మెయన్ ఫీచర్

ఈ ప్రశ్నకు బదులేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చరిత్రలో చాలా ప్రశ్నలకు సమాధానం దొరకటంలేదు. అందుకు కారణం మన అధ్యయన లోపం కాదు. చరిత్ర నిర్మాణమే అలా జరిగింది. ఇంతకూ చరిత్ర అంటే ఏమిటి? కొందరు సాహసోపేతమైన వ్యక్తులు కాలంపై అద్దిన పాదముద్రలు. ఈ సాహసవీరులు సత్పురుషులు కావాలనే సిద్ధాంతం ఏమీ లేదు. కాని రామచరిత్ర నిర్మాతలవుతారు. అయోధ్యలో రాముడు చరిత్రను నిర్మించినట్లే లంకలో రావణుడు- ఆధునిక రావణుడు వేలుపిళ్లై ప్రభాకరన్ చరిత్రను నిర్మించారు. చరిత్ర పునరావృతమవుతుందని ఇందులో ఒక గతితర్కం ఉందని విశే్లషకులు చెపుతారు. మరి పాఠాలు గుణపాఠాలు నేర్చుకోవలసిన బాధ్యత ప్రజలకు లేదా?
పురుషోత్తముణ్ణి ఓడించటం కోసం అంబి అనే రాజు అలెగ్జాండర్‌తో చేతులు కలిపాడు. పృధ్విరాజ్ చౌహాన్‌ను ఓడించటం కోసం రాజా జయచంద్ మహమ్మద్ ఘోరీని ఆహ్వానించాడు. అక్బర్ పాదుషాకు రాజా మాన్‌సింగ్ సేనాధిపతిగా పనిచేశాడు. ఇతడు గొప్ప శివభక్తుడు. ఉదయమే రుద్రాభిషేకం చేసి తర్వాత రాజపుత్ర నాయకుడైన రాణాప్రతాపసింహుణ్ణి వేటాడటం కోసం ససైన్యంగా ఆరావళీ పర్వత శ్రేణికి బయలుదేరాడు. అంటే దైవభక్తులంతా దేశ భక్తులు కాదు అని తాత్పర్యం.
మాలిక్ కాఫర్ 1310లో వరంగల్ నుండి 241 టన్నుల బంగారం ఢిల్లీ ఎలా తరలించుకొనిపోయాడు? మన మయూర సింహాసనం ఏమయింది? కోహినూర్ వజ్రం ఏమయింది? పదవ నిజాం ఉస్మాన్ అలీఖాన్ 45 ట్రక్కులో బంగారాన్ని పాకిస్తాన్‌కు తరలిస్తుంటే నెహ్రూ, పటేల్ ప్రభృతులు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? మహమ్మద్ అలీ జిన్నా కాశ్మీరులోని సగం భాగాన్ని ఆక్రమించుకుంటుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? అసలు 1947లో భారతదేశాన్ని ‘మతం’ ప్రాతిపదికపై విభజిస్తుంటే కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులు ఎందుకు మద్దతు పలికారు? విక్టోరియా రాణి ఎవరు? ఈమె మీద పంచమ జార్జి చక్రవర్తిమీద మన కవులు పంచరత్నాలు రాయడం ఏమిటి? కొక్కొండ వెంకట రత్నం పంతులు వేల్స్ యువరాజు చరిత్ర వ్రాశాడు. జార్జి రాజేంద్ర వైభవ విర్జితేంద్ర అనే మకుటంతో తిరుపతి వెంకట కవులు సీస పద్యాలు వ్రాశారు. హిందూ పీఠాధిపతులు జార్జి పట్ట్భాషేకానికి ఆశీర్వాద మంత్రాక్షతలు పంపారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను కుక్క అని ఎందుకు తిట్టారు? భారత ప్రధాని నరేంద్ర మోదీని వేణీప్రసాద్ వర్మ పిచ్చికుక్క అని ఎందుకు తిట్టినట్లు? సమాజవాద పార్టీ నేతలు మాయావతి (యుపి)ని చంపబోతే ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఆమెను రక్షించారు. ఆమె, కాన్షీరాంలు హిందూ సాంస్కృతిక సంస్థల కార్యకర్తలు పాములు, తేళ్లు అని తిట్టారు. భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేయండి అని పిలుపునిచ్చిన ఢిల్లీలోని జెఎన్‌యు విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్‌ను ఏచూరి సీతారాం, అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధి ఎలా బహిరంగ మద్దతు ప్రకటించారు? భారతదేశంలో ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా మారిపోయారు. భారీగా క్రైస్తవీకరణం జరుగుతున్నది. ఐనా ఒక్క పీఠాధిపతి కూడా ఎందుకు రంగంలోకి దిగలేదు? యుపిలో ఉగ్రవాద సిమి సంస్థ వారు మా పార్టీ యువ కార్యకర్తల విభాగం అని ములాయంసింగ్ యాదవ్ ప్రకటించాడు. శివలింగాలమీద మూత్రం పోయండి అని కర్ణాటకలోని కలుబురిగీ అనే ఒక సెక్యులరిస్టు పిలుపునిచ్చాడు. నరేంద్ర మోదీ భారత ప్రధాని అయితే తాను దేశం వదిలిపెట్టి వెళ్లిపోతానని యు.ఆర్.అనంతమూర్తి అనే కర్నాటక సాహితీవేత్త ప్రకటించారు. ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు. ఇవన్నీ ఎలా జరిగాయి??
