మెయిన్ ఫీచర్

తం సూర్యం ప్రణమామ్యహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతకోటి కిరణుడు- తేజమయుడు- దినకరుడు- వే వెలుగుల జ్యోతిర్మయుడు- త్రైలోక్య చూడామణి- దినమణి- ఆదిత్యుడు- శుభదాయకుడు- లోకరక్షకుడు- భక్త్భాష్ట వరప్రదుడు- మార్తాండుడు, సత్య, ధర్మ దయామూర్తిగా, ఆదిదేవునిగా యుగయుగాలలో ఆరాధింపబడుచున్నాడు సూర్యభగవానుడు. కర్మసాక్షి.
సూర్యుడు దక్షిణాయనము నుండి ఉత్తరాయణమునకు తన ప్రయాణమును నడిపించే రోజుగా విశిష్టతను పొందిన రోజు కాలమానంలో మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమి, రథసప్తమిగా పర్వదినమై శోభిల్లుచున్నది.
ఆదిత్యుడు 12 మాసాల్లో 12 రకాల రూపాలను ధరిస్తాడు గనుకనే ‘ద్వాదశాత్మ’ అనే పేరు వచ్చింది. నెలకో రూపాన్ని పొందుతూ ప్రకృతిని రక్షిస్తూ ఉంటాడు. ప్రతి మాసంలో ఆరేసిమంది పరిజనంతో పరిభ్రమిస్తుంటారు. ఈ పరిజనంలోని ఆరుగురి పేర్లు కృతస్థలి- హేసి- వాసుకి - రధకృత్తు - పులస్త్యుడు- తుంబురుడు అనువారు.ఈ ఆదిత్యుడు చైత్రంలో ధాత- వైశాఖంలో ఆర్యముడు- జ్యేష్ఠంలో మిత్రుడు- ఆషాఢంలో ఇంద్రుడు- భాద్రపదంలో వివస్వంతునిగా, ఆశ్వయుజంలో తృష్టగా- కార్తీకంలో విష్ణువనీ- మార్గశిరంలో తవ్యముడనీ, పుష్యమాసంలో క్రతువుగా కీర్తింపబడుచున్నాడు. సూర్యకిరణంలో ఏడు రంగులు ఉండటంవలన ‘సప్తాశ్వుడ’ని పేరుంది. సూర్యునికి దినకరుడు- అహస్కరుడు- ప్రభాకరుడు- విభాకరుడు- భాస్కరుడు- సప్తాశ్వుడనే ఏడు పేర్లున్నాయి. సప్త అనే గుఱ్ఱం గలవాడనీ- ఏడు గుఱ్ఱాలు గల రథం ఎక్కేవాడనీ అర్థం.
మరో పేరు మార్తాండుడు. అనగా మృతమైరుూ బ్రహ్మాండమును బ్రతికించేవాడు. మేఘరూపంలో ఈ జగతిని తడుపుతాడు గాన మిహిరుడు అనీ, సర్వప్రాణులయందునూ స్నేహంగలవాడు గాన మిత్రుడనీ, లోకాన్ని పోషిస్తాడుగాన పూషుడు అనీ పేరు. చిత్రభానుడు అని పేరు కూడా వుంది. ఈ పేరుతో తెలుగు సంవత్సరముంది. అదే ‘చిత్రభాను’ సంవత్సరం.
ఈ రవి ఆకాశానికి మణివంటివాడుగాన ‘ద్యుమణి’ అని పేరు. పండితులకూ, కవులకూ చదువే ధనం ఎలాగో, సూర్యునికి కూడా ఆయన కాంతియే ధనం. అందుకే విభావసుడంటారు. కాలమానంలోని వారములలో మొదటిది భానువారం. ఇదే ఆదివారంగా, రవి వాసరంగా సూర్యునిగా ప్రారంభవౌతుంది. జ్యోతిష శాస్త్రంలో గ్రహరాజుగా, నయనరాజుగా ప్రముఖ స్థానం ఉంది.
. నవగ్రహాలలో ప్రథమస్థానం ఆదిత్యునకే. అందుకే ‘ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు, శుక్ర, శనిభ్యశ్చ రాహవే కేతవే నమః’ అని స్తోత్రం చేస్తే సూర్యుడు అనుగ్రహిస్తాడు. మానవులకు గ్రహాల బలం చాలకపోతే గ్రహాలు నీచ స్థానాల్లో ఉండుటవలన కంటికి జబ్బులు వస్తాయి. శరీర ఆరోగ్యం పూర్తిగా ఆయన చేతిలోనే వుంటుంది. అందుకే ‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ అని శాస్త్రం.
సూర్యమహిమను అగస్త్య మహర్షి ఆదిత్య హృదయంలో పలు రకాలుగా వర్ణించి స్తుతించాడు. సనాతనమైన ఈ ఆదిత్య స్తోత్రమును త్రేతాయుగంలో శ్రీరామచణద్రునికి అగస్త్యుడు ఉపదేశించాడు. తద్వారా సకల శుభాలూ కల్గుతాయన్నాడు. యుద్ధరంగంలో విజయం లభిస్తుందని దీవించాడు.
సూర్యోదయ వేళలో ఆకాశంలో నక్షత్రాలన్నీ ఒక సమూహంగా, రథాకారంలో ఉంటుందిగాన ఈ పర్వదినానికి రథసప్తమి అని పేరు వచ్చింది. ఈ రోజునుండే వేసవి కాలం ప్రారంభమవుతుంది. నిత్య చైతన్యమూర్తి, జీవకోటికి ప్రాణశక్తని అందించే ఆరోగ్య ప్రదాత లోకనాథుడు- లోకపాలకుడు ఈ భాస్కరుడు.
నాగులచవితి నాడు మొదలైన చలి రథసప్తమి నాటికి తగ్గుననీ, ఎండలు ప్రారంభమవుతాయనీ తెలిపాడు. సూర్యగ్రహదోషంవలన పలు రకాల రోగాలు వస్తాయనీ, సూర్య ఆరాధనతో రోగాలు మాయమవుతాయి. సూర్యునికి అసాధ్యమేదియునూ లేదు. ఈ విషయాన్ని శ్రీకృష్ణ్భగవానుడు ధర్మరాజుకు ఈ విషయం ఉపదేశించాడు. శ్రీరాముని కులదైవం సూర్యభగవానుడు. ఇనకుల తిలకుడు శ్రీరాముడు సూర్యుని ప్రాతఃకాలంలో జపిస్తూ అర్ఘ్యమిచ్చేవాడు. అదితి, కశ్యపులు సూర్యశక్తినుపాసించారు. సూర్యుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అదితి దేవతలను కాపాడమన్నది. సూర్యశక్తి ఆమె గర్భంలో చేరింది. ఉపవాసాలు చేసింది. వారించిన ముని మాటలతో అదితి గర్భాండమును పరిత్యజించగా, ఆ తేజంవలన నిప్పులు చెలరేగాయి. ముని వేద మంత్రాలతో స్తుతించాడు. అండం పగిలి దానినుండి ఒక సుదర్శన బాలుడు పుట్టి సూర్య నామముతో దేవతల నాయకుడై విజయం అందించాడు. విశ్వ నియంతయైనాడు. ఒకసారి శివుడు సూర్యునిగాంచి సప్తాశ్వవాహనా! నీవు శుభాలనొసగే కాశీపురం వెళ్లు. అచటి రాజు ధార్మికుడు. దివోదాసుడు. రాజు ధర్మవిరుద్ధమైన పనులు చేసినందున కాశీ పాడుబడి నిర్జనమవుతుంది. నీ బుద్ధిబలంతో రాజును ధర్మచ్యుతిని గావించు. దేవతలూ, యోగులూ ఈ పని చేయలేకపోయారు, తిరిగి వచ్చారు. ఈ జగతిలో ఎన్ని జీవరాసులున్నవో వాటి పనులన్నీ నీకు తెలుసుగాన నిన్ను లోకచక్షువంటారు. నిర్జనమైన కాశీనగరంలో నేను వసింపాలని భావిస్తున్నాను అన్నాడు మహాదేవుడు. సూర్యుడు కాశీ చేరి లోపల - వెలుపల సంచరించాడు. రాజులో ఏ అధర్మము గోచరించలేదు. పలు రూపాలు ధరించాడు. ధర్మమయము కాశీనగరంగాన తానూ మనసులో కలిగిన లోల వలన సూర్యుడు కాశీల లోలార్కనామంతో ప్రసిద్ధిగాంచిన వరుణ, అసి కలసి వారణాసి అయినది. కాశీకి దక్షిణ దిశలో ‘అసీ’సంగమ సమీపాన లోలార్కుడుండెను. కాశీ నివాసుల యోగక్షేమములను చూస్తున్నాడు. ఆదివారంనాడు లోలార్క సూర్యుని దర్శించిన ఎంతో పుణ్యము. ఏ రోగాలూ దరిచేరవు. మేరు పర్వత శిఖరంపై తిరుగాడుచూ కమలముల వనాన్ని వికసింపచేస్తూ వుంటాడు. పీతవర్ణం కల్గి ఉంటాడు. వాయురూపంలో వైశాఖంలో వేడి గాలులు వీస్తూ ప్రాణులను ప్రభావితం చేస్తాడు. పితరులకు అధిపతి. శ్రాద్ధమందు పితరులకు తుష్టిగాన వీనిని తృప్తిపరచాలి.
