మెయిన్ ఫీచర్

స్నేహగీతం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ ఇంటిలో అడుగుపెడితే ఆ ఇంటి గోడలు సరిగమలు వినిపిస్తాయి. ఆ ఇంటిలో ఉండే ప్రతి వస్తువు రాగాలాపన చేస్తోంది. అదే పండిట్ శంకర్‌జీ కుటుంబం. ఆ కుటుంబ పాటల పూదోట నుంచి మరో కుసుమం వికసించింది. ఆ కుసుమమే స్నేహా శంకర్. ఔత్సాహిక గాయకురాలిగా తనను తాను నిరూపించుకుంటున్న పదకొండేళ్ల స్నేహా శంకర్ సంగీత వినీలాకాశంలో మెరుస్తున్న మరో నక్షత్రం. పిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు. కాని స్నేహా శంకర్ పసిప్రాయం నుంచే సంగీత పరికరాలతో ఆడుకోవటం అలవాటుగా చేసుకున్నారు. మ్యూజిక్ పరికరంతో స్టేజ్ మీదకు రాగానే కరతాళ ధ్వనులు వినిపిస్తాయి. మెగా మ్యూజిక్ రియాలిటీ షో విజేత. ఆసియా సింగింగ్ సూపర్‌స్టార్ ప్రోగ్రామ్‌లోనూ, అలాగే 2016లో జరిగిన ‘సరిగమప’ ప్రోగ్రామ్‌లోనూ స్నేహ తన గానమాధుర్యంతో మంత్రముగ్ధులను చేసింది.
ముంబయిలో పుట్టిపెరిగిన స్నేహ శంకర్ సుప్రసిద్ధ సుఫీ గాయకులు శ్రీశంకర్జీ మునిమనవరాలు. మూడేళ్ల వయసు నుంచే తండ్రి రామ్ శంకర్ నుంచి శాస్ర్తియ సంగీత పాఠాలు నేర్చుకోవటం ఆరంభించారు. తండ్రి శిక్షణలో సుస్వరాలు అందించే కోయిలగా మారారు. ఎన్నో సంగీత పోటీల్లో పాల్గొన్నారు.
తండ్రి శిక్షణలో..
తండ్రి శిక్షణలోనే స్నేహ గాయకురాలిగా తొలి అడుగులు వేసింది. ప్రతిరోజూ కనీసం అరగంట సేపు సాధన తప్పనిసరి. ఇప్పటి వరకు కూడాఈ సాధన చేయటం ఏనాడు మరువలేదు. తన గారాలపట్టి సంగీత సాధనకు అనుగుణంగానే తండ్రి రామ్ శంకర్ తన రోజూవారీ షెడ్యూల్‌ను మలుచుకుంటారంటే అతిశయోక్తి కాదు. తండ్రి పాడిన వీడియోలను ప్రతినిత్యం స్నేహ చూస్తుంటుంది. రెండేళ్ల వయసులోనే తండ్రి వీడియోను గమనించిన ఆ చిన్నారి తండ్రి పెదాల కదలికలను ఇట్టే పసిగట్టింది. తల్లిదండ్రుల ఆకాంక్ష మేరకే గాయకురాలిగా తనను తాను మలుచుకుంటుంది.
స్నేహా తన తండ్రి వలే కాకుండా ఘోషల్, అజిత్‌సింగ్ వలే ప్లేబాక్ సింగర్‌గా స్థిరపడాలని ఆరాటపడుతోంది. లతామంగేష్కర్‌జీ, ఆషాభోంస్లే పాటలు అంటే ఎంతో ఇష్టం. వాటినే ఆమె తన ప్రోగ్రామ్స్‌లో పాడుతుంటుంది. ఇంత చిన్న వయసులోనే పాటలు పాడటానికి భయపడుతున్నారా అని ప్రశ్నిస్తే.. పాట అంటే భయం లేదు ప్రేమ ఉంది అని చెబుతుంది. ఎలాంటి బెరుకు భయం లేకుండా వేదికమీద ఆమె పాడుతుంటే ప్రేక్షకులు తన్మయులవుతారు. శంకర్ మహాదేవన్, సురేష్ వడేకర్ వంటి సంగీతకారులు ఓ నటుడులో చిత్రంపై నమ్మకాన్ని కలిగిస్తారని స్నేహాశంకర్ నిశ్చితాభిప్రాయం. తన పాఠశాలలోనే కాదు ముంబయిలోని అనేక పాఠశాలల్లో స్నేహాశంకర్ కచ్చేరీలు చేస్తోంది. పాఠశాల పాఠాలను టీచర్లు సైతం మళ్లీ బోధిస్తూ ఆమెను ప్రోత్సహిస్తారు. ఈ వయసులో పిల్లలు ఐస్‌క్రీమ్స్, కూల్‌డ్రింక్స్‌ను అమితంగా ఇష్టపడుతుంటారు. కాని స్నేహ శంకర్ సంగీతపై ఉండే మక్కువ వల్ల వాటిని అసలు ముట్టుకోదు. తన ఇతర అలవాట్లు గురించి చెబుతూ.. సంగీతమే ఆట. సంగీత పరికరాలే ఆట వస్తువులు అని అంటుంది. నాకు విసుగు అనిపించినపుడు పియానో వాయిస్తాను. స్నేహితులతో సైకిల్ తొక్కుతూ ఆనందాన్ని పొందుతానని ముగించింది.