మెయిన్ ఫీచర్

అమ్మకు ప్రేమతో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంశోద్ధారకుడు కొడుకు నీడలోనే సేదతీరాలనుకునే తల్లిదండ్రులకు కూతుళ్లే కొడుకులవుతున్నారు. తండ్రి పోయి ఒంటరైయిన తల్లులకు మానసిక బలాన్ని అందిస్తున్నారు. తల్లి ప్రతి బాధ తెలుసుకుని తోడుగా నిలుస్తున్నారు. ముదిమి వయసులో పొదవి పట్టుకుని నడిపిస్తూ.. ఓదార్పునిస్తున్నారు. తల్లి ఆనందానికి ఏ లోటు లేకుండా కంటికిరెప్పలా కాపాడుకుంటున్నారు.అంతిమ క్షణాల వరకు అనుక్షణం వెన్నంటే ఉంటున్నారు. తలకొరవి పెట్టడానికి ఒక్క కొడుకు చాలు అని తపించే తల్లిదండ్రులకు కూతుళ్లే తలకొరవి పెడుతున్నారు. మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరిని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కొడుకులు కేవలం ఆర్థిక సాయం, కాస్తంత ప్రేమను అందిస్తారు. అదే కూతురైతే.. తల్లికి ఏ కష్టం వచ్చినా సేవచేస్తూ వెన్నంటే ఉంటుంది. ఎక్కడకు వెళ్లాలన్నా వెన్నంటే ఉండి తీసుకువెళుతుంది. దీనికి రుజువులు బాలీవుడ్‌లో మన కళ్ల ముందే కనిపిస్తోంది.

తల్లితోనే ఐశ్వర్యరాయ్..

అభిషేక్ బచ్చన్‌తో వివాహం అయినప్పటికీ ఐశ్వర్యరాయ్ తల్లి వెన్నంటే ఉంటుంది. అది విదేశాల్లోని కేన్స్ వేడుకకావచ్చు, ముంబయిలోని ఫంక్షన్ కావచ్చు. ఏ చిన్న కార్యక్రమమైనా తల్లి బృందారాయ్ వెన్నంటే ఉంటుంది. ఈ మధ్యకాలంలో తండ్రి చనిపోవటంతో తల్లిని కనిపెట్టుకుని ఉంటోంది. ఎక్కడికి వెళ్లినా తల్లిని తనతో పాటు తీసుకువెళుతుంది. ముంబయిలో ఉంటే మాత్రం భర్త అభిషేక్ బచ్చన్‌తో కలసి తల్లిని తరుచూ చూసి వస్తోందట.
సహచరురాలిగా..
శిల్పాశెట్టి అద్భుతమైన కుమార్తె అని చెప్పవచ్చు. ఆమె తల్లిదండ్రులకు నిరంతర సహచరురాలు. భర్త రాజ్‌కుంద్రాతో కలిసి తరుచూ తల్లి వద్దకు వెళ్లేది. ఇటీవల తండ్రి పోవటంతో ప్రతిరోజూ వెళ్లి చూసి వస్తోంది. శిల్పాశెట్టి తల్లి సునందాశెట్టికి కూడా కూతురు అంటే వల్లమాలిన అభిమానం. సెలవు దొరికితే చాలు తల్లి ముందు వాలిపోతుంది.
బబితాకు శక్తినిచ్చేది వారే..
బబితా కపూర్‌కు శక్తినిచ్చేది ఆమె కుమార్తెలు కరీనా,కరీష్మాలేనట. తండ్రి రణధీర్‌కపూర్‌తో విభేదాలు వచ్చినా.. తల్లి వెన్నంటే నిలిచారు. తల్లికి పిల్లర్‌గా వ్యవహరిస్తున్నారు.
జీవితంలో సగభాగం..
ఆశా పరేఖ్, హేమమాలిని, షబనాఅజ్మీ, రవీనాటాండన్ వంటివారు తల్లులైనప్పటికీ తమ తల్లే తమ జీవితంలో సగభాగం అని ఇప్పటికీ చెబుతారు. చలనచిత్ర రంగంలో సెలబ్రిటీలుగా ఉన్నప్పటికీ తాము కూడా సాధారణ కుటుంబంలోని మనుషుల మధ్య ఉండే మానవ సంబంధాలే మా కుటుంబాల్లోనూ ఉంటాయని చెబుతారు. ఇద్దరు పిల్లలకు తల్లనైనా నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే అది తల్లిదండ్రులు ఇచ్చినదే అని అంటుంది రవీనాటాండన్. నాన్నగారు రవీ టాండన్ సినిమా నిర్మాత అయినప్పటికీ తల్లి సాధారణ పిల్లలుగానే పెంచిందని అంటూ.. తండ్రి కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు వచ్చినా అవి మాకు తెలియనీయకుండా పెంచటం గొప్ప విషయం అని అంటారు. అందుకే తన జీవితంలో తల్లి సగభాగం అయిపోయిందని రవీనాటాండన్ అంటారు.
తల్లే నా స్నేహితురాలు అని అంటుంది సీనియర్ నటి షబనాఅజ్మీ. ఆమె వయసు 88 సంవత్సరాలు. జ్ఞాపకశక్తిని పూర్తిగా కోల్పోయింది. తండ్రి చనిపోయినప్పటి నుంచి ఆమే నాకు స్నేహితురాలైంది. నోబెల్ విజేత అమర్త్యసేన్ సైతం ఆమెను ప్రశంసించారు. పదేళ్ల ప్రాయం నుంచి తల్లి నాటకాలు వేసేది. ఆమెకు చీరలంటే ఎంతో ఇష్టం అని షబనాఅజ్మీ తన తల్లి గురించి గర్వంగా చెబుతుంది. ఆశాపరేఖ్, హేమమాలినీలకు తల్లులు నేడు జీవించిలేనప్పటికీ వారు సైతం ఈనాటికీ తమ తల్లిని నిరంతరం గుర్తుకు చేసుకుంటారు. తాము ఈ స్థాయికి ఎదిగినా చనిపోయేవరకు ఇసుమంతైనా ప్రేమ తరగలేదని, లోటుపాట్లకు అతీతంగా పెంచిందని గుర్తుకు తెచ్చుకున్నారు.
ఒంటరిగా ఉన్నాననే బాధ లేదు..
భర్త మరణం తరువాత ఒంటరిగా ఉన్నాననే బాధ ఎన్నడూ కలగలేదని చెబుతుంది ప్రియాంక చోప్రా తల్లి మధు. ప్రియాంక చోప్రా ప్రోత్సాహంతో నిర్మాతగా మారి బిజీ అయిపోయింది. పని ఒత్తిడి ఎక్కువైనా ఎలాంటి విసుగూ ఉండదు. ప్రియాంక అవిధంగా తల్లికి ‘తాను ఒంటరి’ అనే బాధ లేకుండా యాక్టివ్‌గా ఉండేటట్లు ప్రోత్సాహాన్ని అందిస్తోంది.