మెయిన్ ఫీచర్

సర్వదేవతల కొలువే ముక్కోటి ఏకాదశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

29న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ..
*
వైకుంఠమనగా అమృతత్వస్థితి. కలియుగ కాలచక్రంలోని విషయాలలోని తిథులలో ఏకాదశి పదకొండవది. సంవత్సరానికి వున్న పనె్నండు నెలల్లో చైత్రమాసం నుండి ఫాల్గుణం వరకు వున్న వాటిలో విశిష్టమైన మాసం మార్గశిర మాసం. ప్రతి మాసంలో రెండు పక్షాలలో రెండేసి ‘ఏకాదశి’ తిథులు వస్తాయి. అనగా నెలకు రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్ష ఏకాదశి, రెండవది బహుళ పక్ష ఏకాదశి. కనుక సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ప్రధానమైనవి కార్తీక శుక్లపక్ష ఏకాదశి. ఈ తిథి రోజున మహాభారత యుద్ధంలో మహావీరుడు-్భగవతాగ్రేసరుడు అయిన భీష్మాచార్యుడు అంపశయ్యను చేరారు. అందువలన ఆ ఏకాదశికి ‘్భష్మ ఏకాదశి’ అని పేరు. అధికమాసంలో 26 ఏకాదశిలు వస్తాయి.
రెండవది వైకుంఠ ఏకాదశి మార్గశిర మాసంలో ఈ పర్వదినానికి ఎంతో విశిష్టత ఏర్పడినది. పురాణ, శాస్త్రాల ననుసరించి క్షీరసాగర మథనం పిదప శ్రీ మహావిష్ణువు మోహినీ రూపము ధరించి దేవతలకు అమృతం పంచిపెట్టిన పవిత్ర దినము. ఈ ఏకాదశిని హరి తిథియనీ, వైకుంఠ తిథియనీ పిలుస్తారు. చాంద్రమానం ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అనీ, ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగానూ వ్యవహరిస్తారు. ఈఏకాదశిని ‘హరి’ వాసరం అంటారు. ఏకాదశిలో- దశ అనగా పది. పదిలోని ఏకము 1. ఈ ఒకటిసంఖ్య భగవంతుని సూచిస్తుంది. సున్న ప్రకృతిని తెల్పుతుంది. కావున కలి మానవులు కడు జాగరూకతతో ప్రకృతిని వదలి, హీరో అయిన భగవంతుని సేవించి తరించు దినము ఏకాదశి. ఆనాడే పూర్ణత్వమును అందుకోగలరు. అనగా అనేకత్వముతో కూడిన ప్రకృతిలో ఏకత్వమును దర్శించుట.
ఈ వైకుంఠ ఏకాదశి నాడు విష్ణువు నివాసమైన వైకుంఠము యొక్క ద్వారము తెరువబడునన్న నమ్మకముతో ఒక ప్రత్యేక ద్వారమును వైష్ణవ దేవాలయాలలో వేకువ ఝామునుండే తెరుస్తారు. ఆ పవిత్రమైన వాకిలి ద్వారా భక్తులు ప్రవేశించి ఆ శ్రీ మహావిష్ణువును దర్శించి, వైకుంఠ ప్రాప్తికి మూలమని భావించి ఆనందిస్తారు. చూచి తరిస్తారు. ఇది ఒక బాహ్య ఆచారమంటారు. ఈ పర్వదినమునే ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి దేవతలకు అమృతము సిద్ధింపగా వారికి అమృతత్వము ప్రాప్తించిన దినము. దేవతలకు కొంతకాలం దూరమైన స్వర్గం