మెయిన్ ఫీచర్

ఆలయ దర్శనం సత్వగుణ శోభితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన సనాతన హిందూ ధర్మ సంప్రదాయంలో ఏ పని చేసినా దానికో ప్రత్యేకత - విశిష్టత ఉండడం సహజం. మనం భగవంతుని దర్శించడానికి ఆలయ దర్శనం చేసుకొంటూ ఉంటాం. అన్నింటా తానై ఉన్నప్పటికీ దైవాన్ని మనం ప్రత్యేకమైన ఆలయాల్లో దర్శనమూర్తిగా కొలువై ఉన్నాడని నమ్ముతాం. ఆ ఆలయాలకు వెళ్లి దైవాన్ని దర్శించుకొంటాం. అలా ఆ శుద్ధసత్వగుణస్వరూపుణ్ణి దర్శించుకోవడానికి మనం ముందుగా శారీరిక శుద్ధిని పాటిస్తాం. ఆ తరువాత మనస్సుద్ధిని పాటిస్తాం. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి, నుదుట తిలక ధారణ చేసుకొని నిష్కల్మషమైన మనస్సుతో భగవంతుని సేవకు బయలుదేరాలి. ఏ ఆలయానికి వెళ్లినా ముందు ధ్వజస్తంభం దర్శించుకుంటాం. ఆ తరువాత భగవంతుని రూపాన్ని కళ్లారా చూసుకొని మనసా ,వాచా, కర్మణా అంతా నీవే స్వామీ మమ్ము రక్షించు అని ప్రార్థిస్తాం. మనకు తోచిన విధంగా పత్రం, తోయం, పుష్పం ఇలా దేనినైనా భగవంతునికి సమర్పిస్తాం.
అయితే వీటి అన్నింటికన్నా మన మనస్సును ఎంత సేపు వీలైతే అంతసేపు భగవంతునిపై ఏకాగ్రం చేయాలి. భగవంతుని తత్త్వాన్ని ఆకళింపు చేసుకోవాలి. ప్రతిమనిషిలోను అసలు ప్రతి జీవిలోను పరమాత్మ అంశ ఉన్నదని ప్రతివారినీ భగవంతుని రూపుగా భావించాలి.
అట్లాకాక ఏదో మొక్కుబడిగా తోసుకొంటూ, తిట్టుకుంటూ భగవంతుని ఆలయానికి రావడం ఏదో ఒక విధంగా దేవుని దర్శించడం, అక్కడ కూడా వారి వారి అహంభావాలను ప్రదర్శించడం చేస్తే భగవంతుని దర్శించిన ఫలితం ఏమీ మనకు అందదు.
పూర్వకాలంలో చాలామంది భక్త్భివంతోనే జీవించేవారు. అంతా భగవంతుని మాయ అనుకొనేవారు. కాని రాను రాను మనిషి ఆలోచనల్లో మార్పు వస్తోంది. విదేశీ సంస్కృతులను ఒంట బట్టించుకుంటున్నారు. వారు కూడా పనిని దైవంగా భావిస్తారు. కాని ఇక్కడ మిడిమిడి జ్ఞానజీవులు అంతటికీ కారణం మేమేననుకొని గర్వం పెంచుకుంటున్నారు. మన ఆచార సంప్రదాయాలను, సనాతన ధర్మాలను విస్మరిస్తున్నారు.
ఇట్లాంటి జరగకూడదని మన పెద్దలు పండుగలు, పర్వదినాల పేరిట ఉత్సవాలు జరిపేవారు. వాటిని అర్థం చేసుకొంటే ఎన్నో అంతరార్థాలు కనిపిస్తాయి. పండుగలు జరుపుకోవడం వల్ల అటు ఆనందమూ, ఆరోగ్యమూ చేకూరుతుంది. ఉత్సవాలను జరిపించడం వల్ల ప్రజల్లో ఐకమత్యం పెరుగుతుంది. ఒకరికొకరుగా జీవించడం అలవడుతుంది. ఆ ఉత్సవాలలో హరికథలు, బుర్రకథలు, ఒగ్గు కథలు ఇలా ఎన్నో సాహిత్య ప్రక్రియా విశేషాలు ఉండేవి. వాటి వల్ల మన పూర్వీకుల గొప్పతనాలు వారి చేసిన దానాది కార్యక్రమాలు ఎన్నో తెలిసేవి. అన్నింటిలోకి ముఖ్యంగా జనులందరూ దేవుని బిడ్డలుగా భావించేవారు. వారిలో తరతమభేదాలు పొడచూపేవికావు. గర్వాంధకారం కలిగేది కాదు. ప్రతివారిలో సేవాభావం నెలకొనేది. ఇట్లాంటి వన్నీ ఆలయ దర్శనం వల్ల అక్కడ జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రసాద వితరణలు, జానపద విశేష ప్రదర్శన వల్ల తెలుస్తాయి. కనుకనే ఇపుడు కూడా నేటి యువత ఆలయ దర్శనం చేసుకొని అందులోదాగి ఉన్న పరమార్థాలను అర్థం చేసుకోవాలి.

- కురవ శ్రీనివాసులు