మెయిన్ ఫీచర్

ఇటువంటి సేవ మనకెందైనా గలుగునా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటువంటి సేవ మనకెందైనా గలుగునా
పటుతరమైన రాఘవ ప్రభు సన్నిథి నే గాక
తేటకస్తురి నుదట - నీటు గులుకు చుండ
హాటకాంబరుడైన శ్రీ- హరి సభయందునె గాక
ఆడుచు నాదమున - బాడుచు నెదుటను
వేడుచు నామది - గూడి యుండుటె చాలు
వాసిగ భద్రశైల - వాసుని దాసాను
దాసుడౌ నరసింహ - దాసావనుని గనకున్న
దాసుడే నరసింహ - దాసావనుని గనకున్నా....
అన్న తూము నరసింహ దాసు కీర్తనలు వింటూనే ఉంటాం కదా. ముక్కోటి దేవతలున్నట్లుగానే ముక్కోటి రకాలైన భక్తులున్నారు. ఈ భక్తులు ఒక్కొక్కరు ఒక్కోవిధంగా భగవంతుని పై తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. వాగ్గేయకారులు, సంగీతజ్ఞులు పాటలు పాడి వారి భక్తిని భగవంతునికి నివేదిస్తుంటారు.
తమ భక్తిని గానం చేసి ప్రకటించిన వారు వాగ్గేయకారులుగానో, సంగీత సామ్రాట్టులుగానో కీర్తిపొందుతున్నవారు ఉన్నారు.
వారిలో తూము నరసింహదాసుగారొకరు. అచ్చయ్య మంత్రి, వెంకమ్మల ముద్దుబిడ్డడు తూము నరసింహదాసుగారు. వీరికి భక్తివారసత్వంగా లభించింది. వీరుతమ కుటుంబంతో కలసి దక్షిణ దేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి ఆయా దేవీదేవతలను చూసారట. అక్కడంతా ఆయన తన భక్తిని పాటరూపంలో కైంకర్యం చేసారు. ఒకసారి చెన్నపట్నం వచ్చి అక్కడ పార్థసారథి స్వామిని దర్శించారు. వీణ కుప్పయ్యగారింటిలో బసచేశారట.అక్కడ త్యాగరాజ స్వామిని దర్శించుకునే వీలు కలిగిందట. ఆయన మురిసిపోయి త్యాగరాజు మీద పద్యాలు అల్లి పాడారట. ఆ తరువాత నెల్లూరుకు వచ్చి రంగనాథుని సేవించారట. అక్కడ ఆయనకు రామదాసు అనే భక్తుడు తారసిల్లాడు. ఆయన సాయంతో భద్రాచలం చేరాడు. అక్కడ రాముని సేవించారు. అప్పుడు అక్కడ రామునిసేవలో సంకీర్తనలు ఆలపిస్తుండగా కంచెర్ల గోపన్న గారి విభవాన్ని తెలుసుకొన్నారట. ఆ గోపన్ననే రామదాసుగా కీర్తి గడించారిని విన్నారు. ఆ రామదాసు సేవించిన రామచంద్రమూర్తికి అప్పటి ముస్లిం నవాబు తానీషా నిత్యకైంకర్యానికి ఇచ్చిన దాన శాసనాన్ని దుష్టులెవరో పాడు చేసి ఉండడం చూశారు. ఎంతో బాధ పడి తిరిగి ఆ శాసనాన్ని తూము నరసింహదాసుగారు చెక్కించారట. అప్పటి నుంచి మళ్లీ ఆ నవాబు చేత రాముని కైంకర్యానికి వార్షికాలను ఏర్పాటు చేసేట్లుగా చేశారట. ఇక అప్పటి నుంచి నరసింహ దాసుగారు రామదాసుగా రాముని సేవిస్తూ కాలం గడిపేరట. చివరకు రామునిలోనే ఐక్యం చెందారని రామభక్తులు తూము నరసింహదాసుగురించి చెబుతారు. ఆయన పాడిన పాటలను ఈనాటికి ప్రాచుర్యంలోనే ఉన్నాయి. సంగీత సామ్రాజ్యంలో ఉన్నవారంతా ఒక్కసారన్నా తూము నరసింహదాసుగారి రచించి కీర్తించిన ఆ కీర్తనలు పాడుకుంటూ ఉంటారట.

- జి. కల్యాణి