మెయిన్ ఫీచర్

మూయలేని నోటితో నరకమే మరి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నోరు మూసుకోలేకపోవడం ఏంటి?’- అని ఆశ్చర్యపోతున్నారా? ఓసారి 14 ఏళ్ల అమ్మాయిని వాళ్ళమ్మ నోరు మూసుకోలేకపోతుందన్న కారణంగా ఓ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లింది. పంటినొప్పివల్ల ఇలా జరుగుతోందని భావించి నొప్పి మందులు రాసేడు ఆ డాక్టర్. మూడు రోజులు గడిచినా, ఆ అమ్మాయి నోరు మొత్తం మూసుకోవటల్లేదు. ఎందుకలా జరుగుతోందో అర్థం కాక, ఆ అమ్మాయిని నా దగ్గరికి ఆ డాక్టర్ తీసుకుని వచ్చాడు. దీనినే ‘నిఱశ్రీజ్గ నిడజ్జ్ళన్జి’’ అంటారని చెప్పి ఆమెకి తగిన చికిత్స చేశాను.
"MANDIBULAR DIS-LOCATION'' అంటే..?
కింది దవడ కదలికల వల్ల మన నోరు తెరుచుకోవడం కానీ, మూసుకోవడం కానీ జరుగుతుంది. కింది దవడ ఎముక కొద్ది భాగం కీలులో ఉంటుంది. నోరు తెరుచుకున్నప్పుడు, మూసినప్పుడు ఈ భాగం ఎముక కీలులో ముందుకి, వెనక్కి కదులుతుంటుంది. ఈ ఎముక భాగం కొన్ని సందర్భాలలో కీలులోంచి బయటికి వచ్చేస్తుంది. అలా బయటికి వచ్చిన ఎముక తిరిగి కీలులోకి వెళ్లని పక్షంలో నోరు మూసుకోవడం కుదరదు. దీనినే ‘నిఱశ్రీజ్గ నిడజ్జ్ళన్జి’ అంటారు.
ఎందుకిలా అవుతుంది?
నోటిని పరిమితికి మించి తెరిచిన సందర్భాలలో- అంటే ఆవలింత అప్పుడు, పంటి లేక గొంతు చికిత్స చేయించుకోడానికి ఎక్కువ సమయం తెరిచిపెట్టినప్పుడు, కింది దవడకి కానీ, కీలుకి కానీ దెబ్బ తగిలినపుడు, నరాల బలహీనత ఉన్నవారిలో కీలులోంచి ఎముక బయటికి వచ్చే ప్రమాదం ఉంది.
తిరిగి కీలులోకి ఎందుకు వెళ్లదు?
కొన్ని సందర్భాలలో బయటకు వచ్చిన ఎముక తిరిగి కీలులోకి వెళుతుంది, కొన్నిసార్లు వెళ్లదు. కింది దవడ తెరుచుకోడానికి, మూసుకోవడానికి సహాయపడే కండరాలకి అనియంత్రిత సంకోచం (శ్రీడ్ళజఉ డ-డ) కలగడంవల్ల కీలు నుంచి బయటికి వచ్చిన ఎముక అక్కడ ఇరుక్కుపోతుంది. కదలికకి కారణం అయిన కండరాలు కదలలేని ఈ సందర్భంలో ఎముక కూడా కీలు బయటే ఉండిపోతుంది.
ఏ వయసు వారిలో..
దీనికి వయసుతో సంబంధం లేదు. కాకపోతే చాలా పెద్దవారిలో, మూర్ఛ వ్యాధి ఉన్నవారిలో, చిన్నపిల్లలలో ఎక్కువగా చూస్తాం.
ఎలా గ్రహించాలి ?
కొందరిలో నోరు మూసుకోదు. బాధితుడికి ఆ విషయం అర్థమయిపోతుంది. వారి పైపళ్ళు, కింది పళ్ళు కలుసుకోవు. ఇరువైపులా ఇలా జరిగితే ముందుపళ్ల మధ్య చాలా ఖాళీ ఏర్పడుతుంది, వెనకపళ్లు మాత్రం కలుసుకుంటాయి. ఒకవైపే జరిగితే, కింది దవడ జరగని వైపుకి తిరిగిపోతుంది. అటుమాత్రమే పై పళ్లు, కింది పళ్లు కలుసుకుంటాయి. ఇలాంటి అనుమానం ఉన్నప్పుడు దంతవైద్యుడిని కలిసి నిర్థారించుకోవడం మేలు.
ఏం చెయ్యాలి?
ఇలా జరిగిన సందర్భాలలో సమయం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎంత సేపటి నుంచి కీలు బయట ఎముక ఉందన్నదాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. కొన్ని గంటలు మాత్రమే అయిన సందర్భాలలో పూర్తి మత్తు ఇచ్చే అవసరం సాధారణంగా ఉండదు. వైద్యుడు కింది దవడని కిందికి లాగి, తిరిగి వెనక్కి అనగా కీలులోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. వారం, పది రోజులు ఎక్కువగా నోరు తెరవద్దని హెచ్చరిస్తాడు. ఒక రోజు లేక చాలా రోజులయిన వారిలో శరీరానికి పూర్తి మత్తు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. పై చెప్పిన విధంగా దవడని తిరిగి కీలులో ప్రవేశపెట్టాలి. రెండు నుంచి మూడు వారాలు నోరు తెరుచుకోకుండా పై పళ్లు, కింది పళ్లని వైర్లతో కట్టేయాలి. ఈ విధానాలను పాటించిన తరువాత కూడా సమస్య అలానే ఉంటే సిటి స్కాన్, ఎంఆర్‌ఐ చేయించాలి.
ప్రతి ఇంటి చుట్టూ ప్రహరీగోడ ఉన్నట్టు కీలు ముందు, వెనుక భాగంలో ఎతె్తైన ఎముక, దవడ కీలు నుంచి బయటికి రాకుండా అడ్డుగా నిలుస్తుంది. ఈ ఎముక అరిగిపోయిన వారిలో ఇలా జరిగే ఆస్కారం ఉంది. వీరికి ఆపరేషన్ చేసి తిరిగి అక్కడి ఎముక పెద్దదిగా ఎత్తుగా ఉండేలా శరీరంలోని వేరే ప్రదేశం నుంచి ఎముక తీసి అతికించాలి.
కొందరిలో ఈ అడ్డుకునే ఎముక ఎత్తుగానే ఉన్నా కూడా ఈ సమస్య కనబడుతుంది. కీలులో దవడ ఎముక ఎక్కువ ముందుకి పోకుండా పట్టుకునే తాళ్ల వంటివి ఉంటాయి. ఇవి వదులుగా మారినపుడు ఈ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ తాళ్లని గట్టిపరిచేందుకు చెవి ముందు ఉన్న చర్మం నుంచి ఇంజక్షన్ ద్వారా కీలులోకి మందు యిస్తారు. దీనివల్ల ఆ తాడ్లు గట్టిపడే అవకాశం ఉంది. ఇది ఫలించని పక్షంలో ఆపరేషన్ చేసి ఆ తాళ్ళకి చికిత్స చేయాలి.
ఆపరేషన్ ద్వారా కొందరిలో నోరు తెరచుకునేందుకు ఉపయోగపడే కండరాలను ఆపరేషన్ ద్వారా సడలించినట్లయితే వారికి ఈ సమస్య తగ్గే అవకాశం వుంది.
కొందరిలో ఇలా నోరు మూసుకోవట్లేదనే విషయం వారాలు, నెలలు అయినా తెలియదు. వృద్ధాశ్రమాల్లో ఏ శ్రద్ధకూ నోచుకోని పెద్దవారిలో, ప్రమాదంలో కోమాలోకి వెళ్లినవారిలో, పిచ్చాసుపత్రిలో ఉండే బాధితుల్లో కండరాలు శాశ్వత అనియంత్రిత సంకోచానికి గురవుతాయి. (శ్రీడ్ళజఉ ళ్జ్గో్ళశ్రీ్గఉ) వీరిలో కింది దవడ ఎముకని కీలులోకి తిరిగి పంపడం చాలా కష్టం. శరీరానికి పూర్తి మత్తు ఇచ్చి కింది దవడకి రంధ్రాలు వేసి అందులోంచి వైరులు పంపి దవడని కిందికి లాగుతారు. ఇది ఫలించనపుడు ఉ-్జ్గజనిడ అనే చాలా శక్తివంతమైన కండరాన్ని ఎముక నుంచి కోసివేసి నయం చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇది కూడా సఫలీకృతం కాకపోతే ఆ ఎముకనే తీసేయవలసి వస్తుంది.
ఒకసారి వృద్ధాశ్రమంలో వైద్య శిబిరం నిర్వర్తించిన నాకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. బాగా చదువుకున్న కొడుకు చాలా డబ్బులు సంపాదించాలన్న కోరికతో అమెరికాకి వెళ్లిపోయాడు. కొడుకుంటే చాలు కూతురెందుకు? ఇబ్బందులు కలిగించే బాధ్యతని తండ్రి అనుకున్నాడు. ఏడు సముద్రాల అవతల కొడుకు, ఏడేళ్లుగా ప్రేమకి నోచుకోని తండ్రి, ఫొటోలు చూసి, ఫోన్ మాట్లాడి మురిసిపోవడమే గాని, నడవలేని అతనికి అండగా ఉండేవాడు, ప్రేమగా చూసుకునేవాడు లేడు. కొన్ని నెలలుగా తిండి తినని అతనిని ‘ఎందుకు తినట్లేదు తాతగారూ?’ అని నేను అడిగితే- ‘నా నోరు మొత్తం మూసుకోవట్లేదు, అందుకే తినలేకపోతున్నా’ అని సమాధానం ఇచ్చాడు. ‘ఎవరికైనా చెప్పలేకపోయారా? ’ అని అడిగితే, ‘సొంత కొడుకే పట్టించుకోలేదు. ఇంక పరాయివాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు?’ అని జాలిగా చెప్పాడు. బాగా ఉండడం అంటే ఆర్థికంగా, ఆరోగ్యంగా బలంగా ఉండడమే కాదు, ప్రేమానురాగాల మధ్య ఉండడం, ఆనందంగా ఉండడం.
*

-డా. రమేష్ శ్రీరంగం, సర్జన్, ఫేస్ క్లినిక్స్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్ సెల్ నెం: 92995 59615 faceclinics@gmail.com