మెయిన్ ఫీచర్

కళాజ్యోతి ( కళాంజలి )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళారత్న డా. వనజా ఉదయ్ అత్యుత్తమ నర్తకీమణి. కూచిపూడి, భరతనాట్యం రెండు సంప్రదాయ నృత్యాలు అద్భుతంగా చేయగల కళాజ్యోతి. కొన్ని దశాబ్దాలుగా నాట్యానికే అంకితమైన ఈ నాట్య మయూరి. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, నృత్య శాఖలో పనిచేస్తున్నారు. నర్తకిగా, గురువుగా, తల్లిగా, గృహిణిగా, పరిశోధకురాలిగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న లలిత కళాభారతి ఈవిడ. ప్రఖ్యాత టివి నటుడు ఉదయ్ ఈమె భర్త. వీరికి తనయ్ అనే కొడుకు. ‘కల్చరల్ టూరిజం అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ మీద పరిశోధన చేసి, పిహెచ్‌డి పొంది ఆ గ్రంథాన్ని ప్రచురించారు.

ఎన్నో పురస్కారాలు..
ఎన్నో గౌరవాలు, మరెన్నో సత్కారాలు, పురస్కారాలు పొందారు డా వనజా ఉదయ్. వాటిలో కొన్ని..
శృంగారమణి - సుర సింగార్ సంసద్
ఔట్‌స్టాండింగ్ పర్సన్ ఆఫ్‌ది ఇయర్ - బాలభారతి
నాట్యమయూరి - భరత్ భారతి
సరోజినీ నాయుడు అవార్డు - ఆరాధన
దుర్గ్భాయి దేశ్‌ముఖ్ అవార్డు - అభినందన
కళాజ్యోడి - వైష్ణవి ఆర్ట్ థియేటర్స్
లలిత కళాభారతి - కమలాకర్ లలిత భారతి
నాట్య కళాతపస్వి - కళాభారతి
అభినయ తేజస్విని - నటరాజ కళా సమితి
నాట్యజ్యోతి - అకాడమీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్స్
పద్మమోహన్ అవార్డు - పద్మా ఆర్ట్స్ అకాడమీ
రాష్ట్రీయ వికాస్ శిరోమణి - ఢిల్లీ తెలుగు అకాడమీ
ఇటిఎ అవార్డు - యూరోపియన్ తెలుగు అసోసియేషన్
ఔట్‌స్టాండింగ్ డాన్సర్ - మలేసియా తెలుగు అసోసియేషన్
గౌరవ పురస్కారం - ఢిల్లీ తెలుగు అకాడమీ
ఉగాది విశిష్ట పురస్కారం - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
కళారత్న అవార్డు - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
రాజీవ్ ప్రతిభా పురస్కారం - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ప్రతిభా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం
మెంబర్ రీజినల్ ఫిలిం సెన్సార్ బోర్డ్

