మెయిన్ ఫీచర్

సాహితీ తపస్వి(క ళాంజలి )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కవిత్వం జీవితమంత విస్తృతం. జీవితం కవిత్వమంత సుందరం’’ అంటారు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ. అందరూ ఎస్వీ అని ఆత్మీయంగా పిలుచుకునే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ‘‘జీవితం ఊహ కాదు వాస్తవం. సాహిత్యం సమాజ చలనాలకు దర్పణం’’ అనే ఆయన జీవితంలో ఎన్నో శిఖరాలు ఎక్కినా, ఎంతో సాధించినా తొణకని నిండు కుండలా ఉంటారు. సభలలో జనరంజకంగా, చమత్కారంగా మాట్లాడుతూ నవ్విస్తుంటారు. ఎస్వీకి తెలుగు అంటే వల్లమాలిన అభిమానం. కవి, పరిశోధకుడు, విమర్శకుడు, సంపాదకుడు, వక్త. ఇలా ఎన్నో మంచి గుణాలు ఒక్కరిలో ఉండటం చాలా అరుదు. అయినా ఆయన మాట సున్నితం, మనసు నవనీతం.
పరిశోధకుడిగా ప్రస్థానం ఆరంభం..
ప్రొఫెసర్ ఎస్.వి.సత్యనారాయణ శ్రీ ఎస్.విఠల్‌రావు, శ్రీమతి ఎస్.రాధాబాయి దంపతులకు 16 ఆగస్టు 1954న హైదరాబాద్‌లో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగుచేసి అక్కడే ‘తెలుగులో ఉద్యమగీతాలు’ అనే అంశంమీద పరిశోధన చేశారు. ఆ తరువాత డా. బి.ఆర్.అంబేద్కర్ కళాశాలలో దాదాపు పది సంవత్సరాలు తెలుగు అధ్యాపకుడిగా పనిచేసి, ఆ తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా చేరారు. లెక్చరరు, రీడరు, ఆచార్యుడు, అక్కడ తెలుగు శాఖాధ్యక్షుడిగా ఎన్నో బాధ్యతలు నిర్వహించారు. వీరు ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్ష వర్గ సభ్యులుగా ఉన్నారు. విశాలాంధ్ర ప్రచురణాలయం, నవ చేతన ప్రచురణాలయ సంపాదక వర్గ సభ్యులుగా ఎంతో సేవలు అందించారు. సాహిత్యం సమాజాన్ని ప్రతిబింబించాలని, సమాజాన్ని ప్రగతి మార్గంలో నడిపించాలని ఎస్వీ ఆకాంక్ష. నిజమే కదా! కళ, సమాజం ఈ రెండు పరస్పర ఆధారమైనవే కదా! అభ్యుదయ సాహిత్యానికి నిరంతర వ్యాఖ్యాత ఎస్వీ. ఆయన ఒక ఉద్యమమూర్తి. కుల మతాలకు అతీతుడైన ఎస్వీ ఒక అంతర్జాతీయవాది. సాటి సాహిత్య మిత్రులతో, విద్యార్థులతో స్నేహితుడిగా, ఏ భేషజం లేకుండా ఉంటారు. అందరితో స్నేహంగా ఉండే ఎస్వీ ఆత్మగౌరవానికి నిబద్ధ మిత్రుడు.
రచయత.. మార్గనిర్దేశకుడు
ఎస్వీ ఎన్నో పరిశోధక వ్యసాలు ప్రచురించారు. 115 వ్యాసాలు, జాతీయ పత్రికలలో 320, అంతర్జాతీయ సదస్సులో 6 వ్యాసాలు సమర్పించారు. రాష్ట్ర, జాతీయ సెమినార్లలో 66 వ్యాసాలు సమర్పించారు. వీరు 25 గ్రంథాలు రచించి, 27 గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. ఎంతోమంది పరిశోధకులకు దారిదీపం అయ్యారు. ఎస్వీ మార్గదర్శిగా 3 పరిశోధనలు, ఎం.్ఫల్ పట్టా చేపట్టారు. 10 పరిశోధకులు పిహచ్‌డి పట్టా పొందారు.
ఆయన నేపాల్, సోవియట్ యూనియన్, ఈజిప్ట్, ఆస్ట్రేలియా మొదలగు దేశాలలో మన తెలుగు కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. ఎన్నో పదవులు చేపట్టన ఆయన ఇపుడు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం విసిగా ఉన్నారు. ఈయన నేతృత్వంలో యూనివర్శిటీలో మరింత మంది విద్యార్థులు భావి జీవితాన్ని నిర్దేశించుకోవాలని, ఈ విశ్వవిద్యాలయం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందాలని కోరుకుందాం.

