మెయిన్ ఫీచర్

మోగింది వీణ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమెకు చిన్నప్పటి నుంచి వీణ అంటే ప్రాణం. మూడేళ్ల వయసులోనే వీణ తంత్రులను మీటితే కలిగిన అనుభూతే ఆమెను సంగీత సరస్వతిగా తీర్చిదిద్దింది. సంగీతంలో తొలి అడుగులు తల్లి వద్ద వేసినా.. సంగీత శిక్షణలో రాటుదేలింది మాత్రం అత్త పద్మావతి అనంతగోపాలన్ వద్దే. జాతీయ వాయిద్య పరికరమైన సరస్వతి వీణను వాయిద్యంగా చేసుకుని అంతర్జాతీయ వేదికలపై ఆమె చేసే కచ్చేరీలు శాస్ర్తియ సంగీతానికి జీవం పోస్తాయి. సుమధుర వీణానాదంతో సంగీత నిలయంగా భాసిల్లే ఆమే డాక్టర్ జయంతి కుమరేశ్ గురించి వేరే చెప్పక్కర్లేదనుకుంటా. వీణా వాయిద్యంలో పరిశోధనలు చేసి ఎంతోమంది పరిశోధకులకు పాఠ్యగ్రంధంగా మారిందంటే అతిశయోక్తి కాదు. తమిళనాడులోని చెన్నై మహానగరంలో జన్మించిన జయంతి కుమరేశ్ కుటుంబంలోని అందరూ సంగీత కళాకారులే. వంశపారంపర్యంగా వస్తున్న సంగీత కుటుంబం. ఆ ఇంట్లో అందరూ సంగీత జ్ఞానంతో తలపండినవారే. ఇపుడు జయంతి కుమరేశ్ ఆరవ తరానికి చెందిన కళాకారిణి. సంగీత విద్వాంసులు లాల్గూడి జయరామన్ మేనకోడలు అయిన డాక్టర్ జయంతి కుమరేశ్ తన సంగీత ప్రస్థానాన్ని ఇలా వివరించారు.
మూడు దశాబ్దాలుగా సంగీత ప్రయాణం..
వీణా వాయిద్యానే్న జీవిత సరస్వంగా చేసుకున్న అత్త పద్మావతి అనంతగోపాలన్ ప్రపంచ ప్రసిద్ధురాలు. అలాంటి గొప్ప కళాకారిణి పద్మావతి స్వయాన మేనత్త. ఆమె ఇంట్లో జయంతి మూడేళ్ల నుంచి గరుకులవాసం చేశారు. ప్రతిరోజూ స్కూలుకు వెళ్లటంతో పాటు తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి వీణావాయిద్యంలో శిక్షణ తీసుకునేవారు. దాదాపు ఇరవై ఏళ్లపాటు ఆమె కఠోర శిక్షణలోనే రాటుదేలారు. చిన్నప్పటి నుంచే అత్తతో పాటు సంగీత కచ్చేరీ ప్రర్శనలకు వెళ్లేది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా సాగుతున్న ఈ సంగీతయాత్రలో అత్తతో చేసిన ప్రయాణం తన జీవితంలో ఓ అద్భుతం అని జయంతి అంటారు. అత్యంత కష్టతరమైన వాయిద్యాలలో ఒకటి సరస్వతి వీణ.
అటువంటి వీణా వాయిద్యంలో సంపాదించిన ప్రావీణ్యంతో పాటు అందులో ఆమె పిహెచ్‌డీ సైతం చేశారు. తొలుత రాగాన్ని గుర్తించండి. ఆ తరువాతే కూర్పులు చేయండని వర్థమాన సంగీత కళాకారులకు ఆమె సూచన చేస్తారు. రెండు గంటల పాటు నిర్విరామంగా.. రసరమ్యంగా కచ్చేరీ సాగాలంటే.. వీక్షకులు కదలకుండా కుర్చీలోనే కూర్చోబెట్టాలంటే కళాకారిణికి కత్తిమీద సాము చేయాల్సి ఉంటుంది. అందుకే ఆమె సోలో కచ్చేరీలనే చేస్తారు. డాక్టర్ జయంతి ఆలిండియా రేడియోలో యువ సంగీతకారుల్లో మొట్టమొదటి స్థానంలో నిలిచిన కళాకారిణి. ఆమె భర్త కూడా ప్రముఖ వయోలిన్ వాయిద్యకారుడు. సంగీతమే ప్రాణంగా భావించే ఈ జంట అన్యోన్యత ఉత్తమ సంగీతాభిరుచికి నిదర్శనం.
విభిన్న శైలి..
వీణా వాయిద్యంలో విభిన్న శైలి ఉంది. తంజావూర్, మైసూర్, కేరళ శైలి ఉన్నది. కేరళ, తంజావూరు శైలికి పోలిక ఉన్నది. మైసూర్ వీణను రోజ్‌వుడ్‌తో తయారుచేయటం వల్ల ధ్వని అధిక పిచ్‌లో ఉంటుంది. ‘తంత్రికారి పద్ధతులు ఉపయోగస్తున్నారు. వేలాది మంది విద్యార్థులు డాక్టర్ జయంతి వద్ద శిక్షణ తీసుకున్నారు. వీరంతా దేశ విదేశాల్లో కచ్చేరీలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా జయంతికి ఆంధ్ర వీణానాదంలో తియ్యదనం కనిపిస్తుందని అంటారు.
దేశ విదేశాల్లో ప్రదర్శనలు..
ఈ సంగీత సరస్వతి దేశ విదేశాలలో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. శాన్‌ఫ్రాన్సిస్కో, క్వీన్‌లాండ్, న్యూయార్క్, పారిస్ తదితర దేశాలలో జరిగిన ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు.
ఎన్నో అవార్డులు సొంతం..
సంగీత చూడామణి, కలైమామణి, వీణానాద మణి, కళారత్న, సత్యశ్రీ, గానవారధి (మ్యూజిక్ అకాడమీ నుంచి ఏడుసార్లు) పొందారు. ఆమె ఇండియన్ నేషనల్ ఆర్కెస్ట్రా (ఐఎన్‌ఒ) స్థాపించారు. ఇందులో 21మంది కళాకారులు శాస్ర్తియ సంగీత మాధుర్యాన్ని దేశ విదేశాల్లో అందిస్తున్నారు. సంగీత, నృత్య రూపకాలు, వేలాది రికార్డులు రూపొందించి శాస్ర్తియ సంగీతానికి జీవం పోస్తున్నారు.

చిన్నప్పటి నుంచే అత్తతో పాటు సంగీత కచ్చేరీ ప్రర్శనలకు వెళ్లేదాన్ని. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా సాగుతున్న ఈ సంగీతయాత్రలో అత్తతో చేసిన ప్రయాణం తన జీవితంలో ఓ అద్భుతం. అత్యంత కష్టతరమైన వాయిద్యాలలో ఒకటి సరస్వతి వీణ. అటువంటి వీణా వాయిద్యంలో సంపాదించిన ప్రావీణ్యంతో పాటు అందులో పిహెచ్‌డీ సైతం చేశాను.