మెయిన్ ఫీచర్

సాహసమే శ్వాసగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవకాశం దక్కించుకున్న ఏకైక భారతీయురాలు ప్రత్యూష

ఎత్తయిన శిఖరాలను అధిరోహించటం.. సముద్రాలను ఈదటం అంటే మాటలు కాదు. ఓ రకంగా ప్రాణాలతో చెలగాటమే. అయినా నేటి యువత భయపడటం లేదు. ఏటవాలు కొండల్ని ఎక్కేందుకు కఠిన శిక్షణ తీసుకుంటుంది. మానసిక దృఢత్వంతో ముందుకు సాగుతోంది. ఒక్క సాహసం వేయి తెగింపులకు మేలుకొలుపు. సాహసం, సరదా కలగలుపుకుని సాగే క్రీడే రాక్ క్లైంబింగ్. రిస్క్ తీసుకుంటేనే జీవితం థ్రిల్‌గా ఉంటుందని భావిస్తూ.. ఎత్తయిన శిఖరాలను సైతం సవాల్ చేసేందుకు ముందుకు వస్తోంది. రాక్ కైంబ్లింగ్‌ను 2018లో ఒలింపిక్ గేమ్‌గా ఆరంగ్రేటం చేయనుండటంతో ఔత్సాహిక అధిరోహకులు అమితోత్సాహంతో అడుగు ముందుకు వేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న రాక్ క్లైంబింగ్ శిక్షణా కేంద్రాలలో కుర్రకారు విపరీతంగా చేరుతున్నారు. గజ గజ వణికించే మంచు ప్రాంతాలలో పరిశోధనలకు సైతం యువతీ యువకులు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. అంటార్కిటికా ఖండంలో చేసే సాహసయాత్రకు మన తెలుగమ్మాయి ప్రత్యూషా ఎంపిక కావటం ఇందుకు నిదర్శనం.

బౌల్డరింగ్ సాహస క్రీడ..

బౌల్డరింగ్ అనేది ఇపుడు సరికొత్త సాహస క్రీడ. ఈ ఆట నేర్చుకోవటానికి ఎటువంటి తాడులు అవసరం లేదు. ఎందుకంటే చిన్న ఎత్తయిన ప్రదేశంలో ఈ క్రీడను నేర్పిస్తారు. సాధారణంగా 18 అడుగుల ఎత్తు ఎక్కటానికి కేవలం ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. చాలా చోట్ల తక్కువ ఎత్తయిన పర్వతాలనే ఈ క్రీడకు ఉపయోగిస్తారు. అదే రాక్ క్లైంబింగ్ అయితే క్రాష్ ప్యాడ్స్, తాడు, వివిధ భద్రతా పరికరాలు అవసరమవుతాయి. నిలువుగా రాళ్లపైకి అధిరోహించటం ఒక కళే. 1970లో ప్రారంభమైన ఈ ఈ క్రీడ నేడు ప్రపంచవ్యాప్తంగా జనాధరణ పొందుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో క్లైంబింగ్ స్పాట్లను సైతం ఏర్పాటయ్యాయి. కర్ణాటకలోని హంపి, బాదామి, మహారాష్టల్రోని పూణే, మనాలిలోని చాత్రు వంటి ప్రాంతాలు క్లైంబింగ్ కేంద్రాలకు ప్రసిద్ధి.

హైదరాబాద్‌లోనూ విస్తరణ..

