మెయన్ ఫీచర్

బుల్లితెర విశ్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దూరదర్శన్ వచ్చిన కొత్తలో ప్రాంతీయ లింక్ కేవలం సాయంకాలం 3 గంటలు ప్రసారమయ్యేది. ఆదివారం నాడు సాధారణంగా జాతీయ పురస్కారాలు గెలుచుకున్న ప్రాంతీయ భాష చిత్రాలు ప్రసారం అయ్యేవి. తెలుగు సినిమాలు సంవత్సరమంతా నిరీక్షించి చూస్తే మహా అయితే రెండు వచ్చేవి. మిగతా రోజుల్లో ఏమి చేయాలి. వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆకుపచ్చ పురుగులకి ఏ మందు ఎంత పాళ్లలో కలిపి జల్లాలిలాంటివి అప్పట్లో మహా గొప్ప కాలక్షేపం. ముఖ్యంగా, కనీసం టూరింగ్ టాకీసు లేని గ్రామాల్లో, ఆదివారం మధ్యాహ్నం వచ్చే ప్రాంతీయ భాష సినిమా అస్సామీస్ అయినా, మలయాళందైనా సబ్ టైటిల్స్ సహాయంతో చూడందే వదిలేవాళ్లం కాదు. గురువారం నాడు ప్రసారమయ్యే చిత్రలహరి పట్టుమని అర్ధగంట కూడా ఉండదు. అభిమాన హీరో లేక నటి పాట చూద్దామనుకునేలోగానే చుక్కలు వచ్చిన ఆంటిన్నా సరిచేయడానికి సరిపోయేది లేదా ‘ప్రసారంలో అంతరాయానికి చింతిస్తున్నాము’ అన్నట్లు రంగుల గీతలతో స్లయిడ్ వచ్చేది. లేదా ‘ఓవర్ టు ఢిల్లీ’ ప్రత్యక్షమయ్యేది.
1980లలో దూరదర్శన్ యువతపై ప్రభావాన్ని చూపించగలిగేది. ఆ రోజుల్లో టెలివిజన్‌కు వచ్చేసరికి దీనికి ప్రత్యామ్నాయాలు లేకపోవడం అందుకు కారణం. అలాంటిది ఇప్పుడు దేశంలో 800కి పైగా టీవీ చానళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. 1980లకి ఇప్పటికీ మారనిదేమిటంటే ‘రోజులో 24 గంటలు’.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ వలసదారులు, స్థానిక వార్తలు మరియు వినోద చానళ్లను అనుసరించినా కానీ వారు మాతృభాషలో సొంతగడ్డ విషయాలు, వార్తలు, వినోదభరిత కార్యక్రమాలు తిలకించడానికి మొగ్గు చూపుతారు. వార్తలు, వినోదం విషయాల్లో భాష కీలక పాత్ర పోషిస్తుంది. భారతదేశంలో రెండు వంతులు జనాభా వివిధ గుర్తించదగిన మాతృభాషలలో మాట్లాడటం, మీడియాని వినియోగించడంవలన ప్రాంతీయ భాషా ప్రేక్షకులకు టెలివిజన్ బ్రాడ్‌కాస్టర్స్ అసమానమైన ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇటీవలి ఫిక్కీ-కెపిఎంజి నివేదిక ప్రకారం, 2016లో ప్రాంతీయ వీక్షకుల వాటా 33 శాతంగా ఉంది. ఇది ప్రాంతీయ జనాభాలో ప్రేక్షకుల గణనీయమైన వాటా. ప్రాంతీయపరంగా, తమిళ్ చానల్స్ స్థానిక వీక్షకులు అధికభాగం 25.7 శాతం, కన్నడ 11.6 , మలయాళం 9.2, బెంగాలీ 6.6, మరాఠీ 4.6 మరియు 2.6 శాతం. మన మాతృభాష తెలుగు 24.4 శాతంతో రెండో స్థానంలో ఉంది.
