ఎడిట్ పేజీ

శతాబ్దులుగా చెఱగని వ్యథ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె మంగళసూత్రాన్ని లాక్కోవడం ఆశ్చర్యం కాదు! ఆమె చేతికున్న గాజులను కూడా తొలగించారు. ఆమె సుమంగళి..! పాకిస్తాన్‌లోని కారాగృహాలలో 22 నెలలుగా క్రుంగిపోతున్న తన భర్త కుల్‌భూషణ్ జాధవ్‌ను చూడడానికై ‘చేతన్‌కుల్’ అన్న ఈ మహిళ మన దేశం నుండి వెళ్లింది, ఆమె వెంట జాధవ్ తల్లి అవన్తి కూడా వెళ్లింది! పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో కుల్‌భూషణ్ జాధవ్‌ను సోమవారంనాడు వారిద్దరూ చూశారు. జాధవ్ కూర్చున్న గదికీ ఈ మహిళలిద్దరూ కూర్చున్న గదికీ మధ్య గాజుతెరను ఏర్పాటు చేశారు పాకిస్తానీ ప్రచ్ఛన్న బీభత్సకారులు... అందువల్ల జాధవ్ మాటలు వీరికి, వీరి మాటలు జాధవ్‌కూ వినపడడానికి వీలుగా ధ్వని యంత్రాలను అమర్చారు. కానీ ఈ సమావేశానికి ముందుగా చేతన్‌కుల్ చేతులనుంచి గాజులను లాగేశారు, ఆమె మంగళసూత్రాన్ని తొలగించారు. ఆమె బొట్టును చెరిపేశారు.. ఇదంతా మానవీయ సంస్కార ధ్యాస ఉన్నవారికి విస్మయం కలిగించవచ్చు, శతాబ్దుల ‘జిహాదీ’ పైశాచిక వికృత బీభత్స చరిత్ర తెలిసినవారికి ఇది ఆశ్చర్యకారకం కాదు! కుట్టడం తేలు స్వభావం, గోడ దూకి ఆవుల మెడలను కొరకడం తోడేలు నైజం, ఇస్లామేతర మతాలవారిని నిష్కారణంగా హత్య చేయడం, మహిళలను లైంగిక అత్యాచారాలకు గురిచేయడం అవమానించడం, బానిసలుగా అమ్మడం, మతం మార్చడం, స్వస్థలాలనుండి తరిమివేయడం ‘జిహాదీ’ల ప్రవృత్తి! కలియుగం మూడు వేల ఎనిమిది వందల పదునాలుగవ సంవత్సరంలో అరబ్బీ బీభత్సకారుడు మహమ్మద్ బిన్ కాసిమ్ అఖండ భారతదేశానికి వ్యతిరేకంగా ఈ ‘జిహాద్’ను ప్రారంభించాడు. అప్పటికి మన దేశంలో క్రీస్తుశకం ప్రకారం కాలాన్ని లెక్కపెట్టే పద్ధతి లేదు. అందువల్ల సమస్త ప్రపంచానికి వర్తించే కలియుగం వ్యవహార శకం, లేదా సాధారణ శకం, లేదా సామాన్య శకం! ముందు ‘విశేషణాన్ని’ జోడించకుండా కేవలం సంవత్సరాలను ఉటంకించినట్టయితే అది కలియుగం కాలమానం! విక్రమ శకం, శాలివాహన శకం అన్న ‘విశేషణాల’ను జోడించి చెప్పడం కూడా శతాబ్దుల సంప్రదాయం. బ్రిటన్ ముష్కరులు మన దేశం నుంచి నిష్క్రమించిన తరువాత మన ప్రభుత్వం కలియుగం 5059వ సంవత్సరంలో శాలివాహన శకాన్ని జాతీయ శకంగా ప్రకటించింది! శాలివాహన శకం ప్రకారం లేదా జాతీయ శక ప్రకారం ప్రస్తుతం 1939వ సంవత్సరం నడుస్తోంది! అందువల్ల శతాబ్దుల కాలగణన చరిత్రను ‘కలియుగం’ ప్రాతిపదికగా చెప్పడం స్పష్టతకు మాత్రమే కాదు న్యాయానికి కూడా నిదర్శనం.. అందువల్ల మహమ్మద్ బిన్ కాసిమ్ ‘జిహాద్’ను ప్రారంభించిన కలియుగం 4014వ సంవత్సరం క్రీస్తుశకం 712వ సంవత్సరానికి సమానమని ఆ తరువాత మన దేశంలో చొరబడిన బ్రిటన్ ముష్కరులు నిర్ధారించారు!
భారతదేశం అనాదిగా సర్వమత సమభావ వ్యవస్థ. ఈ దేశంలో పుట్టిపెరిగిన మతాలను, ఇతర దేశాలనుంచి మన దేశానికి వ్యాపించిన మతాలను మన దేశం సమానంగా ఆదరించింది, ఆదరిస్తోంది! ఈ సర్వమత సమభావ వ్యవస్థను ధ్వంసం చేయడం ‘జిహాదీ’ల లక్ష్యసాధనలో భాగం. ఎందుకంటే ప్రపంచంలోని ఇతర మతాలన్నిటినీ ధ్వంసం చేసి ఇస్లాంను ఏకైక మతంగా ప్రతిష్ఠించాలన్నది ‘జిహాదీ’ల లక్ష్యం! ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం క్రీస్తుశకం 712లో మహమ్మద్ బిన్ కాసిమ్ బీభత్సకాండను మొదలుపెట్టాడు! కలియుగం 5049- క్రీస్తుశకం 1947వ సంవత్సరంలో మహమ్మదాలి జిన్నా ఈ ‘ఏకమత’ స్థాపన లక్ష్యంతోనే పాకిస్తాన్‌ను ఏర్పాటు చేశాడు! అందువల్ల పాకిస్తాన్ రాజ్యాంగ వ్యవస్థ స్వభావమే ‘జిహాదీ బీభత్సకాండ’కు ప్రేరకం! 712లో మన దేశానికి వ్యతిరేకంగా మహమ్మద్ కాసిమ్ ఆరంభించిన జిహాదీ బీభత్సకాండను 1947 తరువాత మహమ్మదాలీ జిన్నా, ఆయన వారసులు కొనసాగిస్తున్నారు. హత్యాకాండ సాగిస్తున్నవారు ప్రత్యక్ష జిహాదీలు.. వారిని నడిపిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వ నిర్వాహకులు ప్రచ్ఛన్న జిహాదీలు. అందువల్ల సర్వమత సమభావ వ్యవస్థకు, అన్యమత విధ్వంసక ప్రవృత్తికీ మధ్య శతాబ్దులుగా ‘పోరు’ నడుస్తోంది! సర్వమత సమభావానికి మన దేశం సజీవ వాస్తవం.. ఏక మతోన్మాద చిత్తవృత్తికి పాకిస్తాన్ ఏడు దశాబ్దుల సాక్ష్యం.. కీచకుడు చేసిన దుశ్చర్యతోను, దుశ్శాసన సైంధవాదుల బీభత్సకాండతోను వారు పుట్టిన మతాలలోని ఇతరులకు సంబంధం లేదు. అలాగే జిహాదీల పైశాచికకాండతో ఇస్లాం మతంలోని ఇతరులకు సంబంధం లేదు! కీచకాదులను మన దేశంలోని అన్ని మతాలవారు నిరసిస్తూన్నట్టే జిహాదీలను కూడా అన్ని మతాలవారు నిరసిస్తున్నారు!
కుల్‌భూషణ్ జాధవ్ భార్యకు ప్రచ్ఛన్న జిహాదీలైన పాకిస్తాన్ ప్రభుత్వం వారు జరిపిన ఘోరమైన అపచారానికి ఇదంతా నేపథ్యం... భర్త జీవించి ఉండగానే ఇలా ‘మంగళ’ చిహ్నాలను తొలగించవలసి వచ్చినందుకు ఆ మాతృమూర్తి మదిలో చెలరేగిన విషాదం అక్షరాలకు అందనిది. పాకిస్తాన్ ప్రచ్ఛన్న బీభత్సకారులు- పాకిస్తాన్ సైనికులు జాధవ్‌ను రెండేళ్ల క్రితం ఇరాన్ నుండి అపహరించుకుని వెళ్లారు. ఆయనపై ‘ఉగ్రవాది’ అన్న నేరం మోపి మరణశిక్షను విధించారు. జాధవ్ తమకు బలూచిస్తాన్‌లో పట్టుబడినట్టు, ‘బలూచిస్తాన్‌ను పాకిస్తాన్ నుంచి విడగొట్టడానికి జరుగుతున్న’ కుట్రలో జాధవ్ పాత్ర ఉన్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రచారం చేసింది. మన ప్రభుత్వం దాఖలు చేసిన ‘న్యాయయాచిక’ ప్రాతిపదికగా నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరంలోని ‘అంతర్జాతీయ న్యాయస్థానం’- ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్- ఈ మరణశిక్ష ‘అమలు’ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఐక్యరాజ్య సమితి ‘వియన్నా ఒప్పందం’లోని మానవీయ అధికారాల నిబంధనలకు విరుద్ధంగా జాధవ్‌ను సైనిక న్యాయస్థానం అతి రహస్యంగా విచారించడం పాకిస్తాన్‌లోని బీభత్స జిహాదీ రాజ్యాంగ వ్యవస్థకు మరో నిదర్శనం! జాధవ్ తరఫున వాదించడానికి న్యాయవాదిని నియమించడానికి ఇస్లామాబాద్‌లోని మన దౌత్యకార్యాలయం విఫలయత్నం చేసింది. అనుమతిని ఇవ్వకపోవడం పాకిస్తాన్ ప్రభుత్వ దౌత్య బీభత్సానికి నిదర్శనం! గత మే నెల తొమ్మిదవ తేదీన ‘అంతర్జాతీయ న్యాయస్థానం’ ఈ తాత్కాలిక ఆదేశం జారీ చేసింది. అయితే జాధవ్ తన ‘‘నేరాన్ని ఒప్పుకున్నట్టు, క్షమాభిక్షను ప్రసాదించవలసిందిగా’’ పాకిస్తాన్ సైనిక దళాల అధిపతిని అభ్యర్థించినట్టు పాకిస్తాన్ గత జూన్ ఇరవై రెండవ తేదీన అసత్య ప్రచారం చేసింది.. ఇదంతా జిహాదీ బీభత్స చరిత్రలో వర్తమాన ఘట్టం.. గతానికి వికృత వారసత్వం...
