మెయిన్ ఫీచర్

బురఖాలపై అపోహలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్యనే ప్రచురితమైన ముస్లిం మహిళలు బురఖాలు ధరించడంపై వచ్చిన వ్యాసం చదివిన తరువాత కలిగిన ఆవేదనతో ప్రతిస్పందించడం జరిగింది. అదేదో బలవంతంగా స్ర్తిలను బురఖాలను ధరింపజేస్తున్నట్లు వ్యాఖ్యానించడం శోచనీయం. ఎంతోమంది అమ్మాయిలు స్వచ్ఛందంగానూ..యిష్టపూర్వకంగానూ బురఖాలు ధరించి కాలేజీలకు, ఆఫీసులకు వెళ్తుండటం చూస్తున్నాం. ఒకవేళ ఇంట్లో తల్లో, తండ్రో బలవంతంగానైనా బురఖాను ధరింపజేస్తే అందులో తప్పేమిటి? ఆడవాళ్ల భద్రత కోసమే కదా!
సాంఘికపరంగా చూసినా నేడు మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, యాసిడ్ దాడులు, చెయిన్‌స్నాచింగ్‌లు, లైంగికదాడులు వారి దృష్టికి రాలేదా?
ఇన్ని దుష్కృత్వాలు జరుగుతున్న సమయంలో కూడా బురఖాకు వ్యతిరేకంగా మాట్లాడటం అర్ధరహితం. రక రకాల డ్రెస్సులు వేసుకుని, చీలికలు, పీలికలు వంటి వస్త్రాలు ధరించి అర్ధనగ్నంగా అంగాంగ ప్రదర్శన చేస్తుంటే సామాజిక పరంగానూ, కుటుంబపరంగానూ తలవొంపులు తెస్తుంటే వాటిని నిషేధించాలిగాని- నిండుగా సాంప్రదాయబద్ధంగా తన శరీర వొంపుసొంపులు పరాయి మగవాళ్లకు ఆకర్షించబడకుండా బురఖాను వేసుకుంటే తప్పేముంది. ముస్లిం స్ర్తిలు బురఖాలో ఉండి తమ భావోద్వేగాలను వ్యక్తంచేయలేరని, ఇది చాలా అమానుషమని పేర్కొనటం శుద్ధ అపవాదు. అవగాహన లేక చేసిన విమర్శ ఇది. బురఖాలు ధరించి విమానాలను నడిపిన వైనం ఉంది. దేశాలను ఏలిన వాళ్లున్నారు. యుద్ధంలో పాల్గొన్నవాళ్లున్నారు. మొన్నజరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనటం కూడా చూసే ఉంటారు. ఇటీవల హైదరాబాదులో ఓ పత్రికవారు నిర్వహించిన ఓ సభలో బురఖాలు ధరించే తమ ఉపన్యాసాలను అదర గొట్టేశారు. ఇంకా ఇలాంటి ఉదహరణలు ఎన్నో. బురఖాలు అనాగరికం అనటం సబబుకాదు. ఒకసారి ఓ విదేశంలో ఉగ్రవాదుల సమస్య వచ్చి పడినప్పుడు బురఖాల మాటున ఉగ్రవాదులు ఏదైనా ప్రమాదాలను సృష్టించవచ్చుననే భయంతో ఒకసారి బురఖాను వ్యతిరేకించటం జరిగింది. అంతేకాని సాంప్రదాయమైన బురఖాకు వ్యతిరేకం కాదు. ఆధునికత పేరిట స్ర్తిలను ఒక ప్రదర్శన బొమ్మగా మారుస్తూ అశ్లీలత, నిర్లజ్జత వంటి విష సంస్కృతిని సమాజాంలో వ్యాపింపజేస్తే మన మనుగడకు ముప్పు వాటిల్లటం తప్పదు. వాటిని కట్టడిచేస్తూ మన సమాజాన్ని కాపాడుకుందాం.
కాలంపేరిట మరొకరి ప్రాచీన సంస్కృతులను సాంప్రదాయాలను హద్దుల్ని చెరిపి వేయటానికి ప్రయత్నించటం అమానుషం. అనాగరికం.
అక్కడక్కడా అంతోయింతో మంచి సాంప్రదాయాలను పాటిస్తూ మన పూర్వీకులు ఆదేశించిన సూక్తులను పాటిస్తున్నారు. పెద్దలు ఎలాంటి సంస్కృతులను అలవర్చుకుంటే పిల్లలు కూడా అవే పాటిస్తుండటం పరిపాటి.
ఇది కాలం చెల్లిన ఛాందసవాదుల ధోరణి అసలే కాదు. కలకాలం వర్థిల్లాల్సిన నీతి, నియమాలు. పరదా ప్రగతికి అడ్డురాదు. యింకా చెప్పాలంటే బురఖా ఆడవారిపట్ల ఓ కవచంలాంటిది. ఇది ఒక దురాచారం కాదు అని మనవి చేసుకుంటున్నాను. అందరూ వివేకంతో దురాలోచనతో విశాలదృక్పథంతో ఆలోచిస్తారని ఆశిస్తున్నాను.

- పి.షహానాజ్, 9849229786