మెయిన్ ఫీచర్

పిల్లలు బయటకు వెళితే భయమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలు బయటకు వెళితే వాళ్లు వచ్చే వరకూ నాకు భయంగా ఉంటుంది. తరచూ ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అడుగుతుంటాను అని అంటుంది ఒకనాటి బాలీవుడ్ అగ్రనటి శ్రీదేవి. మీడియాకు దూరంగా ఉండే శ్రీదేవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పిల్లలు, కుటుంబ విషయాలను, అభిరుచులను మీడియాతో ముచ్చటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
పిల్లలకు తమిళం మాట్లాడటం రాదు. నా మాతృభాష తెలుగు. నేను ఎక్కువ సమయం చెన్నై, ముంబయిలో గడిపాను.
ఇపుడున్న సామాజిక పరిస్థితుల్లో పిల్లలకు భద్రత లేదని తల్లిగా ఫీల్ అవుతుంటాను. జాహ్నవి, కుషీ ఇద్దరికీ ఓకేరకమైన రూల్స్ ఉంటాయి.ఏ టైమ్‌కల్లా ఇంటిలో ఉండాలో వారికి తెలుసు. ఆ టైమ్‌కు ఇంటికి వచ్చేస్తుంటారు. అలాగే లేటయితే ‘‘ప్లీజ్ మామ్ అరగంట’’ అని అడుగుతారు. వారికి వారి లిమిట్స్ తెలుసు. ఎపుడూ ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదు.
నేనేమి హైటెక్ అమ్మను కాదు. ఈ విషయం వారికి కూడా తెలుసు. అలాగే నా తల్లి నాతో ఎలా ఉండేదో వారికి తెలియదు. సాధారణ తల్లిగానే వారితో మసులుకుంటాను.
వాళ్ల ఆరోగ్యం గురించి వారే జాగ్రత్తలు తీసుకుంటారు. వారికి వంట చేసిపెట్టను. కాని వంటగదిలోకి వెళ్లి వారికి ఏమేమి ఇష్టమో తెలుసుకుని అవి చేయించి పెడుతుంటాను.
జాహ్నవికి కేక్స్, కుకీస్ తయారుచేయటం తెలుసు. జాహ్నవి ఎక్కువ క్లోజ్‌గా ఉంటుంది. ఆమె చాలా సున్నితం. వినయంగానూ ఉంటుంది. నాగురించి, నా ఇష్టాలు పెద్దమ్మాయి జాహ్నవికే ఎక్కువ తెలుసు. కాని నా సినిమాలు ఎపుడూ చూడదు. హిందీ కూడా సరిగా రాదు. ఇపుడిపుడే నేర్చుకుంటోంది. ఉర్దూ బాగా మాట్లాడలేదు.
ప్రతి విషయాన్ని ఇద్దరు అమ్మాయిలు నాతో షేర్ చేసుకుంటారు. పిల్లలతో స్నేహితురాలిగానే ఉంటాను. ఒత్తిడిని తట్టుకునేలా వారిని వారే తీర్చిదద్దుకున్నారు. వాళ్లకు బాలీవుడ్‌లో రావాలని అనుకుంటే తల్లిగా నేను చేయాల్సింది చేస్తాను. వాళ్ల గురించి తలుచుకున్నపుడు సాధారణ తల్లిగానే గ్లిజరిన్ లేకుండానే అపుడపుడు కన్నీళ్లు రావటం సహజం.
మొదట్లో పిల్లలను సినిమా రంగంలోకి తీసుకురాకూడదు అని అనుకున్నాను. కాని ఇపుడు పిలల్లు సొంత నిర్ణయాలు తీసుకునే మానసిక స్థితి కలిగివున్నారు.
మీ అమ్మాయి జాహ్నవి సినిమాల్లోకి వస్తే ఏమి సలహాలు ఇవ్వాలనుకుంటున్నారని అని అడిగితే.. కష్టపడితే వందశాతం ఫలితాలు వస్తాయని అని చెబుతాను. శ్రీదేవికి పెయింటింగ్ అంటే అమిత ఇష్టం.
ఇప్పటికీ మిమ్మల్ని చూస్తే అభిమానులు క్రేజీగా ఫీల్ అవుతున్నారంటే చాలా సంతోషంగా ఉందని చెప్పారు.