ఐదేళ్ల క్రితం డిసెంబర్ నాలుగవ తేదీన పాకిస్తాన్‌లోని సింధు ప్రాంతంలోని ఉమర్‌కోట జిల్లా ‘గులామ్‌నబీషా’ గ్రామానికి చెందిన వైజయంతి మేఘవర్ అన్న ఆరేండ్ల పసిపాపను జిహాదీ లైంగిక అత్యాచారానికి గురిచేయడం అంతర్జాతీయ ప్రకంపనలను సృష్టించింది! కానీ ఈ హైందవ బాలికను అత్యాచారానికి గురిచేసిన దుండగులను పోలీసులు అరెస్టు చేయలేదు.. 2012లో ‘ఘోట్కో’ ప్రాంతంలోని ‘మీర్‌పూర్’ గ్రామానికి చెందిన ‘రించల్ కుమారి’ అన్న పంతొమ్మిదేళ్ల యువతిని జిహాదీలు అపహరించుకొని వెళ్లి మతం మార్చి బలవంతపు పెళ్లి చేశారు. ఈ ఘటన తరువాత రెండు వందల కుటుంబాల హిందువులు ‘ఘోట్కో’ ప్రాంతం నుంచి పారిపోయారు. సింధు ప్రాంతంలో మరో ముగ్గురు యువతులను 2010లో జిహాదీలు ఇళ్లనుంచి లాక్కొని వెళ్లి మతం మార్చి బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. పాకిస్తాన్ సర్వోన్నత న్యాయస్థానం- సైన్యం అదుపాజ్ఞలకు లోబడి తీర్పులిస్తున్న సుప్రీంకోర్టు- ‘జిహాదీ’లను శిక్షించలేదు. ఈ ముగ్గురు యువతులు దాదాపు పద్దెనిమిది నెలలు బలవంతపు కాపురానికి గురి అయినవారు- తమ ‘్భర్త’తో కాపురం చేయవచ్చునని లేదా తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్లవచ్చునని మాత్రమే పాకిస్తాన్ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది! కానీ తిరిగి వెళ్లినట్టయితే ‘‘మీ తల్లిదండ్రులను మీ కుటుంబాల సభ్యులను చంపేస్తాము..’’ అని జిహాదీలు ఆ యువతులను బెదిరించారు. అందుకు ఆ అభాగినులు భర్తల వద్దనే ఉండిపోయారు. 2012 మే రెండవ తేదీ ఈ దారుణం గురించి భారతీయ జనతా పార్టీ నాయకుడు మురళీ మనోహర్ జోషి ప్రస్తావించాడు! పాకిస్తాన్‌లోని అవశేష హిందువులను నిశే్శషం చేయడానికి ‘జిహాదీ’లు కొనసాగిస్తున్న బీభత్సకాండకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే!
అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో 2002లో ‘కల్పనాడే’ అన్న తొమ్మిదవ తరగతి విద్యార్థిని బంగ్లాదేశ్ నుంచి చొరబడిన జిహాదీ ముష్కరులు అత్యాచారానికి గురిచేసి చంపేశారు! ఈశాన్య ప్రాంతంలో సగటున ప్రతి రోజూ ఇలాంటి దుర్ఘటనలు ఒకటి జరిగినట్టు 2003-2004లో ఈశాన్య ప్రాంతాన్ని సందర్శించిన జాతీయ మహిళా హక్కుల సంఘం వారు వెల్లడించారు! 1990వ దశకం ఆరంభంలో కశ్మీర్ లోయలో పుట్టింట పురుడు పోసుకుని బిడ్డనెత్తుకొని అత్తింటికి నడిచి వెడుతుండిన ‘యశోరాణి’ అన్న యువతిని కూడా అస్సాంలో కల్పనాడేకు పట్టిన గతి పట్టింది! తల్లిబిడ్డల ఆచూకీ ఆ తరువాత లభించలేదు.. పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో జీలం నది ఒడ్డున ‘నృపేన్ పూర్ సేథీ’ అన్న గ్రామం ఉంది. 1947లో దేశ విభజన జరిగిన నాటికి ఆ గ్రామంలో తొంభై శాతానికి పైగా హిందువులు! హిందువులు గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని 1947 సెప్టెంబర్‌లో ‘జిహాదీ’లు ‘దండోరా’ వేశారు! ‘కామాక్షి’ అన్న పక్కనున్న పట్టణంలోని కర్మాగారంలో పనిచేస్తుండిన మాణిక్‌చంద్ ‘నృపేన్‌పూర్ సేథీ’ నివాసి, ఇరవై నాలుగేళ్లవాడు. పంతొమ్మిదేళ్ల ‘రాజ్‌వన్తి’ అతని భార్య, వారికి సంవత్సరం నిండిన కుమారుడు..! మిగిలిన గ్రామస్థులవలెనే ఈ దంపతులు కూడా మోయగలిగిన సామానులు తీసుకుని కామాక్షి రైలు స్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే స్టేషన్ దాదాపు ఐదువేలమంది హిందువులతో కిటకిటలాడింది. వారందరూ రైలెక్కి అవశేష భారతదేశానికి శరణార్థులై వస్తుండినవారు. పోలీసులు సైనికుల ‘పహారా’ మధ్య ఈ జనం నిద్రాహారాలు మాని ‘కామాక్షి’ స్టేషన్‌లో రోజంతా గడిపారు. తెల్లవారింది. ఒక రైలు బయలుదేరింది. రెండువేలమందికిపైగా రైల్లో ‘కూరుకున్నారు’. నిలబడడానికి కూడా స్థలం లేని తొక్కిసలాట జరిగింది! రాజవన్తి, మాణిక్‌చంద్ దంపతులు తమ బాబు నెత్తుకొని రైలులో నిలబడ్డారు. రైలు ‘కామాక్షి’ నుండి బయలుదేరింది కానీ పక్క స్టేషన్‌లో ఆపివేశారు.. జిహాదీలు ప్రతి పెట్టెలోకి చొరబడి హిందువులను ఊచకోత కోశారు. ఆమె కళ్ల ముందే రాజ్‌వన్తి భర్తను చంపారు, బిడ్డను లాక్కొని విసిరివేశారు.. హాహాకారాలు చేసిన ప్రయాణికులు ‘్ఫ్లట్‌ఫారమ్’ పైకి దూకేశారు. వారిని వందలమందిని పోలీసులు తుపాకులతో కాల్చి చంపారు! గంట తరువాత రెండు వందలమంది యువతులను జిహాదీలు సమీప గ్రామాలకు లాక్కొని పోయారు! రాజ్‌వన్తిని ఒక ‘టాంగా డ్రైవర్’ తన ఇంటికి ఎత్తుకెళ్లాడు. వాడికి అదివరకే పెళ్లి అయింది, భార్య ఉంది.. మూడు నెలల పాటు వాడు రాజ్‌వన్తిని లైంగిక అత్యాచారానికి గురిచేశాడు! రెండు వందల మంది యువతులు కూడా ఇదే ‘గతి’కి గురి అయ్యారు! మూడు నెలల తరువాత జిహాదీలు వారిని తమ ఇళ్లనుంచి వెళ్లగొట్టారు! నూట ఎనభైమంది ఇస్లాంలోకి మారిపోయారు, ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అవశేష భారత్‌కు ‘జీవచ్ఛవాలై’ చేరుకున్న ఇరవై మంది చెప్పిన కథ ఇది. రాజ్‌వన్తి అధికారులకు వివరించిన వ్యథ ఇది...
ఇలాంటి లక్షల ‘రాజ్‌వన్తి’ వంటివారు 1947లో పాకిస్తాన్‌లో బలైపోయారు! మహమ్మద్ బిన్ కాసిమ్ మొదలుపెట్టిన ‘కథ’ ఇది.. మహమ్మదాలీ జిన్నా నడిపిన కథ.. ఈ కథను పాకిస్తాన్ ప్రభుత్వం ఇపుడు కొనసాగిస్తోంది...

-హెబ్బార్ నాగేశ్వరరావు 9951038352