మెయిన్ ఫీచర్

లయ బ్రహ్మ.. సంగీత సామ్రాట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సంగీత, ఆధ్యాత్మిక రంగాలకు మకుటంలేని మహారాజు శ్రీ త్యాగరాజు. సంగీత సాహిత్యాలకు ఒజ్జిబంతి శ్రీ త్యాగరాజు. సంగీత సాహిత్యాలతోపాటు భరతమునికి ధీటుగా భారతావనిలో వనె్నకెక్కినవారు ‘సంగీత సాహిత్య సార్వభౌమ’, ‘లయబ్రహ్మ’ పుంభావ సరస్వతికి ప్రతిరూపంగా అవతరించినవారు హరికథా పితామహులు శ్రీ ఆదిభట్ల నారాయణదాసుగారు.
ఇద్దరూ సాహిత్య స్రష్టలే. వాగ్గేయకారులు కూడా. విశేషించి ఇద్దరూ శ్రీరామభక్తులు. మరొక విశేషం ఇరువురూ పుష్య బహుళ పంచమినాడు కైవల్యం పొందారు.
సన్యాసి పరమపదించిన తిథినాడు ‘ఆరాధన’ జరపడం శాస్త్ర సంప్రదాయం. శ్రీ త్యాగరాజు కైవల్యం పొందడానికి అయిదు రోజుల ముందు సన్యాసం స్వీకరించారు. అందువల్ల తిరువయ్యూరు ఆయన సమాధి వద్ద ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు.
దాసుగారు సన్యసించకపోయినా, తమ జీవితాన్ని హరికథాగానంతో, సరస్వతిని అర్జిస్తూ సన్యాసాశ్రమానికే అంకితం చేశారని చెప్పవచ్చు. పైగా భగవతిని జీవిత పర్యంతం వశం చేసుకుని, ఇచ్ఛామరణం పొందిన ఉపాసకులు. అందువల్ల శ్రీ దాసుగారికి ఆనాడు ఆరాధన ఉత్సవం నిర్వహిస్తారు. ఇద్దరూ కారణజన్ములే!
సంగీతాన్ని ‘నాదోపాసన’గా సాగించిన త్యాగరాజు, ఆ నాదాన్ని శ్రీరామునిగా ఆరాధించారు. కర్ణాటక సంగీతం ఆవిర్భవించిన సంగీత మూర్తిత్రయంలోని ముగ్గురూ తిరువయ్యూరు క్షేత్రంలో సదాశివావతారమైన త్యాగరాజేశ్వర క్షేత్రంలో జన్మించారు. ఆ పేరే తల్లిదండ్రులు తమ కుమారునికి ‘త్యాగరాజు’గా నామకరణం చేశారు. త్యాగరాజు తల్లిదండ్రులు సీతమ్మ (తొలిపేరు శాంతమ్మ), రామబ్రహ్మం.
త్యాగరాజు బాల్యంలోనే అష్టపదులు, పురందరదాసు రచనలు, రామదాస్తు కీర్తనలు, అన్నమయ్య పదాలను ఔపోశనం పట్టారు. 8వ ఏటనే ఉపవీతుడైన త్యాగరాజు వైణిక విద్వన్మణి కాళహస్తి అయ్యర్ వద్ద తారకమంత్రాన్ని, మరుదానల్లూరు మఠాధిపతి వద్ద శ్రీరామ షడాక్షరీ మంత్రాన్ని పొందేరు. త్యాగరాజు 95 కోట్ల తారకమంత్ర జపం చేసేరని అంటారు. అదే సమయంలో నారదుని ద్వారా స్వరార్ణవ గ్రంథం పొంది సంగీత శాస్త్రంలోని రహస్యాలను గ్రహించారు.
శ్రీ నారాయణదాసుగారు నరసమ్మా, వెంకటాచయనుల దంపతులకు సూర్యనారాయణ వరస్రాదంగా జన్మించారు. ఆ కారణంగా సూర్యనారాయణ అని నామకరణం చేసేరు. కాలక్రమంలో నారాయణదాసుగా మార్పు చెందింది. త్యాగరాజు, నారాయణదాసులకు తొలి గురువులు జననీ జనకులే!
నారాయణదాసుగారు సంస్కృతాంధ్ర భాషలలోనేగాక ఆంగ్లం, పారశీకం, అరబ్బు భాషలలో నిష్ణాతులు. అచ్చతెనుగు అశ్వత్థవృక్షం.
త్యాగరాజు నాదయోగి. తాను అలవోకగా రచించిన కృతులను అద్భుతంగా, అపూర్వమైన రాగాలతో పాడడమేగాక వాటి ద్వారా ఎన్నో శాస్త్ర మర్మాలను చెప్పారు. ఉపనిషత్తులకు భాష్యంగా ఉంటాయంటారు విజ్ఞులు. నారాయణదాసుగారు గంధర్వ గాయకుడు. సకలకళా పారంగతుడు. తాత్వికుడు. వైయాకరుణుడు. ప్రధానంగా హరిభక్తుడు. దాసుగారి దీధితి చెప్పాలంటే ఒక గ్రంథమే రాయవచ్చు. పలు రంగాలలో మేటి అయిన దాసుగారి ప్రధాన కర్మక్షేత్రం ‘హరికథాగానం’.
ఇద్దరికి ఇద్దరూ రాజస్థానాలో ప్రశంసలతోపాటు సన్మానాలు అందుకున్నవారే! ఇద్దరూ హరి ఉపాసనాపరులే. మహత్తులూ గొప్పవే! త్యాగరాజు వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ‘తెరతీయగరాదా’ అనడంతో తెరతొలగడం, కాంచీపురం వద్ద బావిలోపడి మరణించిన ఒక్కగానొక్క బిడ్డను బ్రతికించమని ప్రార్థించిన తల్లిని ఊరడిస్తూ ‘నా జీవనధార! నా నోము ఫలమా!’ అను కీర్తనతో బ్రతికించిన కథ ప్రాచుర్యంలో వుంది.

-ఎ.సీతారామారావు