సంపాదకత్వం వహించిన గ్రంథాలు

అగ్గిచిగుళ్ళు - కవితా సంకలనం- 1973
కవితాభ్యుదయం- కవితా సంకలనం- 1881
జాషువా సాహితీ స్థ్రానం- వ్యాస సంకలనం -1995
స్ర్తివాద వివాదాలు - వ్యాస సంకలనం - 1997
జన చైతన్య దీపం - సురవరం- వ్యాస సంకలనం- 1998
విధ్వంసం నేపథ్యం- కవితా సంకలనం -1998
దలిత వివాదాలు - వ్యాస సంకలనం - 2000
తెలంగాణ వీరనారి- ఆరుట్ల కమలాదేవి-
వ్యాస సంకలనం- 2001
నిర్విరామ కర్మయోగి వైవికె- 2001
నాలుగు రోడ్ల కూడలిలో నల్లటి రక్తపు మరకలు- 2002
ప్రపంచీకరణ ప్రతిధ్వని - కవితాసంకలనం- 2003
గ్లోబలైజేషన్ కథలు - కథా సంకలనం- 2003
అఖిలభారత అభ్యుదయ రచయిల సంఘం
ప్రత్యేక సంచిక - 2003
కె.రాజేశ్వరరావురచనలు - రచనల సంపుటి - 2005
ఆధునిక సాహిత్యం ప్రక్రియలు, ధోరణులు -
వ్యాస సంకలనం- 2005
పార్థివ- ఉగాది కవితలు - 2005
కె.రాజేశ్వరరావు గేయాలు - గేయా సంపుటి- 2006
కమ్యూనిస్టు ఉద్యమగీతాలు - గీతికాసంకలనం - 2007
మేడే గీతాలు - గీతికా సంకలనం - 2007
కవితా దశాబ్ది - గీతికా సంకలనం - 2008
అరుణకేతనం - గీతికా సంకలనం - 2008
దశాబ్ది కవిత -కవితా సంకలనం- 2013
తెలుగు సాహితీ వీచిక- 2013
జాషువా సాహిత్య నేపథ్యం (పునర్ముద్రణ)-
వ్యాస సంకలనం- 2014
జాషువా సాహిత్య సమాలోచనం- వ్యాస సంకలనం - 2011
ఉత్తరాంధ్ర కథలు - కథా సంపుటి- 2016

పురస్కారాలు - సత్కారాలు

సుంకర సాహిత్య పురస్కారం
డా. చెలికాని రామారావు స్మారక సత్కారం
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి
పురస్కారాలు
యునైటెడ్ చిల్డ్రన్స్ మూవ్‌మెంట్, న్యూఢిల్లీ
పద్మమోహన ఆర్ట్ థియేటర్స్ పురస్కారం
తుమ్మల వెంకట్రామయ్య సాహితీ పురస్కారం
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘంవారి భాషా పురస్కారం
వేములపల్లి శ్రీకృష్ణ స్మారక పురస్కారం
పులుసు వెంకట శివయ్య సాహితీ పురస్కారం
బొల్లిముంత శివరామకృష్ణయ్య సాహితీ పురస్కారం
యునైటెడ్ రైటర్స్ అసోసియేషన్, చెన్నై వారిచే లైఫ్
అఛీవ్‌మెంట్ అవార్డు
హిమగిరి ఆర్ట్ థియేటర్స్, శ్రీశ్రీ సాహితీ పురస్కారం
వంశీ ఇంటర్నేషనల్ వారి శ్రీశ్రీ స్వర్ణపతకం
తంజీమ్ సహెపుజే ఉర్దూవారి ఉత్తమ కవి పురస్కారం
డా.ఆవంత్స సోమసుందర్ సాహిత్య విమర్శ పురస్కారం
పురిపండ అప్పలస్వామి సాహితీ పురస్కారం
పల్లేరు స్వయంప్రభ సాహితీ పురస్కారం
దాశరథి సాహిత్య పురస్కారం
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం వారి రాష్ట్ర స్థాయి మాతృభాషా పురస్కారం
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి
సాహితీ పురస్కారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభ్వుం వారి ఉత్తమ అధ్యాపక పురస్కారం
డా.పట్ట్భా కళాపీఠం వారి గిడుగు స్మారక ప్రతిభా పురస్కారం

కలం నుంచి జాలువారిన రచనలు

సరిగమలు - లలిత గీతాలు 1978
ఉద్యమం - ఉద్యమ గీతాలు- 1982
జీవనజ్వాల - వచన కవిత -1985
రేఖాచిత్రాలు - సాహిత్య వ్యాసాలు- 1987
తెలుగులో ఉద్యమ గీతాలు- సిద్ధాంత వ్యాసం, 1991
యుద్ధం జరుగుతూనే వుంది- కవిత- 1992
ఆలోచన- సాహిత్య వ్యాసాలు- 1996
దళిత సాహిత్య నేపథ్యం- విశే్లషణ- 1997
అవిశ్రాంత పోరాటయోధుడు తమ్మారెడ్డి- జీవత చరిత్ర - 1998
తెలంగాణ సాయుధ పోరాట సాహిత్యం- విశే్లషణ- 1999
ప్రజల మనిషి ధర్మభిక్షం- జీవిత చరిత్ర - 2001
మహిళోద్యమ నాయకురాలు శ్రీమతి యార్లగడ్డ భాగ్యవతి- 2002
అభ్యుదయ సాహిత్యం - ఇతర ధోరణులు- విశే్లషణ- 2003
ఆధునిక సాహిత్యం - విభిన్న ధోరణులు- 2004
తెలుగులో ఉద్యమ గీతాలు- పరిష్కృత, సంక్షిప్త ముద్రణ- 2005
జీవితం ఒక ఉద్యమం- కవితా సంపుటి- 2005
తెలంగాణ విమోచనోద్యమం- సాహిత్యం- 2005
దృక్పథాలు- ఆధునిక కవితా విశే్లషణ- 2009
విశే్లషణ- సాహిత్య వ్యాసాలు - 2001
తెలుగులో అభ్యుదయ సాహిత్యం- చరిత్ర - 2012
సత్యానుశీలన- సాహిత్య వ్యాసాలు - 2012
జీవన్ ఏక్ సంఘర్ష్ (హిందీ)-కవిత 2013
లైఫ్ ఈజ్ ఏ మూవ్‌మెంట్ (ఆంగ్లం)- కవిత - 2016

డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి