మెయిన్ ఫీచర్

అక్షరాలు మురిసి మెరిసేలా.. ( గోరుముద్ద)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదమూడేళ్ల పిల్లాడు ఇంద్ర భవనం వంటి ఇంటిలో కమ్మగా నిద్రపోతున్నాడు. ఆ నిశిరాత్రి తన జీవితంలో పెను విషాదం ముంచుకువస్తుందని తెలియదు. అందుకే ఆ పసిమనసు ఆదమరచి హాయిగా నిద్రపోతుంది. ఇంతలో ఆ ఇంటిలో పనిచేసే వృద్ధురాలైన పనిమనిషి వచ్చి బాబూ! అంటూ తట్టిలేపింది. నిద్రలేచిన ఆ పిల్లాడిని పట్టుకుని భోరున విలపించింది. కమ్మగా నిద్రపోతున్న తనను లేపి పనిమనిషి ఇలా పట్టుకుని ఏడుస్తుందేమిటని ఆ బేల హృదయం దిగ్భ్రాంతికి గురైంది. కాసేపటికిగానీ తెలియలేదు. అమ్మ లేదని. మరుసటి రోజు ఉదయం తెలిసింది. మృత్యువు అంటే మనం మరలిరాని లోకాలకు వెళ్లిపోవటం అని అర్థమైంది. అమ్మ కోసం ఆ పసి హృదయం పడిన ఆవేదనకు అక్షరమాలే గీతాంజలి. ఆ బాలుడే ఈ ప్రపంచం మెచ్చిన విశ్వకవి కవి, నోబెల్ విజేత రవీంద్రనాథ్ టాగోర్. ఆ మృత్యువే యుక్తవయసులోనూ ఆయన ముంగిటకు వచ్చి ఆత్మబంధువైన వదినను, అత్మీయమైన అర్ధాంగిని, అపురూపమైన కుమార్తెలను, కుమారుడిని ఒక్కొక్కరిని నిర్ధాక్షిణ్యంగా తీసుకువెళుతుంటే.. అలవికాని దుఃఖంతో అంతర్ముఖుడై మనోహరమైన మధుర కవిత్వాన్ని మనకందించారు. అంతర్మథనంతో అలా అనే్వషణ ఆరంభించిన టాగోర్ మరపురాని తన బాధకు మధురమైన భావాల మాలికలల్లి ఆ భగవంతుని పాదాలకు సమర్పించారు. సామాజిక, తాత్విక, ఆధ్యాత్మిక భావనలకు ఆలవాలమైన గీతాంజలికి 1913లో నోబెల్ బహుమానం వరించింది.