చరిత్రలో ఎప్పుడో ఏవో జరిగాయి. అల్లా ఉద్దీన్ ఖీల్జీ అక్బర్ ఔరంగజేబులకు మేము సమకాలికులం కాదు కదా! అని కొందరు ప్రశ్నించవచ్చు. మరి ఇవాళ మన కళ్ల ముందే చైనా, టిబెట్టును నేపాల్‌ను స్వాహా చేసింది కదా! దీనికి ఏం చెపుతారు? బ్రహ్మపుత్రపై చైనా ఓ ఆనకట్ట కట్టింది. మరి ఈ డామ్ నిర్మాణాన్ని ఎందుకు ఆపలేకపోయాము? కులభూషణ్ యాదవ్ అనే పౌరుణ్ణి అపహరించి పాకిస్తాన్ తన జైలులో పెట్టింది. అతనిని చూడడానికి అంతర్జాతీయ కోర్టు ఒత్తిడితో యాదవ్ భార్యకు అనుమతినిచ్చింది. ఆమె వెళితే గాజులు మంగళసూత్రాలు తీసివేయించారు. అద్దాలకు అవతల ఎవరినో నిలబెట్టి నాటకమాడారు. ఇది దుర్మార్గం అనడానికి మన దేశంలోని రాజకీయ ప్రముఖ పార్టీలకు నోరు రాలేదు. పదివేల జనాభా కూడా లేని కరవది అనే చిన్న గ్రామంలో (ప్రకాశం జిల్లా) పది చర్చిలు ఎలా వచ్చాయి?
చైనా హిమాలయాలు దాటి భారత భూభాగాల్లోకి ప్రవేశిస్తుంటే ‘హిందూ మతోన్మాదం నశించాలి’ అంటే తాము హిందువులు కాదని దీని అర్థం. భారత్‌ను పాకిస్తాన్ చైనాలు ఆక్రమించుకుంటే తమకు అభ్యంతరం లేదని దీని సారాంశం. సోమనాథ దేవాలయంపై గజనీ మహమ్మద్ పదిహేడు సార్లు దండయాత్ర చేసి దేశ సంపదను దోచుకొనిపోయారు. 1948లో సోమనాథ దేవాలయ పునరుద్ధరణను కె.యం.మున్షీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ప్రతిపాదిస్తే దానిని తీవ్రంగా వ్యతిరేకించినవాడు నాటి భారత్ ప్రధాని పండిత జవహర్‌లాల్ నెహ్రూ. ఎందుకని?? బాబరీ మసీదు కూల్చివేతను కారణంగా చూపి పి.వి.నరసింహారావుమీద ఒత్తిడి తెచ్చి బిజెపి ప్రభుత్వాలను కూల్చివేసినవాడు మధ్యప్రదేశ్‌కు చెందిన అర్జున్‌సింగ్. ఆయనను ఒక దశలో సోనియాగాంధీ చెత్తబుట్టలో పడేసింది, ఎందుకని? పి.వి.నరసింహారావు కుటుంబ సభ్యులు రాజేశ్వరరావు వంటివారికి ఆమె కనీసం ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు, ఎందుకని? నరసింహారావుకు భారతరత్న రానీయలేదు, కనీసం దహనక్రియలు కూడా సరిగ్గా నిర్వహించలేదు. ‘‘నామీద వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డిమీద ఆమె కక్ష కట్టింది’’ అని తన అంతరంగాన్ని వెల్లడించాడు మాజీ ఎం.పి. కావూరి సాంబశివరావు. వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిపై అక్రమాస్తుల కేసులు బనాయించారు. మరి రాహుల్ గాంధీ అక్రమాస్తుల మాటేమిటి? సమ్రాట్ సైకిల్ ఫ్యాక్టరీ నేషనల్ హెరాల్డ్ కేసుల సంగతి ఏమిటి? పనామా పేపర్‌ల ప్రచురణ తర్వాత పాకిస్తాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ మీద అక్కడి కోర్టులు చర్యలు తీసుకున్నాయి. మరి ఇండియాకు చెందిన వారిపై ఎందుకు మోదీ ప్రభుత్వం ఉపేక్షాభావం ప్రదర్శించింది.
