ఇది చట్టం ప్రకారం మనం అంగీకరించి తీరాలి, తప్పదు మరి!
ఈ తర్కాన్ని మరికొంచెం పొడిగిస్తే అమరావతి పేరుతో నిర్మిస్తున్న నూతన రాజధాని నగరం మనె్న సుల్తాన్ శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుగారి వారసులకే చెందాలి. వారు గుంటూరులోని లక్ష్మీపురం ప్రాంతంలో ఉన్నారు. అమరావతికి ఆ పేరు పెట్టింది కూడా వెంకటాద్రి నాయుడుగారే. ఇపుడు అసెంబ్లీ కడుతున్న ప్రదేశంలో వెంకటాద్రి నాయుడుగారి సుధర్మ అనే దర్బారు ఉండేది. ఇందుకు కావలసిన సాక్ష్యాలు డాక్యుమెంట్లు నా వద్ద ఉన్నాయి. మరి అమరావతి మొత్తం వాసిరెడ్డి వంశస్థులకు అప్పగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభ్యంతరం ఉండకూడదు.
ఈ తర్కం ప్రకారం మధ్యప్రదేశ్‌లోని ఉత్తర భాగాన్ని రాజా బుందేల్‌ఖండ్‌గారికి ఇవ్వాలి. ఈయన రాజా ఛత్రసాల్‌గారికి వారసుడు. కొన్నాళ్ల క్రితం మా బుందేల్‌ఖండ్ మాకు ఇవ్వండి అంటూ అక్కడ ఉద్యమం జరిగితే ఆ ప్రజోద్యమానికి నేటి కేంద్ర మంత్రిణి ఉమాభారతి మద్దతునిచ్చింది కూడా!
హైదరాబాద్‌లోని గోల్కొండ ఖిల్లా ఉస్మానియా యూనివర్శిటీ, చార్మినార్, నిలోఫర్ ఇవన్నీ రాజా ఉస్మాన్ అలీఖాన్‌కు చెందుతాయి. ఎందుకంటే ఈయన ఏడవ నిజాం ప్రభువు. ఆయనపై యుద్ధం చేసి ఈ రాజ్యాన్ని బలవంతంగా ఇండియన్ యూనియన్‌లో కలిపారు. అంటే తెలంగాణ ముస్లిములకు చెందుతుందే కాని కెసిఆర్‌కు కాదు. కర్ణాటక టిప్పు సుల్తాన్ సామ్రాజ్యం. ఈయన హైదరాలీ కొడుకు. వీళ్లను చంపి బ్రిటిషువారు కర్ణాటకను ఆక్రమించుకున్నారు. కాబట్టి టిప్పు సుల్తాన్ వారసుణ్ణి వెతికి తెచ్చి సిద్ధ రామయ్య కర్ణాటక సామ్రాజ్యాన్ని అతనికి అప్పగించాలి. ఇది చరిత్ర!
అదెట్లా జరుగుతుంది అని ప్రశ్నించకండి. కాశ్మీరును స్వతంత్ర రాజ్యంగా ప్రకటించండి అని చైనా ప్రేరేపిత ఉగ్రవాద విద్యార్థి నాయకుడు కన్హయ కుమార్ ఢిల్లీలో అల్లరి చేస్తుంటే అతనికి అరవింద్ కేజ్రీవాల్, కామ్రేడ్ ఏచూరి సీతారాం, రాహుల్ బాబు మద్దతునిచ్చి రావటం ఇటీవలి సంఘటనయే! ఈ అగ్ర నాయకులంతా ఎందుకిలా చేశారు? భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేయండి అంటూ కన్హయ్య జరిపిన ఊరేగింపు వీడియో మనమంతా టీవీలల్లో ఇటీవల చూచాము కదా! భారత్ మాతాకీ జై అన్నందుకు చంద్రన్ అనే యువకుణ్ణి చంద్రశేఖరన్ అనే టీచర్‌ను చంపించారు. చంద్రన్ తండ్రి అశోకన్ సిపియం కార్యకర్త. అతనిని కూడా అంతమొందించారు. అధికార పార్టీ ఈ దురాగతాలకు కారణమని ఆరోపణలు ఉన్నాయ. కలకత్తాలో జైహింద్ అన్నందుకు సిపియం సీనియర్ కార్యకర్త, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు ఋతువ్రత్ ముఖర్జీని మొన్న పార్టీనుండి బహిష్కరించారు.
