మెయిన్ ఫీచర్

మనకు మనమే చేటు!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్తమాన కాలంలో సనాతన వాఙ్మయంలో మన శాస్త్రాలలో పురాణేతిహాసాలలో, మరీ ముఖ్యంగా వేదాలలోని శాస్త్ర విజ్ఞానానికి నేటి సమాజం చేరుకోలేని దూరాన్ని చేరిపోయింది. వాటిని అధ్యయనం చేయడం అర్థం చేసుకోవడం చేతకాక, చులకన చేసి మాట్లాడటం, హేళన చేయడం ఒక నాగరికతగా భావించడం విడ్డూరం. కాలధర్మం అనుకున్నా, కాలదోషం అనుకున్నా, యుగయుగాలుగా సంతరించుకున్న, సంపాదించుకున్న భారతీయ విజ్ఞానవీచికలు కనుమరుగైన విషయం సత్యం. కారణాలనేకం.
భారతదేశం మీద సంస్కృతీ సంప్రదాయాలమీద శతాబ్దాల తరబడి సాగిన విదేశీ దండయాత్రల దాడులతోపాటు స్వాతంత్య్రానంతరం లార్డు మెకాలే విద్యా విధానాన్ని భారతదేశంలో తూ.చ తప్పకండా అమలు చేయడానికి కంకణంబద్ధులైన స్వదేశీ పాలకులు, భారతీయ విజ్ఞానానికి చేయవలసినంత ద్రోహం చేశారు. జరగాల్సిన ద్రోహం జరిగిపోయింది. నేటి పరిస్థితి ఎట్లా వుందంటే, భారతీయ వాఙ్మయాన్ని చదవకుండానే వాని గురించిన అవగాహన లేకుండానే పుట్టుకతోనే పాశ్చాత్య విద్యాభ్యాసం చేస్తున్న మనవారే, ఆంగ్లపదం లేకుండా మాట్లాడలేనివారే, భారతీయ విద్యలను అందలి విజ్ఞానాన్ని అపహాస్యం చేసి మాట్లాడుతూ, తాము విజ్ఞానవంతులనుకుంటున్నారు.
డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ననుసరించి మనిషి కోతి నుండి పుట్టాడని బోధిస్తున్నారు. ఇది అసంబద్ధ విషయం. భారతీయ శాస్త్రాల్లో మనిషి మనిషిగానే సృష్టింపబడినట్లు చెప్పబడింది. ‘యోనిం దేవకృతం’ (ఋగ్వే.3-33-4), ‘దృపర్వత్యాం మానుష ఆపయాయాం సరస్వత్యాం రేవదగ్నే- దిధీహి’ (ఋగ్వే. 3-3-24-4) అను శ్రుతి వాక్యాల చేత మనుస్మృతి (2-17) వాక్యాల చేత ప్రజాపతి మానవావతారములో వచ్చి సృష్టి చేసినట్లు చెప్పబడింది.
భక్తియార్ ఖిల్జీ అనే దురాక్రమదారు, తక్షశిల విశ్వవిద్యాలయానికున్న విశాలమైన గ్రంథాలయాన్ని నెలల తరబడి తగలబెట్టించాడు. తంజావూరులోని సరస్వతి గ్రంథాలయంలోని తాళపత్రగంథాలను, పాత తాటాకులని చెప్పి వేడినీళ్ళు కాచుకున్నారు. ‘బండి రెండు రూపాయలకు అమ్మించారు. ఆంగ్లేయ పాలకులు ప్రాచీన విజ్ఞానమంతా సర్వనాశనం చేశారు. ఇవి కొన్ని ఉదాహరణలే.
మనకున్న నాలుగు వేదాలలో 1131 శాఖలుండేవి. వీటిలో ఇప్పుడు కేవలం 13 శాఖలే లభిస్తున్నాయి. (ఋగ్వేదంలో రెండు, యజుర్వేదంలో ఆరు, సామవేదంలో మూడు, అధర్వణవేదంలో రెండు శాఖలు) కాగా ప్రస్తుతం అధ్యయనంలోనున్నవి కేవలం ఏడు శాఖలేనని చెబుతున్నారు వేదాధ్యయనం చేసినవాళ్ళు.
వైద్య, విమాన, గణిత, భౌతిక, రసాయన మొదలైన అనేక శాస్త్రాలకు సంబంధించిన సమాచారం మన వేదాల్లో శాస్త్రాల్లో కనిపిస్తుంది. అంగట్లో అన్నీ వున్నాయి, అల్లుడి నోట్లో శని వుందన్నట్లుగా, భారతీయ శాస్త్ర విజ్ఞానాన్ని సాంకేతికంగా అధ్యయనం చేసి నిరూపించలేకపోతున్నారు మన శాస్తవ్రేత్తలు, పరిశోధకులు, ఆచార్యులు, విద్యార్థులు. కారణం సంస్కృతం తెలియకపోవడం.
ఆంగ్ల మాథ్యమంలోని గ్రంథాలమీద మాత్రమే ఆధారపడడం శ్రీ రేమెళ్ళ అవధానిగారి వంటి నవీన శాస్తవ్రేత్తలు వేదాధ్యయనం చేయడమే కాకుండా, వేదాలను కంప్యూటరైజ్ చేసి నేటి తరానికే కాక భవిష్యత్తరాలకు మహోపకారం చేసి జాతి రుణం తీర్చుకుంటున్నారు. జగదీశ్ చంద్రబోస్ వంటి ఆధునిక వైజ్ఞానికులు తమ సిద్ధాంతాలకు వేదాలే ప్రేరణ అని చెప్పారు. మన మహర్షులు కేవలం ఆశ్రమవాసులు, వనవాసులుగా తపస్సు చేసుకునేవారనుకుంటే మనం తప్పులో కాలేసినట్లే. వారు మనం కనీ వినీ ఎరుగనంటి గొప్ప శాస్తజ్ఞ్రులు కూడా. వశిష్ఠ, భరద్వాజ, గౌతమ, అత్రి, అంగిరస, నారద, కశ్యప, పరాశర, వ్యాసాది మహర్షులు మనకనేక శాస్త్ర గ్రంథములునందించిరి. వారి తపఃశక్తి లౌకిక, పారలౌకిక, అపార శాస్త్ర విజ్ఞానము అత్యాశ్చర్యకరము, మహాద్భుతము. కొద్దిమంది మహర్షులచే మనకందించబడిన కొన్ని శాస్త్రగ్రంథములనిక్కడ ప్రస్తావించుట అవసరమనిపిస్తుంది. బృహత్‌యంత్ర సర్వస్వం అనే అద్భుతమైన గ్రంథాన్ని భరద్వాజ మహర్షి రచించారు. ఈగ్రంథంలో 32 రకాల విద్యుచ్ఛక్తిని తయారుచేసే విధానాలు వివరించబడ్డాయి.
- ఇంకా ఉంది