శారదా చిట్‌ఫండ్ కేసు ఏమయింది? నారదా టేపుల స్కాం ఏమయింది? దబోల్కర్, కలబురిగి, గౌరీ లంకేష్ హంతకులు ఎందుకు ఇప్పటికీ దొరకలేదు. సంచనాలు సృష్టించిన హైదరాబాద్ ఫిలింనగర్ డ్రగ్స్ కేసులు పబ్ కేసులు ఏమయినాయి? ఔను.. అవిమరచిపోయేటట్లుచేయగలిగారు. రోడ్డుమీద ఒక అనాథపై కారు నడిపి సల్మాన్ హత్య చేస్తే ‘రోడ్డుపై గేదెలు పడుకుంటాయి కాని మనుషులెందుకు పడుకోవాలి?’ అని బాలీవుడ్ భామలు ప్రశ్నించారు. ఇదీ మన కళాకారుల మానవత్వం?
కళాకారులు అంటే గుర్తుకువచ్చింది. 2004లో గోపీనాథ్ సారంగ్ కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా ఎన్నిక అయితే ఆయనను మహాశే్వత అండ్ కో చిత్రహింసలు పెట్టింది. అగ్రహారం కృష్ణమూర్తిని బర్తరఫ్ చేశారు. అక్కిరాజు రమాపతిరావుపైన అవిశ్వాస తీర్మానం పెట్టారు. బి.హెచ్.కృష్ణమూర్తిగారి సంధ్యావసరాలు తీర్చి పురస్కారాలు కొనుక్కున్నారు. పాఠ్య గ్రంథాలను రోమిల్టా థాపర్‌ల వక్రీకరణ చరిత్రలో నింపారు. మరి మహాఘనత వహించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ దుర్మార్గాలను ఎందుకు సరిచేయలేదు?? పనామా పేపర్స్‌లో పేర్కొన్న శరద్‌పవార్‌కు పద్మవిభూషణ్ ఎలా వచ్చింది? అంజలి, జమున, సావిత్రి, ఎస్.వి.రంగారావు వంటి అగ్రశ్రేణి నటులకు కనీసం పద్మశ్రీ కూడా ఎందుకు రాలేదు?
‘‘నేను తెలుగుదేశం పార్టీకి మద్దతునిచ్చానని నా పేరు పద్మ పురస్కారాల జాబితా నుండి నాటి హోం శాఖామాత్యులు శివరాజ్‌పాటిల్ తొలగించారు’’ అని సభాముఖంగా కైకాల సత్యనారాయణ ప్రకటించారు. 21 డిసెంబర్ 2017 నాడు సిబిఐ స్పెషల్ కోర్టు 2జి వాయుతరంగాల (స్పెక్ట్రం) అమ్మకం కేసులో కనుమొళి, ఎ.రాజా ఇత్యాదులంతా నిర్దోషులేనని సంచలనాత్మకమైన తీర్పునిచ్చింది. మరి మరి స్పెక్ట్రం కొనుగోళ్లలోని వేలం నోట్ల డబ్బు ఎలా మాయమయింది? కపిల్ సిబాల్ (న్యాయవాది) కేసును నీరుగార్చాడని చెబుతున్నారు. మరి ఎన్‌డిఏ ప్రభుత్వం ఏమి చేసినట్లు? భారతదేశపు ప్రజలకు న్యాయవ్యవస్థమీద ఇంకా విశ్వాసం ఉంది. అది కూడా పోతే తిరుగుబాటు వస్తుంది.
పదివేల కోట్ల మేరకు బ్యాంకుల ఋణం ఎగగొట్టి లండన్ పారిపోయిన విజయ్ మాల్యా 2జి తరంగాల తీర్పు విని ఇలా అన్నాడు. ‘‘నాకు భారత న్యాయవ్యవస్థపై విశ్వాసం పెరిగింది. ఇండియాకు రావడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు’’-ఒక సామాన్యుడు కోర్టుకు వ్యతిరేకంగా మాట్లాడితే దానిని కోర్ట్ధుక్కార నేరం (కంటెప్ట్ ఆఫ్ కోర్ట్) అనే నేరం కింద పరిగణిస్తారు మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చలమేశ్వర్ ప్రభృతులు నలుగురు నేరారోపణ చేస్తే ఇది కోర్టు ధిక్కారం కిందకి వస్తుందా? లేదా? అనే అంశం న్యాయ నిపుణులు పరిశీలించి దేశానికి వివరించాలి.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్