చదువుల సరస్వతి..
డా వనజా ఉదయ్ చదువులతల్లి, కల్పవల్లి. ఎం.ఎ సోషియాలజీ, పబ్లిక్ రిలేషన్స్‌లో పిజి డిప్లొమా, భరతనాట్యంలో డిప్లొమా, స్పానిష్‌లో డిప్లొమా, టూరిజంలో డిప్లొమా, కూచిపూడి నృత్యం టూరిజంలో పిహెచ్‌డి చేశారు. దూరదర్శన్ కూచిపూడి నృత్యంలో ఏ గ్రేడ్ కళాకారిణి. ఐసిసిఆర్‌లో కూచిపూడి నృత్యంలో ఎంపానెల్డ్ నర్తకీమణి.
ఎన్నో బాలేలుకు కొరియోగ్రఫి
డా వనజా ఉదయ్ ఎన్నో బాలేలు, కొరియోగ్రఫి చేశారు. అందులో కొన్ని ముఖ్యమైనవి
గాంధీ, అలువేలుమంగ విలాసం, మోహినీ భస్మాసుర, తెలుగు తేజాభినయం, తెలుగు విజయం, శ్రీకృష్ణదేవరాయ, జయం మనదే, రక్తదానం, స్వగతి, ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్‌లోనూ, ‘నా తెలంగాణ’, వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్, న్యూఢిల్లీలో బాలే, వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్, న్యూఢిల్లీలో కూచిపూడి ప్రదర్శన, శ్రీశ్రీ రవిశంకర్ ఆశీస్సులతో ప్రదర్శించారు.
దేశ విదేశాలలో 4300 పైగా ప్రదర్శనలు
డా వనజా ఉదయ్ 4300 పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఎన్నో లెక్చర్ డెమాన్‌స్ట్రేషన్స్ ఇచ్చారు. ఐసిసిఆర్, ఇండియన్ కల్చరల్ అసోసియేషన్స్, విదేశీ విశ్వవిద్యాలయాలు ఎన్నో సంస్థల ద్వారా ప్రదర్శనలిచ్చారు. కూచిపూడిలో యుఎస్‌ఎ, కెనడా, యుకె, ఇటలీ, జర్మనీ, పారిస్, స్విట్జర్లాండ్, ఆమ్‌స్టర్‌డామ్, డెన్వాంగ్, ఐర్లాండ్, సింగపూర్, మలేసియా, హాంగ్‌కాంగ్, లండన్, మకావ్, బ్రూనై, సౌత్ ఆఫ్రికా, దుబాయ్, అబుధాబి, మారిషస్, రీ యూనియన్ ఐలాండ్స్, శ్రీలంక, మెక్సికో, కొలంబియా మొదలగు దేశాలలో ప్రదర్శించారు.
కల్కీ కళాకార్ సమ్మేళన్, హరిదాస్ సమ్మేళన్, కూచిపూడి డాన్స్ ఫెస్టివల్, బంగళూరు, కూచిపూడి, యుఎస్‌ఎ, కాళిదాస్ సమారోహ్, నృత్యోత్సవ్, కేంద్ర సంగీత నాటక అకాడమీ నృత్యోత్సవ్, యక్షగాన ఫెస్టివ్-కేంద్ర సంగీత నాటక అకాడమీ, ఫెస్టివల్ ఆఫ్ హైదరాబాద్, ఇందూర్ ఫెస్టివల్, ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్, న్యూఢిల్లీ, సూరజ్‌కుంద్ ఫెస్టివల్ హర్యానా, 400 సంవత్సరాల శ్రీకృష్ణదేవరాయ ఉత్సవాలు, స్పిరిట్ ఆఫ్ యూనిటీ జాతీయ సమైక్యత ప్రదర్శనలు, పల్లవోత్సవ ఫెస్టివల్ మైసూరు, జగల్‌బందీ ఫెస్టివల్ జోనల్ కల్చరల్ సెంటర్లు, మిలీనియం ఫెస్టివల్- ఇలా ఎన్నో జాతీయ అంతర్జాతీయ ప్రదర్శనలిచ్చి కూచిపూడి కీర్తి పతాక నెగురవేశారు.
పరిశోధకులకు మార్గదర్శిగా..
గురువు అంటే చీకటినుండి వెలుగుకు దారిచూపేవారు అని అర్థం. డా వనజా ఉదయ్ శ్రీ మహంతి వెంకటేశ్వరరావు, వైజాగ్ వద్ద భరతనాట్యం నేర్చుకున్నారు. డా ఉమారామారావు, హైదరాబాద్ వద్ద భరతనాట్యం, కూచిపూడి నేర్చుకున్నారు. డా భాగవతుల సేతురాం, హైదరాబాద్ వద్ద కూచిపూడి, యక్షగానాలు నేర్చుకున్నారు. సి.ఆర్.ఆచార్యులు, పి.యు.జి.కృష్ణశర్మ, వేదాంతం సత్యనారాయణ శర్మ, కళానిధి నారాయణ, డా. నటరాజ రామకృషలు నిర్వహించే సెమినార్లకు, వర్క్‌షాప్‌లకు వెళ్లి ఎంతో నేర్చుకున్నారు. వనజ గత 25 సంవత్సరాలుగా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో నృత్య శాఖలో పనిచేస్తున్నారు. ఇపుడు పిహెచ్‌డి పరిశోధకులకు మార్గదర్శిగా ఒక దారి దీపం అయ్యారు.
కళాసేవకు అంకితం..
డా వనజ ఉదయ్ ఎన్నో దేశ విదేశాలలో సెమినార్లు ఇచ్చి వర్క్‌షాప్స్ ద్వారా నృత్యానికి ఎంతో సేవ చేశారు. అందులో కొన్ని ముఖ్యమైనవి. - వరల్డ్ తెలుగు ఫెడరేషన్, మలేసియా
- సింగపూర్ తెలుగు సమాజం, సింగపూరు
- భారతీయ విద్యాభవన్, లండన్
- యూనివర్సిటీ ఆఫ్ పారిస్, పారిస్
- న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, న్యూయార్క్
- రట్గర్స్ యూనివర్సిటీ, న్యూజెర్సీ
- యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయ్, చికాగో
- యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్‌ఏంజిలిస్
- మహాత్మా గాంధీ యూనివర్సిటీ, మారిషస్
- ఇండియన్ కల్చరల్ సెంటర్, మారిషస్
- ఇండియన్ కల్చరల్ సెంటర్, కొలంబో
- ఇండియన్ కల్చరల్ అసోసియేషన్, సౌత్ ఆఫ్రికా
ఇలా దేశ విదేశాలలో నృత్యాన్ని ప్రచారం చేస్తూ, కళకి ఎంతో సేవ చేస్తున్నారు కళారత్న డా వనజా ఉదయ్

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి