మెయిన్ ఫీచర్

మూగ జీవి.. ధన్యజీవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎద్దు ఆమెకు ప్రాణం పెళ్లిని త్యాగం చేసిన యజమాని జల్లికట్టు పోటీల్లో విజేత ఇది ఓ కూలీ కథ
రాము (ఎద్దు) నాకు కొడుకుతో సమానం. ఎన్నో పురస్కారాలు గెలుచుకున్నది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల మన్ననలు పొందింది. జల్లికట్టు పోటీల సందర్భంలో రాముపట్ల ఎంతో అభిమానం చూపిస్తారు. -సెల్వరాణి
పెంపుడు జంతువులు పెంచుకోవటం చాలామందికి అభిరుచి. ఆ మూగ జీవాలను తమ జీవితంలో ఒక భాగంగా చేసుకుని బతుకుతుంటారు. తమిళనాడుకు చెందిన సెల్వరాణికి ఎద్దు అంటే ప్రాణం. ఈ ఎద్దు అలాంటిది ఇలాంటిది కాదు. పలు జల్లికట్టు పోటీల్లో విజేత. ఎద్దు కోసం పెళ్లినే ఆమె త్యాగం చేసింది. జల్లికట్టు పోటీల్లో ఆ ఎద్దు విజేతగా నిలిస్తే ఆమెకు ఆనందం. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా వాస్తవం. వివరాల్లోకి వెళితే..
దక్షిణ భారతదేశం తమిళనాడులో రోజూవారీ వేతన కూలీ సెల్వరాణి కనగరసు. ఆమె తాత ముత్తాతలు అంతా కూడా జల్లికట్టు పోటీల్లో పాల్గొనేవారు. వారి వారసత్వాన్ని సెల్వరాణి తీసుకుంది. పెళ్లి చేస్తామని పెద్దలు ఎంత నచ్చచెప్పినా వినలేదు. పదేళ్ల వయసులో ఉన్న ఎద్దును ఆమె తండ్రికి ఇంటికి తెచ్చాడు. అప్పటి నుంచి అదే ఆమె లోకం అయింది. దాని పెంపకంలోనే ఆమెకు 48 ఏళ్ల వయసు వచ్చింది. ఆ ఎద్దుకు రాము అని పేరు పెట్టుకుంది. కుటుంబ సాంప్రదాయాన్ని వదిలేయకుండా కాపాడుతున్న సెల్వరాణీ అంటే ఆ గ్రామంలో అందరికీ ఇష్టం. రాము ప్రతి ఏడాది జల్లికట్టు పోటీల్లో పాల్గొంటుంది. అది పట్టు చీరలు, బంగారు నాణాలను బహుమతులుగా తీసుకువస్తుంది. వాటిని చూసి సెల్వరాణీ మురిసిపోతుంది.
జల్లికట్టు అంటే ఏమిటి?
జల్లికట్టు పురాతన సాంప్రదాయ క్రీడ. దాదాపు రెండు వేల సంవత్సరాల నుంచి ఈ పోటీలు తమిళనాడు రాష్ట్రంతో మమేకమయ్యాయి. ఎద్దు దాదాపు 15 లేదా 20 కిలోమీటర్ల దూరం పరుగు పెడుతుంది. ఈ సందర్భంలో అది ఎగరడం కూడా చేస్తుంది. బహుమతిని గెలుచుకోవాలంటే ఎద్దు పొట్టను పట్టుకుంటారు. ఇలా పట్టుకోవటంలో సఫలీకృతులు కాకపోతే ఎద్దు విజయం సాధించినట్లే. ఈ పోటీల్లో వందలాది మంది యువకులు పాల్గొంటారు. ఎద్దు కొమ్ములు పదునుగా, వాడిగా ఉంటాయి. ఈ పోటీలో ఎద్దులను ఎలాంటి హింసకు గురిచేయరు. ఇటీవల కాలంలో ఎద్దు తోక లాగటం వంటి చేష్టలకు పాల్పడుతుండటంతో సుప్రీం కోర్టు జంతు క్రూరత్వం కింద పరిగణించి రెండేళ్ల పాటు ఈ జల్లికట్టుపై ఆంక్షలు విధించిన సంగతి అందరికీ తెలిసిందే.