జనాభా, భౌగోళిక లక్షణాల కారణంగా టెలివిజన్ బ్రాడ్‌కాస్టర్స్ కోసం భారత ఉపఖండంలో అవకాశాలు పుష్కలంగా ఉండడం ఒక వరం. కాకపోతే మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, భాష, మాండలికాలు, టీవీ వినియోగించే అలవాట్ల పరంగా భారతీయ మార్కెట్ మీడియా ప్రసారకులకు ఒక పజిల్ లాంటిది. సమగ్ర పరిశోధన చేసి క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఛేదిస్తేనే విజయం వరిస్తుంది. రెండు దశాబ్దాలుగా విదేశీ మీడియా సంస్థలు, ప్రాంతీయ భాషల్లో టెలివిజన్ ఛానళ్లకి దూరంగా ఉంటూ వస్తూ వాటిని స్థానిక మీడియా సంస్థలకు విడిచిపెట్టారు. భారతదేశంలో మొట్టమొదట అడుగుపెట్టిన స్టార్ చానళ్ల అనుబంధ సంస్థ రూపర్డ్ ముర్దోచ్ యొక్క న్యూస్ కార్పొరేషన్ మొదట డిటిహెచ్ భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టే నిమిత్తం ప్రవేశించారు. బ్రాడ్‌కాస్టర్స్ కోసం మరొక సవాలు. భారతదేశంలో టెలివిజన్ చూసే అలవాట్లు, డైనింగ్ టేబుళ్లు, టెలివిజన్ సెట్లు మాత్రమే భారతీయ కుటుంబాన్ని ఒకే సమయంలో ఒకచోటికి చేరుస్తాయి. పాశ్చాత్య దేశాలకు విరుద్ధంగా, కుటుంబ సభ్యులందరూ కలిసి టీవీ చూసి ఆనందించడం భారతీయుల సంస్కృతి. మొత్తం భారతీయ గృహాల్లో మూడింట రెండువంతులు లేదా 185 మిలియన్ల గృహాలలో భారతదేశంలో టీవీసెట్లు ఉన్నాయి. వీటిలో 96 శాతం గృహాలు ఒక్క టీవీ మాత్రమే కలిగి ఉన్నాయి. ప్రారంభంలో, ఈ పరిస్థితులు ప్రసారకుల కోసం అడ్డంకిగా, వాణిజ్య ప్రకటనదారులను, వారి లక్ష్య ప్రేక్షకులను ఆకర్షించడం గందరగోళంగా కనిపించేవి. మ్యూజిక్ చానెల్ ఎంటీవీ వంటివి కఠినమైన ఒక గుణపాఠాన్ని నేర్చుకోవలసి వచ్చింది ఇందువల్లే. కానీ ఇక్కడ సంస్కృతిని చూసి దిక్కుతోచక చివరకు, ఎంటీవీ బాంగ్రా సంగీతానికి నాట్యమాడింది. తద్వారా భారతీయ సంస్కృతిని ఆలింగనం చేసింది.
ఇండియన్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ యొక్క రూపాంతరప్రాప్త పెరుగుదల కారణంగా ఎదురయ్యే సవాళ్ల కారణంగా, ప్రసారకులు కేవలం పచ్చటి పచ్చిక బయళ్లకోసం మాత్రమే కాకుండా వారు సంభావ్య సముపార్జనల కోసం గాలిస్తూనే ఉన్నారు. ప్రాంతీయ ప్రేక్షకులను ఆకర్షించడం, ఓవర్ ద టాప్, స్ట్రీమింగ్ ప్లేయర్ల కంటెంట్ లైబ్రరీకి పోటీగా వారి నాణ్యతా విధానాలతో సరిపోయేలా కంటెంట్ వ్యూహాలను పునరుద్ధరించడానికి ఫ్రయత్నం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
గత ఐదు సంవత్సరాలలో బ్రాడ్‌కాస్టింగ్ దిగ్గజాలు, ప్రస్తుతం ఉన్న ప్రాంతీయ చానళ్లని తీసుకోవడమో, కొత్త చానళ్లను సృష్టించడం ద్వారానో తమ ప్రాంతీయ ప్రేక్షకులను గణనీయంగా పెంచుకున్నారు. మీ మాతృభాషలో ఒక క్రీడాచానల్ ఉంటే బాగుంటుందా? కుతూహలంగా ఉందా? తమిళ ప్రేక్షకులను పూర్తిగా ఆశ్చర్యానందాలలో ముంచెత్తారు స్టార్ టీవీ యాజమాన్యం. గత మే నెలలో, స్టార్‌టీవీ ఇతరులకన్నా ఒక అడుగు ముందుకు వేసి భారతదేశంలో మొట్టమొదటి ప్రాంతీయ క్రీడా చానల్ స్టార్ స్పోర్ట్స్ 1 ను ఆవిష్కరించింది. దీనికి కారణం ఏమటంటే, ఈమధ్యకాలంలో ప్రతి క్రీడాంశంలో వివిధ లీగులు నిర్వహించడం, ధోనీ ఐపిఎల్‌లో తమిళనాడుకు ప్రాతినిధ్యం వహించడం ప్రతి ఇంటికి ఇలవేలుపు లేదా హీరో అయ్యాడు. ముఖ్యంగా, స్టార్ టీవీ, తమిళులు ఒకరికొకరు అపరిచితులు కాదు. స్టార్ 2001లో యూటీవీ నుండి విజయ టీవీని కొనుక్కొంది. ప్రస్తుతం ఇబ్బందులతో చుట్టుముట్టబడి స్వీయ బహిష్కరణలోనున్న యునైటెడ్ బ్రేవరీస్ మాజీ చైర్మన్ విజయ్‌మాల్యా, విజయ టీవీని 90లలో ప్రారంభించారు. అందువల, స్టార్ టీవీ నెట్‌వర్క్‌కు తమిళ ప్రేక్షకుల నాడి తెలుసును. వాళ్ల అభిరుచులు స్టార్ టీవీకి కొట్టినపిండి.
జీ టీవీయొక్క ప్రాంతీయ పోర్ట్ఫొలియో ఎనిమిది భాషలతో కూడినది. గత సంవత్సరం జీ యువ మరాఠీ, తమిళ్ మూవీ ఛానల్ ఆవిష్కరించింది. మరోపక్క జీటీవీ, 9ఎక్స్ ఝూకాస్ మరాఠీ, 9ఎక్స్ టషన్ పంజాబీ సహా ఆరు 9 ఎక్స్ మ్యూజిక్ చానళ్లు కొనుగోలు ప్రక్రియలో ఉంది. సోనీ ఇండియా, ప్రాంతీయ చానళ్ల ఆటలో వెనుకబడి ఉంది. అయితే ఆలస్యంగా మేల్కొన్నా మెరుపువేగంతో ఐదు ప్రాంతీయ వినోద చానల్స్ సబ్ బంగ్లా, సబ్ తమిళ్, సబ్ పంజాబీ, సబ్ మరాఠీ, సబ్ తెలుగుతో ఝలక్ ఇవ్వనుంది. వయాకామ్ 18, ఈటీవీ తెలుగు చానళ్లు మినహా మిగతా ఈటీవీ చానళ్లను కొనుగోలు చేసి వాటిని కలర్స్ బంగ్లా, కలర్స్ మరాఠీ, కలర్స్ గుజరాతీ, కలర్స్ ఒరియా, కలర్స్ కన్నడగా రూపాంతరం చేసింది. గత ఏడాది స్టార్ టీవీ మా తెలుగు చానల్ నెట్‌వర్క్ కైవసం చేసుకొని మా టీవీ, మా సినిమా, మా మ్యూజిక్, మా గోల్డ్‌లను స్టార్ హారంలో కలుపుకున్నది. ఇన్ఫోటైనె్మంట్ ద్వయం నేషనల్ జియోగ్రాఫిక్, డిస్కవరీ పోటీగా ‘సోనీ-బిబిసి’ ఇన్ఫోటైన్మ్‌ంట్ రంగంలోకి ఉమ్మడిగా ప్రవేశించి , ‘సోనీ-బిబిసి’ యొక్క ప్రాంతీయ భాషల్లో డబ్బింగి ఫీడ్ ప్రారంభించి మంచి అవకాశాన్ని సద్వినియోగపర్చుకున్నాయి. అక్టోబర్ నెలలో బీబీసీ తన బీబీసీ వరల్డ్ వ్యూ కార్యక్రమం కోసం ఈటీవీ, ఇండియా టీవీలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. భారతదేశంలో షాప్ సీజె నెట్‌వర్క్‌లో 74 శాతం వాటాను సంపాదించడానికి మధ్య భాగంలో హోముషాప్ 18 ఇప్పటికే ప్రాంతీయ టెలిషాపింగ్ టీవీలో ఐదు భాషల్లో ఉనికిని చాటుకుంటోంది.