యజ్ఞములలో స్వాహా, శ్రాద్ధములందు స్వధా, హవ్య, కవ్యములయందు సూర్యుడు వరుణునితో కలిసి స్వీకరిస్తాడు. తాపం కల్గించు సూర్యుని శరీరం సుదర్శనంవలె కమనీయం. సూర్యునికి మంద- శీఘ్ర గతులుంటాయి. వీటి ప్రకారం సంవత్సరాన్ని ఐదు రకాలుగా వర్గీకరించారని దేవీ భాగవతంలో వుంది. సంవత్సరం పరివత్సరం- ఇడావత్సరం- అనువత్సరం- ఇద్వత్సరం అని పేర్లు ఉన్నాయి.
*
రథసప్తమినాడు ఆచరించవలసినవి
ఈ రోజున వేడువనే లేచి స్నానమాచరించి ప్రమిదలో నూనె పోసి వత్తి వసి దీపాన్ని వెలిగించి తలపై పెట్టుకొని నదులలో గానీ ప్రవాహంలో గానీ వదలిపెట్టాలి. నువ్వుల పిండితో శరీరం రద్దుకొని, ఏడు జిల్లేడు ఆకులు- ఏడు రేగు ఆకులు - ఏడు చిక్కుడు ఆకులలు తలపైనుంచి స్నానం చేయాలి. ఇంటికి వచ్చి సూర్య విగ్రహానికిగానీ, పటానికిగానీ పూజ చేయాలి. పండ్లు భక్ష్యాలు- పాలు పాయసం ఆదిత్యునికి నైవేద్యం పెట్టాలి. వ్రతకర్త ఆరోజు నూనెతో చేయబడని పదార్థాలు భుజించాలి. పిదప పటాన్ని తగినవారికి దానం ఇవ్వాలి. భక్తిశ్రద్ధలతో పూజ చేయాలి. సూర్యునికి అర్ఘ్యం ఇస్తూ ‘‘జననీత్వం హిలోకానాం - సప్తమీ సప్త సప్తికే సప్తమ్యహ్యతికే దేవీ నమస్తే సూర్యమాతృతే’ అని జపించాలి. ధ్యానించాలి. తరించాలి. జననం నండి మరణం వరకూ సూర్యుని ప్రనావం మనపై ఉంటుంది గాన ఈ భాస్కరుని ఆరాధించి ఆయన అనుగ్రహానికి పాత్రులు కావాలి. వేదాల్లో పురాణాల్లో సూర్యుని చరితం చక్కగా వర్ణింపబడినది. భారతంలో కుంతి కన్యగా వుండి దుర్వాసుని సేవించి ఆయన చెప్పిన మంత్రమును ధ్యానిచి సూర్యుని కరుణతో కర్ణుని పుత్రునిగా పొందినది. పాండవులు అరణ్యవాసంలో ధర్మరాజు సూర్యుని ధ్యానిచి అక్షయపాత్రను పొందాడు. సూర్యునివలన సప్త సంఖ్యకు ప్రాధాన్యత వచ్చింది. సమాజంలో గీతాసప్తాహాలు- నామసప్తాహాలు- భాగవత సప్తాహాలు జరుగుతున్నాయి. వివాహాల్లో సప్తపది అని వధూవరులచే ఏడు అడుగులు వేయిస్తారు. కుష్ఠురోగ పీడితుడైన మయూరుడు సూర్యుని ఆరాధించి ఆరోగ్యం పొంది సూర్య శతకాన్ని రచించాడు. హనుమంతునికి సకల విద్యలూ నేర్పి నవ వ్యాకరణ పండితునిగావించాడు. సత్రాజిత్తుకు దినమునకు నూరు బారువుల సువర్ణమునిచ్చే శమంతకమణిని ప్రసాదించాడు. సూర్యవైభవం వర్ణింపనలవికానిది. మకర సంక్రమణం సంక్రాంతి నాడు సూర్యుని ఆరాధన చేస్తారు. మానవుని బుద్ధికి అధిదేవత సూర్యభగవానుడు. జ్ఞానప్రదాత. ‘చక్షోస్సూర్యో అజాయత’ అని పురుషసూక్తం. జీవనవేదం. జీవదాత ఆదిత్యుడు.
‘ఆదిత్యాయ నమో నమః’

-పి.వి.సీతారామమూర్తి