పదేళ్ల వయసు నుంచి పోషణ..
సెల్వరాణి ఈ ఎద్దు (రాము)ని పదేళ్ల వయసులో ఉండగా కొనుగోలు చేసింది. అపుడు ఆమె యుక్త వయసులో ఉండేది. ఇంటికి తెచ్చిన రాము పోషణలోనే ఆమె ఎక్కువ కాలం గడిపేది. ఆ మూగ జీవి పట్ల ఆమె చూపే అభిమానం ప్రత్యేకంగా ఉంటుందని స్థానికులు సైతం అంటుంటారు. సెల్వరాణీకి చిన్న గది మాత్రమే ఆస్థి. ముందు వసారా ఉంటుంది. ఆ వసారాలో రాము ఉంటుంది. రోజూ కూలీ పనులకు వెళుతుంది. ఆమెకు రోజుకు రూ.200లు వస్తాయి. ఇందులో ఎక్కువ భాగం ఎద్దుకే ఖర్చు చేస్తుంది.
(పత్యేక ఆహారం..
రాము కోసం ప్రత్యేకమైన ఆహారాన్ని అందిస్తుంది. గడ్డి, కొబ్బరి, అరటి పళ్లు, నువ్వులు, వేరుశనగ నూనె కేక్స్, మెల్లెట్స్,రైస్ వండి పెడుతుంది. తాను సరిగా తినకుండానే ఈ రాముకు మాత్రమే పోషకాహారాన్ని ఇవ్వటంలో ఎలాంటి వ్యత్యసం చూపదు. ఒక్కొక్కసారి సెల్వరాణీ ఒక్కపూట మాత్రమే భోజనం చేసి మిగిలిన ఆ డబ్బులతో రాముకి అరటి పళ్లను తెచ్చిపెడుతుందంటే ఆశ్చర్యం కలుగకమానదు. ప్రతిరోజూ సరస్సు వద్దకు తీసుకువెళ్లి దాన్ని శుభ్రంగా కడుగుతుంది. అంతేకాదు ఈత కొట్టిస్తుంది. రోజూ కొన్ని మీటర్ల దూరం పరుగు పెట్టిస్తుంది. ప్రతి ఏడాది జల్లికట్టు పోటీల్లో పాల్గొనే ముందు వెటర్నరీ వైద్యుడి నుంచి ఫిట్‌నెస్ సర్ట్ఫికెట్ తీసుకున్న తరువాతే పోటీలకు హజరుపరుస్తుంది. నల్లగా నిగనిగలాడుతూ జల్లికట్టు పోటీల్లో పాల్గొనే ఈ ఎద్దు విజేతగా నిలుస్తుండటంతో దీన్ని ఆమె చేతుల్లో నుంచి తప్పించి సొంతం చేసుకోవాలని చాలామంది ప్రయత్నాలు చేసారు కానీ సఫలం కాలేదు. లక్ష రూపాయలు ఇచ్చి కొంటామని ఆఫర్ వచ్చినా సెల్వరాణి తిరస్కరించింది. తన తదనంతరం రామును చూసుకోవటానికి సెల్వరాణి తన పద్దెనిమిది సంవత్సరాల మేనకోడలిని తనతో పాటు దీని ఆలనాపాలనా చూసుకునేలా పనులు నేర్పిస్తుంది. ఆమె మేనకోడలు చదువుకుంటుంది. ఆ కుటుంబంలో ఇంత వరకు ఆడపిల్లలు ఉన్నత చదువులు చదవలేదు. కాని సెల్వరాణి మేనకోడలు పట్టుదలగా చదువుకుంటూ రామును చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఈ కుటుంబంలో తొలి గ్రాడ్యూయేట్‌గా నిలవాలని ఆ మేనకోడలు తహతహలాడుతోంది. ఏదిఏమైన సెల్వరాణి జీవితంతో మమేకమైన ఈ ఎద్దును పెంచటంలో ఈనాటికీ వరకు రాజీ పడకుండా ముందుకు సాగుతుంది. ఈ ఎద్దు జల్లికట్టులో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుందాం.