మెయిన్ ఫీచర్

కథల వల్లి.. కాంచనపల్లి(ప్రపంచ తెలుగు మహాసభలు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంచనపల్లి నడిచే కాంచనగంగ. ఆయన నల్గొండ సాహిత్య శిఖరం. నల్గొండ సాహితీ మూర్తిమత్వానికి ఒక నిలువెత్తు
తెలుగుటద్దం. ఏ విషయాన్ని గురించైనా ధారాళంగా, నిష్పక్షపాతంగా ప్రసంగించే ఓర్పు, నేర్పు కలిగిన వ్యక్తి. దాశరథి, సినారె, వట్టికోట, కాళోజీ, దేవులపల్లి వంటి స్నేహితుల్ని కలిగిన సౌజన్యమూర్తి. జిల్లాలోనే గాక రాష్ట్ర రాజకీయ ఉద్యమాలలో, సాహిత్యరంగంలో ప్రముఖ పాత్ర వహించిన
కాంచనపల్లి తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయుడు.

కాం చనపల్లి ఒక వ్యక్తి కాదు, గొప్ప మానవతా శక్తి. నల్గొండ సాహితీ లోకానికి ఆయనొక కాంచన శిఖరం, ఆయన జీవితమంటే నల్గొండ చరిత్రే. తెలంగాణ ప్రతిఘటనా చైతన్యాన్ని తన నవలల్లో, ప్రతిబింబించిన వట్టికోటి ఆళ్వార్‌స్వామి, తెలంగాణ వైతాళికులైన కొమర్రాజు ప్రజాకవి సుద్దాల హనుమంతు, గ్రంథాలయోద్యమానికి నీడనిచ్చిన రావిచెట్టు రంగారావు, తెలంగాణలో పత్రికా రంగానికి పునాదులు వేసిన షబ్నవీసు వెంకట నర్సింహారావు, దిగంబర కవితోద్యమానికి సాహిత్యాన్ని ఆయుధంగా ఉపయోగించిన చెరబండరాజు, నిఖిలేశ్వర్‌ల తర్వాత చెప్పుకోదగిన వ్యక్తి కాంచనపల్లి చిన వెంకటరామారావు.
తెలంగాణ విముక్తి ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కాంచనపల్లి కవిగా, కథకుడిగా, విమర్శకుడిగా, సాహితీవేత్తగా, న్యాయవాదిగా, కార్యకర్తగా, పత్రికా సంపాదకుడిగా, శాసనసభ్యులుగా సుప్రసిద్ధులు. ఆధునిక యుగంలో షబ్నవీసు మైలురాయిలాంటి వాడైతే అభ్యుదయ యుగంలో కాంచనపల్లి ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు. దాశరథి, వట్టికోటల తరువాత స్థానం కాంచనపల్లికే దక్కింది.
న్యాయవాద వృత్తిలో..
1942లో ‘లా’ పట్టాను పొంది నల్లగొండలో వకాలత్ ప్రారంభించారు. కాంచనపల్లి, మూడవ ఆంధ్రమహాసభ అధ్యక్షుడు, న్యాయవాది పులిజాల వెంకట రంగారావు వద్ద జూనియర్‌గా చేరారు. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని ఉరిశిక్షకు గురైన నల్లా నర్సింహులు, బాల నిందితుడిగా జైల్లో మగ్గిన ఎర్రబోతు రాంరెడ్డి తదితర కామ్రేడ్ల తరపున కాంచనపల్లి వాదించారు. శాసనసభ్యుడిగా పదవీకాలం పూర్తయిన తరువాత కూడా న్యాయవాద వృత్తిలో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. వామపక్ష ఉద్యమంతో, మమేకమైన న్యాయవాదులు అతి తక్కువగా ఉన్న రోజుల్లో, కాంచనపల్లి న్యాయవాద వృత్తిలో స్థిరపడడం పార్టీకి, ప్రజలకు ఎంతో మేలు చేసింది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కోర్టు కేసుల్లో ఇరుక్కుని ఉన్న వేలాదిమంది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధుల పక్షాన న్యాయస్థానాల్లో వాదించారు కాంచనపల్లి. తమ వాదనా పటిమతో అనేకమంది వీరులకు ఉరిశిక్ష పడకుండా, జైలుశిక్షలు పడకుండా కేసుల్లో విజయాన్ని సాధించారు.
భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా, పేదప్రజలపై దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, కాంచనపల్లి ఒక నిబద్ధ న్యాయవాదిగా జీవితాంతం నిలబడ్డారు. అమాయక గ్రామీణ ప్రజల పక్షాన, వ్యవసాయ కార్మికుల పక్షాన, పేద రైతాంగం పక్షాన న్యాయస్థానంలో బలమైన గొంతును వినిపించారు కాంచనపల్లి. ‘అన్యాయం’ పక్షాన ఏనాడూ వకాల్తా పుచ్చుకోరాదన్న నియమాన్ని జీవితాంతం పాటించిన నిష్కళంక న్యాయవాదిగా జిల్లాలో పేరు సంపాదించారు. వృత్తిరీత్యా న్యాయవాద ధర్మాన్ని ఎంత నియమబద్ధంగా గడిపారో, ఉద్యమరీత్యా నల్గొండ జిల్లాలో తలెత్తిన అన్ని ఉద్యమాలకు ‘పెద్దదిక్కు’గా నిలిచారు. అటు న్యాయవాద వృత్తికి, ఇటు సాహితీ ప్రవత్తికి న్యాయం చేకూర్చడం కాంచనపల్లి విశిష్ఠ వ్యక్తిత్వానికి నిదర్శనం.
రాజకీయాల్లో..
అప్పటి రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీ సభ్యులై ఎన్నో నిర్బంధ విధానాలను ఎదుర్కొన్నారు. 1947లో పోలీసు నిర్బంధానికి గురికాకుండా రహస్య జీవితంలో ఉండి 1948లో అరెస్టు కాబడి 1950 దాకా జైలు జీవితం గడిపిన ఉద్యమశీలి. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కృష్ణాజిల్లా రామాపురం గ్రామంలో అరెస్టయి కడలూరు, రాయవెల్లూరు, వరంగల్ జైళ్లలో ఏడాది శిక్షను అనుభవించారు. 1965లో మళ్లీ అరెస్టయి 6 నెలల తర్వాత విడుదలయ్యారు.
1952లో మొదటి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ జిల్లా చినకొండూరు నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా పిడిఎఫ్ తరపున ఎన్నికయ్యారు. శాసనసభాపక్ష ఉపనాయకునిగా పనిచేశారు. 1952 నుంచి 57 వరకు బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో పనిచేసిన కాంచనపల్లి 1957 తరువాత అ ప్రజాసంఘాలలో పనిచేశారు. 1962 నుంచి 64 వరకు నల్గొండ పంచాయతీ సమితి అధ్యక్షులుగా, జిల్లా సహకార మార్కెటింగ్ డైరెక్టర్‌గా ఉన్నత పదవుల్లో కొనసాగారు.
జిల్లా రచయితల సంఘంలో..
నల్గొండలో ఏర్పడిన ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహించిన సభలకు కాంచనపల్లి అధ్యక్షత వహించి ఘనంగా జరిపించారు. ఆ తర్వాత కాంచనపల్లి యువ రచయితల సంఘం అధ్యక్షుడిగా వుండి 1960లో జిల్లా యువ రచయితల మహాసభలను ఘనంగా నిర్వహించినారు. ఆ తర్వాత పూర్తికాలం జిల్లా రచయితల సంఘాధ్యక్షులుగా వుండి 1960లో జిల్లా యువత రచయితల మహాసభలను ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత పూర్తికాలం జిల్లా రచయితల సంఘాధ్యక్షులుగానే కొనసాగారు. వీరి ఆధ్వర్యంలో ఎన్నో గ్రంథావిష్కరణ సభలు, సాహితీ సదస్సులు, సాహితీ సంస్థల సాహిత్య కార్యక్రమాలెన్నో కన్నుల పండువుగా జరిగాయి. నల్లొండ జిల్లా రచయితల సంఘాల సంఘాన్ని స్థాపించి దానికి అధ్యక్షులుగా వుండి మూడుసార్లు 1970, 74, 83 ఏప్రిల్ 8, 9, 10 తేదీలలో జిల్లా మహాసభలను దిగ్విజయంగా జరిపి సాహిత్య చైతన్యాన్ని కలిగించిన ఘనత ఆయనకే దక్కింది. అందుకే జిల్లాలోని సాహిత్య సంస్థలకు ఆయన పెద్దదిక్కులాంటివారని, సాహిత్యరంగంలో భీష్మునివంటివారని కొనియాడుతుంటారు. వందలకొద్దీ కవులను, రచయితలను, కథకులను, నవలాకారులను ప్రోత్సహించిన గొప్ప సాహితీవేత్త.
పత్రికా సంపాదకుడుగా...
ఆ రోజుల్లో కాంచనపల్లి లిఖిత మాస పత్రికను కొంతకాలం నడిపారు. గోల్కొండ, శోభ, నీలగిరి, తెలంగాణ, ప్రజాశక్తి, విశాలాంధ్ర, అభ్యుదయ, ఆంధ్రభూమి, భారతి వంటి పేరున్న పత్రికలలో కాంచనపల్లి కథలు, కవితలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు ప్రచురితమైనాయి. నల్గొండ సాహితీమిత్రుల ఆధ్వర్యంలో 1972లో వెలువడిన దర్పణం సాహితీ త్రైమాస పత్రికకు కాంచనపల్లి సంపాదకునిగా పనిచేశారు. ఇందులో కవితలు, పద్యాలు, గేయాలు, వ్యాసాలు గ్రంథ సమీక్షలు వచ్చాయి. యువ రచయతల సమితి పక్షాన కాంచనపల్లి సంపాదకత్వంలో మాలిక, దర్పణం, సమర్పణ కథా సంకలనాలు, సైరన్, సంఘర్షణ కవితా సంకలనాలు వెలువడ్డాయి.
ఆనాడు సమగ్రంగా ఉన్న జిల్లా సాహిత్య చరిత్రను రాయడానికి ఎవరూ ముందుకు రాకపోతే కాంచనపల్లి పూనుకుని అజ్ఞాతంగా వున్న కవుల గురించి, మరుగునపడిన సంస్థల గురించి, జిల్లా రచయితల సమగ్ర సమాచారాన్ని అందించారు. నల్గొండ జిల్లా రచయితల మూడవ మహాసభల ‘సావనీర్’లో కాంచనపల్లి వ్యాసం ‘‘సాహిత్య వ్యవసాయంలో నల్గొండ జిల్లా కృషి’ అచ్చయింది.
కథా రచయితగా...
కాంచనపల్లి కవిగాకన్నా కథా రచయితగా గొప్పవారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యంలో, వామపక్ష ఉద్యమ చైతన్యంతో కథలు రాశారు. ఎంత గొప్ప రచయితో అంత గొప్ప మనిషి. తొమ్మిది కథలున్న ‘‘మన ఊళ్లో కూడానా?’’ కథల సంపుటిని 1973లో అరసం ప్రచురించింది. ఇందులో ఆరు కథలు 1940లో రాసినవి కాగా మిగిలిన మూడు కథలు మాత్రం 1972లో రాసినవి.
అవి 1. మన ఊళ్లో కూడానా?, 2. ఆకలి, 3.చెరువొడ్డున, 4. మీటింగు ముగిసింది, 5.దావతు, 6.బోడిబఱ్ఱె, 7.అదనం కోత 8. ప్రమోషన్ 9. జై తెలంగాణ! జై ఆంధ్రా!!
ఇందులోని, కథలన్నీ తెలంగాణ పల్లెల్లోని భూస్వామ్య వ్యవస్థ స్వరూపాన్ని, ఆనాటి పరిస్థితులను కండ్లకు కట్టినట్లుగా చిత్రించినవే. కాంచనవల్లి చేయి తిరిగిన కథకుడిగా, తెలంగాణ గర్వించదగ్గ తొలితరం కథకుల్లో ఒకరుగా మనం చెప్పుకోవచ్చును. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యం వెట్టిచాకిరీ, జాగిర్దారీ, జమీందారీ విధానాన్ని, పీడనను తొలగించడం, భూపంపక సమస్య, దానికి పరిష్కార మార్గాలను చూపడం, 1969 నాటి తెలంగాణ ఉద్యమ స్థితిగతులను చిత్రించడం ఇందులోని ప్రధాన ఘట్టాలు.
రాజకీయాలంటే ఎంత ఇష్టమో, సాహిత్యం అన్నా అంత ఇష్టం. అభ్యుదయ రచయితల సంఘం ముఖ్యుల్లో ఒకరు. రాష్ట్ర పౌరహక్కుల కమిటీ సభ్యులు శ్రామికవర్గ రాజకీయాలు ఏనాడో వంటబట్టించుకున్నారు కాంచనపల్లి. రాజకీయాల్లో కూడా గొప్ప అనుభవజ్ఞులుగా మనకు కన్పిస్తారు.

- కడవెండి మమత 9440402691