సాహసానికి మారుపేరుగా నిలిచే ఈ క్రీడలో సరికొత్త రికార్డులు సొంత చేసుకునే తహతహ యువతలో ఏర్పడుతోంది. యువత ఉత్సాహాన్ని చూసి నగరంలో అనేక అడ్వెంచర్ క్లబ్‌లు సైతం పుట్టుకొచ్చాయి. జిహెచ్‌ఎంసీ కూడా ఐదారేళ్ల నుంచి రాక్ క్లైంబింగ్ సెంటర్లను ఏర్పాటుచేస్తోంది. దుర్గమ్ చెరువు, వౌలాలీ, తిరుమలగిరి, లాంకోహిల్స్ వంటి ప్రదేశాలను ఎంపికచేసి యువతను ఆహ్వానిస్తోంది. రాక్ క్లైంబింగ్ సంఘాలు సైతం ఏర్పడ్డాయి. ఒకప్పుడు ఇరవై అడుగులు కొండను ఎక్కేవారు. అది వంద అడుగుల వరకు చేరింది. ఇపుడు జపాన్, వియత్నాం, థాయిలాండ్, యూరప్ వంటి దేశాల తరహాలో రెండు వేల అడుగులు ఉండే కొండలను సైతం యువత ఉత్సాహాంగా అధిరోహిస్తోంది. వీకెండ్ సెలవులు వచ్చాయంటే పబ్‌లు, క్లబ్బ్‌ల్లో కాలం వెళ్లదీయకుండా ఈ సాహస క్రీడల్లో పాల్గొంటుంది. వరంగల్ కలెక్టర్ ఆమ్రాపాలి ఇటీవలనే ట్రెక్కింగ్‌లో పాల్గొని యువతను ఉత్సాహపరిచారు. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో నిజాయితీ, సాహసమైన అధికారిగా పేరుగడించిన డైరెక్టర్ అకున్ సబర్వాల్ పర్వతారోహణ చేసినవారే. రాక్ క్లైంబింగ్ అనేది సాహసమైన వ్యాయామం అని అంటారు అకున్ సబర్వాల్. ఇది ఆసియా క్రీడల్లో ఒక భాగం. విభిన్న కోణాల్లో అధిరోహించే ఈ క్రీడను విభిన్న పదజాలంతో పిలుస్తారు. 30 డిగ్రీల కోణంలో ఉండే రాయిని అధిరోహిస్తే హిమానీనదం అని అంటారు. 30 నుంచి 75 అభిముఖంలో అధిరోహిస్తే స్లాబ్ అని పిలుస్తారు. 70 నుంచి 90 అంతకంటే 120 డిగ్రీల కోణంలో అధిరోహిస్తే సీలింగ్ అని అంటారు. ఇలా విభిన్న విభాగాల్లో యువత శిక్షణ తీసుకునేందుకు ముందుకు వస్తోంది.

మానసిక ఆరోగ్యానికి దోహదం..

కొండలను ఎక్కటం వల్ల కేవలం శారీరక ఆరోగ్యమే కాదు మానసికి ఆరోగ్యం కలుగుతుంది. చాలామంది భౌతిక ప్రయోజనాలను ఆశించి ఈ క్రీడలో చేరుతుంటారు. కాని ఇది మనసుకు దగ్గరగా ఉండే క్రీడ అని చెప్పవచ్చు. ఓ విధంగా ధ్యానం వంటిదే అని అంటారు. శారీరక ఉత్తేజం కలుగుతుంది. చాలా తక్కువ సమయంలో శారీరక పరిమితులు లేవని నిరూపించుకునే క్రీడ. కేవలం 12 నిమిషాల్లో అనుకున్న లక్ష్యాన్ని పూర్తిచేయటానికి కావల్సిన శారీరక శక్తి సమకూరుతుంది. ఔత్సాహిక అధిరోహకులు ముందుకు వస్తుండటంతో జిహెచ్‌ఎంసీ అధికారులు కూడా ఈ క్రీడకుమెరుగులు దిద్దుతున్నారని జిహెచ్‌ఎసి హైదరాబాద్ క్లైంబర్ వూటూకూరు రంగా చెబుతున్నారు.