లభించిన రోజు. మానవసేవకు వినియోగించిన వైకుంఠ ద్వారములు తెరువబడిన రోజు ‘సర్వం విష్ణుమయం జగత్’ అని శాస్తమ్రు. కావున ఈరోజున జపము ధ్యానము- ఉపవాసము- నామ సంకీర్తనం- జాగరణలు ఆచరించవలసిన సాధనములు. ఈ పవిత్ర సాధనల వలన నిరవధిక పారిచింతన లభిస్తుంది. పవిత్ర సంకల్పములు మనసుకు చేకూరుతాయి. దైవత్వమును స్మరించుటయే ముక్కోటి ఏకాదశి యొక్క అంతరార్థము. ఈరోజున భక్తులతోపాటు జనులందరు ఉపవాసం, విష్ణు పూజలు చేయాలి. ఈ వైకుంఠద్వారం నుంచి సూర్య భగవానుడు ఉత్తరాయణానికి ప్రవేశిస్తాడు. కావున దీనిని ఉత్తర ద్వార దర్శనకాలమనీ, ఉత్తరాయణ పుణ్యకాలమనీ పురాణాలు తెలిపాయి.
ఈ పర్వదినాన షోడశోపచారాలతో శ్రీమన్నారాయణుని పూజించాలి. ద్వాదశినాడు తిరిగి పూజచేసి అన్నాదికాలు నివేదించి పారాయణ, ఉపవాసం చేయాలి. ఈరోజు ఏకాదశి వ్రతాచరణవలన దేహశుద్ధి- కార్యశుద్ధి- మోక్ష దీక్షలతోపాటు వైకుంఠప్రాప్తి కల్గుతుందని శాస్త్రం. గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు ‘మాసానాం మార్గశీర్షోహం’ అంటూ ఈ మాస వైశిష్ట్యాన్ని తెలిపారు. ఈ ఏకాదశినాడు దేవతలందరూ భూమికి దిగి వస్తారనీ, వారికి చీకటిపోయి సూర్యుడు-వైకుంఠుడు ముక్తుడు కాగా దేవతలందరూ వెలుతురులోకి వస్తారని ప్రతీతి. అంటే వారికి పగలు ప్రారంభమైనది. మనకున్న ఆరు నెలలు దేవతలకు ఒక పగలు, మరో ఆరు నెలలు రాత్రి. అనగా రాత్రి గడిచి పగటిలోనికి చేరారు. ఈ వైకుంఠ ద్వారమే సూర్యుని ఉత్తరాయణ ప్రవేశ చిహ్నము. సూర్యునికి పట్టిన ఆరు నెలల చీకటి వదలిందన్నమాట. కావున ఈరోజున దైవకర్మల నాచారించాలనీ పురాణ వచనం.
ఈ మార్గశిర ఏకాదశిని భారతీయ సంప్రదాయంలో మహిమాన్వితమైన ఏకాదశిగా పురాణాలు వర్ణించాయి. ఒక్కొక్క తిథినాడు ఒక్కొక్క దేవుడిని ఆరాధించడం అనాదినుంచి వస్తున్న సదాచారం, సత్ సాంప్రదాయం. భారతదేశంలోని ప్రతి వైష్ణవ పుణ్యక్షేత్రంలోనూ ఉత్తర ద్వార దర్శనాలను ఏర్పాటుచేసి విష్ణు ప్రీతిగా కలి భక్తులకూ, జనులకూ శ్రీ మహావిష్ణువును దివ్యమంగళ స్వరూపాన్ని దర్శింపచేయుట భారతీయుల పుణ్యఫలంగా పేర్కొనవచ్చు. భగవంతుడు ఏది చేసినా, ఎలా అనుగ్రహించినా అంతా మన మంచికోసమే. మనలో ఆధ్యాత్మిక చింతన అలవరచడం కోసమేనని సర్వులూ గుర్తించి ఈ పర్వదిన వైశిష్ట్యాన్ని తాము తెలుసుకుని ఇతరులతో ఆచరింపచేయడమే ఆధ్యాత్మిక లక్ష్యం. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం ముఖ్యం.
*

ఉత్తర ద్వార దర్శనం .... సర్వపాపహరం

-పి.వి.సీతారామమూర్తి