మెయన్ ఫీచర్

అన్నదాతా సుఖీభవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగిరెద్దులు, హరిదాసులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు, మృష్టాన్న భోజనాలు, బోగి మంటలు, పేక, బ్రాకెట్ ఆటలు, కొత్త సినిమాల విడుదల, అల్లుళ్లు బంధువుల రాకతో సంక్రాంతి ఈ యేడు కూడా చాలా భేషుగ్గా జరిగి ఎక్కడి వాళ్లు అక్కడికి తిరుగుముఖం పట్టారు. మరి రైతన్నల మాటేమిటి? ఏమంటాడు డూడూ బసవన్న?
అసలు సంక్రాంతి ప్రముఖంగా జరుపుకోవడానికి కారణమే రైతులు. పంటలు చేతికొచ్చి, ఇంటినిండా ధాన్యపు రాసులతో సుభిక్షంగా ఉండేవారు. అమ్మిన సొమ్ముతో కులాసాగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటేలాగా జరుపుకొనేవి పూర్వం పల్లెలు. రైతన్నలు గత రెండు దశాబ్దాలుగా గడ్డు రోజులు ఎదుర్కొంటున్నారు. ఈ రోజైనా వాన పడుతుందేమో అనే చిగురాసతో వేకువజామునే లేచి కళ్లు తెరచిన లగాయితూ రోజంతా కాయకష్టం చేసి, ఎంతకూ తరగని ఋణభారం తలుచుకుంటూ కలత నిద్రతో కాలక్షేపం చేయడం రైతుల దినచర్యగా మారింది. కార్గిల్లో యుద్ధం మొదలయింది అనగానే ముందుగా ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర వస్తువులు పప్పు ధాన్యాన్ని నిల్వ చేసుకొన్నాము, మందుల దుకాణాల బంద్‌కు పిలుపు ఇవ్వడమే తడువు నెలకి సరిపడా ఔషధాలు కొనుక్కొంటాము. అంతెందుకు ఎవరో ఉప్పు కిలో రెండు వందల రూపాయలు అయిపోతుందని పుకారు వ్యాప్తి చేస్తే తక్షణమే ఆలోచనపాలోచన లేకుండా ఒక డజను ఉప్పు పాకెట్లు బెత్తాయించేస్తాము. మరి మన అన్నదాతలు అనుక్షణం ఆత్మహత్యలకు పాల్పడుతూంటే ఆదుకోవడం మన కర్తవ్యం కాదా? దేశ జనాభాలో దాదాపు 60 శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నందున ప్రపంచంలోని ఎక్కువమంది రైతులున్న దేశం కాబట్టి భారతదేశానికి వ్యవసాయం వెన్నుముక వంటిది. ఇటీవలి కాలంలో రైతుల ఆత్మహత్యలు ఆందోళకరమైన స్థాయిలో పెరుగుతున్నాయి. మనదేశంలో ప్రతి 40 నిమిషాలకు ఒక రైతు, సగటున ప్రతిరోజు 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దేశంలో మొత్తం ఆత్మహత్యలకు పాల్పడినవారిలో పది శాతం పైగా రైతులే. గత రెండు దశాబ్దాలలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల సంఖ్య 3 లక్షలకు పై చిలుకు. ఇదేమీ ఆషామాషీ కాదు. అత్యధికశాతం సన్నకారు రైతుల సగటు వార్షిక ఆదాయం 25,000 - 40,000కు మించదు అంటే ఆశ్ఛర్యంగా ఉంటుంది. లేదా నష్టాలు యాభైవేల నుండి రెండు లక్షల వరకు. మోదీ సర్కారు ఐదేళ్లలో రైతులు, వ్యవసాయ రంగంలో పనిచేసేవారి ఆదాయం రెండింతలు అయ్యేటట్టు చర్యలు తీసుకొంటామని వాగ్దానం చేసింది. రైతుల ఆత్మహత్య అనే సంక్షోభం సమసిపోయి సామాజిక భద్రత కల్పించాలంటే సాంకేతికంగా వ్యవసాయ పద్ధతులలో అభివృద్ధితోపాటు భారీ పెట్టుబడి కూడా అవసరం. ప్రతీ పంట లేక సాగుకు కనీస మద్దతు ధర ఉండాలి. పంపిణీ వ్యవస్థ, పంట అమ్మకంలోను ఇంకా మార్పులు తేవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్జీఓలు, సహకార సంఘాలు, గ్రామ పంచాయతీలు కలసికట్టుగా పనిచేసి రైతులకు సంక్షేమ పథకాలను అమలు చేసి అభయహస్తాన్ని అందించాలి. అప్పుడు ఆత్మహత్యలు నివారించవచ్చు.