మంచుఖండంలో ప్రత్యూష కిరణాలు

యువత తలచుకుంటే సాధించలేనిది.. శోధించలేనిదంటూ ఏమీ ఉండదు. గజగజలాడించే చలిని. భగభగ మండే ఎండలను సైతం లెక్కచేయరు. అంటార్కిటికా అంటే మంచుతో కప్పబడ్డ ప్రాంతం. అక్కడకు వెళ్లాలంటే గుండె ధైర్యం ఉండాలి. హైదరాబాద్‌లో రేడియోజాకీగా పనిచేస్తున్న 29 ఏళ్ల ప్రత్యూషా అంటార్కిటికాను శోధించటానికి ఎంపికయ్యారు. క్లైమేట్ ఫోర్స్ అంటార్కిటికా(సిఎఫ్‌ఏ) యాత్రకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక భారతీయురాలు. ప్రపంచవ్యాప్తంగా 80 మంది ఎంపికవ్వగా అందులో ప్రత్యూషా ఒకరు.
రాబర్ట్ స్వాన్‌లో శిక్షణ పొందుతున్న ఈ రేడియో జాకీ సాహసయాత్ర చేయటంలోముందుంటారు. ప్రత్యూషాకు విహారయాత్రలు చేయటం అంటే మహాసరదా. ఆమె ఎక్కువ కాలం ప్రయాణాలు చేస్తూ.. విభిన్న ప్రాంతాలను చుట్టేస్తుంటారు. అక్కడి వాతావరణ పరిస్థితులు, సంస్కృతీ సంప్రదాయాలను పరిశీలిస్తుంటారు.
రాబర్ట్‌స్వాన్ ఆధ్వర్యంలో శిక్షణ
రాబర్ట్ స్వాన్ గురించి తెలియనివారు ఉండరు. నిరంతరం మంచుతో కప్పబడి ఉండే ఉత్తర, దక్షిణ ధ్రువ ప్రాంతాల్లో ముప్పయి మూడేళ్ల వయసులోనే తొమ్మిది వందల మైళ్లు నడిచిన ఏకైక విజేత.
మంచు ప్రాంతాల్లో అనే్వషణ చేసే ఆసక్తి ఉన్నవారికి ఈయన శిక్షణ ఇస్తుంటారు. అలాంటి రాబర్ట్ వద్ద ప్రత్యూష శిక్షణ తీసుకున్నారు. అంటార్కిటికా ఖండంలో ఉండే వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా కఠినమైన శిక్షణ తీసుకున్నారు. అంటార్కిటికాకు వెళ్లే టీమ్‌ను రాబర్ట్‌స్వాన్ లీడ్ చేస్తున్నారు.
జీవితకాలం గుర్తుండే సాహసం..
అంటార్కిటికా వెళ్లే టీమ్‌లో చోటు దక్కటం మధురానుభూతి. ఇది జీవితం కాలం గుర్తుండే సాహసయాత్ర. ఫిబ్రవరి 26న ప్రారంభమై మార్చి 12న ముగుస్తుంది. పదేళ్ల క్రితం రాబర్ట్ స్వాన్ నిర్వహించే నాయకత్వ సమావేశానికి వెళ్లాను. అపుడే ఈ సాహస యాత్ర గురించి తెలుసుకున్నాను. ఈ యాత్రలో పాల్గొనే అభ్యర్థుల ఎంపిక సుదీర్ఘకాలం పాటు జరిగే పక్రియ. దరఖాస్తు చేసుకోవటం, ఇంటర్వ్యూలో ఎంపికకావటం సంతోషాన్ని కలిగిస్తుందని చెబుతుంది ప్రత్యూష.
పిట్‌నెస్ కోసం..
ఈ అంటార్కిటికా సాహసయాత్రలో పాల్గొనాలంటే ఫిట్‌నెస్ సాధించాలి. ఇందుకోసం ప్రతిరోజూ యోగా చేస్తాను. జిమ్‌కు వెళ్లి ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాను. రాత్రివేళల్లో ఆ మంచు ఖండంలో ఉండటం కోసం శరీరాన్ని ఆ వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా మలుచుకునేందుకు ప్రత్యేక శిక్షణ అవసరం. అందుకే ఫిట్‌నెస్‌ను జీవితంలో భాగంగా చేసుకున్నాను. ఈ యాత్రకు దాదాపు 17 లక్షల రూపాయలు ఖర్చవుతోంది. ప్రభుత్వం సహాయం చేస్తుందని ఆశిస్తున్నాను. తొలుత విమానంలో అర్జెంటీనా వెళ్లి అక్కడ నుంచి యాత్ర ఆరంభమవుతోంది. రాబర్ట్‌స్వాన్ ప్రస్తుతం తన కొడుకు బార్నేతో దక్షిణ ధ్రువ యాత్ర చేస్తున్నారు.
ఇలా తండ్రీకొడుకులు కలిసి దక్షిణ ధ్రువ ప్రాంతంలో యాత్ర చేయటం అనేది చరిత్రలోనే అరుదైన విషయం. అక్కడ నుంచి వచ్చిన తరువాత రాబర్ట్‌స్వాన్ మాకు శిక్షణ ఇస్తారు. ఇలాంటి గొప్ప వ్యక్తి వద్ద శిక్షణ తీసుకోవటం చాలా సంతోషాన్ని ఇస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులందరూ కూడా ఈ అంటార్కిటికా యాత్రపై చాలా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారని ముగించింది ప్రత్యూష. మూడుపదులు దాటని వయసులో మంచుఖండంలో ప్రత్యూష చేస్తున్న ఈ యాత్ర యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

నాకు ప్రయాణాలంటే ఎంతో ఇష్టం. ఇప్పటికే హిమాలయాలు, లడఖ్ ప్రాంతాలకు ఎన్నోసార్లు వెళ్లివచ్చాను. ట్రెక్కింగ్, సైక్లింగ్ కూడా ప్రాణం. అంటార్కిటికా యాత్ర కోసం శారీరక దృఢత్వం సాధించేందుకు ధ్యానం చేస్తుంటాను. జిమ్‌కు వెళుతుంటాను. అంటార్కిటికా జీవితకాలం గుర్తుండే గొప్ప సాహస యాత్ర. అంటార్కిటికా వెళ్లాలంటే దాదాపు 17 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వ సాయం, స్పాన్సర్స్ కోసం ఎదురుచూస్తున్నాను.

-ప్రత్యూష

- టి.ఆశాలత