రివ్యూ

సాదాసీదా పోలీస్ కథ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాకి ** ఫర్వాలేదు

** *** ***

తారాగణం:
కార్తీ, రకుల్ ప్రీత్‌సింగ్ అభిమన్యు సింగ్, బోస్ వెంకట్ సత్యన్, మనోబాల తదితరులు
కెమెరా: సత్యన్ సూర్యన్
సంగీతం: జీబ్రాన్
మాటలు: శశాంక్ వెనె్నలకంటి
నిర్మాతలు: ఉమేష్‌గుప్తా, సుభాష్ గుప్తా
రచన, దర్శకత్వం: సి.హెచ్ వినోద్

పోలీస్ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. హీరో పోలీస్ అయితే.. ఇక విలన్‌ల దుమ్మురేపడం...్భరీ డైలాగ్స్.. అదరగొట్టే యాక్షన్.. అబ్బో ఇలాంటి అంశాలకు కొదవలేదు. కానీ వీటన్నిటికీ భిన్నంగా వచ్చిన చిత్రమే ‘ఖాకి’. రియల్ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన చిత్రమిది. తమిళ హీరో కార్తీ.. తెలుగులో కూడా చక్కటి గుర్తింపును తెచ్చుకున్నాడు. కార్తీ కమర్షియల్ పంథాలో కాకుండా భిన్నమైన సినిమా చేస్తూ క్రేజ్‌ని పెంచుకున్నాడు. తాజాగా కార్తీ పోలీస్ పాత్రలో నటించిన చిత్రమిది. సి.హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా కార్తీ ఎలా నటించాడు.. అసలు ‘ఖాకి’ కథ ఏమిటి అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే...
1995 కాలంలో జరిగిన కథ నేపథ్యంలో సాగుతుంది. తమిళనాడు హైవే పరిసరాల్లో వరుసగా దోపిడీ హత్యలు జరుగుతుంటాయి. ఆ కేసుకు సంబంధించిన ఫైల్ అప్పుడే డిఎస్పీగా బాధ్యతలు తీసుకున్న ధీరజ్ (కార్తీ) వద్దకు వస్తుంది. ఆ కేసు ఫైల్ చదివి దోపిడీ హంతకుల్ని పట్టుకోకపోతే ఇంకా ప్రజలు చనిపోతారని నిర్ణయించుకున్న ధీరజ్ ఇనె్వస్టిగేషన్‌కు బయలుదేరుతాడు. భయభ్రాంతుల్ని చేసే ఒక దోపిడీ దొంగల ముఠా కేసు ఓ పోలీస్ ఆఫీసర్‌కి అప్పగిస్తే, అతను సిన్సియర్ పోలీస్ అయివుంటే.. ఆ కథ ఎలా వుంటుంది? ఆ దొంగల్ని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ ఎంత కష్టపడతాడు? కొంతమంది టీమ్‌తో కలిసి ప్రాణాలకు తెగించి దేశం మొత్తం తిరిగి కీలక ఆధారాలని సేకరిస్తారు ధీరజ్. వాటి ద్వారా కేసులోకి ఇంకాస్త లోతుగా వెళ్లి అసలు వాస్తవాల్ని కనుక్కొంటారు. ఆ వాస్తవాలు ఏమిటి? ఆ దోపిడీ హత్యల వెనకున్న ముఠా ఎవరు? వాళ్ల నేపథ్యం ఏమిటి, వాళ్లను ధీరజ్ ఎలా పట్టుకున్నాడు అనేదే సినిమా. ఈ సినిమాను అప్పట్లో ఈ కేసును డీల్ చేసిన పోలీసుల చర్యల ఆధారంగానే రూపొందించారు. పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసి డిఎస్పీగా చార్జ్ తీసుకుంటాడు ధీరజ్. అవినీతి, అక్రమాలపై విరుచుకుపడతాడు. దీంతో అతనికి ట్రాన్స్‌ఫర్ తప్పనిసరి అవుతాయి. కొన్ని సంవత్సరాలుగా హైవే పక్కనే వున్న ఓ ఇంట్లో దోపిడీ జరుగుతుంది. నగలు, డబ్బులు దోచుకెళ్లడమే కాకుండా, ఆ ఇంట్లో వారిని చంపేస్తారు. ఈ కేసుని ఇనె్వస్టిగేట్ చేయలేదని ధీరజ్‌కి అర్థమవుతుంది. ఒక టీమ్‌ని ఏర్పాటు చేసుకొని ఆ దొంగల ముఠా గురించి ఎంక్వయిరీ మొదలు పెడతాడు. ఇదంతా హవారియా అనే గ్యాంగ్ చేస్తోందని తెలుసుకుంటాడు. రాజస్థాన్‌కి చెందిన ఓమా (అభిమన్యుసింగ్) కొంతమందితో ముఠా ఏర్పరచుకొని దోపిడీలు, హత్యలు చేస్తున్నాడని తెలుస్తుంది. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఓమా గ్యాంగ్ ఎక్కడ వుందో పోలీసులు తెలుసుకోగలుగుతారు. అయితే ఆ ప్రదేశానికి వెళ్లి వాళ్లని అరెస్ట్ చేయడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే ఆ ఊరంతా ఓమా గ్యాంగ్‌కి సపోర్ట్‌గా వుంటుంది. ఇది తెలిసీ అక్కడికి వెళ్లిన ధీరజ్ బృందంపై దాడి చేస్తారు ఆ ఊరి జనం. అలాంటి పరిస్థితుల్లో ధీరజ్ బృందం హవారియా గ్యాంగ్‌ని పట్టుకోవడానికి ఎలాంటి పథకం వేసింది? హైవే పక్కన వుండే జనం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న వారి ఆగడాలకు పోలీసులు ఎలా అడ్డుకట్ట వేశారు? ఈ ప్రయత్నంలో ధీరజ్‌కి ఎదురైన సమస్యలు ఏమిటి? అన్నది మిగతా కథ.
హీరో కార్తీ పోలీస్ అధికారి పాత్రలో ఒదిగిపోయాడు. తన క్యారెక్టర్‌లో పూర్తిగా ఇన్‌వాల్వ్ అయ్యాడు. ప్రతీ సీన్‌లో అతడి కష్టం కనిపిస్తుంది. ప్రియగా రకుల్ తన పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. వారిద్దరి లవ్‌ట్రాక్ బాగుంది. హవారియా గ్యాంగ్ నాయకుడు ఓమా క్యారెక్టర్‌కి అభిమన్యు సింగ్ పర్‌ఫెక్ట్‌గా సూట్ అయ్యాడు. ఓమాగా తన పెర్‌ఫార్మెన్స్‌తో అందర్నీ భయపెట్టాడు. మిగతా పాత్రల్లో నటించిన వాళ్లు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక సాంకేతిక విభాగాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది ఫైట్‌మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ గురించి. సినిమా మొదలైనప్పటి నుండి చివరి వరకు ప్రతి పదినిమిషాలకు ఫైట్‌గానీ, ఛేజ్‌గానీ వుంటాయి. ప్రతి ఫైట్‌ని ఎంతో డిఫరెంట్‌గా కంపోజ్ చేసి ప్రేక్షకులని థ్రిల్ చేశాడు. సత్యన్ సూర్యన్ ఫొటోగ్రఫీ సినిమా ప్లస్ అయిం ది. ఎడిటర్ శివ నందీశ్వర్ ఎడిటింగ్ కూడా స్పీడ్‌గా వుంది. నిడివి పరంగా కాస్త ఎక్కువగానే వున్నా , ఎక్కడా బోర్ అనిపించకుండా ఎడిట్ చేశాడు. జిబ్రాన్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలోని ప్రతి సీన్‌ని బాగా ఎలివేట్ చేసింది. ఇక దర్శకుడు వినోద్ ఇలాంటి సబ్జెక్ట్‌ని డీల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. యదార్థ ఘటనల ఆధారంగా తయారు చేసుకున్న ఈ సబ్జెక్టులో ఎక్కడా సినిమాటిక్‌గా అనిపించే సన్నివేశాలు వుండవు. ప్రతి సీన్‌ని నేచురల్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. ఎంతో రీసెర్చ్ చేసి ఈ కథ రాసుకున్నట్లు తెలుస్తోంది. అసలు పోలీస్ వ్యవస్థ ఎలా వుంది? ఒక కేసుని ఎన్ని కోణాల్లో పరిశీలిస్తారు? చిన్న క్లూ దొరికితే దాని ఆధారంగా నేరస్తుల్ని ఎలా పట్టుకుంటారు? అనే విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించిన వినోద్ వాటిని సినిమాలో అప్లయ్ చేసి సక్సెస్ అయ్యాడు. రెగ్యులర్‌గా వచ్చే పోలీస్ కథలకు భిన్నంగా ఒక కొత్త బ్యాక్ డ్రాప్‌లో యదార్థ ఘటనల ఆధారంగా తీసిన చిత్రం ‘ఖాకి’. హీరో కార్తీ, దర్శకుడు వినోద్ చేసిన ప్రయత్నం బావుంది. పోలీస్ పవర్ ఎలాంటిదో కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. సినిమాలో ఉత్కంఠకు గురిచేసే సన్నివేశాలు చాలానే వున్నా, అవి అనుకున్నంత పేలలేదు. ముఖ్యంగా పోలీస్ ఇనె్వస్టిగేషన్ సీన్స్, ఇంటర్వెల్, సెకండాఫ్, క్లైమాక్స్ సన్నివేశాల విషయంలో మరింత జాగ్రత్త పడాల్సింది. కార్తీ పెర్ఫార్మెన్స్, వినోద్ దర్శకత్వం ఆకట్టుకుంటాయి. అయితే లవ్‌ట్రాక్ మాత్రం పేలవంగా వుండి బోర్ కొట్టిస్తుంది.

-త్రివేది