మెయిన్ ఫీచర్

గెలుపు మనదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశ సహజం. ఆలోచన అవసరం. ఆచరణతో అది సుసాధ్యం. లక్ష్య సాధన మన చేతుల్లోనే ఉంటుంది. మనసుంటే మార్గం అదే దొరుకుతుందనేదేగా నానుడి. మహిళలు నిజంగానే పని రాక్షసులు. అయితే కాంక్షని వీడకుండా పరిశ్రమిస్తే.. లక్ష్యాన్ని సులభంగా చేరవచ్చు. కాలం కదిలిపోతుంది. ఆగదు. దాంతోపాటే మన జీవన గమనమూ సాగిపోతుంది. 2017 సంవత్సరం వెళ్లిపోతోంది. కొత్త సంవత్సరానికి కొత్తకొత్త ఆలోచనలతో స్వాగతిద్దాం. కష్టాలు అందరికీ ఉంటాయి. కాకపోతే చిన్నగీత పక్కన పెద్ద గీత అనుకుంటూ మున్ముందుకు నడవాలి. మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ సంయమనంతో పయనించాలి. బుద్ధి కుశలతతో నైపుణ్యాన్ని ఒడిసిపట్టాలి. శీతాకాలంలో ఆకులు రాలడం.. మళ్లీ చిగురించడం సహజం. అలానే జీవన గమనంలో కష్టాలు, నష్టాలు అతి సహజం. అయితే సుఖాలు, లాభాలు కూడా వాటి వెన్నంటే ఉంటాయని గమనిస్తే నిస్తేజం, నిస్పృహ దరిచేరవు. అంతే.. విజయం మన సొంతం అవుతుంది! 2017 సంవత్సరం అనుభవాల మెట్ల మీద నుంచి 2018 సంవత్సర నిచ్చెననెక్కి విజయాలను సొంతం చేసుకుందాం.
పాత, కొత్తల కలయికతో ముందుకు సాగుదాం.

నేడు మహిళలకి వెనుకబాటు అనేది లేదు. ఆ వెనుకబాటుకి కారణమైన అవిద్యను దాటెయ్యటం ఎప్పుడో మొదలుపెట్టాం. మహిళలు ఉన్నత విద్యావంతులు అవుతున్నారు. సవాళ్లను ఎదుర్కొని దీటుగా అధిగమిస్తున్నారు. రాజకీయాలనూ శాసిస్తున్నారు. పురాణాలను పుక్కిట పట్టడం వాళ్లకి అలవాటే కదా! విభిన్న రంగాల్లో తమ కౌశల్యాన్ని ప్రదర్శిస్తున్నారు. క్రీడా, పారిశ్రామిక రంగాల్లో రాణిస్తున్నారు. దౌత్తవేత్తలుగా ప్రవర్థిల్లుతున్నారు. ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కించుకుంటున్నారు.
తెగువతో మగువ చూపుతున్న ధైర్య సాహసాలకు పురుష పుంగవులే అచ్చెరువొందుతున్నారంటే అతిశయోక్తి కాదు. ముళ్ల కిరీటం లాంటి నేవీ, సైన్యంలో స్థానం సంపాదించి ప్రముఖులకు అంగరక్షకులుగానూ కొనసాగుతున్నారంటే మామూలు విషయం కానేకాదు. లేత తమలపాకుల్లాంటి మహిళలు శారీరక అడ్డంకులను సైతం అధిగమించ గలుగుతున్నారు. కాలగమనంలో వచ్చే మార్పులకు అనుగుణంగా పూర్వపు భావజాలాన్ని పక్కన పెడుతున్నారు. ఇదే ఉత్సాహంతో మహిళా సాధికారత సాధించడం కష్టమేమీ కాదు. మహిళా సాధికారత కోసం ఎవరి పైనో ఆధారపడకుండా మహిళలే సొంతంగా గమ్యాన్ని చేరుకోగలరు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. ఆత్మవిశ్వాసంతో సమర్థవంతంగా ఎంచుకున్న రంగంలో ప్రథమ స్థానం సంపాదించడం శ్రమపడటం అలవాటున్న మహిళలు కష్టమేమీ కాబోదు. తామెంచుకున్న రంగంలో తమకు ముందూ, వెనుకా ఎలాంటి ఆసరా లేకపోయినా తాము అనుకున్నది తమ చేతుల్లోకి తెచ్చుకుంటున్నారు. సాదాసీదాగా ఉండే రాజకీయవేత్త మమతా బెనర్జీ పేరు ఒక్కటి చాలు ఇక్కడ చెప్పుకోడానికి.
2017లో మగువలు ఎన్నో అద్భుత విజయాలు సాధించి చూపరులు ముగ్దుల్ని చేశారు. మహిళ అంటే శక్తి కదా. వారి శక్తి ఏమిటో నిరూపించుకున్నారు. మొక్కవోని దీక్షతో తాము ఆశించిన లక్ష్యాన్ని చేరుకుంటూ దూసుకుపోతున్నారు. అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా, ధాటిగా మనగలుతున్న ఓ మహిళా.. నీకు వందనం. ఇదే స్ఫూర్తి, ఒరవడితో 2018లోనూ మహిళలు మరింతగా ముందుకెళ్లాలని ఆశిద్దాం. ఆకాంక్షిద్దాం.