1950 నాడు దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం 50 శాతం తోడ్పడడం వలన వ్యవసాయ రంగంలో ఉపాధి 80 శాతం కల్పించేది. ఈరోజు జీడీపీలో వ్యవసాయం 15 శాతం కన్నా ఎక్కువ లేదు. ఉపాధి 55 శాతానికి గణనీయంగా తగ్గింది. వ్యవసాయ రంగం వేతనాలు అత్యల్ప స్థాయికి పడిపోయాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 1996 నుంచి ప్రతీ ఏటా ఆత్మహత్యల వివరాలు ప్రచురిస్తుంది. వాటిలో పేర్కొన్న రైతన్నల ఆత్మహత్య గణాంకాలు బాధ కలిగిస్తాయి. 2013లో 11,770, 2014లో 12,360, 2015లో 12,600, 2016లో 11,450, 1995లో 10,720 అతి కనిష్ఠ, 2004 కరువులో అత్యధిక సంఖ్యలో 18,241 ఆత్మహత్యలు నమోదయ్యాయి. అగ్రికల్చర్ ఎకనమిక్స్ రీసెర్చ్ యూనిట్ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు సమర్పించిన నివేదిక ప్రకారం దేశంలో 50 నుంచి 60 శాతం వ్యవసాయ గృహాల ఆదాయం దారిద్య్ర రేఖకన్నా దిగువన ఉన్నాయి. సగటున 50 శాతం వ్యవసాయ గృహాలు ఋణాలు సగటు 50వేలు తీసుకోగా తెలుగు రాష్ట్రాల్లో 90 శాతం రైతులు సగటున 1.2 లక్షలతో ఋణాలతో సతమతమవుతున్నారు.
ఇవీ ప్రాథమిక కారణాలు
ఈ స్వీయ ప్రేరేపిత సామూహిక ఆత్మహత్యలకు ప్రాథమిక కారాణాలను వివరంగా చెప్పుకోవచ్చు. అధిక వ్యయం, తక్కువ ఆర్జనతో కూడుకున్న వ్యవసాయం, అధిక వడ్డీలు, ఎన్నటికీ తరగని ఋణాల బాధ, బహుళజాతి సంస్థల ఖరీదైన విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు, వీటిలో మళ్లీ నకిలీలు, స్థిరత్వం లేని మార్కెట్లు, అనుకూలించని వాతావరణంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. సన్నకారు రైతులకు సాంకేతిక పరిజ్ఞానం, నీటిపారుదల వసతుల లభ్యత కనిష్ఠంగా ఉంది. నీటిపారుదల, విద్యుత్, డీజిల్ ఇంధనం, యంత్రాల అద్దె, వ్యవసాయ భూమి కౌలు ఖరీఫ్‌తో పోలిస్తే రబీలో రెండింతలుగా ఉంటాయి. చెరకు, జొన్న, సోయాబీన్ సాగు అత్యధిక లాభాలను ఇవ్వగా రాగులు, చోళ్లు, మసూర్ ఇతర పప్పు్ధన్యాలు కనిష్ఠ లాభాన్ని ఇస్తున్నాయి.
భారతదేశంలో చిన్న-సన్నకారు, మధ్యతరహా రైతులు అంటే రెండు హెక్టార్లలో లేదా ఐదు ఎకరాల భూమిని సాగు చేసేవారు మొత్తం వ్యవసాయ గృహాల్లో 80 శాతం ఉన్నారు. దురదృష్టవశాత్తు, ఈ రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. దేశం యొక్క సాగుభూమిలో 70 శాతం కరవువలన, 12 శాతం వరదల బారినపడి ఇంకో ఎనిమిది శాతం తుపానుల వలన పంట నాశనం అవుతున్నాయి. నీతి అయోగ్ ఇటీవలే భారత వ్యవసాయరంగం, అభివృద్ధిలో 28 ఏళ్లు వెనుకబడి ఉందని నొక్కిచెప్పింది.