స్వచ్ఛమైన మనసుకు ప్రతిబింబాలు చిన్నారులు. వారి లేలేత చేతివేళ్ల కొనల్లోంచి మాతృభాషలో అక్షరాలు అందంగా అల్లుకుంటే ఎంత చూడముచ్చటగా ఉంటుందో కదా! దురదృష్టం కొద్దీ నాలుగు వాక్యాలు సరిగా చదివే, రాసే చిన్నారులే కరువయ్యారు. ఈ కంప్యూటర్ యుగంలో పిల్లలు స్మార్ట్ఫోన్లు చేతబట్టి తమకు వచ్చిన సమాచారాన్ని చదవకుండానే ఇతరులకు ఫార్వర్డ్ చేస్తున్నారు. మనసూ, మాట ఒక్కటైతే భావాలు అక్షరరూపం దాల్చుతాయని పిల్లలు గ్రహించలేకపోతున్నారు. చిన్నారులు గ్రహించిన రోజు ఆ చిట్టి చేతుల నుంచి ఎన్నో భావాలు మనముందు ఆవిష్కృతమవ్వటమే కాదు అందమైన దస్తూరికి సృష్టికర్తలుగా నిలుస్తారు. ఆలోచనలను రేకెత్తించే అందమైన అక్షరాలు కుదురుగా, గుండ్రంగా, చక్కని వరుసలో, క్రమశిక్షణతో నిలబడతాయి.
ఇలాంటి అక్షరాల మాలికలు కనిపిస్తుంటే ఎంత ఆనందం కలుగుతుంది. చిన్నప్పటి నుంచి అందమైన దస్తూరీ, చేతిరాతను నేర్పిస్తే అందమైన భావాలు ఆ చిన్నారుల నుంచి చొచ్చుకురాకుండా ఉంటాయా చెప్పండి.
చిన్నప్పటి నుంచి వారిలో అందంతో పాటు అక్షరాల స్పష్టత గురించి విడమరచి చెబితే ఆచరణలో పెట్టకుండా ఉంటారా? అహింస అనే ఆయుధంతో మన దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీ మహాత్ముడు సైతం విద్యాభ్యాసంలో చేతిరాత ఒక భాగం కావాలని ఆకాంక్షించారు. ప్రతిరోజూ కనీసం 25 నిమిషాలు అందమైన చేతిరాత కోసం సాధన చేస్తే చాలు అని నిపుణులు సైతం నొక్కివక్కాణిస్తున్నారు.
నేపాలీ అమ్మాయి నేర్పుతున్న గుణపాఠం
విశాలమైన ఈ లోకంలో సంకుచితమైన మనసులే ఎక్కువగా ఉన్నాయి. అలాంటి సంకుచిత మనసులను చైతన్యపరిచేందుకు ఈ చిన్నారి చేసిన ప్రయత్నం నేడు ప్రపంచం మొత్తం వేనోళ్ల కొనియాడుతోంది.
రెండు నెలల క్రితం సోషల్ మీడియాలో ఓ నేపాలీ అమ్మాయి అందంగా రాసిన ఇంగ్లీషు లేఖ నేటి చిన్నారులకు కనువిప్పు కలిగించేలా ఉన్నది. ఆ అమ్మాయి పేరు ప్రకృతీ మల్ల. పేరుకు తగ్గట్లుగానే ప్రకృతి అందం వలే ఆ చిన్నారి రాసిన చేతిరాత ప్రపంచవ్యాప్తంగా ప్రంశంసలను అందుకున్నది. చేతిరాతకు ఉన్న విలువలను అందులో మరింత అందంగా పొందుపరచింది. ఆ ఉత్తరాన్ని చదివిన సోషల్ నెట్‌వర్క్ ప్రియులు ఈ ఫాంట్‌ను అఫీషియల్ ఫాంట్ చేసెయ్యమని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌కు సలహా కూడా ఇచ్చారు.
ఉపాధ్యాయునికి హేట్సాఫ్..
తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, ధర్మారం మండలంలోని రచ్చపల్లి ఉపాధ్యాయుడు రాంపల్లి విజయభాస్కర్ తన చేతతో రాసిన అక్షరమాల సైతం సోషల్ మీడియాలో అందరిని అబ్బురపరుస్తోంది. తెలుగు అక్షరమాలలోని అన్ని అక్షరాలు మురిసి మెరిసేలా రాసిన వ్యాఖ్యానం ఎంత ఆహ్లాదంగా, ఆనందంగా ఉందో.. తేట తెలుగు భాషలోని తియ్యదనాన్ని రుచి చూపిస్తూ అందంగా రాసిన ఈ దస్తూరి సైతం ఆ ఉపాధ్యాయుని భావాలకు అంజలి ఘటిస్తుంది అంటే అతిశయోక్తి కాదు. చిన్నపిల్లలు స్మార్ట్ఫోన్ ఆపరేట్ చేస్తుంటే చూసి మురిసిపోయే తల్లిదండ్రులు, పాఠశాలల్లోని టీచర్లు ఇలాంటివి పిల్లలకు చూపిస్తూ చిన్నప్పటి నుంచే మంచి దస్తూరిపై వారికి అనురక్తి, ఆసక్తి, మమకారం పెంపొందేలా చేస్తే ఎంత బాగుంటుందో కదా!
అహింస అనే ఆయుధంతో మన దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీ మహాత్ముడు సైతం విద్యాభ్యాసంలో చేతిరాత ఒక భాగం కావాలని ఆకాంక్షించారు. ప్రతిరోజూ కనీసం 25 నిమిషాలు అందమైన చేతిరాత కోసం సాధన చేస్తే చాలు అని నిపుణులు సైతం నొక్కివక్కాణిస్తున్నారు.

-హరిచందన