సారాంశమేమంటే ఇండియాలో హిందువులు మైనారిటీ వర్గంగా మారిపోతున్నారు. ‘2050 నాటికి ఇండియా క్రమంగా పాకిస్తాన్‌లో అంతర్భాగం అవుతుంది. హిందువులైతే ఏమిటి? ముస్లిం అయితే ఏమిటి? మతంతో మనకేమిటి పని? మనకు మానవత్వం కావాలి. కార్మిక కర్షక సంక్షేమం కావాలి’ అంటున్నారు ఏచూరి సీతారామయ్యలు. మరి భారతదేశాన్ని 1947లో ‘మతం’ ప్రాతిపదికపై ఎందుకు విభజించారు? పాకిస్తాన్‌లో చర్చిలు ఉన్నాయా? అక్కడ స్వస్థత కూటములు జరుపుకునే అవకాశం ఉందా? అక్కడ కమ్యూనిస్టు పార్టీ ఆఫీసులు ఉన్నాయా? 1947 నాడు పాకిస్తాన్‌లో 14 శాతం హిందువులున్నారు. నేడు ఒక్క శాతంకన్నా తక్కువ ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటికి కోనసీమలో 0.5 శాతం క్రైస్తవులున్నారు. ఇవ్వాళ మతం మార్పిడుల కారణంగా 12 శాతం రాజమండ్రి పరిసర ప్రాంతాలల్లో ఉన్నారు. వారు దళిత క్రైస్తవుల పేరుతో ఇటు రిజర్వేషన్లను అటు విదేశీయ నిధులు తెచ్చుకుంటున్నారు. కోనసీమలోని వేద పండితులకు తినడానికి తిండి లేదు, వారి పిల్లలకు రిజర్వేషన్లు లేవు. షెపర్డ్ కంచ ఐలయ్య తెలంగాణలో గుడ్ షెపర్డ్ స్కూలు పెట్టి కోట్ల కొలది విదేశీ నిధులు తెచ్చుకుంటున్నాడు. మళ్లీ బి.సి వర్గం పేరుతో యూనివర్శిటీలో ఉద్యోగం తెచ్చుకుని ‘నేనెందుకు హిందువునవుతా?’ బాపనోళ్లు తోడేళ్లు, కోమటోళ్లు స్మగ్లర్లు అంటూ పుస్తకం వ్రాశాడు.
1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. 1950లో భారతదేశానికి స్వతంత్ర రాజ్యాంగం వచ్చింది. దేశంలోని ఐదు వందల సంస్థానాలు జమీందారీలు నిజాం రాజ్యాలు ఇండియన్ యూనియన్‌లో కలిసిపోయాయి. ఒక్క జమ్మూ కాశ్మీర్‌కు మాత్రమే నెహ్రూగారి పుణ్యమా అని స్వతంత్ర రాజ్యాంగమూ ప్రత్యేక జాతీయ జెండా ఉంది. ఇవాళ యాకూబ్ హబీబుద్దీన్ తుల్సీ తాను బహదూర్‌షా వారసుణ్ణి కాబట్టి తనకు తాజమహల్ అయోధ్య స్థలం ఇవ్వాలి అంటే కుదరదు. అయోధ్య వేల సంవత్సరాలనుండి ఇక్ష్వాకులది. అక్కడ రామాలయాన్ని నేల కూల్చి సమర్‌ఖండ్ నుండి వచ్చిన ఒక బందిపోటు ఆక్రమించుకున్నాడు. అతడు మొగల్ సామ్రాజ్య స్థాపకుడు.
తెలంగాణ కాకతీయులది. వారిని 1323లో ఓడించి ఉలుగ్‌ఖాన్ ఓరుగల్లును ఆక్రమించుకున్నాడు. రాజధాని ఓరుగల్లు పేరును సుల్తాన్‌పూర్‌గా మార్చాడు. సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ 1948లో తెలంగాణాలో అసఫ్‌జాహీ ప్రభువు పాలన నుండి విముక్తం చేసి ఇండియన్ యూనియన్‌లో కలిపాడు. ఇవాళ మనకు పటేల్‌మీద గౌరవం లేదు. ‘మా నిజాం చాలా మంచోడు’ అంటున్నారు.
కాకతీయుల వారసుడు భంజదేవ్ ప్రస్తుతం చత్తీస్‌గఢ్ ఉన్నాడు. దిక్పాలదేవుని దంతెవాడ హిందీ శాసనం నా వద్ద ఉంది. మరి ఆయనను పిలిపించి తెలంగాణకు ప్రభువును చేస్తారా? అదెట్లా కుదురుతుంది? అంటున్నారు. మరి అయోధ్యపై బాబరు వారసుడు ఆధిపత్యం ఎలా కుదురుతుంది??

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్