మెయిన్ ఫీచర్

మనోధైర్యంతో మున్ముందుకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్ స్టార్ రజనీ తన చిత్రం కబాలితో ప్రతిచోటా రికార్డులను సృష్టించినట్లే ఆంధ్రప్రదేశ్ హాకీ క్రీడాకారిణి, గోల్‌కీపర్ ఏటిమరుపు రజనీ భారత హాకీ జట్టు విజయంలో కీలక భూమిక పోషించి రికార్డు సృష్టించారు. ముప్పయి ఆరేళ్ల తరువాత ఒలింపిక్స్‌లో పాల్గొనే మహిళా హాకీ జట్టులో బెర్త్ సంపాదించి చరిత్ర సృష్టించగా.. నేడు 13 ఏళ్ల తరువాత చైనాపై సాధించిన అద్వితీయమైన విజయంలో పాలుపంచుకున్నారు. చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం గ్రామంలో జన్మించిన రజనీ ఒక్క మన తెలుగు రాష్ట్రాలకే కాదు దక్షిణ భారతదేశం తరపున హాకీ జట్టులో చోటు సంపాదించిన ఏకైక మహిళా క్రీడాకారిణి కావటం విశేషం. హైదరాబాద్‌లో స్పోర్ట్స్ అథారటీ ఆఫ్ ఇండియాలో శిక్షణ తీసుకున్న రజనీకి శిక్షణ ఇచ్చింది తిరుపతిలో ఇస్మాయిల్ అనే కోచ్. ఆ కోచ్ ఇచ్చిన శిక్షణలో రాటుదేలిన ఆమె తాను దేశం తరపున ఆడగలను అనే నమ్మకాన్ని ఆ కోచ్ కలిగించారు. తొలుత జూనియర్ హాకీ జట్టులో స్థానం సంపాదించిన రజనీ అంచెలంచెలుగా ఎదుగుతూ.. 2009లో సీనియర్ జట్టులో స్థానం సంపాదించే స్థాయికి వెళ్లటమే కాదు ఒలింపిక్స్‌లోనూ, మొన్నటికి మొన్న ఆసియా కప్‌లో భారత్ విజయాల బాటకు వారధిగా నిలిచారు.

అసమానతలను అధిగమిస్తూ..

హాకీలో రజనీ చూపించే నైపుణ్యం, ప్రతిభను విస్మరించిన సందర్భాలు లేకపోలేదు. వాటన్నింటినీ మనోధైర్యంతోనే ఎదుర్కొన్నారు. అసమానతలు ఎదురైనపుడు తల్లిదండ్రులు, శిక్షకులు అండగా నిలిచి ఆమెను ఓ మంచి క్రీడాకారిణిగా నిలబెట్టారు. తొలి రోజుల్లో హాకీ ఆడుతుంటే ఆమెను గ్రామంలో ఎగతాళి చేసినవారే అధికం. ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో అవమానాలు ఎదురైనా.. మంచి క్రీడాకారిణిగా ఎదిగేందుకు తరగతులను సైతం పక్కన పెట్టి శిక్షణకు వెళ్లేది. 2014లో ఆటలో గాయపడటం ఆమెను దాదాపు ఐదు టోర్నమెంట్లకు దూరం చేసింది. చికిత్స పొందుతూ ఎన్నోసార్లు భావోద్వేగానికి గురైతే అమ్మ ఓదార్పే ఆమె మళ్లీ క్రీడాప్రాంగణంలో అడుగుపెట్టేలా చేసింది. ఆనాటి ప్రోత్సాహం వల్లే 36 ఏళ్ల తరువాత అర్హత సాధించిన ఒలింపిక్స్ హాకీ జట్టులో స్థానం సాధించగలిగారు. చుట్టుపక్కల వారు పెళ్లి గురించి అడుగుతుంటే ఒక్కొసారి కోపం వస్తుంది. ఇదే ప్రశ్నను అబ్బాయిలను ఎందుకు అడగరు అని రజనీ ప్రశ్నిస్తారు. ముంబయి రైల్వే శాఖ ఆమెను టిక్కెట్ కలెక్టర్‌గా నియమించుకుంది. టిక్కెట్ కలెక్టర్ నుంచి హాకీ గోల్‌కీపర్‌గా విజయ పరంపర కొనసాగిస్తున్నారు.

విజేతగా నిలిచినపుడు భావోద్వేగానికి గురవుతా..

కఠిన శిక్షణ, అంకితభావం వల్లే ఆసియా కప్ విజేతగా నిలిచామని అంటారు రజనీ. ఆసియా కప్ పోటీల్లో విజేతగా నిలిచిన తరువాత టీమ్ సభ్యులమంతా తీవ్ర భావోద్వేగానికి గురయ్యామని అంటూ.. ఎన్నో ఏళ్ల తరువాత లభించిన విజయం కాబట్టి సహజంగానే భావోద్వేగానికి గురవుతామని వెల్లడించింది. టోర్న్‌మెంట్ ముందే ఈ ఆటలో విజయం సాధించాలని గట్టిగా నిర్ణయించుకున్నాం. 2018లో జరిగే ప్రపంచ కప్ కోసం అర్హత సాధించాల్సి అవసరం ఉన్నందున ఇది చాలా ముఖ్యమని సిరీస్ అని భావించి క్రీడామైదానంలోకి అడుగుపెట్టాం. 13 ఏళ్ల తరువాత ప్రపంచ కప్‌కు వెళ్లటం గొప్ప అనుభూతిని మిగిల్చింది. ఈ టోర్నీలో అత్యంత ప్రతిభ ప్రదర్శించిన యువ క్రీడాకారిణులు ఉన్నారు. మాకు నైతిక సామర్థ్యంతో పాటు వౌలిక సదుపాయాలను కల్పిస్తున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ధన్యవాదాలు సమర్పించాల్సిన అవసరం ఉందని రజనీ వినమ్రంగా చెబుతారు.

అసమానతలు ఎదురైనపుడు తల్లిదండ్రులు, కోచ్ అండగా నిలిచి క్రీడాకారిణిగా నిలబెట్టారు. తొలి రోజుల్లో హాకీ ఆడుతుంటే మా గ్రామంలో ఎగతాళి చేసినవారే అధికం. ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో అవమానాలు ఎదురైనా.. మంచి క్రీడాకారిణిగా ఎదిగేందుకు తరగతులను సైతం పక్కన పెట్టి శిక్షణకు వెళ్లేదాన్ని. చుట్టుపక్కల వారు పెళ్లి గురించి అడుగుతుంటే ఒక్కొసారి కోపం వస్తుంది. ఇదే ప్రశ్నను అబ్బాయిలను ఎందుకు అడగరు. 13 ఏళ్ల తరువాత ప్రపంచ కప్‌కు వెళ్లటం గొప్ప అనుభూతిని మిగిల్చింది.

-రజని

-హరిచందన