‘కౌన్ బనేగా క్రోర్పతి’, ‘ఇండియన్ ఐడల్’, ‘బిగ్‌బాస్’ భారతీయ రాష్ట్రాలలో సృష్టించిన అలజడి అంతాఇంతా కాదు. ప్రేక్షకులలో ఆసక్తి వలన అవి వివిధ ప్రాంతీయ భాషల్లో పునర్నిర్మించారు. ఆ షోలయొక్క నిర్మాణ సంస్థలు ఎండమాల్, ఫ్రీమాంటిల్ అసలు బ్రిటిష్ ఫార్మాట్‌లను రూపొందిస్తున్నప్పుడు అవి ఇంత అద్భుతమైన విజయం సాధిస్తాయని, ఇన్ని భాషల్లో వెర్షన్లు తీస్తారని ఊహించి ఉండరు. ఈ పరిణామాలు, దృష్టాంతాలు భారతీయ ప్రాంతీయ భాషలకు ప్రసారాలు అందించే ప్రాధాన్యాన్ని సూచిస్తున్నాయి.
1980లలో దూరదర్శన్ ప్రాంతీయ లింక్ పరిమిత సమయానికి ఉండే రోజుల నుంచి భారత మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగం సుదీర్ఘ ప్రయాణం చేసి ఈరోజు 800 చానళ్లకు పైగా సృష్టించింది. మరోపక్క సోషల్ మీడియా, ఇంటర్నెట్ పుణ్యమా అని నేడు అరచేతిలో మీట నొక్కి మాయాబజార్ సినిమాలో చూపినట్లు ఏమి తలచుకొంటే అది ప్రత్యక్షమవుతోంది. ఏది, ఎవరు, కావాలంటే వాళ్లను చూడగలం.
భారతదేశ టెలివిజన్ చరిత్రను విస్తృతంగా రెండు కాలాలుగా విభజించవచ్చు. ప్రైవేటీకరణ ముందు, తరువాత అని. ప్రైవేటీకరణ ముందు సమయాన్ని మళ్లీ రెండు దశలుగా విభజించవచ్చు. 1. ప్రీ-ఆసియాడ్ గేమ్స్, 2. పోస్ట్ ఆసియాడ్ గేమ్స్. ప్రైవేటీకరణ తరువాత కాలాన్ని మరో రెండు రకాలుగా చూడొచ్చు. 1.ప్రీ-కేబీసీ, 2.పోస్ట్-కేబీసీ.
నేడు దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెట్లలో ఒకటి. 2000నాటికి మూడుశాతం వృద్ధి రేటుతో 2016 నాటికి 10.5 (సీఏజీఆర్) కాగా ప్రపంచ సగటు 4.2 శాతం మాత్రమే ఉండడం గమనార్హం.

- సునీల్ ధవళ, 09741747700