మెయిన్ ఫీచర్

‘రుద్రమదేవి’ ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఒక దృశ్యం, గ్రంథం, చిత్రం నచ్చనంత మాత్రాన తలలు తీస్తాం, ముక్కులు కోస్తాం’ అని బెదిరించటం
అప్రజాస్వామికం’ అని భారత ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడు హెచ్చరించారు. ఇప్పుడు తెలుగులో
‘రుద్రమదేవి’, హిందీలో ‘పద్మావతి’ చిత్రాలు వివాదాస్పదమయ్యాయి. ఈ రెండూ చారిత్రక చిత్రాలే. రుద్రమదేవి కాలం క్రీ.శ.1250. పద్మావతి కాలం 1303. ఒకరు వరంగల్‌కు, మరొకరు రాజస్థాన్‌లోని మేవాడ్‌కు చెందినవారు. రుద్రమదేవి
చిత్రానికి రావలసిన స్థాయిలో నంది పురస్కారాల విషయంలో గుర్తింపు రాకపోవడానికి కారణం ఆమె తెలంగాణ రాణి. తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ, పురస్కారాలు ఇచ్చుకోనివ్వండి అని భావించినట్లు తెలుస్తున్నది.

ఇన్ని వివాదాలు ఎందుకు వస్తున్నాయి? ఇది ప్రచారం కోసమా? లేక అజ్ఞానం వల్లనా?

‘ఒక దృశ్యం, గ్రంథం, చిత్రం నచ్చనంత మాత్రాన తలలు తీస్తాం, ముక్కులు కోస్తాం’ అని బెదిరించటం అప్రజాస్వామికం’ అని భారత ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడు హెచ్చరించారు. ఇప్పుడు తెలుగులో ‘రుద్రమదేవి’, హిందీలో ‘పద్మావతి’ చిత్రాలు వివాదాస్పదమయ్యాయి. ఈ రెండూ చారిత్రక చిత్రాలే. రుద్రమదేవి కాలం క్రీ.శ.1250. పద్మావతి కాలం 1303. ఒకరు వరంగల్‌కు, మరొకరు రాజస్థాన్‌లోని మేవాడ్‌కు చెందినవారు. రుద్రమదేవి చిత్రానికి రావలసిన స్థాయిలో నంది పురస్కారాల విషయంలో గుర్తింపు రాకపోవడానికి కారణం ఆమె తెలంగాణ రాణి. తెలంగాణ ప్రభు త్వం సబ్సిడీ, సింహ పురస్కారాలు ఇచ్చుకోనివ్వండి అని భావించినట్లు తెలుస్తున్నది. ఇది చారిత్రక అజ్ఞానానికి నిదర్శనం.
రుద్రమదేవి భర్త నేటి పశ్చి మ గోదావరి జిల్లాలోని నిడదవోలుకు చెందినవాడు. గణపతి దేవుని భార్య కృష్ణా జిల్లాలోని కొయ్యూరుకు చెందిన రాణి. గణపతి దేవుని గజసేనాని జాయప్ప ఇక్కడివాడే. నేటి అమరావతిని నాడు కోట వంశస్థులు పాలించేవారు. వీరు గణపతిదేవునితో వైవాహిక సంబంధం పెట్టుకొన్నవారు. అంటే నేటి అమరావతి నాటి కాకతీయ సామ్రాజ్యం ఒకటే!! ఇది చారిత్రక సత్యం! తెనాలిలో కాకతీయుల మిలటరీ ట్రైనింగ్ క్యాంప్ ఉంది. శ్రీశైలం సమీపంలోని దోరణాల వద్ద కాకతీయుల రిజర్వ్ మిలటరీ సైన్యం ఉండేది. నేటి అమరావతి రాజధానికి సమీపంలోని మందడంవద్ద కాకతీయ యూనివర్శిటీ ఉండేది. మోటుపల్లి నుండి కాకతీయుల ఉత్పత్తులు పడవలపై సుదూర తీరాలకు వెళ్లేవి. తెలంగాణలోని ప్రముఖ చరిత్రకారుడు ఆదిరాజు వీరభద్రరావు తన ఆంధ్ర మహానగరం అనే గ్రంథంలో కొలనుపాక, భువనగిరి కోట ఓరుగల్లు ప్రముఖ ఆంధ్ర నగరాలు అని పేర్కొన్నాడు. మహాకవి తిక్కన ఓరుగల్లు వచ్చి కొంత సైన్యాన్ని నెల్లూరు యుద్ధం కోసం తీసుకొనిపోయాడు. ఒంగోలుకు ఆనుకొని వున్న కరవది అనే గ్రామంలో కామయ్య బొప్పండు 1310 ప్రాంతంలో ఒక శిలాశాసనం వేశాడు. దాని ముక్క (శిథిలభాగం) స్థానిక రామలింగేశ్వర దేవాలయంలో చూడం డి. శాసన పూర్తి పాఠం నా వద్ద ఉంది. అందులో కామ య్య బొప్పండు తను ప్రతాప రుద్రదేవుల వారి పేరుమీద ఈ శాసనం వేస్తున్నట్లు చెప్పాడు. ఇలాంటి శాసనాలు ఇంకా ప్రకాశం జిల్లాలో, గుంటూరు జిల్లాలో కోకొల్లలుగా లభించాయి. ఇప్పుడు చెప్పండి- రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు ఎవరు? వీరు ఆంధ్ర రాజులు. అంటే రుద్రమదేవి చిత్రానికి పురస్కారాలు సబ్సిడీ ఇవ్వకపోవటం తప్పు కదా! ఈ క్రింది శ్లోకం చూడండి. దీనిని రచించినవాడు విద్యానాధ పండితుడు. ఈ శ్లోకం ప్రతాపరుద్రీయంలో భూషణము అనే సంస్కృత గ్రంథంలో ఉంది. ‘‘రే రే ఘర్జర!’’ అని ఈ శ్లోకం ప్రారంభమవుతుంది. దీని తాత్పర్యం ఏమంటే- ‘‘ఓ గుజరాత్ సైన్యమా! ద్రవిడ సైన్యమా! మహారాష్ట్ర సైన్యమా! మధ్యప్రదేశ్ సైనికులారా! బెంగాల్ సైనికులారా! జాగ్రత్తగా ఉండండి. ఇదుగో మా కాకతీయ ప్రతాపరుద్ర ప్రభువుల వారి ఆంధ్ర సైన్యం ఓరుగల్లు నుండి యుద్ధానికి బయలుదేరింది’’-
ఇక్కడ ఒక స్వవిషయం చెబుతాను. మా ఇంటిపేరు ముదిగొండ. ఈ పేరు గల గ్రామాలు రెండు. తెలంగాణలోని నల్గొండ- ఖమ్మం జిల్లాల్లో ఉన్నా యి. 1323 సెప్టెంబరులో ఉలుగ్‌ఖాన్ ఓరుగల్లును ఆక్రమించుకున్నాడు. అప్పుడు వేల సంఖ్యలో చంపబడ్డారు. మిగిలినవారు కృష్ణానది పరీవాహక ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. అందువల్లనే నేడు గుంటూరు, తెనాలి, ఈమని వంటి ప్రాంతాలల్లో ముదిగొండ అనే ఇంటిపేరుగల చాలా కుటుంబాలు ఉన్నాయి.
పాల్కురికి సోమనాథుడు రెండవ ప్రతాపరుద్రుని కాలం నాటివాడు. ఆయన 40 గ్రంథాలు రచించాడు. అందులో తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలో జన్మించిన పండితారాధ్యుడు అనే శివయోగి జీవితంలో బృహత్ గ్రంథం రచించాడు. రెండవ గ్రంథం బసవపురాణం. ఇందులో కథానాయకుని పేరు బసవన్న. ఈయన తాతముత్తాతలు విజయవాడకు చెందినవారు. పాఠకులకు విజ్ఞప్తి ఏమిటంటే, ఈ చారిత్రకాంశాలను గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు, సిద్ధరామయ్య, కల్వకుంట్ల చంద్రశేఖరరావుగార్ల దృష్టికి వచ్చేటట్లు చేయండి.
ఇప్పుడు చెప్పండి రుద్రమదేవి ఎవరు?
ఈమె ఆంధ్రుల ఆడబడుచు. ఒకవేళ జ్యూరీకి ఈ గుణశేఖర్ చిత్రంలో ఎట్టి కళాత్మక విలువలు కనపడని కారణంగా ఉత్తమ చిత్రంగా ఎంపిక చేయకపోతే అది వారి ఇష్టం. అంతేకాని- రుద్రమదేవి తెలంగాణాకు చెందింది. శాతకర్ణి అమరావతికి చెందినవాడు అని భావించటం చరిత్ర జ్ఞానం లేని వారు అనుకోవాలి.
ప్రజలకు రాజకీయ నాయకులకు సినీ నిర్మాతలకు చారిత్రక జ్ఞానం లేకపోతే వ్యవహరించి తమ కులస్థురాలికి అవార్డు ఇవ్వలేదు అనే వ్యాఖ్యానమూ ఉంది. అసలు జ్యూరీ కులంపై ప్రసక్తి తీసుకొని రాకూడదు. ‘పద్మ’ అనే క్రిటిక్ 27 నవంబరు 2017 జాగృతి వారపత్రికలోని ఒక వ్యాసంలో ‘‘రుద్రమదేవి తెలంగాణాకు సంబంధించిన మూవీ కాబట్టి పన్ను మినహాయింపు అవార్డు పొందలేకపోయింది- అనే ప్రాంతీయ విద్వేషాన్ని మూటగట్టుకోవలసి వచ్చింది (12వ పుట). ఈ విమర్శకు శాసనాధారాలతో రుద్రమదేవి ‘ఆంధ్రుల రాణి’, ‘కమ్మ కులస్థురాలు’ అని నేను నిరూపించాను కదా!
రుద్రమదేవికి రాయితీ ప్రకటించిన ముఖ్యమంత్రి వెలమ కులస్థుడు. రాయితీ తిరస్కరించినవాడు కమ్మ కులుస్థుడు. కాబట్టి ఝాన్సీ రాణి, రుద్రమదేవి చిత్తూరు రాణి పద్మిని వీరు ఒక ప్రాం తానికి ఒక భాష ఒక కులానికి చెందినవారు కాదు. వీరి వారసత్వం మొత్తం హిందూ జాతికి చెందుతుంది అని ఆలోచించడమే జాతీయ సమైక్యతకు తోడ్పడుతుంది. కళాదర్శనానికి కులాలతో కాక గుణాలతోనే సంబంధం ఉంటుంది. (గుణము = మార్కులు వేయటం అని మరొక అర్థం).
1975లో హైదరాబాద్‌లో సినిమాలు నిర్మించేవారికి ప్రోత్సాహకాలుగా లక్ష రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. అప్పుడు ఎక్కువగా ఐ.వి.శశి అనే మలయాళ దర్శకుడు నిర్మించిన చిత్రాలకు సబ్సిడీ లభించింది. ఆ కమిటీలో నేను, జి.ఎస్.వరదాచారి (జర్నలిస్టు) సభ్యులం. శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారు కమిటీ అధ్యక్షుడు. శ్రీమతి శ్రీరాజ్యం సిన్హా (కృష్ణా జిల్లా, కమ్మ)- డైరెక్టర్ సమాచార శాఖ కో-ఆర్డినేటర్- నేను వీర శైవుణ్ణి- వరదాచారి వీర వైష్ణవుడు. అయినా ఎవ్వరూ మమ్మల్ని పల్లెత్తు మాట అనలేదు. ఎట్టి ఆక్షేపణలూ రాలేదు. లక్షలకు లక్షల డబ్బు నిర్మాతలు తీసుకొనిపోయారు.
2018 నవంబర్‌లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలతో సహా సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. అందుకని ఏదో వివాదం ప్రతిపక్షాలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యాస రచయితకు టిఆర్‌ఎస్‌తోను, తెలుగుదేశంతోనూ ఎట్టి సంబంధమూ లేదు. కాని ఈ ఇద్దరు ముఖ్యమంత్రులూ ఎంతో శ్రమించి పనిచేస్తున్నారని మాత్రం నమ్ముతున్నాను.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్