మెరికల్లాంటి మహిళామణులు వీరు..
నిర్భీతికి ఆమె చిరునామా
గౌరీ లంకేష్ సీనియర్ జర్నలిస్ట్. నిష్పాక్షికంగా వార్తలు రాయడంలో దిట్ట. నిర్భీతికి ఆమె చిరునామా. మహిళా, దళిత హక్కుల పరిరక్షణ, సాధన కోసం దీర్ఘకాలంగా పోరాడుతున్న ఆమె దుండగుల చేతిలో కిరాతక హత్యకు గురయ్యారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన అన్నా పొలిటికోవస్కాయ అవార్డు ప్రకటించారు.

వెళ్లివిరిసిన ఆనందం
ప్రపంచమంతా క్రేజీ వున్న ఈ క్రీడలోనూ మనవాళ్లు దూసుకుపోయారు. ప్రపంచ కప్ సాధించటం మనకు తీరిన చిరకాల వాంఛ. అలాంటి దశలో దేశంలో ఆనందం వెళ్లివిరిసింది. భారత మహిళా క్రికెట్ జట్టు గత టోర్నీలో ఉద్వేగంగా టీవీలు చూస్తున్న అందరికీ మహదానంద విజయాలు అందించారు. గులన్ గోస్వామి, హర్మన్‌ప్రీత్ కౌర్, మైథిలీరాజ్ అత్యద్భుతంగా రాణించి భారత జట్టుకు గర్వకారకులుగా నిలిచారు.

ఫ్యాషన్ చాంపియన్ .. ప్రియాంక చోప్రా
టీవీ, సినిమా, సంగీత రంగాల్లో ప్రియాంక చోప్రా చాంపియన్‌గా నిలిచింది. ఫ్యాషన్ షో అంటే శరీర అందానికి సంబంధించినది అనుకునేవారికి అమెరికన్ టాక్‌షోలో ఆమె ప్రసంగం ఒక పాఠం చెప్పింది. స్ర్తిలు, పిల్లల హక్కుల గురించి ఉద్వేగభరితంగా ప్రసంగించి భారతనారి సత్తా ఏమిటో ఆమె నిరూపించింది.

ధీర వనిత
పురుషాహంకారాన్ని ఎదిరించి: తనకు ఎదురులేదనుకునే రాజకీయ నాయకుడికి కొడుక్కు బుద్ధి చెప్పిన డేరింగ్ అండ్ డాషింగ్ యువతి వార్ణికా కుందు. రోడ్డు మీద కొట్టుకుంటూ దారుణంగా ఈడ్చుకెళ్లి కిడ్నాప్ చెయ్యడానికి ప్రయత్నించిన ఆ యువకుని వెనుక వున్న రాజకీయ అండదండలను లెక్కచెయ్యకుండా కాలుదువ్వి ఎదురు నిలిచిన ధీర వనిత. దేశవ్యాప్తంగా ఆమెకు లభించిన మద్దతును చూసి పోలీసులు తలవంచి నిందితుడ్ని అరెస్టు చెయ్యక తప్పలేదు.

హిజ్రా హక్కుల పోరాటంలో
జోయితా ముండల్ ఓ హిజ్రా. పదో తరగతిలో చదువు ఆపెయ్యాలంటూ ఒత్తిళ్లు వచ్చాయి. ఎన్నో అడ్డంకుల్ని ఎర్కొంది. చివరికి కుటుంబాన్ని వీడింది. ఉత్సవాల్లో హిజ్రాగా పాల్గొంటూనే హక్కుల గురించి పోరాడుతూ న్యాయవిద్య చదివింది. ఓటరు గుర్తింపు కార్డు తెచ్చుకున్న మొదటి హిజ్రాగా నిలిచింది. అంతేకాదు, ఏకంగా లోక్ అదాలత్ జడ్జిగా నియమితురాలై దేశాన్ని ఆశ్చర్యపర్చింది.

మిస్ వరల్డ్‌గా మానుషి చిల్లర్
మిస్ వరల్డ్‌గా: 17ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మానుషి చిల్లర్ 2017 మిస్ వరల్డ్‌గా గెలిచి భారత జాతి పతాకాన్ని విశ్వవీధుల్లో ఎగురవేసింది. లింగ వివక్షతకు మారుపేరుగా నిలిచే హరియాణాకు చెందిన ఈ వైద్య విద్యార్థినికి పదిహేడేళ్ల తరువాత ప్రపంచ కిరీటం దక్కటం వెనుక ఆమె కృషి ఎంతో దాగివుంది.

అంతర్జాతీయ సంస్థలో కీలక పదవి
డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ ప్రతిష్టాత్మకమైన డబ్ల్యుహెచ్‌వో సంస్థకి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రోగ్రామ్స్‌గా నియమితులయ్యారు. ఓ అంతర్జాతీయ సంస్థలో కీలక పదవిలో ప్రవేశించి మన దేశ ప్రతిష్టని మరింత ఇనుమడింపజేసిన ప్రతిభావంతురాలిగా డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ జేజేలు అందుకున్నారు. సౌమ్య ప్రస్తుతం భారత వైద్య పరిశోధనా మండలి (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్- ఐసీఎంఆర్)కు డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె పిల్లల వైద్య నిపుణురాలు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రధాన క్రమశిక్షణాధికారిగా (చీఫ్ ప్రోక్టర్)గా ప్రొఫెసర్ రోయనా సింగ్ సెప్టెంబర్ 28న నియమితులయ్యారు. 101 ఏళ్ల విశ్వవిద్యాలయ చరిత్రలో మహిళను చీఫ్ ప్రోక్టర్‌గా నియమించడం ఇదే తొలిసారి.

- జోస్యుల మల్లేశ్వరి