పేదరికం, అప్పుల ఊబిలో కూరుకుపోవడం, ప్రకృతి వైపరీత్యాలు, పంటల నాశనం, అల్ప దిగుబడి, చేతికొచ్చిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం, అమ్మలేకపోవడం, గిడ్డంగులు లేక పంటపాడైపోవడం, చోరీకి గురికావడం, కల్తీ విత్తనాలు, ఎరువులు వంటి కారకాలు వ్యవసాయ సంబంధిత ఆత్మహత్యలకు ప్రధాన ప్రేరకాలు. కమతాల విస్తీర్ణం తక్కువగా ఉండడం వలన యాంత్రీకరణకు సౌలభ్యం ఉండడం లేదు. రైతులకు హైబ్రీడ్ విత్తనాలను అమ్ముతున్నారు. ఆ విత్తనాలకి భారీ ఎత్తున నీరు, అధిక మోతాదులో ఎరువులు, పురుగు మందులు అవసరం. దీనివల్ల పంటలు ఆశించినంత దిగుబడి లేక లేదా విత్తనాలు మొలకెత్తకపోవడమో తరచుగా రైతులను అప్పుల ఊబిలోకి లాగి చివరిగా ఆత్మహత్యలకు దారితీస్తోంది.
నవతరం రైతులు ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఉద్దేశ్యంతో వాణిజ్య పంటలపై ఆసక్తి కనబరుస్తున్నారు. వరి, పత్తి, చెరకు వంటి పంటలకు నీరు పుష్కలంగా కావాలి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం కొరకు విద్యుత్ రాయితీలు ప్రకటించడంతో 20 లక్షల బోరుబావులు వెలిసి నీరు అధికంగా కావలిసిన పంటలను సాగు చేస్తున్నారు. మరో కోణం ఏమిటంటే ప్రభుత్వ కనీస మద్దతు ధరలను ప్రస్తుతం 23 పంటలకు ప్రకటించినప్పటికీ చెరకు, గోధుమ, బియ్యం ధరలు ప్రోత్సాహకరంగా ఉండడంతో వాటికే ఓటు వేస్తున్నారు. తీరా చెరకు పండించాక చెరకు మిల్లు యజమానులు బకాయిలు చెల్లించడంలో జాప్యం చేయడమో లేదా బాకీ నీటి ఖాతాలో రాయడమో జరుగుతోంది. ఉత్తరప్రదేశ్, మహారాష్టల్రలో మార్థాడా, విదర్భ రైతుల పొలాలు స్మశాన వాటికలు కావడానికి ఈ చెరకు పంటలే కారణం. మిగిలిన పంటలకన్నా చెరుకు లాభదాయకం కావొచ్చు కానీ ఒక పంటకు కనీసం 12 నుంచి 18 నెలలు తీసుకొంటుంది.
తెలుగు రాష్ట్రాలలో వరంగల్, అనంతపురం, గుంటూరు, నల్గొండ, మెదక్, మహబూబ్‌నగర్, కృష్ణా జిల్లాల రైతులు నీటిఎద్దడి, నకిలీ మిర్చి, పత్తి విత్తనాల మోసానికి గురై అప్పులబాధతో ప్రాణాలు తీసుకొంటున్నారు. రైతులలో 40 శాతం మహిళలు ఉన్నందున పొలాలు వంశపారంపర్యంగా వచ్చినందున పట్టా, ఆత్మహత్య చేసుకొన్న రైతుల పేరుమీద లేకపోతే ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా పొందడంలో జాప్యం లేదా అనర్హతకు గురి అవుతున్నారు.
మన దేశ ప్రధాన సమస్య తగినంత నీరు, భూగర్భ జలాలు లేకపోవడం. భారత ప్రభుత్వం 1600 కోట్ల పెట్టుబడితో కరవుపీడిత ప్రాంతాలకోసం నీటి మళ్లింపుపథకం పని ఆరంభించింది. ఇది పూర్తయితే 15,000 కిలోమీటర్ల కృత్రిమ జలమార్గాలను సృష్టించి 35కు పైగా జీవనదులతో అనుసంధానం చేయడం ద్వారా 174 క్యూబిక్ కిలోమీటర్ల నీటిని కరవు ప్రాంతాలకు తరలిస్తారు. ఏదేమైనా సహజసిద్ధమైన వర్షపు నీటిని నిల్వ చేయడం, నదీప్రవాహాలపై చెక్‌డ్యాములు ఏర్పాటు చేసినట్టయితే అవి భూగర్భ జల స్థాయిలను మెరుగుపరుస్తాయి.
1998 తరువాత ప్రపంచబ్యాంకు విధించిన నిబంధనల పుణ్యమా అని భారతదేశంలోకి మోన్సాంటో వంటి బహుళజాతి సంస్థలు అడుగుపెట్టి మన విత్తన మార్కెట్‌ను కకావికలం చేశాయి. మన వేలాది సంవత్సరాల పరిపూర్ణమైన సహజసిద్ధమైన స్థిరమైన వ్యవసాయ వ్యవస్థను పునరుత్పాదకం కాని జన్యుపరంగా మార్పిడి చేయబడిన జీఎం పంటల విత్తనాలు భర్తీ చేశాయి. ఈ నేపథ్యంలో మన సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు కావలసిన జీవ వైవిధ్యాన్ని క్రమేపీ కోల్పోయాము. సంప్రదాయ విత్తనాలతో ఒక కిలోధాన్యం పండించడానికి కావలసిన నీరుకంటే జీఎం విత్తనాలకి రెండింతల నీళ్లు అవసరం. బీటీ పత్తి విత్తనాల వలన బాల్ పురుగుల నుంచి విముక్తి దొరికినా మరెన్నో ఇతర పురుగులను నివారించలేకపోతోంది. బీటీ పత్తి విత్తనాల వలన 20 సంవత్సరాల క్రితం 10 రూపాయలు ఉండే విత్తనాలు ఇప్పుడు కిలో 1700 అయ్యాయి. కాకపోతే పత్తి ఉత్పత్తి 15 మిలియన్ల బేళ్ల నుంచి 45 మిలియన్ల బే ళ్లకు, అనగా మూడు రెట్లు పెరిగింది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద పత్తిపంట సాగు ఎవరిది అంటే.. మనదే.
మొన్సాంటో భారతదేశంలో భూమి పరీక్షల నిర్వహణ కోసం అనుమతి కోరగా పీవీనరసింహారావు ప్రభుత్వంలో బయోటెక్నాలజీ విభాగం తిరస్కరించింది. అయితే 1995లో భూసార పరీక్షలు నిర్వహించడానికి మహీకో అనే సంస్థకి అనుమతి ఇవ్వగా, భారత్‌లో ఎలాగైనా పాగా వేయాలని కాసుకు కూర్చొన్న మోన్సాంటో వెంటనే మహీకోలో వాటా కొని మహీకో-మోన్సాంటో బయోటెక్ స్థాపించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ పర్యవేక్షణలో నేరుగా భూసార పరీక్షల్లో పాల్గొన్నది. మోన్సాంటోకి వ్యతిరేకంగా రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నవధాన్య అనే సంస్థ ప్రజాప్రయోజన వాజ్యం కూడా వేశాయి. ఎన్నో ఎన్జీవోలు, సహకార సంస్థలు, రైతు మండలులు సుదీర్ఘకాలం వ్యతిరేకత ప్రదర్శించి ఆందోళనలు చేపట్టినా కూసింత కూడా లాభం లేకపోయింది.
ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) వాణిజ్య సంబంధిత అంశాలు, మేధో సంపత్తి హక్కులు (ట్రిప్స్) ఒప్పందం యొక్క ఆర్టికల్ 27.3 భారత పేటెంట్స్ చట్టంలోకి పొందుబరచబడడం వలన విత్తనాల పొదుపు, మార్పిడి నుంచి రైతులను నిరోధించింది. మోన్సాంటో వంటి సంస్థల ప్రమేయం ఈ ‘ట్రిప్స్’ ఒప్పందం వెనుక ఉన్నాయి. ఈ పరిణామాలు మనదేశంలో పత్తిరైతుల ఆత్మహత్యలకు కారణమయ్యాయి.
సేంద్రియ విత్తనాలు, విత్తన సార్వభౌమత్వం, పర్యావరణ వ్యవసాయం, వాతావరణ, శీతోష్ణస్థితి స్థాపక వ్యూహాలు ఏర్పడాలంటే మన కేంద్ర విత్తన 1964 చట్టంలో చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయడంవల్ల పంటల వైఫల్యం తగ్గి రైతులు నికర ఆదాయాలు పెరగడానికి దోహదపడుతుంది.
మరి 2018 బడ్జెట్‌లో రైతులకు ఏ రాయితీలు, సబ్సిడీలు, సదుపాయాలు, శుభవార్తలు ఉంటాయో వేచి చూడాలి.

- సునీల్ ధవళ, 09741747700